Karthika Deepam 2 May 30th: సూరజ్‌ హత్యకి జ్యోత్స్న స్కెచ్.. సీఈవో పోస్ట్‌పై శివన్నారాయణ సంచలన నిర్ణయం

Photo Courtesy: JioHotstar

నేను ఎంతో కష్టపడి క్వాలిటీ ఫుడ్ సప్లయ్ చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంటే జ్యోత్స్నగారు దానిని నాశనం చేశారు. నాకు న్యాయం కావాలి, నష్టపరిహారం కావాలని సూరజ్ అడుగుతాడు. ఇప్పటికిప్పుడు నష్టపరిహారం అంటే కష్టమని కార్తీక్ చెప్పడంతో సాయంత్రం వరకు టైమ్ ఇస్తాడు సూరజ్. అతని మాటలు నమ్మొద్దు, బావ బయటివాళ్ల తరపునే మాట్లాడతాడని మండిపడుతుంది జ్యోత్స్న. జరిగిన గొడవతో మనవరాలిపై మండిపడుతుంది పారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవని ఇంటి మీదకి తీసుకొస్తావని, అతనికి సారీ చెప్పమని అంటుంది పారు.

అసలు సూరజ్‌కి, నీకు గొడవ ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గ.. కార్తీక్ గిఫ్ట్ షాపులో జరిగిన గొడవ నుంచి సూరజ్‌ను అర్థరాత్రి పూట నడిపించిన విషయం వరకు చెబుతాడు. జరిగిన దానిలో నీదే పొరపాటు కనిపిస్తోందని మండిపడతాడు పెద్దాయన. నీ వల్ల నా కుటుంబం తలదించుకుంటోంది.. మర్యాదగా ఆ సూరజ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగమని దీప చెప్పడంతో అది చచ్చినా చేయనని తేల్చేస్తుంది. సూరజ్ రాగానే అతనికి 10 లక్షల రూపాయలు ఇచ్చినా సరిపోదని చెబుతాడు. అయితే ఏం కావాలో నువ్వే చెప్పమని కార్తీక్ అడగటంతో పోయిన నా పరువు, మర్యాదలు కావాలని అంటాడు. నా షాపు దగ్గర జ్యోత్స్న మేడం గారు గంటసేపు పనిచేయాలని కండీషన్ పెట్టడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మే 30వ తేదీ 684వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 684 May 30th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యూస్ షాప్ ముందు మన పిల్లది ఫ్లెక్సీ పెట్టడానికి నేను అంగీకరించను, ఇంకా నయం నష్టపరిహారంగా జ్యోత్స్నని జ్యూస్‌లు సర్వ్ చేయమనలేదని అంటుంది పారు. మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉందని సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. ఏ షాప్ దగ్గరైతే నా మర్యాద పోయిందో, అక్కడే నా మర్యాద నిలబడాలంటే మేడం గారు ఒక ఫ్లెక్సీ పెట్టాలి. మేడం గారి వల్లే నా క్వాలిటీకి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి.. మేడం గారే ఒక గంట నా షాప్ దగ్గర నిలబడి సర్వ్ చేయాలి. అప్పుడే జనం నాది కల్తీ ఫుడ్ కాదు.. హెల్దీ ఫుడ్ అని నమ్ముతారని అంటాడు సూరజ్. దీనికి నేను ఒప్పుకోనని తేల్చేస్తుంది జ్యోత్స్న.

మీరు మాజీ మిస్ హైదరాబాద్. మీ ఫ్లెక్సీలు పెట్టామంటే అది మీకే మంచి పేరు. పైగా మీకు సోషల్ మీడియాలో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వీడియో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేశామంటే సమాజ సేవలో మాజీ సుందరి అంటూ సోషల్ మీడియా దద్ధరిల్లిపోతుందని అంటాడు కార్తీక్. నేను అడగాల్సింది అడిగాను.. నేను కోరుకున్న న్యాయం ఇదేనని శివన్నారాయణతో చెబుతాడు సూరజ్. చేసిన తప్పు తనకు తెలిసిరావాలి కదా? ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటుంది సుమిత్ర. కూతురిని సరిగా పెంచలేదన్న చెడ్డ పేరు ఎలాగూ వచ్చింది, తెలిసిన తర్వాత సరిచేసుకోవాలని అంటాడు దశరథ. దాంతో సూరజ్ కోరుకున్నట్లుగానే న్యాయం జరుగుతుందని నిర్ణయం తీసుకుంటాడు శివన్నారాయణ. ఈ బాధ్యతలు కార్తీక్ చేతుల్లో పెడతాడు. పెద్దవాళ్ల పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పనులు అవసరమా అని మండిపడుతుంది కాంచన.

రేపటి కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అంతా నేనే.. నేనే ఫోటోగ్రాఫర్‌ని, నేనే కంటెంట్ డిజైనర్‌ని, నేనే సూపర్‌వైజర్‌ని అంటాడు కార్తీక్. ఆ వెంటనే జ్యోత్స్నని బయటికి తీసుకెళ్లి ఫోటోలు తీస్తాడు కార్తీక్. ఫోటోలు బాగా వచ్చాయి.. రేపు షాపు దగ్గర కలుద్దామని సూరజ్‌తో అంటాడు కార్తీక్. లోపలికి రా నీ సంగతి చెబుతానని పారుకి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నీ కోపరేషన్ మొత్తం అటువైపే ఉందని కార్తీక్ అనడంతో, మన మీద అనుమానం రాకుండా ఉండటానికి దానికి సపోర్ట్‌గా ఉన్నట్లు నటిస్తున్నానని చెబుతుంది పారు. మీరు మాత్రం దాని తిక్క బాగా కుదిర్చారని అంటుంది. సలహా ఇచ్చింది నువ్వే కదా? క్రెడిట్ మొత్తం నీకేనని చెబుతుంది పారిజాతం.

పారిజాతం గారు పార్టీ మార్చేసినట్లున్నారని కార్తీక్‌తో అంటుంది దీప. నాకు అదే అనుమానంగా ఉందని అంటాడు కార్తీక్. ఇంతలో పెద్దాయన వచ్చి ఆ అబ్బాయి బాగా మొండోడిలా ఉన్నాడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బులు కూడా వద్దు అన్నాడంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుంటుందని అనిపిస్తోందని చెబుతాడు. ఎవరి ప్రయాణం ఎప్పుడు ఎటు తిరుగుతుందో తెలియదు కదా, అతని ప్రయాణం కాలం ఎటు తిరగాలని రాసిందో అని అంటాడు కార్తీక్.

తట్టబుట్ట సర్దుకుని ప్రపంచ యాత్రకు నన్ను పోమ్మనడం కాదు.. నువ్వే ఏ కాశీకో, రామేశ్వరానికో పోమ్మని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నీకు చేత కాకపోతే నోరు మూసుకుని ఉండాలి. అందరి ముందు మంచి మార్కులు కొట్టేద్దామని అడ్డదిడ్డంగా వాగావు, అది వాడు పట్టుకుని నా ఫ్లెక్సీ షాపు ముందు పెట్టించాలని కండీషన్ పెట్టాడు. అక్కడితో ఆగిపోతే సరిపోయేది. నా చేత జ్యూస్‌లు కూడా అమ్మిస్తానని చెప్పావని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నువ్వు అలాంటివాడితో ఎందుకు గొడవ పెట్టుకున్నావని ప్రశ్నిస్తుంది పారు. నా ఫ్లెక్సీలు పెట్టుకుంటేనో, నేను జ్యూస్‌లు సర్వ్ చేస్తేనో వాడి పరువు నిలబడుతుందని అనుకుంటున్నాడు. అసలు నేనే వెళ్తేనే కదా వాడి పరువు నిలబడటానికి అంటుంది జ్యోత్స్న.

వెళ్లకపోతే వాడు మళ్లీ రేపు వస్తాడని పారు హెచ్చరించగా.. అప్పటి వరకు నేనెందుకు సైలెంట్‌గా ఉంటాను, నాకే తలపొగరని అనుకుంటే వాడికి డబుల్ ఉంది. డబ్బులు వద్దంట, జరిగిన నష్టం డబ్బులతో భర్తీ కాదట అని అంటుంది జ్యోత్స్న. 5 లక్షలు వద్దు అన్నాడు.. నీ ఫోటో చాలు అన్నాడు. 5 లక్షలకు మించిన బ్యూటీ నీ ఫేస్‌లో ఏముందో నాకు అర్ధం కావడం లేదు అంటుంది పారు. నా తరపున మీరు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి? గొడవ చేయాలంటే సూరజ్ ఉండాలి కదా? రేపు ఈపాటికి వాడు ఉండడు, వాడి స్టాల్ కూడా ఉండదు. మనలాంటి డబ్బున్న వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి, తెలిసేలా చేస్తానని అంటుంది జ్యోత్స్న. మనవరాలి స్పీడు చూసి ఏం జరుగుతుందోనని పారు కంగారుపడుతుంది.

మీ నాన్న సీఈవోగా లేడు కాబట్టి అల్లుడుగారు డ్రైవర్‌గా చేయాల్సిన పనిలేదు. కానీ ఏదో ఒక పని చూసుకోవాలి కదా అని స్వప్నతో కావేరి అంటుండగా కాశీ విని బాధపడతాడు. దాంతో తల్లిపై స్వప్నపై సీరియస్ అవుతుంది. కాశీ దగ్గరికి వెళ్లి స్వప్న మాట్లాడుతుండగా.. మా అమ్మ అయితే ఇలాగే చెప్పేది కదా? అని కాశీ అంటాడు. ఎక్కడ మా అమ్మని అపార్ధం చేసుకుంటావోనని అనుకున్నానని చెబుతుంది స్వప్న. కానీ నేను జాబ్ చేయను.. రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని తన ప్లాన్ చెబుతాడు కాశీ. ఆ మాటలతో స్వప్న చాలా సంతోషిస్తుంది.

శివన్నారాయణకి దశరథ క్షమాపణలు చెప్పి నువ్వు నన్ను పెంచినంత శ్రద్ధగా నేను నా కూతురిని పెంచలేకపోయానని బాధపడతాడు. అది కేవలం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉండదని అంటాడు శివన్నారాయణ. వయసులో ఉన్న పిల్లలు అలాగే ఉంటారు, ఆ సూరజ్‌ అడిగిన దాని గురించి మరోసారి ఆలోచించమని చెబుతుంది పారిజాతం. నా తీర్పు సాయంత్రమే చెప్పేశానని అంటాడు శివన్నారాయణ. నీ తీర్పు నువ్వు మార్చుకో, ఇది నీ మనవరాలి పరువుకి సంబంధించినది అంటుంది జ్యోత్స్న. రోడ్డు మీద గొడవ పడినప్పుడు ఎక్కడికి పోయింది నీ పరువు? పరువంటే జనం దగ్గర పోగొట్టినది కాదు, మన అంతరాత్మ దగ్గర పోగొట్టుకునేది అని చెబుతాడు శివన్నారాయణ.

నీ కారణంగా ఒక మనిషి బాధపడ్డాడు. అతను అడిగింది నేను చేయను, మీ మాటను వెనక్కి తీసుకోమని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేను సైలెంట్‌గా ఉంటే వాడే పోతాడని అలా చేశాను, రేపు 5 లక్షల రూపాయలు అతనికి ఇచ్చేయమని అంటుంది జ్యోత్స్న. నువ్వు సీఈవోగా పనికిరావని చెప్పడానికి ఇది చాలు.. నీకింద పనిచేసే వాళ్లలో అన్నిరకాల మనుషులు ఉంటారు. మేనేజర్ మీద అరిచినట్లు రెస్టారెంట్‌లో బాయ్స్, వంట మనిషి, కస్టమర్ల మీద అరిస్తే వాళ్లు రారు. సీఈవోకి ఉండాల్సిన మొదటి లక్షణం నా అనుకునే తత్వం, అది నీకు లేకపోతే నీ నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్లే.

నా ఆస్తులకు మనవరాలిగా ఉండాలనుకుంటున్నావో, నాకు మనవరాలిగా మిగిలిపోవాలని అనుకుంటున్నావో నీ ఇష్టమని తేల్చేస్తాడు శివన్నారాయణ. నా తీర్పు నీకు సరిదిద్దుకునే ఒక పాఠం.. దానిని నువ్వు వద్దంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు నీ మనసుకు తీసుకోవడానికి కష్టంగా ఉంటాయి. నువ్వు ఉండే దానిని బట్టే నీకు లభించే గౌరవాలు ఉంటాయని తన నిర్ణయం చెబుతాడు శివన్నారాయణ. మీ తాత మనసు గెలవడానికైనా నువ్వు వెళ్లాల్సిందే, సీఈవో పదవి దీపకి, ఆస్తి కార్తీక్ గాడికి రాసేస్తాడు. నువ్వు ఎవరో బయటపడితే మనకు చిప్పకూడేనని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X