Karthika Deepam 2 June 1st: జ్యోత్స్న‌ని పనిమనిషిని చేసిన సూరజ్.. పరువు పోయిందంటూ శివన్నారాయణ ఆవేదన

Photo Courtesy: JioHotstar

జ్యూస్ షాపు ముందు మన పిల్ల ఫ్లెక్సీ పెట్టడానికి నేను ఒప్పుకోనని అంటుంది పారు. మేడం గారి వల్ల నా మర్యాద పోయింది కాబట్టి ఆమె ఫ్లెక్సీతో పాటు తను కూడా నా షాప్ దగ్గర పనిచేయాలని చెబుతాడు సూరజ్. జ్యోత్స్న ఒప్పుకోనని మొండికేయడంతో సోషల్ మీడియాలో నీకు బాగా పేరొస్తుందని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నతో సూరజ్ షాప్ దగ్గర పని చేయించాల్సిన బాధ్యతని కార్తీక్ చేతికి అప్పగిస్తాడు శివన్నారాయణ. దాంతో చేసేదేం లేక ఫోటోలకు ఫోజులిస్తుంది జ్యోత్స్న. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా ఆత్మాభిమానం కోసం నిలబడ్డాడని సూరజ్‌ గురించి కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ.

నువ్వు నోరు జారడం వల్ల నాకు ఈ గతి పట్టిందని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నేను వాడి షాపు దగ్గరికి వెళ్లను, నా ఫ్లెక్సీలు పెట్టడానికి అసలు సూరజ్ ఉండాలి కదా అంటుంది జ్యోత్స్న. మనవరాలు ఏం చేస్తుందోనని పారు వణికిపోతుంది. అల్లుడుగారిని ఏదో ఒక పనిచేయమని స్వప్నతో కావేరి చెబుతుండగా కాశీ విని బయటికొస్తాడు. నేను ఆన్‌లైన్‌లో ఫుడ్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే పెడదామని చెబుతాడు కాశీ. సూరజ్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లనని శివన్నారాయణకి చెబుతుంది జ్యోత్స్న. నువ్వు నా ఆస్తులకి వారసురాలికి ఉంటావో? నా మనవరాలిగా ఉంటావో నిర్ణయించుకోమని తేల్చేస్తాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 1వ తేదీ 685వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 685 June 1st 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నని తీసుకుని సూరజ్ స్టాల్ దగ్గరికి వస్తాడు కార్తీక్. రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి నువ్వు రావేమో, ఏం చేస్తావో అనుకున్నానని అంటుంది పారు. ఎప్పుడు ఏం చేయాలో ఈ జ్యోత్స్నకి బాగా తెలుసు, నేను తలదించుకున్నా అందులో నా గెలుపే ఉండాలని చెబుతుంది. సూరజ్ స్టాల్ దగ్గర నా వల్ల తప్పు జరిగింది, సూరజ్ హెల్దీ ఫుడ్ ఈజ్ ది బెస్ట్ అనే ఫ్లెక్సీలు చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదని కార్తీక్‌పై మండిపడుతుంది. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఫోన్ చేయించి స్టాల్ నాశనం చేశావు, వచ్చిన చెడ్డపేరుని పొగొట్టాల్సింది నువ్వే కదా? అందుకే ఈ ఏర్పాట్లు చేశానని అంటాడు కార్తీక్. నీ సోషల్ మీడియా ఖాతాలో నీ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వరదలా వస్తున్నాయని అంటాడు. మేడం గారికి యూనిఫాం ఇవ్వండి అని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

యూనిఫాం వేసుకొచ్చిన జ్యోత్స్నని మాజీ మిస్ హైదరాబాద్ అని కార్తీక్ అందరికీ పరిచయం చేస్తాడు. దాంతో జ్యోత్స్నతో సెల్ఫీల కోసం కస్టమర్లు ఎగబడతారు. జ్యూస్ చేయమని కస్టమర్ అడగటంతో జ్యోత్స్నకి ఎలా చేయాలో తెలియదు. సూరజ్ స్టాల్ దగ్గర జ్యోత్స్న జ్యూస్‌లు చేస్తున్న ఫోటోలను శివన్నారాయణకి పంపిస్తాడు కార్తీక్. అది చూసిన పెద్దాయన.. ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్ధితి తెచ్చుకుందో చూడమని బాధపడతాడు. అహంకారం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో జ్యోత్స్నకి ఇప్పటికైనా అర్ధమవుతుంది. నేను నా మనవరాలిని ఇలా చూడాలని అనుకోలేదని అంటాడు శివన్నారాయణ. నువ్వే కాదు నాన్న వెళ్లమని చెప్పిందని కాంచన అనగా.. చేసిన తప్పుకి మనమే దండించాలి, ఇలా చేస్తే అయినా మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటుందని చెబుతాడు.

నాకు ఇష్టం లేకపోయినా కేవలం తనలో మార్పు కోసమే పంపించా. లేదంటే ఈ శివన్నారాయణ మనవరాలు ఎవరో అనామకుడి షాపులో జ్యూస్ అమ్మడం ఏంటి? ఇది నా పరువు తక్కువ, నాకు చిన్నతనం అంటాడు. ఆ అబ్బాయి జ్యోత్స్న మీద పగ తీర్చుకోవడం లేదు. జరిగిన నష్టానికి పరిహారం చూస్తున్నాడని అంటుంది కాంచన. అంత పెద్ద గొడవ జరిగినా అతను ఒక్క మాట కూడా తక్కువగా మాట్లాడలేదు. మర్యాదగా తన బాధను చెప్పాడని అంటుంది దీప. జ్యోత్స్న ఇలాంటి శిక్షకు అర్హురాలని దశరథ, పిల్లల్ని సరైన దారిలో పెట్టాలి.. ఎంతో జీవితం ఉన్న మనిషి, ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మనిషి ఇలా తన పొగరుని చిన్నవాళ్లపై చూపించడం తప్పేనని అంటుంది సుమిత్ర.

ఆ వైరాగాడి విషయంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగింది. మనింటి పిల్లని ఎత్తుకుపోయాడు, డబ్బులిస్తే కానీ వదలను అన్నాడు. కానీ ఈ సూరజ్ అలాంటి వాడు కాదు.. ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు పాడు చేసిన చేతులతోనే పాడైన దానిని బాగుచేయాలని అనుకుంటున్నాడు. మంచి మాట తీరు, మంచి పద్ధతి, మంచి కుటుంబంలో పెరిగిన అబ్బాయే అయ్యుంటాడని చెబుతుంది కాంచన. జ్యోత్స్న జ్యూస్ సెంటర్ దగ్గర కష్టపడుతుండటంతో పారు తెగ బాధపడుతుంది. నువ్వు పార్టీ మార్చేసినట్లుగా ఉన్నావని కార్తీక్ అనడంతో పారు షాక్ అవుతుంది. ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే దానికి అనుమానం వస్తుందని అంటుంది పారు.

నువ్వు సరిగా పనిచేయడం లేదు.. నీ గొంతుతో జ్యూస్ గురించి చెబితే వచ్చిపోయేవాళ్లు ఆగిమరి తాగాలని కార్తీక్ చెప్పడంతో అంత కర్మ నాకు పట్టలేదని రగిలిపోతుంది జ్యోత్స్న. నువ్వు అలా చేయకపోతే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నదంతా నా ఛానెల్‌లో లైవ్ పెట్టానని చెప్పడంతో జ్యోత్స్న, కార్తీక్‌, పారులు షాక్ అవుతారు. మీరు మీ టాలెంట్‌తో ఒక కస్టమర్‌ని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. జ్యోత్స్న ముద్దు ముద్దుగా నాలుగు మాటలు మాట్లాడటంతో కస్టమర్‌ వస్తాడు. అది చూసి అంతా ఆనందిస్తారు. అక్కడున్న జ్యోత్స్న ఫోటోలు చూసిన కస్టమర్‌.. నీ స్టాల్ ముందు నువ్వే ఫోటోలు పెట్టుకున్నావా అని కస్టమర్ అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నువ్వు పనిమినిషిలా ఉన్నావని అనడంతో జ్యోత్స్న కస్టమర్‌తో గొడవ పడుతుంది. కార్తీక్ వచ్చి సర్ది చెప్పడంతో నువ్వెవరు అని అడుగుతాడు కస్టమర్. అతను నా డ్రైవర్ అని జ్యోత్స్న చెప్పడంతో .. ఆ బాబు రాజసం ఉట్టిపడేలా ఆ తేజస్సు, మామిడి పండులా మెరిసిపోతున్నాడు, ఈ బాబు గొప్పింటి బిడ్డ అయ్యుంటాడని అంటాడు. ఆ కస్టమర్‌కి బుద్ధి చెప్పాలని జ్యోత్స్న రకరకాల ఫ్రూట్స్‌తో జ్యూస్ చేయగా .. అది చూసిన సూరజ్ దానిని అడ్డుకుని మరో జ్యూస్ ఇస్తాడు. పొరపాటున చేయి తగిలి గ్లాస్ కిందపడిపోయిందని అనుకుంటున్నారా? నేనే కావాలని కిందపడేశానని చెబుతాడు సూరజ్.

ఏం జరిగిందని కార్తీక్ అడగ్గా.. మేడం గారు నిజంగానే జ్యూస్‌ని కల్తీ చేశారు, కస్టమర్‌ తాగాడంటే థూ అని ముఖం మీద కొట్టి వెళ్లేవాడు. ముందుగానే చూశాను కాబట్టి అడ్డుకున్నాను అని చెబుతాడు సూరజ్. నా రేంజ్‌కి ఇప్పటి వరకు ఈ స్టాల్‌లో పనిచేయడమే చాలా ఎక్కువని చెబుతుంది జ్యోత్స్న. శివన్నారాయణ గారి మవనరాలు అనే బ్రాండ్ ఒక్కటే మీకున్న స్థాయి.. అది కాస్తా తీసేస్తే ఇందాక కస్టమర్ చెప్పినట్లు నీ రేంజ్ ఇదేనని సూరజ్ అనడంతో జ్యోత్స్న, పారు, కార్తీక్‌లు షాక్ అవుతారు. కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు.. నిన్న మీది, ఈరోజు నాది. మళ్లీ నా జోలికి రావొద్దని జ్యోత్స్నకి సూరజ్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X