Karthika Deepam 2 June 2nd: జ్యోత్స్న‌తో మేనేజర్ కుమ్మక్కు... దీప సీఈవో పోస్ట్ పీకేసిన శివన్నారాయణ..

Photo Courtesy: JioHotstar

శివన్నారాయణ చెప్పినట్లే జ్యోత్స్నని తీసుకుని సూరజ్ స్టాల్ దగ్గరికి వస్తాడు కార్తీక్. రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్‌కి రావేమోనని అనుకున్నానని అంటుంది పారు. నేను తలదించినా పైచేయి నాదే అవుతుంది.. జరగబోయేది చూడమని చెబుతుంది జ్యోత్స్న. అక్కడికి వెళ్లేసరికి నాదే తప్పు, సూరజ్ హెల్దీ ఫుడ్ ఈజ్ ది బెస్ట్ అనే ఫ్లెక్సీలు చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. అంతలోనే జ్యోత్స్నని చూసి ఆమె అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అది చూసిన కార్తీక్.. మేడం గారికి యూనిఫాం ఇవ్వమని అంటాడు.

సూరజ్ ఫుడ్ స్టాల్ దగ్గర జ్యోత్స్న జ్యూస్‌లు తయారుచేసి సప్లయ్ చేస్తుండటాన్ని ఫోటో తీసి తాతకి పంపిస్తాడు కార్తీక్. మనవరాలిని అలా చూసిన శివన్నారాయణ.. అహంకారం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇప్పటికైనా జ్యోత్స్నకి అర్ధమవుతుందని అంటాడు. జ్యోత్స్న ఈ శిక్షకు అర్హురాలని దశరథ, సుమిత్ర, కాంచన అంటారు. జ్యోత్స్న జ్యూస్ చేస్తుండగా ఓ కస్టమర్ వచ్చి గొడవపడతాడు. దాంతో అతనికి చేదుగా ఉండేలా జ్యూస్ చేసి ఇస్తుంది జ్యోత్స్న. అది చూసిన సూరజ్ దానిని అడ్డుకుంటాడు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఇకనైనా బుద్ధిగా ఉండమని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 2వ తేదీ 686వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 686 June 2nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సూరజ్ స్టాల్ దగ్గర జరిగిన అవమానంతో రగిలిపోతూ ఆఫీస్‌కి వస్తుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన మేనేజర్ లేట్ అయ్యింది.. కాఫీ, టీ, జ్యూస్ ఏమైనా కావాలా అని అడగ్గా పోరా అంటూ ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అమాయకుడి మీద ఎందుకు అరుస్తున్నావని కార్తీక్ మండిపడతాడు. జ్యూస్ గురించి కాకుండా ఇంకేదైనా అడగమని మేనేజర్‌తో అంటాడు కార్తీక్. ఇంతలో మెయిల్ వచ్చిందని మేనేజర్‌ని పిలుస్తుంది దీప. ఓపెన్ చేసి ఏముందో చెప్పమని అడుగుతుంది.. ఫుడ్ ఆర్డర్ వచ్చిందని మేనేజర్ చెప్పగా వాళ్ల వివరాలు చెబితే ఆర్డర్ ఓకే చేసేద్దామని అంటుంది దీప. 350 మందికి క్యాటరింగ్ కావాలని మేనేజర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

350 మందికి డైలీ ప్లేట్ 60 మందికి కావాలని అడుగుతున్నారని మేనేజర్ చెప్పగా.. ఒకరోజు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ రేటుకి ఇవ్వడం కుదరదని చెప్పండని చెబుతుంది. ఆ వెంటనే శివన్నారాయణకి ఫోన్ రావడంతో పెద్దాయన సీరియస్ అవుతాడు. ఇద్దరు సీఈవోలని, కార్తీక్‌ని, మేనేజర్‌ని కూడా పిలవమని చెబుతాడు. ఏమైందని దశరథ అడగ్గా.. తప్పు జరిగిందని అంటాడు. శాండల్‌వుడ్ మీడియా నుంచి ఆర్డర్ ఏమైనా వచ్చిందా అని పెద్దాయన అడగ్గా.. నాకు వచ్చిందని దీప చెబుతుంది, మాకు ఇంట్రెస్ట్ లేదని మెసేజ్ ఇచ్చామని మేనేజర్ చెప్పగానే అతనిని లాగిపెట్టి కొడతాడు శివన్నారాయణ. మీరంతా కంపెనీని నాశనం చేయడానికి ఉన్నారా? బాగు చేయడానికి ఉన్నారా? అని ఫైర్ అవుతాడు.

శాండల్‌వుడ్ మీడియా అంటే ఎంత పెద్ద సంస్థ.. అలాంటి కంపెనీ నుంచి మనకి ఆర్డర్ వచ్చిందంటే మనకి గొప్ప అవకాశం వచ్చినట్లే. అలాంటి అవకాశాన్ని వదిలేస్తావా అని సీరియస్ అవుతాడు. దీప మేడం గారు చెప్పబట్టే ఆ ఆఫర్‌ని వదిలేశానని మేనేజర్ చెప్పగా.. ఇంత పెద్ద ఆఫర్‌ని దీప ఎందుకు వద్దు అంటుందని కార్తీక్ అంటాడు. వంశీ చెప్పింది నిజమే.. నేనే వద్దు అని చెప్పాను, ప్లేట్ మీల్స్ 60 రూపాయలకే కావాలని అడిగారని చెబుతుంది దీప. ఆమె చెప్పింది నిజమేనా అని పెద్దాయన అడగ్గా.. దీప మేడం అబద్ధం చెబుతున్నారని ప్లేట్ మార్చేస్తాడు. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యం ఉందని లాప్‌టాప్ తీసుకొచ్చి చూపిస్తుంది. కానీ అందులో ప్లేట్ మీల్స్ 160 రూపాయలకి ఉందని కార్తీక్ అంటాడు.

మేనేజర్ నాతో అలాగే చెప్పాడని దీప చెబుతుండగా.. నేను అలా చెప్పలేదు. ప్లేట్ 160 రూపాయలకు చేద్దామని అడిగితే 200 రూపాయలకు చేద్దామని దీప మేడం నాతో అన్నారని అనడంతో మేనేజర్ చొక్కా పట్టుకుని సీరియస్ అవుతుంది దీప. ఇదేం బజారు కాదు.. మీరు మీరు కొట్టుకోవద్దు మీ చేతకానితనంతో నిర్లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాల వల్ల నా పరువు పోతుంది. శాండల్‌వుడ్ మీడియా ఓనర్ ఫోన్ చేసి లైఫ్‌లో మీ రెస్టారెంట్‌కు ఆఫర్ ఇవ్వనని చెబుతున్నాడు. నా తల ఎక్కడ పెట్టుకోను అని మండిపడతాడు శివన్నారాయణ. కార్తీక్ ఏదో మాట్లాడబోతుండగా... నాణ్యత లేకుండా అడుగుతున్నారని దీప చెబుతుంది. నీకు అలాంటి అనుమానం వస్తే నీ పక్కనే ఉన్న జ్యోత్స్నని అడగాలి, లేదంటే కార్తీక్‌ని, దశరథ, నన్ను అడగాలని చెబుతాడు శివన్నారాయణ.

చూస్తుంటే కంపెనీని దివాళా తీయించేలా ఉన్నారు.. మిమ్మల్ని పెట్టింది నష్టాల్లో నుంచి బయటకు తీసుకొస్తారని అంటాడు శివన్నారాయణ. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో జ్యోత్స్న నవ్వుకుంటుంది. ఈ మేనేజర్ జ్యోత్స్న మనిషా .. నమ్మించి వెన్నుపోటు పొడిచావు కదా అని కార్తీక్ అనుకుంటాడు. నీ పనులకు సంబంధించి నీదే పూర్తి బాధ్యత.. ఏదైనా తప్పు జరిగితే నేను మిమ్మల్నే అడుగుతానని అంటాడు శివన్నారాయణ. ఇంతపెద్ద ఆఫర్ పొగొట్టిన దీప లాంటి వాళ్లకి సీఈవో పోస్ట్‌లో ఉండే అర్హత లేదని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. దశరథ నచ్చచెప్పబోతుండగా.. ఈ క్షణమే దీపని పోటీలో నుంచి తొలగించి ఆఫీస్ నుంచి బయటకు పంపేయండి అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో కార్తీక్, దశరథ, దీపలు షాక్ అవుతారు.

ఇది కేవలం తనకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల జరిగిన పొరపాటు అని కార్తీక్ చెబుతుండగా.. ఇది బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటాడు. సీఈవో అవ్వగానే పొగరు నెత్తికెక్కిందని అంటాడు శివన్నారాయణ. నాకు మరో అవకాశం ఇవ్వమని దీప అడగ్గా.. మరో నష్టం తీసుకొస్తావా అని పెద్దాయన చెబుతాడు. ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనమని దీప చెప్పడంతో శివన్నారాయణ మరో అవకాశం ఇస్తాడు. దీప తప్పు చేయదని దశరథ అనగా.. తప్పు ఎవరు చేసినాసరే శిక్షించాల్సిందేనని అంటాడు పెద్దాయన.

జరిగిన దానిలో నీ తప్పేం లేదు.. ఇదంతా జ్యోత్స్న మేనేజర్ కలిసి ఆడిన నాటకమని అంటాడు కార్తీక్. ఇంతలో దశరథ వచ్చి అదే అంటాడు. అస్తమానం జ్యోత్స్న మేనేజర్‌పై కోప్పడుతుంటే ఏదో అనుకున్నాను అంటుంది. ఇదంతా కార్పోరేట్ పాలిటిక్స్ నువ్వే తెలివిగా ముందుకు వెళ్లాలని చెబుతాడు కార్తీక్. నేను, కార్తీక్ నీకు సాయం చేయలేం.. కానీ నీకో మనిషి అవసరమని చెబుతాడు దశరథ. తన కోసం తనకింద మనిషిని పెట్టుకోవచ్చని దశరథ సలహా ఇస్తాడు. ఎవరిని పెట్టుకుంటావో నీ ఇష్టం, ఒక మనిషిని పెట్టుకోమని చెబుతాడు. ముందు నీ ఆలోచనా విధానం, భయాన్ని వదిలిపెట్టమని అంటాడు కార్తీక్.

ఈ పారిజాతం మనవరాలి దెబ్బకి శివన్నారాయణ గారి మనవరాలికి దిమ్మతిరిగిపోయిందని జ్యోత్స్న, పారులు సంబరపడిపోతారు. బావ అవస్థ పగోడికి కూడా రాకూడదు, ఇద్దరు మరదళ్ల మధ్య జరుగుతున్న పోటీలో ఆటలో అరటిపండులా మిగిలిపోయాడని చెబుతుంది జ్యోత్స్న. వాడి మౌనం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తుంది పారు. కార్పోరేట్ ప్రపంచంలో బుర్రతో ఆడాలని చెబుతుంది జ్యోత్స్న. ఈ ఆటలో మీ బావ నీకంటే ముదురు అని అంటుంది పారు. అందుకే బావ కాళ్లు, చేతులు కట్టేశానని అంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి నోరైతే కట్టేయలేదు కదా అని అంటాడు. చదువురాని వాళ్లకి ఇలాంటి ఇంగ్లీష్‌ ఉద్యోగాలు అవసరమా అని పారు చెబుతుంది. కాలం తలచుకుంటే ఓడిపోయే గుర్రమే విజేతగా నిలబడుతుంది. దీప వెతికే పనిలోనే ఉంది.. నా భార్య ఫైటర్ కదా? ఓటమి ఒప్పుకోదని అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

సూరజ్ దగ్గరికి వెళ్లిన దీప.. నేను ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్‌కి టెంపరరీ సీఈవోగా వర్క్ చేస్తున్నాను. మైత్రీవనం దగ్గరున్న బ్రాంచ్‌ని డెవలప్ చేసిన బాధ్యత నాదేనని చెబుతుంది. నేను చదువుకుంది 5వ తరగతి వరకే. మెయిల్స్ చదవడం, ఇంగ్లీష్ నాకు రాదని అంటుంది. ఆఫీస్‌ అందరూ జ్యోత్స్న మనుషులే ఎవర్నీ నమ్మలేం.. మా బావ నాకు హెల్ప్ చేయకుండా జ్యోత్స్న కండీషన్ పెట్టిందని చెబుతుంది దీప. మీరు నాతో కలిసి పనిచేస్తారా అని అడగ్గా.. కార్పోరేట్ ఆఫీసుల్లో జాబులు నా వల్ల కాదు, నేను స్వతంత్రంగానే పనిచేస్తానని అంటాడు సూరజ్. ఇది కేవలం రెండు వారాల పోటీయే, మీకు నచ్చకపోతే వెళ్లిపోవచ్చని చెబుతుంది దీప. కార్పోరేట్ ఆఫీస్‌ని మనం వదిలేద్దామని అనుకున్నా.. అది మనల్ని వదలదని అంటాడు సూరజ్. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X