Karthika Deepam 2 June 3rd: సూరజ్‌ని కొట్టించిన జ్యోత్స్న... సుమిత్రకి దీప ఊహించని గిఫ్ట్, షాక్‌లో పారు

Photo Courtesy: JioHotstar

సూరజ్ నుంచి కోపంతో ఆఫీస్‌కి వచ్చిన జ్యోత్స్నని జ్యూస్ కావాలా అని మేనేజర్ అడగ్గా.. అతనిపై కోప్పడుతుంది. ఇంతలో దీపకు ఏదో మెయిల్ రావడంతో ఏంటో చూడమని మేనేజర్‌ని పిలుస్తుంది. ఓ కంపెనీ నుంచి 350 మందికి ఆర్డర్ వచ్చిందని, కానీ ప్లేట్ 60 రూపాయలకే అడుగుతున్నారని చెబుతాడు మేనేజర్. మన క్వాలిటీ ఫుడ్ సప్లయ్ చేస్తున్నప్పుడు తక్కువ రేటుకి ఇవ్వలేమని మెసేజ్ పెట్టమని చెబుతుంది దీప. ఇంతలో శివన్నారాయణకి ఆ కంపెనీ నుంచి ఫోన్ రావడంతో పెద్దాయన అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. వెంటనే దీప, జ్యోత్స్నలని, కార్తీక్‌ని, మేనేజర్‌‌ని పిలిపిస్తాడు. కంపెనీకి వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిందెవరు అని శివన్నారాయణ అడగ్గా.. నేనే అని చెబుతాడు మేనేజర్. దాంతో అతనిని లాగిపెట్టి కొడతాడు. దీప మేడం గారు చెబితేనే ఆర్డర్ క్యాన్సిల్ చేశానని అంటాడు మేనేజర్. దాంతో దీప కూడా అవునని చెబుతుంది.

వాళ్లు ప్లేట్ 60 రూపాయలకి అడిగారని అంత తక్కువ రేటుకి సప్లయ్ చేయలేమని నేనే క్యాన్సిల్ చేయమన్నానని అంటుంది దీప. లాప్‌టాప్ తీసుకొచ్చి చూపించగా దానిలో 160 రూపాయలు ఉండటంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. ఇలాంటి మనిషి సీఈవోగా వద్దని జ్యోత్స్న చెప్పడంతో ఇప్పుడే పీకేస్తున్నానని అంటాడు. అయితే కార్తీక్, దీపలు రిక్వెస్ట్ చేయడంతో చివరి అవకాశం ఇస్తాడు పెద్దాయన. జ్యోత్స్న, మేనేజర్‌లు కలిసి ఆడిన డ్రామాకి నువ్వు బలైపోయావని దీపతో కార్తీక్, దశరథలు చెబుతారు. నీకు అన్ని పనులు చేసిపెట్టే ఒక నమ్మకమైన మనిషిని నీకింద ఉద్యోగిగా పెట్టుకోమని సలహా ఇవ్వడంతో సూరజ్ దగ్గరకి వెళ్లి విషయం చెబుతుంది దీప. అయితే తాను ఏ కంపెనీలోనూ పనిచేయనని తేల్చేస్తాడు సూరజ్. ఇదంతా చూసిన జ్యోత్స్న రగిలిపోతుంది,. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 3వ తేదీ 687వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 687 June 3rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

తన దగ్గర పనిచేయడానికి సూరజ్ ఒప్పుకోకపోవడంతో దీప బాధపడుతుంది. ఈ పనికిమాలిన జ్యోత్స్న.. నా మీద కోపంతో కంపెనీకి వచ్చే ఆర్డర్స్‌ని నాశనం చేస్తోందని కార్తీక్‌కి చెబుతుంది. తను స్వార్ధంతో బతికే మనిషి.. తన స్వార్ధం కోసం ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తుందని అంటాడు కార్తీక్. పోనీ స్వప్నని నా దగ్గర పెట్టుకుంటానని చెబుతుంది దీప. తన కాపురం ఇప్పుడే సెట్ అయ్యింది.. మళ్లీ నీ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ చేశానంటే కాశీకి స్వప్నకి దూరం పెరుగుతుంది. ఇప్పుడు మా నాన్నని తనే జాగ్రత్తగా చూసుకుంటుంది. మా నాన్న తినకపోయినా టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోయినా తను ఊరుకోదు.. ఇప్పుడు తను మా నాన్న దగ్గర ఉండటం చాలా అవసరమని చెబుతాడు కార్తీక్.

స్వప్న వద్దు.. మరి కాశీ ఓకేనా అని అడుగుతుంది దీప. వాడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కంపెనీకి వస్తాడు. ఒకవేళ వచ్చినా జ్యోత్స్న, పాలు కలిసి వాడిని మార్చేస్తారు. నీ మాటలు పనిచేసి సూరజ్ ఈ ఆఫర్ గురించి ఆలోచిస్తాడేమో చూద్దామని అంటాడు కార్తీక్. సూరజ్ మనసు మారితే సంతోషమే, మారాలని కోరుకుందామని చెబుతాడు. సూరజ్ తన ఫ్రెండ్‌తో కలిసి వస్తుండగా ఇద్దరు రౌడీలు అతనిని చితకబాదుతారు. ఆ వీడియోని జ్యోత్స్నకి పెడతారు. ఆ వీడియోని చూపించడంతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతే పడుతుంది. వీడు నాకు చేసిన అవమానానికి చంపేయాలి.. కానీ ఇలాంటి వాడిని వెంటనే చంపకూడదు. నన్ను చూసిన ప్రతిసారి వీడు భయపడాలి.. అదే నిజమైన చావు అంటుంది జ్యోత్స్న.

ఇప్పుడు వాడు మీ తాతతో చెబితే అని పారు అడగ్గా.. ఆ రోజు జరిగిన దానికి బావ సాక్ష్యం చెప్పాడు. ఈరోజు జరిగినదానికి సాక్ష్యం ఎవరున్నారు? అని ప్రశ్నిస్తుంది. సూరజ్ గాడు బాగా మొండోడు.. అనుమానం వచ్చిందంటే వదిలిపెట్టడు. కోలుకున్నాక కూడా నేను మాత్రం వాడిని వదిలిపెట్టనని చెబుతుంది జ్యోత్స. మళ్లీ దారినపోయే కంపను తగిలించుకునే వరకు వదిలిపెట్టదని మనవరాలిపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న.

ఉదయాన్నే దశరథ కేక్ ఆర్డర్ చేస్తుండగా విన్న శౌర్య.. కేక్ నా కోసమేనా అని అడుగుతుంది. ఈరోజు మీ అమ్మమ్మ పుట్టినరోజు తన కోసమే ఈ కేక్ అని చెబుతాడు దశరథ. దాంతో శౌర్య లోపలికి వెళ్లి విషయం అందరికీ చెబుతుంది. నేనే ఈ విషయాన్ని చెప్పొద్దని అంటుంది సుమిత్ర. దాంతో సుమిత్ర మీద ఇష్టం ఉన్నట్లుగా నటిస్తూ నీ బర్త్ డే నాకు తెలుసని అంటుంది జ్యోత్స్న. అమ్మమ్మ బర్త్ డే అని నీకు తెలుసా జో అని శౌర్య అడగ్గా.. మీ అమ్మ అంటే పరాయిది, కాబట్టి మా మమ్మీ బర్త్ డే గురించి తెలియకపోవచ్చు. నేను కన్నతల్లిని కాబట్టి నాకు తెలుసని బర్త్ డే విషెస్ చెబతుుంది జ్యోత్స్న.

అసలు కేక్ ఆర్డర్ చేయించిందే కార్తీక్ అని చెబుతాడు దశరథ. నేను ఇలాంటివి అన్నీ వద్దు అని చెప్పినా వాడు వినిపించుకోలేదని అంటుంది సుమిత్ర. వదిన ఎందుకు అలా డల్‌గా ఉందని కాంచన అడగ్గా.. మీ వదిన బెంగంతా నీ మేనకోడలి పెళ్లి గురించి అని చెబుతాడు దశరథ. జ్యోత్స్న మెడలో మూడు ముళ్లు పడేవరకు తన జీవితంలో పూర్తి సంతోషాన్ని చూడలేమని అంటాడు దశరథ. కార్తీక్‌ని బయటికి పిలిచి మా అమ్మ పుట్టినరోజని నాతో ఎందుకు చెప్పలేదని దీప అలుగుతుంది. ముందే చెప్పుంటే చీర ఆర్డర్ ఇచ్చేదానిని చెబుతుంది. అమ్మ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని చెప్పి దక్షిణామూర్తి తాతని పిలుద్దామని అంటుంది దీప. ఈ మాటలన్నీ పారు, జ్యోత్స్నలు వింటారు.

దక్షిణామూర్తి తాతని కాపాడిన దానికి జరిగిన పంచాయతీని మరిచిపోయావా అని ఫైర్ అవుతాడు కార్తీక్. దక్షిణామూర్తి తాత మంచోడా? చెడ్డోడా అనేది నాకు తెలియదు. దూరంగా ఉన్న బంధాల్ని దూరంగానే ఉంచేద్దామని చెప్పడంతో కార్తీక్‌ని హత్తుకుంటుంది దీప. ఈ రెండు కుటుంబాలు కలవాలని రాసుంటే ఎవరూ ఆపలేరని అంటాడు కార్తీక్. దక్షిణామూర్తి గురించి తాతకి నిజం చెప్పేద్దామని జ్యోత్స్న వెళ్తుండగా పారు ఆపుతుంది. సుమిత్రకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియక ఆలోచిస్తున్న దీపకి కార్తీక్ సలహా ఇస్తాడు.

సుమిత్ర బర్త్ డే కోసం కార్తీక్ దగ్గరుండా బాగా డెకరేట్ చేస్తాడు. తల్లి పుట్టినరోజు సందర్భంగా దీప ఓ చిన్న కానుక ఇస్తుంది. అందులో ఆసుపత్రి బెడ్‌పై డెలివరీ జరిగిన తర్వాత బిడ్డని చూస్తున్నట్లుగా ఉన్న సుమిత్ర స్కెచ్ ఉంటుంది. అది చూసి సుమిత్ర ఎమోషనల్ అవుతుండగా.. పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. సుమిత్రకు డెలివరీ అయ్యాక బిడ్డను మార్చినప్పుడు ఎలా ఉందో ఈ స్కెచ్ అలాగే ఉందని అనుకుంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X