Karthika Deepam 2 June 4th: శివన్నారాయణ ముందు దీపని ఇరికించిన జ్యోత్న్న.. మనవరాలిని కాపాడిన దక్షిణామూర్తి
Photo Courtesy: JioHotstar
సూరజ్ తన దగ్గర పనిచేయడానికి ఒప్పుకోకపోవడంతో కార్తీక్ దగ్గర చెప్పుకుని దీప బాధపడుతుంది. స్వప్నని కానీ, కాశీని కానీ పెట్టుకుందామా అని దీప అడగ్గా.. వాళ్లిద్దరి కాపురం ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది. మా నాన్నకి ఇప్పుడు స్వప్న అవసరం చాలా ఉంది, అలాగే కాశీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తాడు. వచ్చినా జ్యోత్స్న, పారులు వాడి మైండ్ పాడు చేస్తారని చెబుతాడు కార్తీక్. అర్థరాత్రి సూరజ్ తన ఫ్రెండ్‌తో కలిసి వస్తుండగా ఇద్దరు రౌడీలు అతనిని చితకబాది ఆ వీడియోను జ్యోత్స్నకి పంపిస్తారు. వాడిని ఇక వదిలేయమని పారు చెప్పగా.. ఈ జ్యోత్స్న అంటే ఏంటో తెలిసే దాకా వదిలిపెట్టనని అంటుంది.
ఉదయాన్నే దశరథ కేక్ ఆర్డర్ చేస్తుండగా విన్న శౌర్య ఈరోజు అమ్మమ్మ పుట్టినరోజుని అందరికీ చెబుతాడు. దాంతో తల్లికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న దీప.. దక్షిణామూర్తి తాతతో సర్‌ప్రైజ్ చేద్దామని కార్తీక్‌తో చెబుతుంది. కొన్ని బంధాలు మన చేతుల్లో ఉండవు.. ఆ దేవుడే కలపాలని అంటాడు కార్తీక్. ఈ మాటలు విన్న జ్యోత్స్న, పారులు కొత్త స్కెచ్ వేస్తారు. అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని కార్తీక్‌ను అడుగుతూ ఉంటుంది దీప. దాంతో డెలివరీ సమయంలో పాపని చూస్తున్న తల్లి బొమ్మ వేయమని చెబుతాడు. శౌర్య చేత ఆ బొమ్మను వేయించిన దీప.. సుమిత్రకు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతుంది. ఆ బొమ్మ చూసిన సుమిత్ర ఎమోషనల్ అవ్వగా.. పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 4వ తేదీ 688వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్రకు దీప ఇచ్చిన గిఫ్ట్.. హాస్పిటల్‌లో బిడ్డల్ని మార్చినప్పుడు ఉన్న స్కెచ్‌లా ఉండటంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. డ్రాయింగ్ ఎవరు వేశారని సుమిత్ర అడగ్గా.. శౌర్య అని చెప్పడంతో చిన్నారికి ముద్దుపెడుతుంది సుమిత్ర. అమ్మ ఎలా చెప్పిందో అలా వేశాను, ఈ ముద్దు నాకు కాదు అమ్మకు పెట్టమని అంటుంది సుమిత్ర. దాంతో దీపను దగ్గరికి తీసుకుని ముద్దుపెడుతుంది సుమిత్ర. అది చూసి అంతా సంతోషిస్తుండగా.. పారు, జ్యోత్స్నలు రగిలిపోతారు.
నా పుట్టినరోజు నాడు నేను అమ్మగా పుట్టిన క్షణాల్ని బహుమతిగా ఇచ్చారు.. ఇంతకంటే గొప్ప కానుక ఏం ఉంటుందని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఇలాంటి క్షణాన్ని ప్రతి తల్లీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. 9 నెలలు కడుపులో మోసిన బిడ్డని తొలిసారి చూసుకునేది ఇక్కడేనని కంటతడి పెడుతుంది సుమిత్ర. ఈ ఆనందాన్ని ఎంతోసేపు ఉండనివ్వకూడదని చెప్పి డ్రాయింగ్‌ని కిందపడేస్తుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి దక్షిణామూర్తి రావడంతో అంతా షాక్ అవుతారు. మనం విన్నది నిజమే వీళ్లు నిజంగానే దక్షిణామూర్తిని పిలిపించారని జ్యోత్స్న, పారులు అనుకుంటారు.
డ్రాయింగ్ వేసిన శౌర్యని మెచ్చుకుంటాడు దక్షిణామూర్తి. నీ చిట్టి చేతులతో ఇంత మంచి డ్రాయింగ్ వేయించిన మనిషి వేరే ఉన్నారన్న మాట అని అడగ్గా.. మా అమ్మ అని చెబుతుంది. నన్ను కూడా ముద్దుల తాత అని పిలవమని దక్షిణామూర్తి అనడంతో శౌర్యపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావని పెద్దాయన అడగ్గా.. నేను రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడిన మీకు కృతజ్ఞతలు చెప్పడానికి అని అంటాడు దక్షిణామూర్తి. ఆకలితో ఉన్నవాడు నా శత్రువైనా సరే నా ఇంటి ముందుకు వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపించమని నేను నమ్మిన ధర్మం చెబుతోంది. ఆపదలో ఉన్నాను కాబట్టి నాకు సాయం చేశాను అంటావా అని దక్షిణామూర్తి అంటాడు. ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది, అప్పుడైనా నీకు అర్ధం కావాలి.. ఈ శివన్నారాయణ వ్యక్తిత్వం ఏంటో అని అంటాడు.
నేను అని తెలిస్తే ప్రాణం పోసేవాడివా అని దక్షిణామూర్తి అడగ్గా.. ఇచ్చేది నేనని తెలిస్తే ఆ ప్రాణం తీసుకునేవాడివా అని అడుగుతాడు శివన్నారాయణ. నేను ప్రాణాలతో ఉండటానికి వీళ్లే కారణం.. అందుకే నీ మనవడికి, మనవరాలికి కూడా థ్యాంక్స్ చెప్పాలని అంటాడు దక్షిణామూర్తి. వాళ్లిద్దరికీ థ్యాంక్స్ చెప్పి ఆశీర్వదిస్తాడు. నువ్వు పాములాంటోడివి.. నీకు ఒళ్లంతా విషం ఉంటుంది. నీ నోటిలో నుంచి వచ్చిన ఆశీర్వచనాలు కూడా విషం కలిపిన పాము లాంటివి అవి నా మనవడికి అవసరం లేదని అంటాడు శివన్నారాయణ.
ఈరోజు నా కూతురి పుట్టినరోజు .. అందుకే గుడికి వెళ్లి అర్చన చేయించుకుని వచ్చాను. దీర్ఘాయుష్మాన్ భవ అని అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి అంటాడు శివన్నారాయణ. ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రేమలు.. మన మధ్య గొడవ జరిగి ఎన్నేళ్లు అవుతుంది, ఇన్నేళ్లలో ఎన్నిసార్లు నా పుట్టినరోజు జరిగింది, నీకు ఒక్కసారి కూడా ఈ కూతురు గుర్తుకురాలేదా అని సుమిత్ర మండిపడుతుంది. వస్తే మీ మావగారు నన్ను రానిచ్చేవారా అని దక్షిణామూర్తి ప్రశ్నించగా.. ఆనాడే నిన్ను వద్దు అనుకున్నాను, ఈనాడు ఎందుకు రానిస్తాను అంటాడు శివన్నారాయణ. మన కుటుంబాల మధ్య అగ్గిరాజుకోవడానికి కారణం నేనే.. కానీ తగలబెట్టింది నువ్వేనని ఫైర్ అవుతాడు దక్షిణామూర్తి.
నీకు, నీ కొడుక్కి నీతి లేదని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. మీ అన్నయ్యని నీతిలేని మనిషి అంటుంటే నువ్వు మౌనంగా ఉంటావా అని సుమిత్రపై మండిపడతాడు దక్షిణామూర్తి. తండ్రే లేనప్పుడు తోడబుట్టినవాడు ఎక్కడుంటాడని చెబుతుంది సుమిత్ర. ఆరోజు అహంకారంతో అయినవాళ్లని ఎడమకాలితో తన్నింది మీరు అంటుంది కాంచన. నేను మనిషిని కాబట్టి.. గతాన్ని మరిచిపోయి కూతురి కోసం ఇంతదూరం వచ్చానని అంటాడు దక్షిణామూర్తి. అయితే నీ కూతురు చచ్చిపోయిన రోజుని గుర్తుపెట్టుకోమని చెబుతుంది సుమిత్ర.
గతం మరిచిపోదాం.. పుట్టింటికి వెళ్దామని దక్షిణామూర్తి అడగ్గా.. నాకు పుట్టిల్లు అయినా మెట్టినిల్లు అయినా ఇదేనని తేల్చేస్తుంది సుమిత్ర. ఈ మంటలు చల్లారే రోజు త్వరలోనే వస్తుందని దక్షిణామూర్తి అంటాడు. కనిపించే నీ మంచితనం ఎండమావి లాంటిది, నమ్మించి నటించించి చాలని శివన్నారాయణ అంటాడు. దక్షిణామూర్తి అక్షింతలు వేయబోతుండగా పక్కకి లాగేస్తాడు శివన్నారాయణ. అయితే అక్షింతలు సుమిత్ర తలపై పడతాయి. నీకు నాకు రాసిపెట్టుంటే వచ్చే జన్మలో కలుద్దాం.. కానీ నీకు మాత్రం కూతురిగా పుట్టనని అంటుంది సుమిత్ర. నా మీద నువ్వు ఇంత కోపం పెంచుకోవడానికి నాతో పాటు మీ మామగారు కూడా అంతే కారణం, నేను నిజాలు మాట్లాడితే నా ముందు శివన్నారాయణ నిలబడలేడని అంటాడు దక్షిణామూర్తి.
ఈ ఇంటి గుమ్మం ఎందుకు తొక్కావని దక్షిణామూర్తిపై మండిపడతాడు శివన్నారాయణ. ఆయనేం ఊరికే రాలేదు, పిలిస్తేనే వచ్చాడని అంటుంది జ్యోత్స్న. పిలిచింది ఎవరు అని పెద్దాయన అడగ్గా.. దీప అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న శివన్నారాయణ, సుమిత్ర రగిలిపోతారు. నువ్వు, బావ ఈ పెద్దమనిషి గురించి మాట్లాడుకున్నారా? లేదా? అని జ్యోత్స్న నిలదీస్తుంది. మా మమ్మీ పుట్టినరోజుకు వాళ్ల నాన్న వస్తే బాగుండు అని చెప్పావా? లేదా? అని అంటుంది. దాంతో దీప నిజం ఒప్పుకుంటుంది. సమాధానం దీప కాదు.. నేను చెబుతాను అంటాడు శివన్నారాయణ. దీప ఫోన్ చేస్తేనో, కార్తీక్ పిలిస్తేనే నేను రాలేదు.. నా అంతట నేనే వచ్చాను, నా కూతురి కోసం వచ్చాను. నన్ను పిలవాలనే గొప్ప మనసు దీపకు ఉండొచ్చు, అది ఆవిడ గొప్పతనం. కానీ నేను ఒకరు రమ్మంటే రాను, పొమ్మంటే పోను. ఇది నా ప్రాణస్నేహితుడు శివన్నారాయణ ఇల్లు.. ఇది నా కూతురి అత్తారిల్లు, నేను ఎప్పుడైనా వస్తానని అంటాడు దక్షిణామూర్తి.
ఇకపై నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. తలపడటానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని అంటాడు దక్షిణామూర్తి. ఏదో ఒకరోజు నీ చేత్తోనే విందు భోజనం పెడతావని అంటాడు. మీ అన్నయ్య, వదిన నీ రాక కోసం ఎదురుచూస్తున్నారని తండ్రి చెప్పడంతో సుమిత్ర కంటతడి పెడుతుంది. సుమిత్ర ఏడుస్తుండటంతో శివన్నారాయణ బాధపడతాడు. అమ్మకి అన్నయ్య, వదిన కూడా ఉన్నారని దీప చెప్పగా.. ఆ కుటుంబం గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది, లేదంటే ఈ కుటుంబానికి కూడా దూరమవుతాం అంటాడు కార్తీక్. దక్షిణామూర్తి దయ వలన దీప తప్పించుకుందని జ్యోత్స్నతో అంటుంది పారు. దీపకి సుమిత్ర కేక్ పెడుతుండగా జ్యోత్స్న పక్కకి లాగేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications