Karthika Deepam 2 June 5th: దీపకి మేనేజర్‌గా సూరజ్ ఎంట్రీ .. కార్తీక్ ట్విస్ట్‌తో జ్యోత్స్నకి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

దీప ఇచ్చిన గిఫ్ట్ నచ్చడంతో ఆమెను ముద్దు పెట్టుకుంటుంది సుమిత్ర. ఇదంతా చూసిన పారు, జ్యోత్స్నలు రగిలిపోతారు. ఎలాగైనా ఈ సంతోషాన్ని పాడు చేయాలనుకుని సుమిత్ర చేతిలో ఉన్న డ్రాయింగ్ కింద పడేలా చేస్తుంది. ఇంతలో ఆ పేపర్ అందుకుంటాడు దక్షిణామూర్తి. అతనిని చూడగానే శివన్నారాయణ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. నీ పుట్టినరోజని నీ కోసం గుడిలో అర్చన చేయించాను, నిన్ను ఆశీర్వదిద్దామని వచ్చానని అంటాడు దక్షిణామూర్తి. నీ విషపు చేతులతో నా కోడలిని ఆశీర్వదించొద్దని మండిపడతాడు శివన్నారాయణ.

మన రెండు కుటుంబాలు విడిపోవడానికి నేను ఎంత కారణామో, నువ్వు కూడా అంతే కారణమని కౌంటరిస్తాడు దక్షిణామూర్తి. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడగ్గా.. దీపే పిలిచిందని ఇరికిస్తుంది జ్యోత్స్న. నన్ను ఎవరూ పిలవలేదు, నేనే వచ్చానని దీపని కాపాడతాడు దక్షిణామూర్తి. నీ కోసం మీ అన్నయ్య, వదిన ఎదురుచూస్తున్నారని సుమిత్రతో దక్షిణామూర్తి చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఆయన వెళ్లిపోగానే కోడలితో కేక్ కట్ చేయిస్తాడు శివన్నారాయణ. దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తూ ఉండగా జ్యోత్స్న అడ్డుపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 5వ తేదీ 689వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 689 June 5th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న, దీపలు ఆఫీస్‌లో ఉండగా మేనేజర్ వచ్చి దీపకి ఫైలు ఇస్తాడు. అదంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో చదివి చెప్పమని అడుగుతుంది దీప. మీకు అర్ధం కాకపోతే ఛైర్మన్ గారితో తిట్లు తినేది నేను, మీరే చదువుకోండి అని చెబుతాడు మేనేజర్. దీప పరిస్ధితి చూసిన కార్తీక్... హెల్ప్ చేసేందుకు వెళ్లబోతుండగా అతని చేయి పట్టుకుని వెనక్కి లాగుతుంది జ్యోత్స్న. ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్లే చేసుకోవాలని అంటుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కానీ.. నేను మాత్రం పట్టుకున్నానని చెబుతాడు కార్తీక్. ఎవరు ఎవరి మనిషో, ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలుసు అంటాడు. ముఖం మీద వెలుగు పడనంత వరకు తప్పు చేసినవాళ్లు దొరకరు, ఇప్పుడు నువ్వు ఆపేయొచ్చు కానీ ఏదో ఒకరోజు ఆపే అవసరం లేకుండానే ఎదుటివాళ్లు కూడా చైతన్యవంతులుగా మారతారని చెబుతాడు కార్తీక్.

అలాంటి రోజు రాదు.. నేను వెలుగుని మింగేసే రాహువు లాంటి దానిని అంటుంది జ్యోత్స్న, అయితే గ్రహణం విడిపోయే రోజు తొందరలోనే ఉందని చెబుతాడు కార్తీక్. ఏం జరిగినా పర్లేదు.. నువ్వు చదవమని మేనేజర్‌కి చెబుతుంది దీప. నువ్వు మరోసారి బకరా అవ్వడానికి రెడీగా ఉండమని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దీపకి ఎలా సాయం చేయాలో అర్ధం కాక.. ఆఫీస్ బాయ్‌ని పిలిచి పేపర్ మీద ఏం ఉందో చదవని చెబుతాడు. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉంది నాకు అర్ధం కావడం లేదని అంటాడు ఆఫీస్ బాయ్. నీకు తెలుగు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్లే అని చెబుతాడు కార్తీక్. ఇంగ్లీష్‌ని తెలుగులో మార్చే కొన్ని యాప్‌లు ఉన్నాయని దాని సాయంతో చదవొచ్చని అంటాడు. ఇన్‌డైరెక్ట్‌గా ఎవరికి చెబుతున్నావో అర్ధమవుతుందని రగిలిపోతుంది జ్యోత్స్న. ఇప్పుడు ఏ భాష అయినా ఏ వెధవ మీదైనా ఆధారపడకుండా చదువుకోవచ్చని అంటాడు కార్తీక్.

కార్తీక్ చెప్పినట్లు ఫైల్ మొత్తం యాప్ సాయంతో చదివిన దీప.. మేనేజర్‌ చొక్కా పట్టుకుని ఇంతకుముందు తప్పుగా ఎందుకు చెప్పావు? ఇప్పుడేందుకు మాట మారుస్తున్నావు? నీతో ఇలా ఎవరు చేయిస్తున్నారని నిలదీయడంతో జ్యోత్స్న మేడం అని చెబుతాడు మేనేజర్. దాంతో తన చెంప పగలగొట్టినట్లుగా కల కంటుంది జ్యోత్స్న. నాకు ఎవరూ చెప్పలేదు.. నేనే తప్పుగా చెప్పానని మేనేజర్ అనడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. మన టైం బాగుందని జ్యోత్స్నపై సెటైర్లు వేస్తాడు కార్తీక్. బోర్డ్ మీటింగ్లో నువ్వేంటో చూపించే టైం వచ్చిందని దీపతో చెబుతాడు.

జ్యోత్స్న, దీపలకు అప్పగించిన బ్రాంచ్‌ల ప్రొగ్రెస్ ఏంటో తెలుసుకోవడానికే ఈ మీటింగ్ పెట్టానని చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి అప్పగించిన బ్రాంచ్‌లో 10 శాతం గ్రోత్ కనిపిస్తోందని.. ఈ రెండు రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతాడు దశరథ. దీపకి అప్పగించిన బ్రాంచ్ గ్రోత్ పరిస్ధితి చూస్తే.. తనకి బాధ్యతలు అప్పగించినప్పటి కంటే 10 శాతం మైనస్‌లోకి వెళ్లిందని అంటాడు దశరథ. తన వల్ల ఓ పెద్ద ఆర్డర్ కూడా పోయింది.. అది కనుక వచ్చుంటే 10 శాతం మైనస్ కాదు, ఆ బ్రాంచ్ 20 శాతం ప్లస్‌లో ఉండేదని అంటాడు బోర్డ్ మెంబర్. దీప గారిని తీసేసి ఆ బాధ్యతలు జ్యోత్స్న గారికి అప్పగించమని చెబుతాడు.

ఇక్కడో పోటీ జరుగుతోంది.. దానికి టైం పెట్టారు, ఎవరు గెలుస్తారో చివరి వరకు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది.. రేపు పెద్ద ఆఫర్ వచ్చి దీప గారు ఓకే చేస్తే 20 శాతం ప్లస్‌లోకి వెళ్తుంది, అప్పుడు మీ నిర్ణయం మార్చుకుంటారా అని మండిపడతాడు కార్తీక్. ఆవిడ ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తేనే కదా మనం సపోర్ట్ చేయగలమని చెబుతాడు. దీప గారికి మా సపోర్ట్ ఉంటుంది.. ఆవిడ ప్రాబ్లమ్ ఏంటో చెప్పమని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. నా జీవితంలో ప్రతి ఒక్కటి ఒంటరిగానే పోరాడి సాధించాను, ప్రత్యర్ధి ఎలాంటి వాడైనా సరే.. కానీ నాకు బాషపరంగా ఇబ్బందులు ఉన్నాయని చెబుతుంది దీప. అయితే తన అసిస్టెంట్‌ని తనే వెతుక్కోవాలని కండీషన్ పెడుతుంది జ్యోత్స్న. నేను ఒకరిని వెతుక్కున్నానని దీప చెప్పగా.. అతనిని ఇప్పుడే ఫైనల్ చేద్దామని అంటాడు శివన్నారాయణ.

ఆ వెంటనే ఆఫీస్‌లోకి సూరజ్ ఎంట్రీ ఇవ్వడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వెందుకు వచ్చావు? మళ్లీ కంప్లయంట్ ఇవ్వడానికి వచ్చావా? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. కంప్లయంట్ ఇవ్వడానికి కాదు.. కలిసి పనిచేయడానికి అని చెబుతాడు సూరజ్. నేను అసిస్టెంట్‌గా రాలేదు.. కలిసి పనిచేయడానికి వచ్చానని అంటాడు. బాగా చదువుకున్న నువ్వు దీప దగ్గర పనిచేయాలంటే శాలరీ లక్షల్లోనే అడుగుతావు, ఆ స్థాయిలో జీతం ఇవ్వలేనని చెబుతుంది జ్యోత్స్న. నాకు శాలరీ అక్కర్లేదని తేల్చేస్తాడు సూరజ్. అందరూ డబ్బుల కోసమే పనిచేయరని చురకలు వేస్తాడు కార్తీక్. దీప గారి బ్రాంచ్‌లో నా ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.. ఇద్దరికీ లాభం ఉంటుందని చెబుతాడు కార్తీక్. నీ తెలివితేటలు సూపర్ అని దీపని మెచ్చుకుంటాడు శివన్నారాయణ.

నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి, ఏమైందని అడుగుతాడు దశరథ. రాత్రి ఇంటికి వెళ్తుంటే కుక్కలు వెంటపడ్డాయి.. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడ్డాను, ఆ కుక్కల్ని పంపించిన యజమాని ఎవరో తెలుసుకుని నేను వాళ్లకే బుద్ధి చెప్పాలని అనుకుంటున్నానని సూరజ్ అనడంతో జ్యోత్స్నకి చెమటలు పడతాయి. ఇలాంటి కుర్రాడు కంపెనీలో ఉండాలని నేను సరదాగా అన్న మాటని నువ్వు నిజం చేశావని కార్తీక్‌ని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. ఈ క్రెడిట్ అంతా దీపదేనని చెబుతాడు కార్తీక్. సూరజ్‌లో మంచి వ్యాపార లక్షణాలు ఉన్నాయని దశరథతో అంటాడు పెద్దాయన. ఎంత మంది వచ్చినా ఈ జ్యోత్స్నని ఏం చేయలేరని అంటుంది జ్యోత్స్న. మేం చెప్పేది కూడా అదే.. మేనేజర్‌తో వెన్నుపోటు పొడిపించినా, రౌడీలతో కొట్టిస్తేనో మేం ఆగిపోం. ఆదిపరాశక్తి లాంటి దీపకి త్రిశూలం తోడైందని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X