Karthika Deepam 2 June 6th: హార్ట్ అటాక్‌తో చావుబతుకుల్లో శ్రీధర్... క్షమించమంటూ కాంచనతో ఆఖరి మాటలు

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న, దీపలు ఆఫీసులో ఉండగా మేనేజర్ వచ్చి దీపకి ఫైల్ ఇస్తాడు. అదంతా ఇంగ్లీష్‌లో ఉండటంతో చదివి వినిపించమని చెబుతుంది దీప. నా వల్ల కాదు.. మళ్లీ నన్ను ఇరికిస్తారని అంటాడు మేనేజర్. దీపకి హెల్ప్ చేయాలని కార్తీక్ వెళ్తుండగా అతనిని చేయి పట్టుకుని ఆపుతుంది జ్యోత్స్న. అయినప్పటికీ ఇన్‌డైరెక్ట్‌గా ఎలాగైనా దీపకి సాయం చేయాలనే ఉద్దేశంతో యాప్ ఎలా వాడాలో నేర్పిస్తాడు. ఇంతలో బోర్డ్ మీటింగ్ ప్రారంభం కావడంతో జ్యోత్స్న, దీప, కార్తీక్‌లు వెళ్తారు.

ఇద్దరికీ పెట్టిన పరీక్షలో తొలివారం జ్యోత్స్న 10 శాతం గ్రోత్ సాధించిందని, దీప మాత్రం 10 శాతం మైనస్‌లో ఉందని చెబుతాడు దశరథ. ఇక దీపను తప్పించి జ్యోత్స్నకే సీఈవో బాధ్యతలు అప్పగించాలని బోర్డ్ మెంబర్ చెబుతాడు. అయితే పోటీ ఇంకా అయిపోలేదని ఈలోపు ఏదైనా జరగొచ్చని అంటాడు కార్తీక్. నాకు ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడుతున్నానని దీప చెప్పడంతో నీకు అసిస్టెంట్‌గా ఎవరినైనా నియమించుకోవచ్చని చెబుతాడు శివన్నారాయణ. నేను ఇప్పటికే ఆ మనిషిని వెతుక్కున్నానని దీప చెప్పగా.. కాళ్లు చేతులకు కట్లు కట్టించుకుని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏదో రకంగా సూరజ్‌ని బయటికి పంపాలని ప్రయత్నించగా.. అతని తెలివితేటల ముందు జ్యోత్స్న నిలబడలేకపోయింది. వర్క్ విషయంలో దీపకి సూరజ్ హెల్ప్ చేస్తుండటం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 6వ తేదీ 690వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 690 June 6th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నేను ఇలా ఆఫీస్‌కి వస్తానని అనుకోలేదు కదా అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పగ తీర్చుకోవడానికి వచ్చావా? అని జ్యోత్స్న అడగ్గా.. నువ్వు కూడా పగ తీర్చుకోవడానికే కదా నన్ను కొట్టించావని అంటాడు సూరజ్. నేనే కొట్టించాను అనడానికి ఆధారం ఏంటీ? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నువ్వు తెలివైన దానివే, కానీ నేను అమాయకుడిని కాదు. నువ్వు రోడ్డు మీద లిఫ్ట్ ఇవ్వకుండా ఉండుంటే కథ ఇక్కడి వరకు వచ్చేది కాదు అంటాడు సూరజ్. నేనే కొట్టించానని మా తాతతో చెబుతావు.. అంతకుమించి ఏం చేయగలవు అని అంటుంది జ్యోత్స్న. మీరు కోపంతో సముద్రం మీదకి రాళ్లు విసురుతున్నారు. నేనే అలలు విసరడం మొదలుపెట్టలేదు.. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. రెండ్రోజుల్లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తా, నన్ను తట్టుకుని దీపని గెలిపించడం నీ వల్ల కాదని జ్యోత్స్న సవాల్ విసురుతుంది.

నీ పతనం మొదలైంది.. నువ్వు అహంకారంతో నిండిపోయిన కోతి లాంటి దానివి. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి నన్నెవరూ అందుకోలేరని గెంతులు వేస్తున్నావు, నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నా లాంటి వాడు జెట్ ఫ్లైట్‌లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు.. దీప గారిని గెలిపిస్తాడు, నీకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించే వెళ్తానని చెబుతాడు కార్తీక్. ఇదంతా దూరం నుంచి చూసిన కార్తీక్, దీపలు సంతోషిస్తారు. ఇలాంటి సీనే కదా మనం చూడాలని అనుకుందని అంటాడు కార్తీక్. జ్యోత్స్నని సూరజ్ కంట్రోల్ చేస్తాడా అని దీప అడుగుతుంది. వాడే ఈ తిక్కలదానికి సరైన మొగుడు, బ్రదర్‌కున్న ఆటిట్యూడ్‌కి, చిన్న మరదలికి ఉన్న వెర్రితనానికి సరిగ్గా సెట్ అవుతుంది.

ఇప్పుడు నా శత్రువులంతా ఏకమైపోయి చిన్న మరదలు గుండెలు బాదుకుంటుంది, దాని తాట సూరజ్ తీస్తాడు. మా ఇద్దరినీ నువ్వే కాపాడాలి.. సూరజ్‌తో షాపు ఖాళీ చేయించింది, మనుషులతో కొట్టించింది. ఇప్పుడు ఆఫీస్‌లోకి వచ్చి.. తన ఎదురుగా నిలబడి తనకే వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు ఊరుకుంటుందని దీప భయపడుతుంది. మన మీద గెలవడానికి జ్యోత్స్న ఏదైనా చేస్తుంది.. ఇంటి దగ్గర కూడా జ్యోత్స్న మీద కన్నేసి ఉంచాలని అంటాడు కార్తీక్. ఇంతలో శ్రీధర్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్‌కి ఫోన్ రావడంతో హాస్పిటల్‌కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు.

సర్జరీ చేయించుకోకుండా ఇక్కడి వరకు తెచ్చుకున్నాడని కార్తీక్‌పై మండిపడతాడు శివన్నారాయణ. నేను చెబుతూనే ఉన్నాను.. ఇప్పటి వరకు కాపాడుకున్నాం, ఇక మీదట కూడా కాపాడుకుంటానని చెబుతాడు కార్తీక్. మీ నాన్నగారికి వెంటనే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేసినా 90 శాతం బతకడం కష్టం, ఒకవేళ బతికినా ఎంతవరకు రికవరీ అవుతారో చెప్పడం కష్టమని డాక్టర్ అనడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. మీరు కాపాడతారా లేదా? అని మండిపడతాడు. శ్రీధర్‌ని తీసుకుని ఇంటికి వెళ్లిన శివన్నారాయణ.. ఆపరేషన్ గురించి అందరికీ చెప్పడంతో కాంచన, కావేరిలు షాక్ అవుతారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ప్రాణాలకి ప్రమాదమని అంటుంది కాంచన.

మావయ్య ఫ్రెండ్ అమెరికాలో కార్డియాలజిస్ట్.. నాన్నని తీసుకుని వెంటనే రమ్మని చెప్పారని కార్తీక్ అంటాడు. అమెరికా రూల్స్ ప్రకారం.. పేషెంట్‌తో ఒక్కరే వెళ్లాలి, శ్రీధర్‌తో కావేరి వెళ్తుందని చెబుతాడు శివన్నారాయణ. నేను కూడా వస్తానని స్వప్న ఏడుస్తుంది. దేవుడు ఇప్పుడూ ఇంతే.. ఎవరైతే మంచివాళ్లో వాళ్లనే ఎక్కువగా కష్టపెడతాడని అంటాడు దాసు. నువ్వు ఒకరిని ఎంతగా ప్రేమిస్తే.. ఆ మనిషి అంత గొప్పగా కనిపిస్తాడని చెబుతాడు శ్రీధర్. కానీ నా లాంటి కుటుంబం ఎవరికీ ఉండదు. నాన్నకే నడక నేర్పించిన కొడుకు, నాన్న సంతోషం కోసం కాపురాన్ని సరిదిద్దుకున్న కూతురు, నా క్షేమాన్ని కోరుకునే కాంచన, నాకేం జరిగినా తట్టుకోలేని కావేరి, కొడుకులా నిలబడ్డ అల్లుడు, కూతురి లాంటి కోడలు, మిత్రుడు లాంటి నువ్వు, దేవుడు లాంటి మామగారు, భుజం తట్టే బావ ఇంతకుమించి దేవుడిని ఏం కోరుకుంటానని చెబుతాడు శ్రీధర్.

అందరికీ ధైర్యం చెప్పి బయటికెళ్లి ఏడుస్తున్న శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది కాంచన. నేను క్షేమంగా రాకపోతే ఏం చేస్తావని అడుగుతాడు శ్రీధర్. ఆ మాటలకి కాంచన బాధపడుతుంది. ఎందుకంటే నా జీవితంలో పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఉంది. ఆపరేషన్ తర్వాత నాకేమైనా అయితే అని శ్రీధర్ అడగ్గా.. నీకేం కాదని అంటాడు కార్తీక్. బతికుండగానే మనం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అన్ని చెప్పేయాలని అంటాడు శ్రీధర్. కాంచనకి క్షమాపణలు చెబుతాడు. ఆడదాని బతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవు.. నీ జీవితానికి అన్యాయం చేశాను, అనుభవిస్తున్నానని అంటాడు శ్రీధర్. కలిసుండాలంటే ఆ అదృష్టం ఇద్దరికీ ఉండాలి.. నాకు యాక్సిడెంట్ జరిగింది నేను యాక్సెప్ట్ చేశాను, మనం భార్యాభర్తలుగా విడిపోవాల్సి వచ్చింది... దీనిని కూడా అంగీకరించాల్సిందేనని చెబుతుంది కావేరి. నువ్వు ఇంకా చాలా జీవితం చూడాలని చెబుతాడు కార్తీక్. నా కోసం ఎంతో కష్టపడి ఉంటావు, తిరిగి నేను ఏం ఇవ్వగలను మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామని తండ్రిని హత్తుకుంటాడు కార్తీక్.

కాంచన ఒంటరిగా బాధపడుతుండగా శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు ఓదారుస్తారు. శ్రీధర్‌ని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నీకు ఇవ్వమన్నాడని వాచ్ ఇస్తాడు శివన్నారాయణ. కోపాన్ని, ప్రేమను నటించలేం.. అల్లుడు ఫ్లైట్ ఎక్కేముందు వాచ్ తీసి నీకు ఇవ్వమని చెప్పాడు. ఎందుకు బావా అని శ్రీధర్‌ని మీ అన్నయ్య అడిగాడు. నాతో పాటు నేను మాత్రం కాంచన మనసు కూడా వస్తోంది అన్నాడని చెబుతాడు శివన్నారాయణ. బావ నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో, నువ్వు కూడా అంతే ఆరాధిస్తున్నావని చెబుతాడు దశరథ.

ఎక్కడ భోజనం చేయకుండా, నిద్రపోకుండా ఉండిపోతావోనని నీకు ఈ వాచ్ ఇవ్వమని చెప్పాడని శివన్నారాయణ చెబుతాడు. మొండితనం మనశ్శాంతిని దూరం చేయకూడదు, ఎన్నో వదులుకుని ఇంత దూరం ప్రయాణం చేశాను. నా జీవితంలో నేను దాచుకున్న కన్నీళ్లు.. నా పిల్లల జీవితంలో ఎదురవ్వకూడదు అనుకున్నాను అంటాడు శివన్నారాయణ. శ్రీధర్‌ని కార్తీక్ తండ్రిగా అనుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు.. కానీ అతనిని నీ భర్తగా అనుకుంటే మేమంతా సంతోషంగా ఉంటామని చెబుతాడు శివన్నారాయణ. నిన్ను ప్రేమించే మనిషిని క్షమించలేవా? అని తండ్రి అడగటంతో కాంచన ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X