Karthika Deepam 2 June 8th: జ్యోత్స్న సూరజ్ వార్ స్టార్ట్.. దక్షిణామూర్తి గురించి నోరు విప్పిన శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

కాఫీ తాగడానికి కార్తీక్, దీపలు బయటికి వెళ్లగానే నేను ఇలా ఆఫీస్‌కి వస్తానని ఊహించలేదు కదా అని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. పగ తీర్చుకోవడానికే కదా నువ్వు నన్ను కొట్టించావని ఫైర్ అవుతాడు. నేనే నిన్ను కొట్టించాను అనడానికి ఆధారం ఏంటీ? రెండ్రోజుల్లో నువ్వు ఆఫీస్ వదిలి వెళ్లిపోయేల చేస్తానని సవాల్ విసురుతుంది జ్యోత్స్న. నీ పతనం మొదలైపోయింది.. ఎవరెస్ట్ శిఖరం మీద కోతిలా గెంతులు వేస్తున్నావు, నీ అహంకారం దించడానికి నేను జెట్ ఫ్లైట్‌లో దిగానని అంటాడు సూరజ్. వాళ్లిద్దరినీ చూసిన కార్తీక్.. మేడంగారికి సరైన మొగుడు దొరికాడని అనుకుంటాడు. కానీ మా ఇద్దరినీ నువ్వే కాపాడాలని చెబుతుంది దీప. ఇంతలో శ్రీధర్‌కు హార్ట్ అటాక్ వచ్చినట్లు ఫోన్ రావడంతో కార్తీక్, దీపలు ఆసుపత్రికి వెళ్తారు.

శ్రీధర్ గారి హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉంది.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా బతుకుతారన్న నమ్మకం లేదని డాక్టర్ చెప్పడంతో శివన్నారాయణ, కార్తీక్, దశరథ, దీపలు షాక్ అవుతారు. శ్రీధర్‌కి అమెరికాలో ఆపరేషన్ చేయిస్తామని తోడుగా కావేరి వెళ్తుందని శివన్నారాయణ చెబుతాడు. ఇంటికొచ్చిన శ్రీధర్ తాను బాగానే ఉన్నానని అందరితో నవ్వుతూ మాట్లాడి ఒంటరిగా ఏడుస్తుంటాడు. కాంచన దగ్గరికి వెళ్లగా ఆమెకు క్షమాపణలు చెబుతాడు. అమెరికాకు వెళ్తూ శ్రీధర్ నీకు వాచ్ ఇవ్వమన్నాడని శివన్నారాయణ ఇస్తాడు. అది పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 8వ తేదీ 691వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 691 June 8th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సూరజ్ గాడిని అసిస్టెంట్‌గా పెట్టుకుని దీప చావు దెబ్బ కొట్టిందని అంటుంది జ్యోత్స్న. ఐదో తరగతి చదువుకున్న దానికున్న తెలివి తేటలు కూడా నీకు లేవని మండిపడుతుంది పారు. ఇవన్నీ బావ తెలివితేటలని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇలాగే సరిపెట్టుకుంటే దీప పోటీలో గెలిచి సీఈవో అవుతుంది... అప్పుడు కూడా ఇది దీప గొప్పతనం కాదు బావ తెలివితేటలే అంటావని చురకలు వేస్తుంది పారు. గెలవాలన్న ఆశ గెలుస్తామన్న నమ్మకం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ గెలిచేది నేనే అని చెబుతుంది జ్యోత్స్న. సూరజ్‌తో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది పారు. ఇదంతా ఈదురుగాలికి పోగైన చెత్త లాంటిది.. ఒక్క అగ్గిపుల్ల గీస్తే కాలి బూడిదైపోతుందని అంటుంది జ్యోత్స్న.

ఇప్పుడు చెత్త నీ చుట్టూనే పోగైంది.. ఆవేశంతో అగ్గిపుల్ల గీస్తే నిన్నే కాల్చేస్తుందని వార్నింగ్ ఇస్తుంది పారు. సూరజ్ వచ్చినంత మాత్రాన ఏం చేయలేడని చెబుతుంది జ్యోత్స్న. వాడిని తక్కువగా అంచనా వేయొద్దు.. ఒక సమయం తర్వాత వరదై సరదా తీరుస్తాడని అంటుంది పారు. అప్పటి వరకు వాడిని నేను ఆఫీసులో ఉండనిస్తేనే కదా? పారిపోయేలా చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ నుంచి కాల్ వస్తుంది. సూరజ్‌ని నానామాటలు అంటుండటంతో పారు వద్దని చెబుతుంది. మీరేం కష్టపడొద్దు.. ఇప్పుడిది ఆటకాదు, వేట అని అంటాడు సూరజ్.

నీకు టైం దగ్గరపడింది.. నా మాట విని దూరంగా పారిపో, లేదంటే అడ్రస్ లేకుండా పోతావని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. అసలు నువ్వు మా ఆఫీస్‌కి ఎందుకొచ్చావని ప్రశ్నిస్తుంది. నువ్వు ఇన్నిసార్లు రా రా అని పిలిస్తే రాకుండా ఎందుకుంటాను అని అంటాడు సూరజ్. పగ తీర్చుకోవాలనే ఆలోచన ఉంటే మానుకోమని చెబుతుంది జ్యోత్స్న. కాళ్లు చేతులు విరిగినా బుద్ధి లేదా? నువ్వు నన్నేం చేయలేవని అంటుంది. దానికి సూరజ్ కౌంటర్ వేస్తాడు. రేపటి నుంచి నీకు పట్టదని వార్నింగ్ ఇస్తాడు. మన జీవితాల్ని ఉతికి ఆరేసేవాడు ఒక్కడైనా తగులుతాడు, ఆ ఒక్కడు నీకు తగిలాడు. ఇన్నాళ్లు నువ్వే తేడా అనుకున్నాను.. కానీ వాడు నీకంటే తేడాగా ఉన్నాడని అంటుంది పారు. సూరజ్ జోలికి వెళ్లొద్దు.. సముద్రాన్నే తగలబెట్టేస్తాడని చెబుతుంది. వాడేం చేస్తాడో నేను కూడా చూస్తానని చెబుతుంది జ్యోత్స్న.

దీపతో ఆడుకుంటూఉండగా శౌర్యకి దక్షిణామూర్తి, శివన్నారాయణలు కలిసున్న ఫోటో ముక్కలుగా కనిపించడంతో దాని జ్యోత్స్న, పారుల దగ్గరకి వెళ్లి ముద్దుల తాత ఎక్కడున్నాడని అడుగుతుంది. ఇంతలో సుమిత్ర, దశరథలు రావడంతో ఈ ఫోటో ఎలా చినిగిపోయిందని ప్రశ్నిస్తుంది. ఆ ఫోటో చూడగానే వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ఇది ముద్దుల తాత, మరి ఈ తాత ఎవరు? నీ పుట్టినరోజు నాడు మనింటికి వచ్చిన తాత ఇతనే కదా అని శౌర్య చెబుతుండగా కార్తీక్, దీపలు ఉలిక్కిపడతాడు. ఇంతలో శివన్నారాయణ రావడంతో నీ రూమ్‌లో బుక్ నుంచి ఈ ఫోటో ముక్కలు దొరికాయని చెబుతుంది. ఈ ఫోటోలో ఉన్న తాత మన తాతేనా? మీరిద్దరూ ఫ్రెండ్సా? మీరిద్దరూ ఫ్రెండ్స్ అయితే ఈ ఫోటో ఎవరు చింపారు? అని శౌర్య అడగటంతో తర్వాత చెబుతానని అంటాడు కార్తీక్.

ఈ తాతని ముద్దుల తాత తిట్టాడు. వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ అయితే తాత తిట్టడు కదా? తిట్టాడు అంటే తాతకి కోపం ఉన్నట్లే? మరి తాత ఎందుకు ఫోటో తీయించుకున్నాడు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దాంతో ఆ ఫోటో ముక్కలు కాంచన లాక్కుని శౌర్యని బయటికి పంపిస్తుంది. నువ్వెందుకు అత్తా అడ్డుపడతావు.. నీ కొడుకు కోడలు అనుకున్నది జరగనివ్వు.. ఏ గూటి చిలక, ఆ గూటి పలుకులే పలుకుతుందని అంటారు. నీకు, నీ భార్యకు తెలియకుండానే శౌర్య మా తాత గదిలోకి వెళ్లిందా? మా మమ్మీ వాళ్ల నాన్న వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు.. మీరు కాపాడినప్పుడు అతను మీకేం చెప్పి ఉండరు, అందుకే ఈరకంగా కూతురిని అడ్డుపెట్టుకోవాలని అడిగిస్తున్నారని అంటుంది శౌర్య. దాంతో కార్తీక్ కోపంతో రగిలిపోతాడు.

మా కూతురిని అడ్డుపెట్టుకుని నిజం తెలుసుకోవాలని మేమెందుకు అనుకుంటామని దీప ప్రశ్నిస్తుంది. బ్లడ్ ఇప్పించి ప్రాణాలు పోసింది కూడా మీరే కదా అంటుంది జ్యోత్స్న. దాంతో శివన్నారాయణ ఫైర్ అవుతాడు. శౌర్యకే కాదు.. ఇక్కడున్న చాలా మందికి ఆ మనిషి గురించి పూర్తిగా తెలియదు. మరోసారి ఆ మనిషి గురించి ఈ ఇంట్లో ప్రస్తావన రాకుండా ఉండాలంటే ఏం జరిగిందో మీకు తెలియాలి. దక్షిణామూర్తికి ఈ ఇంటికి వైరం ఏంటో ఈ తరంలో పుట్టిన మీ అందరికీ తెలియాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు.

దక్షిణామూర్తి నేను ప్రాణస్నేహితులం.. దక్షిణామూర్తి ఎప్పుడు జీవితంలో గొప్పస్థాయికి వెళ్లాలని కలలు కంటూ ఉండేవాడు. మా ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి, పిల్లలు పుట్టారు. ఏవేవో వ్యాపారాలు మొదలుపెట్టాం. మా స్నేహం మాదిరిగానే మా ఇద్దరు పిల్లల మధ్య కూడా మంచి స్నేహం ఉండేది. సుమిత్ర- దశరథల మధ్య స్నేహం ఇష్టంగానూ ఆ తర్వాత ప్రేమగానూ మారింది. దక్షిణామూర్తి తన ఎదుగుదలకు కూతురి పెళ్లిని వ్యాపారంగా చేశాడు. తన కూతురిని ఒక గొప్పింటికి కోడలిగా చేస్తే తను అనుకున్న స్థాయికి ఎదగొచ్చని అనుకున్నాడు. ఇవేవీ తెలియని సుమిత్ర.. తండ్రి ఒప్పుకుంటాడన్న నమ్మకంతో దశరథని పెళ్లి చేసుకుంది. ఆ టైంలో దశరథ.. దక్షిణామూర్తి కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

నా కూతురికి నువ్వు భర్తగా ఉండే అర్హత లేదని గన్ తీసి దశరథని చంపాలని అనుకున్నాడు. సుమిత్ర అడ్డుపడటంతో దశరథకు తగలాల్సిన బుల్లెట్ గోడకి తగిలింది.. ఆ రోజు జరిగిన గొడవలో ఈ రెండు కుటుంబాలు ముక్కలైపోయాయి. నా కూతురు చచ్చిందని దక్షిణామూర్తి మా ముందే నెత్తిన నీళ్లు పోసుకున్నాడు.. కూతురి ఫోటోకి దండ వేశాడు. దక్షిణామూర్తి స్వార్ధానికి నా స్నేహం కూడా బలైంది. నా స్నేహాన్ని కూడా తన అవసరానికి వాడుకున్నాడని నాకు తర్వాత అర్ధమైంది. చాన్నాళ్లపాటు మాకు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఎక్కడా మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే అతని నీడ కూడా పడనంత దూరంగా వచ్చేశాం. ఇప్పుడు నా నీడని కూడా వెతుక్కుంటూ వచ్చాడని చెబుతాడు శివన్నారాయణ.

వెతుక్కుంటూ వచ్చాడంటే మారినట్లే కదా అని జ్యోత్స్న అడగ్గా.. వాడు మారడు, సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్లమ్మ దొంగచాటుగా వచ్చేది. ఆ విషయం తెలిసిన దక్షిణామూర్తి.. సుమిత్రకు తల్లి లేకుండా చేశాడు. వాడు నా స్నేహాన్నే కాదు, కూతురి జీవితాన్ని కూడా వాడి ఎదుగుదల కోసం వాడుకున్నాడు. వాడు ఇన్నాళ్ల తర్వాత మనింటికి వచ్చాడంటే మళ్లీ ఏ అనర్ధం జరగబోతుందో? దక్షిణామూర్తి నీడ పాము పడగలాంటిది, ఆ మనిషి ఎలాంటి వాడో మీకు ఇప్పటికైనా అర్ధమైందా? వాడు నా శత్రువుని గుర్తుచేసుకోవడానికే ముక్కలు చేసుకున్న ఫోటోని నా దగ్గర పెట్టుకున్నానని చెబుతాడు శివన్నారాయణ. మనం అనుకున్నది జరగదని జ్యోత్స్నతో అంటుంది పారు. ఆఫీస్‌కి వచ్చేసరికి సూరజ్ పనిచేస్తుండటంతో అతనిని మెచ్చుకుంటారు కార్తీక్, దీపలు. పనిపాటా లేనివాళ్లు త్వరగానే వస్తారని జ్యోత్స్న నానామాటలు అనడంతో కార్తీక్ కౌంటర్ వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X