Karthika Deepam 2 June 10th: దీపే నా కూతురంటూ సుమిత్ర కంటతడి... జ్యోత్స్నని వెలేసిన శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
తనను అదే పనిగా చూస్తున్న సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నా వైపు చూస్తే వేధింపుల కేసు పెట్టి లోపల వేయిస్తానని అంటుంది. దక్షిణామూర్తి తాత గురించి ఏమంటావని దీప అడగ్గా.. ఆయన పైకి కనిపించేంత మంచివాడు కాదని అంటాడు కార్తీక్. నా తండ్రి చావుకు కోరుకున్న మనుషులు నాకు కూడా అక్కర్లేదని చెబుతుంది దీప. మన బ్రాంచ్‌కి రెండు ఆర్డర్లు వచ్చాయని దీపకి చెబుతాడు సూరజ్. ఇంతలో దీపకి ఓ ఫోన్ కాల్ రావడంతో కంగారుపడుతుంది. నా రెస్టారెంట్‌లో గొడవ జరుగుతుందని దీప చెప్పడంతో కార్తీక్, జ్యోత్స్న, సూరజ్‌లు పరుగులు తీస్తారు.
రెస్టారెంట్లో ఓ వ్యక్తి బల్లి పడిందని ఫుడ్ సేఫ్లీ డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేస్తాడు. ఇంతలో శివన్నారాయణ రావడంతో అతనిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడమని మేనేజర్‌కి చెబుతాడు. దీప కిచెన్ మొత్తం ఆఫీసర్‌లకి చూపిస్తుంది. అక్కడ అంతా శుభ్రంగానే ఉంటుంది. అయితే గొడవ చేస్తున్న వ్యక్తి మీద డౌట్ వచ్చిన సూరజ్.. అతని వెనుకే వెళ్లి నీకు 10 వేలు ఇస్తాను ఇంకా పెద్ద గొడవ చేయమని చెబుతాడు. ఆ ఆనందంలో జ్యోత్స్న ఈ గొడవ చేయమని చెప్పిందని చెబుతాడు ఆ వ్యక్తి. ఇదంతా వీడియో రికార్డ్ చేస్తాడు సూరజ్. ఇతనితో ఒకరు డ్రామా ఆడిస్తున్నారని, మన రెస్టారెంట్ మూయించాలని చూస్తున్నాడని సూరజ్ చెప్పి వీడియోని బయటపెట్టడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. దీప మాత్రం అతనిని క్షమించి వదిలేయమని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 10వ తేదీ 693వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నిజం చెప్పకుండా ఎందుకు అడ్డుపడ్డారు? జ్యోత్స్నని ఎందుకు కాపాడారని దీపని అడుగుతాడు సూరజ్. వాడు నిజం చెప్పడం వల్ల మనవరాలు ఎలాంటిదో శివన్నారాయణ గారికి తెలిసేది, మిమ్మల్ని సీఈవోని చేసేవారు అంటాడు. దానితో పాటు జరిగే మరో ప్రమాదాన్ని కూడా నువ్వు అర్ధం చేసుకోవాలి. రెస్టారెంట్‌కి పెద్దాయన తన భార్య పేరు పెట్టుకున్నారు. మనవరాలికి కూడా అదే పేరు పెట్టారు. జ్యోత్స్న రెస్టారెంట్ అంటే మార్కెట్‌లో ఒక నమ్మకం. తప్పు చేసింది జ్యోత్స్న అని ఎవరికి తెలియదు కాబట్టి అందరూ మాణిక్యం గురించే ఆలోచిస్తున్నారు.
నిజం తెలియగానే మనమే తప్పు చేసుకున్నాం.. పాపం జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్లకి ఏ సంబంధం లేదని జనం అనుకుంటున్నారు. కానీ ఇదే తప్పు పెద్దాయన మనవరాలు చేసిందని జనానికి తెలిస్తే అందరూ మాణిక్యాన్ని మరిచిపోయి జ్యోత్స్ననే గుర్తుపెట్టుకుంటారు. ఫుడ్ కల్తీ అయినా సరే దాని గురించి ఆలోచించరు. సొంత మనవరాలే చేసిందని.. ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని ఏవేవో పుట్టిస్తారు. తప్పు చేసిన జ్యోత్స్న వల్ల ఏ తప్పు చేయని ఇంట్లో వాళ్లు తలదించుకోవాలా? అని దీప ప్రశ్నిస్తుంది.
మీరు చాలా గొప్పగా ఆలోచించారు. అందరిలో సంస్థ పరువు పోకూడదని అనుకున్నారు. కానీ జ్యోత్స్నని ఇలాగే వదిలేస్తామా? తప్పు చేసిన వాళ్లకి శిక్ష ఉండదా? అని ప్రశ్నిస్తాడు సూరజ్. శిక్ష తప్పకుండా ఉంటుంది.. మనం ధర్మాన్ని తప్పాల్సిన అవసరం లేదు, వాళ్లని దారిలో పెట్టకుంటే మనం చేతకాని వాళ్లుగా మిగిలిపోతాం. అందరిలో జ్యోత్స్న పేరు చెబితే ఏం జరిగిందో దీప చెప్పింది.. మనకి కావాల్సింది ఆ పెద్దాయనకి మనవరాలు ఎలాంటిదో తెలియాలని అంటాడు కార్తీక్. అయితే మనం ఆ మాణిక్యం సోషల్ మీడియా అకౌంట్‌ని సబ్‌స్క్రైబ్ చేద్దామని అంటాడు.
రెస్టారెంట్‌లో జరిగిన దాని గురించి దశరథ, శివన్నారాయణ ఇంట్లో రగిలిపోతుంటారు. ఈ పని నువ్వు చేసిందేనా అని జ్యోత్స్నని అడుగుతుంది పారు. నేను కానీ నువ్వు సైలెంట్‌గా ఉండమని అంటుంది జ్యోత్స్న. తప్పు చేసిన వాళ్లని క్షమించాల్సిందే పోలీసులకు అప్పగించాల్సిందేనని సుమిత్ర అంటుండగా కార్తీక్ వచ్చి శిక్ష పడాల్సిందేనని చెబుతాడు కార్తీక్. బిర్యానీలో బొద్దింక వేసిన వాడిని వదిలేశారు కదా? మళ్లీ ఎందుకు ఆ గొడవ అంటుంది పారు. ఈ కార్తీక్ అసలు నేరస్థుడిని పట్టుకున్నాడని చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి.
ఇంతలో మాణిక్యాన్ని తీసుకుని సూరజ్ లోపలికి వస్తాడు. బావకి నిజం తెలిసిపోయినట్లుగా ఉందని జ్యోత్స్న అనడంతో నువ్వు దొరికిపోయినట్లేనని పారు కంగారు పడుతుంది. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు లేదా అని సుమిత్ర మండిపడుతుంది. ఇతనితో ఆ పని చేయించిన వాళ్లు అంతకంటే సిగ్గు లేని వాళ్లని అంటాడు కార్తీక్. దీప గారికి కేటాయించిన రెస్టారెంట్‌లో ఫుడ్ బాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయమన్నది ఎవరు? అని కార్తీక్ అతనిని నిలదీస్తాడు. అయితే నిజం చెప్పొద్దని మాణిక్యానికి జ్యోత్స్న వార్నింగ్ ఇస్తున్నట్లు సైగలు చేస్తుంది.
వాడిని తీసుకొచ్చి బలవంతంగా చెప్పించాల్సిన అవసరం ఏంటీ? అని పారు మండిపడుతుంది. ఇతను నిజం చెప్పేలా కనిపించడం లేదు కాబట్టి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్దామని అంటాడు కార్తీక్. నేను 123 లెక్కపెట్టేలోగా నువ్వు కనుక నిజం చెప్పకపోతే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకు భయపడిపోయిన మాణిక్యం.. వెంటనే జ్యోత్స్న మేడం అని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న మేడమే నాకు డబ్బులిచ్చి ఈ పని చేయమన్నారు అని అనడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. నీతో ఈ మాట చెప్పించడానికి నీకెంత ఇచ్చారని పారు ప్రశ్నిస్తుంది.
మాణిక్యం చెప్పింది అబద్ధమని పెద్ద మేడం గారిని చెప్పమను అంటాడు కార్తీక్. ఇది నిజం అని చెప్పడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెబుతాడు. నా దగ్గర కూడా వీడియో ఉందని సూరజ్ అంటాడు. రెస్టారెంట్‌లో దాయాల్సిన అవసరం ఏంటీ? ఇంటి దగ్గర పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏంటీ అని పారు మండిపడుతుంది. పెద్దయ్య గారి కోసమే నేను జ్యోత్స్న పేరు బయటపెట్టలేదు. జ్యోత్స్న రెస్టారెంట్ అంటే పెద్దయ్య గారి ఆత్మగౌరవం. కానీ ఈరోజు పెద్దయ్య గారి మనవరాలి వల్లేనని బయటికొస్తే, సొంత మనవరాలే ఇలాంటి పనిచేసిందని తెలిస్తే చాలా మాటలు వస్తాయిన అంటుంది జ్యోత్స్న.
అక్కడ చెప్పి ఉంటే సమాజం కోసం ఈ కుటుంబం తలదించుకోవాల్సి వస్తుంది. కానీ తప్పు చేసినవాళ్లే తలదించుకోవాలని అంటుంది దీప. ఆ మాటలతో రగిలిపోయిన సుమిత్ర కూతురిని కొట్టడానికి వెళ్తుంది. నిన్ను సరిగా పెంచనందుకు మమ్మల్ని మేం దండించుకోవాలి. నువ్వు మమ్మల్ని తలదించుకునేలా చేస్తే.. ఈ ఇంటి రక్తంతో ఏ సంబంధం లేని దీప ఈరోజు మా అందరితో పాటు నీ పరువు కూడా కాపాడింది. అన్నం పెట్టినందుకే దీప ఇంత రుణపడి ఉంటే.. జన్మనిచ్చినందుకు నువ్వెంత రుణపడాలి. కడుపున పుట్టకపోయినా దీప నా కూతురైంది. నీ బదులు దీప నా కడుపున పుట్టి ఉంటే తల్లిగా నా జన్మ సార్ధకమయ్యేది. ఈ ఇంటి పరువు మర్యాదలు ఏమైపోయినా పర్లేదనే నీకంటే.. ఈ ఇంటి పరువు కోసం పాకులాడే దీపే నా కూతురిగా ఎందుకు పుట్టలేదని అనిపిస్తుందని అంటుంది సుమిత్ర. దీపే నీ కూతురు.. అందుకే ఈ ఇంటి పరువు కోసం పాకులాడుతోంది, కానీ ఈ నిజం ఎన్నో రోజులు దాగేట్లు లేదని అనుకుంటుంది పారు.
మన అదృష్టం బాగుండి దీప వల్ల మనకి ఏ నష్టం జరగలేదని అంటాడు దశరథ. మాణిక్యం గాడిని సూరజ్ పట్టుకున్నాడు కాబట్టి నిజాలు బయటపడ్డాయి.. అదే పట్టుకోకపోయుంటే నా భార్యకు ఇచ్చిన రెస్టారెంట్ క్లోజ్ అయిపోయేది, గెలవడానికి మనుషులు ఇంతగా దిగజారిపోతారని మాకు తెలియదని అంటుంది కార్తీక్. నా మీద, నా భార్య మీద పీకలదాకా పగ పెంచుకుంది. తాత దగ్గర నాటకాలాడి నన్ను సీఈవో పోస్ట్ నుంచి తీయించేసింది. బయటికెళ్లి బతకడానికి ఇడ్లీ బండి పెట్టుకుంటే దానిని కూడా లేకుండా చేసిందని అంటాడు కార్తీక్. ఆ తర్వాత అగ్రిమెంట్ పేరుతో నిన్ను డ్రైవర్‌ని చేసిందని మండిపడుతుంది కాంచన.
ఎక్కడ నా భార్య గెలుస్తుందోనని నా భార్యకు నన్ను దూరం చేయాలనుకుంది. ఇలా మోసం చేసి గెలవడానికైతే పోటీ ఎందుకు సీఈవో పోస్ట్ జ్యోత్స్నకే ఇచ్చేయమని అంటుంది కాంచన. ఎవరికో డబ్బులిచ్చి నా భార్య రెస్టారెంట్‌కి చెడ్డపేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటీ? అని అడుగుతాడు కార్తీక్. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అసలు ఈ పోటీ ఎందుకు పెట్టానా అనిపిస్తుంది. దీపనే ఏకగ్రీవంగా సీఈవోని చేస్తే అయిపోయేది ఈరోజు నుంచి నా కుటుంబంలో నువ్వు ఉండవు అని తేల్చేస్తాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications