Karthika Deepam 2 June 11th: మనవరాలికి శివన్నారాయణ ఊహించని శిక్ష.. జ్యోత్స్నకి ఐ లవ్ యూ చెప్పిన సూరజ్
Photo Courtesy: JioHotstar
మాణిక్యం చేత నిజం చెప్పకుండా ఎందుకు అడ్డుపడ్డారని దీపని నిలదీస్తాడు సూరజ్. నిజం చెబితే జ్యోత్స్న దోషిగా తేలుతుంది. కానీ శివన్నారాయణ గారు తలదించుకోవాల్సి వచ్చేది. శివన్నారాయణ గారి సొంత మనవరాలే తన సొంత రెస్టారెంట్‌పై దుష్ప్రచారం చేయించిందని తెలిస్తే జనం ఒకటికి నాలుగు పుకార్లు పుట్టిస్తారు. అప్పుడు శివన్నారాయణ కుటుంబం తలదించుకోవాలని, అందుకే వాడిని అక్కడే వదిలేశానని అంటుంది దీప. తప్పు చేసినవారికి శిక్ష పడాలి కదా అని సూరజ్ అనగా.. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుందని అది ఇంట్లో వాళ్ల ముందే ఉంటుందని చెబుతాడు కార్తీక్.
రెస్టారెంట్‌లో జరిగిన దానిపై దశరథ, శివన్నారాయణ రగిలిపోతుంటారు. మనపై ఇంత ద్వేషం ఎవరు చూపిస్తున్నారని దశరథ అడుగుతుండగా కార్తీక్ వస్తాడు. తప్పు చేసినవాడికి కాదు, అసలు వాడితో తప్పు చేయించిన వారికి శిక్ష పడాలని మాణిక్యంను తీసుకుని రమ్మని సూరజ్‌కి చెబుతాడు. నీతో ఈ పని చేయించిందెవరు? అనేది చెబుతావా? లేక పోలీస్ స్టేషన్‌కి వెళ్దామా అని కార్తీక్ బెదిరించడంతో జ్యోత్స్న మేడమే ఇదంతా చేయించారని మాణిక్యం చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రెస్టారెంట్‌లోనే ఈ విషయం బయటపెట్టొచ్చు కదా అని పారు అడగ్గా.. అక్కడ నిజం బయటపెడితే శివన్నారాయణ గారి పరువు పోతుందని అలా చేశానని అంటుంది దీప. నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది.. కడుపున పుట్టిన నీకంటే, ఏ రక్త సంబంధం లేని దీపే నా అసలు కూతురని అంటుంది సుమిత్ర. నా కుటుంబంలో నా వాళ్లు మాత్రమే ఉండాలి, నీకు స్థానం లేదని జ్యోత్స్నతో అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 11వ తేదీ 694వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇదివరకు నాకో మనవరాలు ఉండేది ఇప్పుడు ఆ మనవరాలిని దీపలో చూసుకుంటున్నాను అని చెబుతాను అంటాడు శివన్నారాయణ. ప్రతి తప్పుకి ఒక క్షమాపణ ఉంటుంది కదా అని పారిజాతం అనగా.. మనం ఎదగాలంటే నేర్చుకోవాలి, గెలవాలంటే కష్టపడాలి. కానీ జ్యోత్స్న చదివిన పాఠాలు వేరేలా ఉన్నాయి. మనం ఎదగాలంటే ఎదుటివాళ్లని తొక్కాలని, మనం గెలవాలంటే ఎదుటివాళ్లని మోసం చేయాలని అనుకుంటుంది. ఇలాంటి వాళ్లని క్షమించడం అంటే క్షమించడం అనే పదమే చచ్చిపోతుంది. అలాంటి మనుషుల్ని మనుషుల జాబితాలో నుంచి తీసేయడమే మేలు. ఇకపై జ్యోత్స్న అనే మనిషిని నా కుటుంబ సభ్యుల జాబితాలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తను ఉన్నా లేనట్లే అంటాడు పెద్దాయన. ఏం జరిగిందో అందరికీ తెలిసేలా చేసినందుకు సూరజ్‌కు థ్యాంక్స్ చెబుతాడు శివన్నారాయణ.
మావయ్య గారు మంచి పనే చేశారు. మన కుటుంబంలో ఎవరిలోనూ కనిపించని విపరీతమైన బుద్ధులన్నీ దీనిలోనే కనిపిస్తున్నాయి. మావయ్య గారు చెప్పినట్లు దీనిని ఇలా వదిలేయడమే శిక్ష అంటుంది సుమిత్ర. శిక్ష అని మీరు అంటున్నారు. కానీ జరిగే ప్రతిదానికే బాధపడేది మేమే కదా అంటుంది కాంచన. నువ్వు ఇంటికెళ్లు మనం తర్వాత మాట్లాడుకుందామని సూరజ్‌తో చెబుతాడు కార్తీక్. జ్యోత్స్నతో ఒక్క మాట కూడా మాట్లాడొద్దు.. ఇలాగే వదిలేయండి, మీరు కూడా మాట్లాడొద్దని దశరథ, పారిజాతంలకు చెబుతుంది సుమిత్ర. తనను అందరిముందు ఇరికించిన సూరజ్‌పై రగిలిపోతుంది జ్యోత్స్న.
బాధగా ఉందా? మనసుని ఎవరో మెలిపెడుతున్నట్లుగా అనిపిస్తుందా? ఒంటికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయమే ఎక్కువ బాధపెడుతుందని అంటాడు సూరజ్. మీరు ఉసిగొల్పిన కుక్కలు ప్రతిసారి ఎదుటివాళ్లని మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మీ వైపు కూడా తిరుగుతాయి. ఇలాంటి పనులు ఆపేయండి, లేకపోతే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. బయటికి వెళ్తున్న సూరజ్‌ని జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది. నీ దెబ్బ అదిరిపోయింది.. నిన్న ఎక్కడో అర్ధరాత్రి రోడ్డు మీద కొట్టిస్తే, నువ్వు పట్టపగలు నా ఇంట్లో నా వాళ్ల ముందే ఎందుకు పనికిరాని వాళ్లుగా నిలబెట్టావు, నీ బ్రెయిన్‌కి, నీ గట్స్‌కి హ్యాట్సాఫ్ అంటుంది జ్యోత్స్న.
రోజులు లెక్కపెట్టుకో.. నీకు ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏం జరుగుతుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నేను విసిరిన వస్తువుని .. నేను ఒక లక్ష్యం వైపు వెళ్తుంటాను, ఎవరు చెప్పినా ఆగను. నీ దమ్మేంటో నువ్వు చూపించావు, నా దమ్మేంటో నేను చూపిస్తానని చెబుతుంది. మామూలుగానే నేనొక పెద్ద కంత్రీని.. నాకు నచ్చిన బొమ్మని నాకు ఇవ్వలేదంటేనే నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నన్ను నా వాళ్లముందు ఫూల్‌ని చేసిన నిన్ను వదిలిపెడతానా? అని ప్రశ్నిస్తుంది. అయితే సీరియస్‌గా నీకో మాట చెప్పానా అని అంటాడు సూరజ్. ఏంటది అని జ్యోత్స్న అడగ్గా.. ఐ లవ్ యూ చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నన్ను ఇంత ప్రేమగా తాకిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే.. నన్ను టచ్ చేసిన ఫస్ట్ అమ్మాయివి కూడా నువ్వే అందుకే థ్యాంక్స్ చెబుతున్నానని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్.
ఇంతలో పారు వచ్చి తేడాగాళ్లంతా నీక తగులుతారు.. ఆ కార్తీక్ గాడేమో మాయలోడు, ఈ సూరజ్ గాడేమో మాంత్రికుడు. ఇద్దరూ నీకే తగిలారు. కార్తీక్ గాడైతే మాటలతో చెప్పి వదిలేస్తాడు, కానీ వీడు నిన్ను ఉతికి దండం మీద ఆరసేలా ఉన్నాడు అంటుంది. అప్పటి వరకు వీడు బతికుంటేనే కదా? అని చెబుతుంది జ్యోత్స్న. వీళ్లందరినీ ఏం చేయాలో ఆలోచిస్తాను.. అందరూ నన్ను వదిలేశారు కదా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసని అంటుంది జ్యోత్స్న.
దీప కూతురిగా బాగుండేదని సుమిత్ర అన్న మాటల్ని కార్తీక్‌తో పదే పదే చెప్పించుకుని సంబరపడుతుంది దీప. ఏ మాటైతే అమ్మతో అనాలని అనుకున్నానో ఆ మాటల్ని అమ్మ అనేసిందని అంటుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి మీరంతా కలిసి ఆవిడతో అలా అనేలా చేశారని చెబుతుంది. 9 నెలలు మోయకపోయినా నేనే మా అమ్మకి కూతురిని అంటుంది జ్యోత్స్న. నిన్ను మా అమ్మ మోస్తే కూతురివి కాలేదు.. మీ నానమ్మ ఊయలలు మారిస్తే అయ్యావు.. ఈ కథకు శుభం పలికే రోజులు వచ్చేశాయని అంటుంది దీప. నా వ్యక్తిత్వం చూసి నా కన్నతల్లి మెచ్చుకుందని చెబుతుంది.
రెండు వారాలు, మూడు వారాలు కాదు. నాకు పూర్తిగా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందని దీప చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న వల్లే నేను నా కుటుంబానికి దగ్గరవుతున్నాను అని థ్యాంక్స్ చెబుతుంది దీప. జ్యోత్స్న ముఖంలో పెళ్లికళ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో ఒక తింగరి పని చేసి నేనే అసలు కూతురినని ఇదే బయటపెట్టేలా ఉంది. నీకు టైం దగ్గరపడింది. ఈ లోపు ఎన్ని గంతులు వేస్తావో వేయ్.. నీ పెళ్లి చేసి నీ రుణం తీర్చుకుంటామని చెబుతుంది దీప. సూరజ్‌ని చంపించడానికి రౌడీలకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. ఇంట్లో వాళ్లకి ఎలా దగ్గరవ్వాలో పరిస్ధితులన్నీ నా కంట్రోల్‌కి రావాలంటే దీప ఇక్కడ ఉండకూడదని ప్లాన్ చేస్తుంది.
నీ కూతురు అదృష్టవంతురాలే.. కానీ ఈ తల్లి దురదృష్టవంతురాలని అంటుంది సుమిత్ర. మంచి భర్త, తండ్రిలా చూసుకునే మామగారు, బంగారం లాంటి కుటుంబం ఇంతకన్నా ఏం కావాలని చెబుతుంది దీప. గౌరవాన్ని కాపాడలేని సంతానం ఉన్నప్పుడు ఏ రకంగానూ సంతోషం ఉండదు.. జ్యోత్స్న తరపున నేను నీకు క్షమాపణలు చెబుతున్నానని అంటుంది సుమిత్ర. పిల్లలు సరిగా లేకపోతే కన్నతల్లి ప్రశాంతంగా ఉండదని చెబుతుంది. నీ మీద గెలవాలని నా కూతురు ఏం చేస్తుందో అర్ధం కావడం లేదని అంటుంది సుమిత్ర. నా కూతురు కూడా నీలాగే ఉంటే చాలా బాగుంటుందని చెబుతుంది సుమిత్ర. తాత చాలా కోపంగా ఉన్నాడు.. జ్యోత్స్న మీద ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి, అసలు జ్యోత్స్న ఊరికే ఉండదు కదా ఏం చేస్తుందోనని దీప టెన్షన్ పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications