Karthika Deepam 2 June 12th: దీపని సుమిత్రకి దూరం చేసిన జ్యోత్స్న.. జ్యోత్స్న, శివన్నారాయణలని కాపాడిన సూరజ్
Photo Courtesy: JioHotstar
నా కుటుంబంలో ఇకపై జ్యోత్స్న ఉండదని, నా మనవరాలు ఎవరు అంటే దీపేనని చెబుతానని అంటాడు శివన్నారాయణ. మావయ్య గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎవరూ దీనితో మాట్లాడొద్దని చెబుతుంది సుమిత్ర. తనకు ఇంతటి అవమానం జరగడానికి కారణమైన సూరజ్‌ని లాగిపెట్టి కొడుతుంది జ్యోత్స్న. నా వాళ్ల ముందే నన్ను ఫూల్‌ని చేస్తావా? నిన్ను వదిలిపెట్టను రోజులు లెక్కపెట్టుకో నీకు ఎటు వైపు నుంచి చావు వస్తుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు అనుకున్నది నువ్వు చేయ్.. నేను అనుకున్నది నేను చేస్తానని అంటాడు సూరజ్. ఇంతలో ఆమెకు ఐ లవ్ యూ అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కానీ అంతలోనే మాట మార్చేసి థ్యాంక్స్ చెబుతాడు సూరజ్.
తేడా గాళ్లంతా నీకే దొరుకుతారు.. ఆ కార్తీక్ గాడు నీకు మాటలు చెప్పి వదిలేస్తాడు. కానీ ఈ సూరజ్ మాత్రం నిన్ను ఉతికి ఆరేసే వరకు వదిలిపెట్టడం లేదని అంటుంది పారు. తాత నాతో మాట్లాడొద్దు అన్నాడు కదా నువ్వు కూడా వాళ్లతో కలిసిపోమ్మని మండిపడుతుంది జ్యోత్స్న. ఇంట్లో జరిగిన దాని గురించి కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వస్తుంది. నీ వల్లే నేను మా అమ్మకు దగ్గర అవుతున్నానని జ్యోత్స్న బుగ్గ గిల్లుతుంది దీప. నేను అనుకున్నది సాధించాలంటే దీప ఈ ఇంట్లో ఉండకూడదని అనుకుంటుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 12వ తేదీ 695వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శివన్నారాయణ కుటుంబ సభ్యుల్ని సమావేశపరుస్తుంది జ్యోత్స్న. నేను కాంపిటీషన్‌లో ఎలాగైనా గెలవాలని అనుకున్నాను, ఆ ఆలోచనతోనే పర్యవసానాలు ఆలోచించకుండా తప్పు చేశాను. నేను చేసిన పనివల్ల దీపకి చెడ్డపేరు వస్తే తను ఓడిపోతుందని అనుకున్నాను, దాని వల్ల సంస్థకు చెడ్డపేరు వస్తుందని నేను అర్ధం చేసుకోలేకపోయానని అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు అర్ధం చేసుకుని ఏం చేయాలని అనుకుంటున్నావని సుమిత్ర అడగ్గా.. దీపకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అనడంతో అంతా షాక్ అవుతారు.
మనుషుల్లో మార్పు సహజమని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్ గుండె పట్టుకుంటాడు. హాట్ వాటర్ మాత్రమే కాదు.. దానిలో కొంచెం తేనే కూడా వేయమని సెటైర్లు వేస్తాడు. ఆ వెంటనే దీపకి క్షమాపణలు చెబుతుంది జ్యోత్స్న. నీ ఇష్టం వచ్చినట్లు తప్పులు చేసి ఇప్పుడు క్షమించమని అడిగితే సరిపోతుందా అని మండిపడుతుంది కాంచన. నేను చేసిన అసలైన తప్పు వేరే ఉంది.. ముందు దానిని సరిదిద్దుకోవాలని చెబుతుంది జ్యోత్స్న. కాంపిటీషన్ పేరుతో భార్యాభర్తల్ని విడగొట్టాను.. అది ఎంత పాపమో నాకు ఇప్పుడు అర్ధమయ్యిందని అనడంతో కార్తీక్ సెటైర్లు వేస్తాడు.
బావ నిజాయితీ నాకు తెలుసు.. దీప పక్కనే ఉన్నా కూడా తను ఎలాంటి సలహాలు ఇవ్వడు అన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పెట్టిన కండీషన్‌ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను, బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్లిపోవచ్చని జ్యోత్స్న చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. రాత్రంతా నేను నిద్రపోకుండా మా మమ్మీ గురించే ఆలోచిస్తున్నాను, నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ల గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తున్నాను, నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను, నువ్వు అత్తని దీపని తీసుకుని వెళ్లిపోమ్మని కార్తీక్‌కి చెబుతుంది జ్యోత్స్న.
మరి అగ్రిమెంట్ సంగతి ఏంటని కాంచన అడగ్గా.. నా పెళ్లి అయ్యే వరకు అగ్రిమెంట్ అలాగే ఉంటుందని చెబుతుంది జ్యోత్స్న. నా పెళ్లి బాధ్యతని నీ కొడుకే తీసుకున్నాడు.. ఎలా వదిలేస్తానని అంటుంది. దీపతో నేను నిజాయితీగానే పోటీపడతానని అంటుంది. అయితే మేం సాయంత్రమే ఇంట్లో నుంచి వెళ్లిపోతాం, మళ్లీ దీని మనసు మారి ఏ కండీషన్ అయినా పెడితే అదో తలనొప్పి అంటుంది కాంచన. ఇంతకీ మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి అని శివన్నారాయణని అడుగుతుంది పారు. దీపకి జ్యోత్స్న సారీ చెప్పకపోయుంటే నేను నా నిర్ణయం చెప్పేవాడిని.. ఇక ఆ అవసరం లేదని అంటాడు శివన్నారాయణ.
జ్యోత్స్నలో నేను అనుకున్న మార్పు మొదలైందని సుమిత్ర అనగా.. నా మేనకోడలు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అంటుంది కాంచన. ఇక నా కూతురి వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదని అంటాడు దశరథ. ఈ మధ్య నువ్వు పార్టీ మార్చేసినట్లుగా ఉన్నావని పారుపై సెటైర్లు వేస్తాడు కార్తీక్. నేను మీ పార్టీయేనని అంటుంది పారు. నా మీద దానికి అనుమానం రాకూడదని నటిస్తున్నానని కవర్ చేస్తుంది పారు. ఇంట్లో నుంచి నన్ను గెంటేసీ అదే గెలిచిందని కార్తీక్ దగ్గర బాధపడుతుంది దీప. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి.. మీరంతా కలిసి పోతుంటే నేను చూస్తూ ఉండాలా అని చెబుతుంది.
నేను దాస్ కూతురిని అని తెలిసి కూడా నన్ను తప్పించాలని ప్రయత్నించారు అని మండిపడుతుంది జ్యోత్స్న. నిన్ను మనిషిగా మార్చాలని అనుకున్నామని చెబుతాడు కార్తీక్. మీ అమ్మ నీతో దీప నా కడుపున పుడితే బాగుండు అన్న ఒక్క మాట నీ జీవితంలో కొత్త ఆశల్ని రేపింది. దొరికిందే అవకాశమని ఇక్కడే ఉండిపోదామని అనుకున్నావని అంటుంది జ్యోత్స్న. అందుకే రాత్రికి రాత్రి మారిపోయినట్లు నటించావని మండిపడుతుంది దీప. నేను ఎంత నటించినా మీరు నా కంటే పెద్ద నటులని నాకు తెలుసు.. మీరు దొరకరు, నేను దొరుకుతానని అంటుంది జ్యోత్స్న. మళ్లీ దీపని ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వనని ఫైర్ అవుతుంది.
ఈ ఇంటి వారసురాలిగా ఎప్పటికీ ఉండేది నేనే.. నువ్వు ఎప్పటికీ అమ్మానాన్నలు లేని అనాథగానే మిగులుతావని చెబుతుంది జ్యోత్స్న. అనాథగా ఎవరు మిగులుతారో, అయినవాళ్లతో ఎవరుంటారో కాలమే నిర్ణయిస్తుందని చెబుతాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ అక్కడికి రావడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ ఏదోలా కవర్ చేసి నిజం దాచేస్తాడు. నువ్వు చేసేది నువ్వు చేయ్.. నేను చేసిది నేను చేస్తానని రౌడీలకు ఫోన్ చేసి సూరజ్‌ని చంపమని చెబుతుంది జ్యోత్స్న.
శివన్నారాయణ, జ్యోత్స్నలు కారులో వెళ్తూ.. నువ్వు నా మనవరాలివి కాదు, నిన్ను ఈపాటికే ఇంట్లో నుంచి గెంటేసేవాడిని అంటాడు శివన్నారాయణ. ఈ శివన్నారాయణ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాల్సిన నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మ కోరిక తీరుతుంది. నీ భర్తతో కలిసి నా బిజినెస్ మొత్తం నువ్వు చూసుకునే స్థాయికి ఎదుగుతావో అప్పుడే నా కోరిక తీరుతుంది. అలాగని తప్పు చేస్తే క్షమించను.. అందరికంటే ఎక్కువగా శిక్షిస్తానని చెబుతాడు శివన్నారాయణ. ఈసారి నేను ఏ తప్పు చేయనని అంటుంది జ్యోత్స్న.
ఇంతలో సూరజ్‌ని చంపమని పంపించిన రౌడీలు జ్యోత్స్న దగ్గరికి రావడంతో ఆమె టెన్షన్ పడుతుంది. మీరు చెప్పినట్లు సూరజ్‌ను చంపేశాం.. కానీ మాకు 50 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో నేను ఇవ్వనని చెబుతుంది జ్యోత్స్న. మీరు ఇవ్వకపోతే మీ తాత దగ్గర తీసుకుంటామని రౌడీలు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుండగా చూసిన శివన్నారాయణ మనవరాలని కాపాడాలని వెళ్తాడు. అయితే రౌడీలు పెద్దాయనను పక్కకి తోసేస్తారు. జ్యోత్స్నని రౌడీలు కారు ఎక్కిస్తుండగా సూరజ్ వచ్చి కాపాడటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. గొడవలో సూరజ్‌ని రౌడీలు కాలిపై తన్నడంతో అతనిని ఆసుపత్రికి తీసుకెళ్తారు శివన్నారాయణ, జ్యోత్స్న. సూరజ్ ఎంతకీ రాకపోవడంతో దీప, కార్తీక్‌లు టెన్షన్ పడుతుండగా.. ఈరోజు సూరజ్ రాడని చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నని కాపాడి తను గాయపడ్డాడని జరిగింది చెబుతాడు. ఆ వైరాగాడే రౌడీలను పంపించాడని అనుకుంటున్నానని అంటాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications