Karthika Deepam 2 June 13th: జ్యోత్స్నపైకి సూరజ్ ప్రేమబాణం.. సూరజ్‌కి శివన్నారాయణ ఊహించని గిఫ్ట్
Photo Courtesy: JioHotstar
తన తల్లికి దగ్గరవుతున్న దీపని ఇంటి నుంచి పంపేయడానికి జ్యోత్స్న స్కెచ్ వేస్తుంది. ఫ్యామిలీ మొత్తాన్ని సమావేశపరిచి.. నా తప్పు వల్లే ఇదంతా జరిగింది, దీప మీద గెలవడానికే ఇలా చేశానని అంటుంది జ్యోత్స్న. ఇందుకు దీపకు క్షమాపణలు చెబుతుంది. నా స్వార్ధం కోసం భార్యాభర్తల్ని కూడా విడదీశాను.. ఇకపై ఆ అవసరం లేదు. అత్తని, దీపని తీసుకుని బావ వాళ్లింటికి వెళ్లిపోవచ్చని జ్యోత్స్న చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. మరి అగ్రిమెంట్ సంగతి ఏంటని కాంచన అడగ్గా.. నా పెళ్లి బాధ్యతల్ని బావే తీసుకున్నాడు, నా పెళ్లయిన వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఎత్తుగడతో కార్తీక్ దగ్గర దీప బాధపడుతుంది. ఇంతలో దీప వచ్చి.. మీ అమ్మకి నువ్వు దగ్గరైపోతున్నానని సంబరపడిపోతున్నావు కదా? అందుకే నీకో ట్విస్ట్ ఇచ్చాను. ఈ ఇంటికి వారసురాలి స్థానంలో నేనే ఉంటాను, నిన్ను ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వనని అంటుంది జ్యోత్స్న.
దీపే మా అత్త కూతురని కార్తీక్ చెబుతుండగా ఆ మాటలు విన్న శివన్నారాయణ ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో ఏదో ఒకటి కవర్ చేస్తాడు కార్తీక్. సూరజ్‌ని చంపేయమని రౌడీలకు చెబుతుంది జ్యోత్స్న. కారులో శివన్నారాయణ, జ్యోత్స్న వెళ్తుండగా.. సూరజ్‌ని చంపడానికి పంపిన రౌడీలు జ్యోత్స్న దగ్గరికి వచ్చి వాడిని చంపేశాం, 50 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తారు. జ్యోత్స్న ఇవ్వనని చెప్పడంతో ఆమెను కిడ్నాప్ చేయాలని కారు ఎక్కిస్తుండగా అది చూసిన శివన్నారాయణ మనవరాలిని కాపాడటానికి వెళ్లగా ఆయన్ని పక్కకి తోసేస్తారు. ఇంతలో సూరజ్ వచ్చి రౌడీలతో ఫైట్ చేసి జ్యోత్స్నని, శివన్నారాయణని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా దెబ్బతింటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 13వ తేదీ 696వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఫుడ్ ఆర్డర్ రావడంతో అది చూసి చదవమని మేనేజర్‌ని అడుగుతుంది దీప. మీకు నా మీద నమ్మకం లేదు కదా మీరే చదువుకోండి అని మేనేజర్ కోపంగా వెళ్లిపోతాడు. దాంతో కార్తీక్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి తెలుగులోకి మార్చేస్తుంది. ఇదంతా దొంగచాటుగా చూసిన జ్యోత్స్న.. ఏం చేస్తున్నావే ఫిఫ్త్ క్లాస్ అంటుంది, పోయి పనిచూసుకోవే కల్తీ దానా అని దీప కూడా రివర్స్‌లో కౌంటరిస్తుంది. రెస్టారెంట్‌లో ఫుడ్ కల్తీ చేయించింది నువ్వే కదా అప్పుడు నువ్వు కల్తీ దానివే కదా అంటుంది. నువ్వేం గొప్పదానిలా బిల్డప్ ఇవ్వకు.. నువ్వు జీవితంలో ఎంత మందికి మాటిచ్చి తప్పావో అంటుంది జ్యోత్స్న. వచ్చిన మెయిల్‌ని తెలుగులో చదవడం గొప్పకాదు.. కానీ ఆ మెయిల్‌కి నువ్వు రిప్లయ్ ఇవ్వాలి, నీకు ఇంగ్లీష్ రాదు కదా అని నానామాటలు అంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన కార్తీక్... ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపించొద్దని కౌంటర్ వేస్తాడు.
సూరజ్ వచ్చేలోపు ఏం చేసుకుంటావో చేసుకోమ్మని చెబుతుంది జ్యోత్స్న. ఇప్పుడు మెయిల్‌కి రిప్లయ్ ఇవ్వడానికి సూరజ్ రావాలా అని కార్తీక్ అడగ్గా.. వాడికి తగిలిన దెబ్బను బట్టి వారం రోజుల వరకు మంచం మీద నుంచి దిగడు అంటుంది. లేచినా నడవలేడు, ఏం చేసినా దీపే చేసుకోవాలని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి కాలికి కట్టుతో సూరజ్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. హీరో లెవల్‌లో ఫైట్ చేసి పెద్ద మేడం గారిని కాపాడావని పెద్ద సార్ చెప్పాడు, నీకు కాలికి గాయమైందని నడవలేవని పెద్ద మేడం గారు చెప్పారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే లిఫ్ట్ ఇవ్వవని అడుగుతాడు కార్తీక్. కొన్ని కారణాల వల్ల మీ కాల్స్‌కి, మెసేజ్‌లకి రిప్లయ్ ఇవ్వలేకపోయాను. ఇలాంటి పరిస్ధితుల్లో ఆఫీస్‌కి ఎందుకొచ్చావని అడుగుతాడు కార్తీక్.
దెబ్బలు తగలడం నాకు పర్సనల్, దీప గారికి హెల్ప్ చేయడం నా ప్రోఫెషన్.. నేను పక్కన లేకపోవడం వల్ల దీప గారికి ఏ పని ఆగిపోకూడదని అంటాడు సూరజ్. నువ్వు మరి పని రాక్షసుడిలా ఉన్నావు.. ఒకవేళ లేచి నడవలేకపోతే స్టెచర్ మీదే ఒక సెలైన్ బాటిల్ పెట్టుకుని డ్యూటీకి వచ్చేలా ఉన్నావని అంటాడు కార్తీక్. వచ్చినా వచ్చేలా ఉన్నాడని జ్యోత్స్న సెటైర్ల్ వేస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కాపాడినందుకు కార్తీక్, దీపలు సూరజ్‌కు థ్యాంక్స్ చెబుతారు. నిజానికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్.
ఈయనేదో గొప్పపని చేశావని అలా పొగుడతావేంటీ? మమ్మల్ని కాపాడటం మాకు చేతకాదా? అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటే ఇలాగే దెబ్బలు తగులుతాయని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలు పట్టుకుని సూరజ్‌ని కుర్చీలో కూర్చోబెడతారు. వీడికి కాళ్లు చేతులు విరిగిపోయినా పొగరు మాత్రం తగ్గలేదని అనుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ మనంత మంచివాడు కాదు.. ఎలా బుద్ధి చెప్పాలో బ్రదర్‌కి తెలుసుని అంటాడు కార్తీక్. అయినా పదే పదే సూరజ్ చుట్టూ రౌడీలు ఎందుకు తిరుగుతున్నారు? ఈ అటాక్ కూడా జ్యోత్స్న చేయించి ఉండొచ్చు కదా అని అనుమానిస్తాడు కార్తీక్. కాలు, చేయి విరిగినా సూరజ్ మాత్రం తగ్గడం లేదని మెచ్చుకుంటాడు. హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకుందామని దీపని తీసుకుని వెళ్తాడు కార్తీక్. మనకి ఈ కష్టాలు పోవాలని అంటుంది దీప.
ఆఫీసులో పనిచేస్తూ పదే పదే జ్యోత్స్నని చూస్తుంటాడు సూరజ్. జ్యోత్స్న టేబుల్ మీద ఐ లవ్ యూ అని రాసున్న పేపర్ ఉండటంతో ఆమె రగిలిపోతుంది. వీడు ఈరోజు నా చేతుల్లో చచ్చాడని ఆ పేపర్ తీసుకెళ్లి సూరజ్ ముందు పెడుతుంది. నేను రాయడం, పెట్టడం మీరు చూశారా? మరి నేనే రాశానని మీరెలా కన్ఫర్మ్ చేస్తారని అడుగుతాడు సూరజ్. నిన్న కూడా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావని మండిపడుతుంది. మీకు జరిగింది జరగనట్లు.. జరగనిది జరిగినట్లు అనిపిస్తోంది, అయినా మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.. మీరు నన్ను ప్రేమించడం నా తప్పు కాదని అంటాడు. మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావని మండిపడుతుంది జ్యోత్స్న.
ఇంతలో అక్కడొచ్చిన శివన్నారాయణ.. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా ఎందుకు ఆఫీస్‌కి వచ్చావని ప్రశ్నిస్తాడు. నాకు అసలైన విశ్రాంతి పనిలోనే దొరుకుతుందని చెబుతాడు సూరజ్. ఇతను నాకు ఏం రాశాడో చూడమని జ్యోత్స్న పేపర్ చూపించగా.. నిజానికి ఇది రాయాల్సింది నువ్వు అంటాడు పెద్దాయన. దాని మీద థ్యాంక్యూ అని ఉండటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. థ్యాంక్యూ అని జ్యోత్స్న గారే రాశారని.. మీరొచ్చారని జ్యోత్న్న గారు ఆట పట్టిస్తున్నారని అంటాడు సూరజ్. ఈ మాత్రం సరదా ఉండాలని మెచ్చుకుంటాడు పెద్దాయన. నువ్వు ఎక్కడుంటావని అడగ్గా.. మణికొండలో పీజీలో ఉంటానని, దగ్గరలో రూమ్ కోసం వెతుకుతుండగా మిమ్మల్ని రౌడీలు ఇబ్బంది పెట్టడం చూశానని చెబుతాడు సూరజ్.
నీకు పెళ్లయ్యిందా? అని పెద్దాయన అడగ్గా.. ఒక రైట్ పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నాను, జంట అయ్యే మనిషి దగ్గరలోనే ఉందని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీ జాతకంలో కళ్యాణ ఘడియాలు వస్తే ఆ పిల్ల ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తుందని అంటాడు శివన్నారాయణ. పేపర్‌లో ఐ లవ్ యూ ఉండాలి కదా ఎలా మారిందని అనుకుంటుంది జ్యోత్స్న. సూరజ్‌ను తీసుకుని ఇంటికి వస్తాడు కార్తీక్. మమ్మల్ని మీరు కాపాడారు కదా మీకు తాంబూలం ఇద్దామని అనుకుంటున్నావా అని మండిపడుతుంది జ్యోత్స్న. మా అమ్మాయిని కాపాడినందుకు థ్యాంక్స్ చెబుతుంది సుమిత్ర.
నన్ను, నా మనవరాలిని ప్రాణాలకు తెగించి కాపాడావు కాబట్టి నువ్వు కోరుకుంటున్నది నేను ఇస్తాను అంటాడు పెద్దాయన. సూరజ్ ఉండే ప్లేస్ ఆఫీస్‌కి చాలా దూరంగా ఉందని, ఆఫీస్‌కి దగ్గరిగా ఉండే పీజీకి మారాలని అనుకుంటున్నాడు. చేతికి కట్టుతో, కర్ర పట్టుకుని నడిచే పరిస్ధితి మన కారణంగానే వచ్చిందని అంటాడు శివన్నారాయణ. కొంతకాలం సూరజ్ మనింట్లోనే ఉంటాడని పెద్దాయన చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మనింట్లో అంటే ఔట్‌హౌస్‌లో అని శివన్నారాయణ చెప్పడంతో పారుకి షాక్‌తో మూర్చ వస్తుంది. ఔట్ హౌస్ అంటే వైట్ హౌస్ అంత పవర్‌ఫుల్. ఒకప్పుడు ఆ ఇంట్లో దీప అడుగుపెడితే తుఫాను వచ్చింది.. ఈసారి సూరజ్ అడుగుపెడితే ఏ సునామీ వస్తుందోనని భయంగా ఉందని అంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications