Karthika Deepam 2 June 17th: జ్యోత్స్న పరువు తీసేసిన సూరజ్.. ఆఫీస్‌లో పడిపోయిన దీప, షాక్‌లో కార్తీక్

Photo Courtesy: JioHotstar

నా గురించి మీ వాళ్లకి నువ్వు చెబితే.. నీ వీడియోని నేను మీ ఫ్యామిలీకి, మన కంపెనీ గ్రూప్‌లో షేర్ చేస్తానని సూరజ్ బ్లాక్ మెయిల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇద్దరం జైలుకి వెళ్దాం అక్కడ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుందాం. వీడు ఆఫీస్‌లో నాకు ఐ లవ్ యూ చెప్పాడు. వీడితో నేను లవ్‌లో పడిపోతానేమో అనుకుంటున్నావు కదా అంటాడు సూరజ్. నేను నీతో ప్రేమలో పడటం అసాధ్యమని మండిపడుతుంది జ్యోత్స్న. నీలాంటి తిక్కల దానికి, నా లాంటి తిక్కలోడే కరెక్ట్ అంటాడు సూరజ్.

ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్తున్న శివన్నారాయణకి రోడ్డు మీద సూరజ్ కనిపించడంత కారు ఎక్కమని చెబుతాడు. అతను కారెక్కడం నాకు ఇష్టం లేదని అంటుంది జ్యోత్స్న. ఎంప్లాయిస్‌ని మన సొంత మనుషుల్లా చూసుకోవాలి, అయినా నీ ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞత కూడా నీలో కనిపించడం లేదని మండిపడతాడు శివన్నారాయణ. ముందు నువ్వు కారు దిగేయమని చెప్పి .. సూరజ్‌తో పాటే వచ్చి అతనిని సేఫ్‌గా ఆఫీస్‌కు తీసుకురమ్మని జ్యోత్స్నకి పనిష్మెంట్ ఇస్తాడు శివన్నారాయణ. దాంతో చచ్చినట్లు సూరజ్‌తో పాటు ఆటోలో వస్తుంది జ్యోత్స్న. వచ్చే దారిలో సూరజ్ చేతికర్రని రోడ్డు మీద విసిరేయడంతో ఆఫీస్‌లో తనే మోసుకుంటూ సూరజ్‌ని లోపలికి తీసుకొస్తుంది జ్యోత్స్న. సూరజ్‌ను జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకొస్తున్న జ్యోత్స్నని చూసి కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 17వ తేదీ 699వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 699 June 17th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న రిజెక్ట్ చేసిన ఫుడ్ ఆర్డర్‌ని సూరజ్, దీపలు అందుకుంటారు. అయితే 1000 మందికి కావాల్సిన భోజనాన్ని రేపు ఉదయానికి అందించాలని కస్టమర్‌ చెప్పడంతో వారిద్దరూ షాక్ అవుతారు. మేం సప్లయ్ చేస్తామని ఇబ్బంది లేదని చెబుతుంది దీప. మంచి క్వాలిటీతో ఫుడ్ డెలివరీ చేస్తామని అంటుంది దీప. ఆ కస్టమర్ వెళ్తూ వెళ్తూ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోమని జ్యోత్స్నపై మండిపడతాడు. ఇంతలో కార్తీక్ రావడంతో అతనికి ఫుడ్ డెలివరీ ఆర్డర్ వచ్చిందని 1000 మందికి భోజనాలు అని దీప చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు. భార్యకు కార్తీక్ కంగ్రాట్స్ చెప్పబోతుండగా జ్యోత్స్న ఆపుతుంది. ఇప్పటి వరకు వాతావరణం హాట్ హాట్‌గా ఉందంటే ఏసీ ఆఫ్ అయ్యింది అనుకున్నాను.. కానీ ఇది కొందరి కడుపు మంట వల్ల వచ్చిన వేడా అని ఇప్పుడే అర్ధమైందని అంటాడు కార్తీక్. పార్టీ ఏది అని దీపని అడుగుతాడు కార్తీక్. ఇంటికి వెళ్లాక ఇస్తానని చెబుతుంది దీప.

దీపకి ఆర్డర్ రావడంతో కోపంతో రగిలిపోతూ కాఫీ తాగాలని తెచ్చుకుని తాగబోతుండగా సూరజ్ దానిని లాక్కుని తాగుతాడు. నువ్వు స్మార్ట్ అని, అమాయకుడివి అని అందరూ అనుకుంటున్నారు. కానీ నీ గురించి నాకు తెలుసని అంటుంది జ్యోత్స్న. ఓ చిన్న వీడియో పెట్టుకుని నువ్వు నన్నేం చేయలేవని చెబుతుంది. కాసేపటిలో మీ తాత దగ్గరి నుంచి నీకు ఫోన్ వస్తుంది.. ఎందుకంటే వీడియో మీ తాతకి పంపించానని సూరజ్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. రౌడీలను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలన్నీ దానిలో ఉన్నాయని అంటాడు. ఎవరికీ పంపించనని మాటిచ్చావు కదా అని జ్యోత్స్న అంటుంది.

నేనేం మాటివ్వలేదు... నువ్వు నా గురించి బయటపెడితే, నేను నీ గురించి బయటపెడతాను అన్నాను అంటాడు సూరజ్. నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదు కదా అని చెబుతుంది జ్యోత్స్న. నేను కూడా ఎవరికీ పంపించలేదు, అది బయటపడితే నువ్వు ఎంత కంగారు పడతావో చూడాలని అనుకున్నాను అంటాడు సూరజ్. నేను కొన్నిసార్లు మిర్రర్‌లా కనిపిస్తాను.. నేను వాళ్ల ముందు నిలబడితే వాళ్ల ముందు కనిపిస్తాను, నీ శాడిజం నీకు కనిపించిందేమో అని అంటాడు. నిన్ను చిన్నప్పుడే ఎవరో ఒక డాక్టర్‌కి చూపించాల్సింది, బాగా ముదిరిపోయింది. అసలు ఎవర్రా నువ్వు, నన్ను, మా తాతని కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి మా ఔట్‌హౌస్‌లో ఉండాల్సిన అవసరం ఏంటీ? నా వీడియో నీ దగ్గర పెట్టుకుని నన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటీ అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.

నాకు చెప్పాలని అనిపించినప్పుడు చెబుతాను అంటాడు సూరజ్. అంత పెద్ద ఆఫర్‌ని నువ్వెందుకు వదిలేశావు, ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు వదిలేసుకునే వాళ్లని జ్యోత్స్న అంటారు. ఈ ఆఫర్ నువ్వు తీసుకుని ఉంటే ఈ కాంపీటిషన్‌లో నువ్వే గెలిచే దానివి అంటాడు సూరజ్. ఆ దీప వంటలక్క .. మా ఇంటిలో వంటలు చేసుకోవడంతో దాని బతుకు మొదలైంది, నువ్వేమో రోడ్డు మీద జ్యూస్‌లు అమ్ముకునేవాడివి అంటే ఇద్దరిదీ ఒకే స్థాయి. కానీ నా స్థాయి వేరు. 1000 మందికి భోజనం పంపించడమంటే అదేదో అద్భుతంగా మీరు ఫీల్ అవుతున్నారని అంటుంది జ్యోత్స్న. కార్పోరేట్ కంపెనీలలో వన్ ఇయర్ ఫుడ్ కాంట్రాక్ట్ లాంటివి అయితే నేను పెట్టే సంతకానికి వాల్యూ ఉన్నట్లు అని చెబుతుంది. నాకు ఎవరి సాయం అక్కర్లేదు.. నువ్వే కాదు, ఆ వంటలక్క కూడా నన్ను ఆపలేదని కోపంగా వెళ్తుండగా మెట్లపై జారిపడిపోతుంది జ్యోత్స్న.

రాహుకాలంలో గిఫ్ట్ షాపులో తగులుకున్నావు.. నన్ను మింగేశాలా ఉన్నావని అంటుంది జ్యోత్స్న. నువ్వు చందమామ కంటే అందంగా ఉంటావని అంటాడు. నేను పడిన విషయం ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నొప్పితో విలవిలలాడుతుండగా శివన్నారాయణ వచ్చి కిందపడ్డావట కదా ఎలా ఉందని అడుగుతాడు. ఆ వెంటనే కార్తీక్, దీపలు వచ్చి అదే విషయం అడగటంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నోరే కాదు కాలు కూడా తిన్నగా నడవదా అని దీప సెటైర్లు వేస్తుంది. జ్యోత్స్న కిందపడిపోయిందని మేనేజర్ కంటతడి పెడతాడు. కింద పడ్డావట ఎలా ఉందని సుమిత్ర కూడా ఫోన్ చేసి అడుగుతుంది. ఆఫీసులో ఉన్నవాళ్లంతా బోకేలు తీసుకుని రాబోతున్నారని ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. ఈ తిక్క దానికి, ఆ తిక్కలోడే కరెక్ట్ అని దీప, కార్తీక్‌లు నవ్వుకుంటూ ఉంటారు.

కింద పడిన విషయం నేను ఎవ్వరికీ చెప్పొద్దని అన్నాను కదా ఎందుకు చెప్పావని సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వొక అడివి మనిషివి.. ఇత తేడాగా ఉన్నావేంటీ అంటుంది. మనిషి ఇలా ఫ్రస్ట్రేట్ కావడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. మీతిమిరీన కోపం వల్ల బాడీ టెంపరేచర్ పెరగడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్న ఇచ్చినట్లు తిట్టడంతో మనసులో ప్రేమ ఉంటేనే తిట్లు వస్తాయని ఎక్కడో విన్నాను అంటాడు. నేను కిందపడినట్లు ఎందుకు చెప్పావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను చెప్పానని నీతో ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తావని మండిపడతాడు సూరజ్. నేను కిందపడినట్లు నీకు మాత్రమే తెలుసు.. నువ్వే చెప్పి ఉంటావని ఫైర్ అవుతుంది. నేనైతే ఎవ్వరికీ చెప్పలేదు.. నువ్వు కిందపడిన వీడియోని మన కంపెనీ గ్రూప్‌లో షేర్ చేశానని చెబుతాడు. ఆ వీడియోని ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయమని కార్తీక్‌ గారితో అన్నాను అని అంటాడు సూరజ్.
ఆర్డర్ రావడంతో దానిని ఎలా ప్రిపేర్ చేయాలో చెబుతుండగా దీప కళ్లు తిరిగి పడిపోతుండగా కార్తీక్ పట్టుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X