Karthika Deepam 2 June 18th: సూరజ్‌ని దెబ్బకొట్టేలా పారిజాతం కుట్ర... పాల గ్లాసుతో సూరజ్ రూమ్‌లోకి జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
దీపకి ఆర్డర్ రావడంతో కోపంతో రగిలిపోతుంటుంది జ్యోత్స్న. కాఫీ తాగుతుండగా ఆ కప్పుని సూరజ్ లాక్కుని తాగుతాడు. ఓ చిన్న వీడియో పెట్టుకుని నన్నేం చేయలేవని జ్యోత్స్న అనగా.. కాసేపట్లో మీ తాత నుంచి నీకు ఫోన్ వస్తుందని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. ఎవరికీ చెప్పనని చెప్పి మా తాతకి లీక్ చేస్తావా అని అడుగుతుంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని అబద్దం చెప్పానని అంటాడు సూరజ్. మా తాతని, నన్ను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి ఎందుకు మా ఔట్‌హౌస్‌లో చేరావని అడుగుతుంది జ్యోత్స్న. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని అంటాడు సూరజ్.
1000 మందికి భోజనం పంపే ఆర్డర్ వస్తే అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ ఓ పెద్ద కంపెనీకి ఏడాది పాటు ఫుడ్ డెలివరీ చేస్తే అది ఆర్డర్, అప్పుడు నా సంతకానికి వాల్యూ ఉంటుందని చెబుతూ వెళ్తున్న జ్యోత్స్న మెట్లపై జారిపడిపోతుంది. నేను కిందపడిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని సూరజ్‌ని బతిమలాడి వెళ్తుంది జ్యోత్స్న. ఆఫీస్‌లోకి వెళ్లేసరికి శివన్నారాయణ, దీప, కార్తీక్‌లు వచ్చి కిందపడ్డావట కదా? దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వెంటనే సూరజ్ దగ్గరికి వెళ్లి గొడవపడుతుంది. 1000 మందికి భోజనం ఎలా తయారు చేయాలో స్టాఫ్‌కి చెబుతుండగా దీప కళ్లు తిరిగి పడిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 18వ తేదీ 700వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆఫీసులో కళ్లు తిరిగి పడిపోతున్న దీపని కార్తీక్ పట్టుకుంటాడు. నువ్వు ప్రెగ్నెంట్‌వి ఆ టైంలో అలసటగా ఉంటుంది, కళ్లు తిరుగుతాయి నువ్విలా పట్టించుకోకుండా పనిచేసుకుంటూ వెళ్లిపోతావా అని ఫైర్ అవుతాడు కార్తీక్. రేపు డెలివరీ పనులన్నీ నేను చూసుకుంటాను.. మీరు, బ్రదర్ ఇంటికి వెళ్లండి అని సూరజ్ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న వచ్చి నాకు డ్రైవర్‌గా నువ్వు ఉంటావా అని ప్రశ్నిస్తుంది. దీప ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ఎప్పుడైనా రావొచ్చని, కానీ బావ మాత్రం నాతోనే ఉండాలని చెబుతుంది జ్యోత్స్న. నా భార్యకు హెల్త్ బాలేదు నేను వెళ్తున్నానని కార్ తాళాలు జ్యోత్స్న చేతిలో పెట్టి వెళ్లిపోతాడు కార్తీక్.
పొగరుకి, ఆత్మగౌరవానికి నీకు తేడా తెలియదని జ్యోత్స్నపై మండిపడతాడు సూరజ్. నా ప్లాన్ సరిగా వర్కవుట్ అయ్యుంటే మీ అందరికీ ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. చిన్న గ్యాప్ ఇచ్చాను.. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ప్రిపేర్ అవ్వమని అనుకుంటుంది జ్యోత్స్న. దీప- కార్తీక్‌లు వెళ్లిపోయిన తర్వాత సూరజ్- జ్యోత్స్నలు మాత్రమే ఆఫీసులో ఉంటారు. ఇంతలో శివన్నారాయణ వచ్చి లంచ్‌కి రమ్మని అడుగుతాడు. నేను మన రెస్టారెంట్ నుంచి భోజనం తెప్పించుకుని తిన్నాను సార్ అని సూరజ్ చెబుతాడు. మరి నువ్వేం చేస్తావని జ్యోత్స్నని పెద్దాయన అడగ్గా.. పిజ్జా ఆర్డర్ వస్తుంది.
నేను ఏ ఫుడ్ ఆర్డర్ చేయలేదని జ్యోత్స్న చెబుతుంది. నువ్వు ఇక్కడ ఆకలితో వర్క్ చేస్తున్నావని మీ గ్రానీయే ఫుడ్ ఆర్డర్ చేసిందేమోనని అంటాడు శివన్నారాయణ. ఆ పిజ్జా ఆర్డర్ చేసింది నేనే అని సూరజ్ చెప్పగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆర్డర్ చేయమని నేను చెప్పానా? నేను చేసుకోలేనా? అని మండిపడుతుంది. మీరు వేరే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తారని నేనే మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశానని చెబుతాడు సూరజ్. నేను ఎక్కడ తినాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. మన రెస్టారెంట్ ఫుడ్ మనమే ఆర్డర్ చేసి తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది, మనం తింటేనే కదా దానిలో లోపాలు తెలుస్తాయని అంటాడు సూరజ్.
ఆ మాటలతో సూరజ్‌ను మెచ్చుకుంటాడు పెద్దాయన. కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలియాలంటే ఆ ఫుడ్ మనం తినాలని చెబుతాడు. అయితే వేరే రెస్టారెంట్ ఫుడ్, టేస్ట్ తెలియాలి కదా అని జ్యోత్స్న చెబుతుంది. మీ ఇద్దరు చెప్పింది నిజమే.. మన ఎదగాలంటే మన గురించి మనకి తెలియాలి, మన ప్రత్యర్ధుల బలం ఏంటో కూడా తెలియాలని అంటాడు. కార్తీక్- దీప ఎక్కడ అని శివన్నారాయణ అడగ్గా.. దీప గారికి కడుపు నొప్పిగా ఉందని వెళ్లిపోయారని అంటాడు సూరజ్. పిజ్జా తిని ఎలా ఉందో చెప్పమని జ్యోత్స్నతో అంటాడు శివన్నారాయణ.
నిన్నెవరు పిజ్జా ఆర్డర్ చేయమన్నారని సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నీకు పిజ్జా అంటే ఇష్టం కదా, అలాగే ప్రతిదానికి బీపీ వస్తుంది కదా అని సాల్ట్ తగ్గించి పంపించమని చెప్పానని అంటాడు సూరజ్. ఏదో ఒక రోజు దొరికిపోతావని జ్యోత్స్న చెప్పగా.. ఇప్పుడే దొరికిపోతానని చెప్పి కట్లు విప్పేసుకుంటాడు. అది చూసిన ఆఫీస్ బాయ్ మీ కట్టు ఏమైందని అడుగుతాడు. మేడం గారి చేత్తో ఇచ్చిన పిజ్జా తినగానే నా నొప్పి తగ్గిపోయిందని అంటాడు సూరజ్. ఉదయం నుంచి నాకు కూడా తలనొప్పిగా ఉంది.. చిన్న ముక్క పెట్టమని అడుగుతాడు ఆఫీస్ బాయ్. దాంతో జ్యోత్స్న మండిపడుతుంది.
ఇంటికొచ్చిన దీపని వచ్చే నాలుగు రోజులు ఆఫీస్‌కి వెళ్లొద్దని క్లాస్ పీకుతుంది కాంచన. పక్కన కార్తీక్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఏమయ్యేదని మండిపడుతుంది. ఇంతలో సుమిత్ర ఫోన్ చేయడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కాంచన. రేపటి నుంచి నా కోడలు ఆఫీస్‌కి రాదు.. నాన్నకి చెప్పమని అంటుంది. నీ కోడలు జీవితంలో ఏదో సాధించబోతుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావని ఫైర్ అవుతాడు కార్తీక్. జ్యోత్స్నకి పెళ్లయితేనే కానీ వీళ్ల జీవితాలు బాగుపడవని అనుకుంటుంది కాంచన.
సూరజ్‌కి, తనకి మధ్య జరుగుతున్న విషయాలన్నీ పారుకి చెబుతుంది జ్యోత్స్న. బావ లాంటి వాడినే అగ్రిమెంట్ పేరుతో లాక్ చేశాను.. ఈ సూరజ్ గాడు ఒక లెక్కా అంటుంది. కార్తీక్ గాడు మాయలోడు అయితే, ఈ సూరజ్ గాడు మాంత్రికుడని అంటుది పారు. వాడి ధైర్యం వాడి దగ్గరున్న వీడియోనే అని చెబుతుంది జ్యోత్స్న. చూస్తుంటే వాడు అంత తేలిగ్గా పోయేవాడిలా కనిపించడం లేదు.. ఐ లవ్ యూ అని రాయడాలు, నువ్వంటే ఇష్టమని చెప్పడాలు చూస్తుంటే ఆ సూరజ్ గాడి ప్లాన్ ఇంకేదో అని అంటుంది పారు. తాత పేరు చెప్పుకుని ఏ రెస్టారెంటో పెట్టుకుంటాడని అంటుంది జ్యోత్స్న. వాడి బుద్ధి అలాంటిది కాదు, వాడు మాత్రం ఊరికే రాలేదు.. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి పెళ్లాం కావాలని అనడం.. దీప- కార్తీక్ కలిసి పెద్ద గొయ్యి తీశారని అనిపిస్తోందని చెబుతుంది పారు.
ఆ సూరజ్ గాడిని నీ దారికి తెచ్చుకో.. దీప- కార్తీక్‌లను దెబ్బ కొట్టాలంటే వాడు మన పక్కనే ఉండాలని చెబుతుంది పారు. ఆ వైరా గాడినే బోల్తా కొట్టించావని.. సూరజ్‌కి ఫోన్ చేస్తుంది పారు. జ్యోత్స్న కాల్ కట్ చేస్తుంది. ఆ వెంటనే సూరజ్ కాల్ బ్యాక్ చేస్తాడు. నీ మిస్డ్ కాల్ వల్ల నా నిద్ర డిస్ట్రబ్ అయ్యింది నువ్వొచ్చి సారి చెబితే పడుకుంటాను, లేకపోతే అందరికీ వీడియో చూపించి నష్టపరిహారం అడుగుతానని బెదిరిస్తాడు. అయితే ఈ ఛాన్స్ ఉపయోగించుకుని వాడితో బేరం మాట్లాడమని చెబుతుంది పారు. వాడి కాళ్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదని అంటుంది. కానీ సూరజ్‌కి పాలు తీసుకుని వెళ్తుంది జ్యోత్స్న.
నీ మీద కోపంతో నేను కొన్ని తప్పులు చేశాను.. నా మీద కోపంతో నువ్వు దీప పార్టీలో చేరావు. మనం ఇలా ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉంటే దీప విన్నర్ అయి సీఈవో అవుతుంది. దీపకి ఇక నీతో అవసరం ఉండదు కాబట్టి.. రోడ్డు మీదకి పోయి జ్యూస్ అమ్ముకోవడమే. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను సీఈవోని అవుతాను.. ఆ తర్వాత నీకు హెల్ప్ చేస్తానని బేరం మాట్లాడుతుంది జ్యోత్స్న. నీ దగ్గరున్న ఎవిడెన్స్‌తో నన్నెప్పుడు ఫూల్‌ని చేస్తావోనని భయంగా ఉంది.. అలాగే నా వల్ల కూడా నీ థ్రెట్ ఉంది. ఇద్దరి భయాలు పోవాలంటే ఇద్దరం ఒకే పార్టీగా ఉండాలని చెబుతుంది జ్యోత్స్న. దీప దగ్గరే ఉండి నా కోసం పనిచేయమని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications