Karthika Deepam 2 June 19th: దీప ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఫేక్... కార్తీక్‌, సూరజ్‌లని ఊహించని దెబ్బకొట్టిన జ్యోత్స

Photo Courtesy: JioHotstar

ఆఫీసులో కళ్లు తిరిగి పడిపోయిన దీపని ఇంటికి తీసుకెళ్లమని కార్తీక్‌తో చెబుతాడు సూరజ్. అతను ఇంటికి వెళ్తే డ్రైవర్ జాబ్ నువ్వు చేస్తావా అంటూ జ్యోత్స్న మండిపడుతుంది. నేను డ్రైవర్‌నే అయినా ఎమర్జెన్సీ టైంలో సెలవు పెడతానని తాళాలు జ్యోత్స్న చేతిలో పెడతాడు సూరజ్. దీప- కార్తీక్‌లు వెళ్లిపోవడంతో సూరజ్- జ్యోత్స్నలు మాత్రమే ఆఫీసులో ఉంటారు. ఇంతలో శివన్నారాయణ వచ్చి దీప, కార్తీక్‌ల గురించి అడగ్గా.. సూరజ్ జరిగింది చెబుతాడు. ఇద్దరినీ భోజనానికి పిలవగా.. నేను మన రెస్టారెంట్ నుంచే భోజనం తెప్పించుకుని తిన్నానని అంటాడు, ఆ వెంటనే జ్యోత్స్నకి పిజ్జా డెలివరీ వస్తుంది. ఇది నేను చేయలేదని జ్యోత్స్న చెప్పగా నేనే చేశానని అంటాడు సూరజ్.

మన రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికే ఇలా చేశానని చెప్పడంతో సూరజ్‌ని మెచ్చుకుంటాడు పెద్దాయన. ఆఫీసులో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. నువ్వు ఇకపై ఆఫీస్‌కి వెళ్లొద్దని దీపకి చెబుతుంది కాంచన. దాంతో కార్తీక్ నచ్చచెబుతాడు. సూరజ్‌కి తనకి మధ్య జరుగుతున్న గొడవని, అతను ఐ లవ్ యూ చెప్పిన విషయం గురించి పారుకు చెబుతుంది జ్యోత్స్న. వాడు చాలా పెద్ద ప్లాన్‌తోనే ఈ ఇంట్లో తిష్ట వేశాడని అంటుంది పారు. అతనిని మన దారిలో తెచ్చుకోమని చెప్పడంతో పాల గ్లాసు తీసుకుని సూరజ్ దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 19వ తేదీ 701వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 701 June 19th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప కోసం పనిచేస్తూనే తన మనిషిగా ఉండాలని సూరజ్‌ని అడుగుతుంది జ్యోత్స్న. నీ డీల్ నాకు బాగా నచ్చిందని చెబుతాడు సూరజ్. నిన్ను ఎలా నమ్మాలి అని జ్యోత్స్న అడగ్గా.. నా మొబైల్ తీసుకుని దీనిలోని నీ వీడియోలన్నీ డిలీట్ చేసుకోమని ఇస్తాడు సూరజ్. వీడియోలన్నీ డిలీట్ చేసిన తర్వాత అతని ముందే కాలి మీద కాలు వేసుకుని కూర్చొంటుంది జ్యోత్స్న. నమ్మకం కుదరకపోయినా ఇప్పుడు నా వీడియోలు నీ దగ్గర లేవు కాబట్టి ఏం చేయలేవని అంటాడు సూరజ్. కానీ నేను చెప్పింది నువ్వు చేయాలని జ్యోత్స్న వెళ్తుండగా.. నాకు సారీ చెప్పడం మరిచిపోయావని అంటాడు సూరజ్. ఇప్పుడు నువ్వు నా పార్టీ కదా అని జ్యోత్స్న అడగ్గా.. నువ్వు నా పార్టీ కదా అంటుంది జ్యోత్స్న.

నేను ఎప్పుడూ ఎవరి పార్టీ కాదు.. నాకు నేను సెపరేట్ పార్టీ, నాకు నచ్చినట్లుగానే ఉంటానని చెబుతాడు సూరజ్. నచ్చకపోయినా ఇప్పుడు నువ్వు చేసేదేం లేదు, నీ మొబైల్‌లో డేటా అంతా డిలీట్ చేశాను, నన్నేం చేయలేవని అంటుంది జ్యోత్స్న. అయితే ఒక్కసారి అటు చూడమని ఫోన్‌లో రికార్డ్ అవుతున్న ఈ మాటల్ని చూపిస్తాడు సూరజ్. అది చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇక్కడ జరిగినదంతా అక్కడ రికార్డ్ అవుతోంది, వీటిలోనే కాదు నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర సేఫ్‌గా ఉన్నాయని అంటాడు. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఇంకా ఏం కావాలని మండిపడుతుంది జ్యోత్స్న.

నాకు శాలరీలు కూడా ఏం వద్దు.. అయినా నేను మార్కెట్‌లో వస్తువుని కాదు, అమ్ముడుపోవడానికి. నేను ఇలాగే ఉంటాను.. ఏం చేస్తావో చేసుకోమ్మని వార్నింగ్ ఇస్తాడు. ఈ విసనకర్ర తీసుకుని నాకు గాలి విసరు లేదంటే ఈ వీడియోని పెద్దాయనకి పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు సూరజ్. దాంతో చేసేదేం లేక విసురుతుంది. నాకు సారీ బ్యాలెన్స్ ఉందని సూరజ్ అనడంతో సారీ చెబుతుంది జ్యోత్స్న. సూరజ్ నిద్రపోగానే అతని రెండు ఫోన్లు దాచేసి, రూమ్‌కి తాళం వేస్తుంది. ఫుడ్ డెలివరీ చేయడానికి ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను, రేపు నువ్వు ఇంట్లోంచి రాలేక గిలగిల కొట్టుకోమని అనుకుంటుంది జ్యోత్స్న.

దీపకి టాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెబుతాడు కార్తీక్. నువ్వు పడే ఇబ్బంది చూస్తుంటే నాకు కూడా ఇబ్బందిగా ఉందని అంటాడు. నేను ఈ పోటీలో దిగడానికి కారణం నువ్వే, నాకు సీఈవో అవ్వాలని కోరికలేం లేవు, కానీ దిగిన తర్వాతే తెలిసిన తర్వాతే ఈ పోటీ కావాలని తెలిసింది. అమ్మానాన్నలు మనకేం చేశారు అనేకంటే .. వాళ్ల కోసం మనం ఏం చేశామో చూసుకోవాలి. నాకు అప్పుడు నాన్న మాత్రమే ఉన్నాడు. నాన్న సంతోషం కోసం ఏదైనా చేయాలని అనుకుని చేశాను. అనాథగా మిగిలిపోయిన నా జీవితంలోకి మీరందరూ వచ్చారు. కొత్త జీవితం, కొత్త ఆశలు.. కానీ ఆలోచనలు మాత్రం పాతవే. నా కన్నవాళ్ల కోసం నేనేం చేశాను అన్నదే నాకు ముఖ్యమని అంటుంది దీప.

నా కుటుంబం సంతోషంగా లేదు.. మనసులో ఉన్న సమస్యని ఎవరు తీరుస్తారు? దానికి ఎవరు వైద్యం చేస్తారు? జ్యోత్స్న రాక్షస గుణాలతో పుట్టినట్లుగా ఉంది, ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని మండిపడుతుంది దీప. దాని వల్ల మనషులకు సమస్య.. ఆస్తులకు నష్టం, ఆ రాక్షసి పీడ వదిలించాలంటే మనిద్దరం యుద్దం చేయాలి. మనతో పాటు మనకు పుట్టబోయే బిడ్డ కూడా వాళ్ల అమ్మమ్మ తాతయ్యల కోసం యుద్ధం చేస్తుంది, ఈ పోటీలో మనం గెలుస్తాం. పెట్టిన గడువులోపు జ్యోత్స్న పెళ్లి చేసి, ఆ దరిద్రం బయటకు పోతేనే కానీ.. ఆ ఇంట్లో సంతోషం ఉండదు. నువ్వు మంచి సంబంధాలు చూడమని దీప చెబుతుంది. రాక్షసి మెడలో తాళి కట్టాలంటే రాక్షసే అయ్యుండాలని అంటాడు కార్తీక్. రాక్షసిని కూడా మనిషిలా మార్చే మనసున్న వాడు దొరుకుతాడని చెబుతుంది దీప. ఇలాంటి దాని మెడలో తాళి కట్టడానికి వాడేన్నీ పూజలు చేస్తున్నాడోనని కార్తీక్ సెటైర్లు వేస్తాడు.

జ్యోత్స్నకి అప్పగించిన రెస్టారెంట్ 30 శాతం గ్రోత్ సాధించింది అని దశరథ చెబుతాడు. దానికి అన్ని తాత తెలివితేటలే వచ్చాయని పారు పొంగిపోతుండటంతో ఏ తాతతో పోల్చావో చెప్పమని ప్రశ్నిస్తాడు దశరథ. తండ్రి తాలూకా తాత శివన్నారాయణ గారే అంటుంది పారు. మన పనిమనిషి బ్రాంచ్ ఎలా ఉందో చెప్పమని పారు అడగటంతో దశరథ, సుమిత్రలు సీరియస్ అవుతారు. దీప 10 శాతం గ్రోత్ వచ్చిందని దశరథ చెప్పడంతో.. జ్యోత్స్నని దాటలేదు. ఎంతైనా ఉన్నోడి బిడ్డ ఉన్నాడో.. లేనోడి బిడ్డ లేనోడేనని అంటుంది పారు. దీప ఆ కుబేరకు సొంత బిడ్డ కాదు కదా? ఈ అనాథ కూడా ఉన్నోడి బిడ్డే అయితే అని దశరథ అడగటంతో పారు షాక్ అవుతుంది. దీప బ్రాంచ్‌కి పెద్ద ఆర్డర్ వచ్చిందని.. ఇది కనుక డెలివరీ అయితే దీప బ్రాంచ్ గ్రోత్ 60 ప్లస్ అవుతుందని దశరథ చెప్పడంతో పారు అవాక్కు అవుతుంది.

ఫుడ్ డెలివరీ ఆర్డర్‌కి సంబంధించి అన్ని వెరైటీలు చెక్ చేసి టేస్ట్ బాగుందని మెచ్చుకుంటుంది దీప. అత్తాకోడళ్లు అంటేనే మీలాగే ఉండాలని ఆఫీస్ మేనేజర్ మెచ్చుకుంటాడు. నీ కోడలు ఈ ఫుడ్ ఆర్డర్ నాలుగైదు మెట్లు ఎక్కేసింది, త్వరలోనే సీఈవో అయిపోతుందని అంటాడు కార్తీక్. నా సంతోషం మీకు వచ్చే పదవుల్లో కాదు.. మీరిద్దరూ ప్రశాంతంగా ఉండటంలోనే ఉంటుందని చెబుతుంది కాంచన. ఆ రోజులు త్వరలోనే వస్తాయి.. దీప సీఈవో అవుతుంది, జ్యోత్స్నకి పెళ్లి చేసి.. దీపే ఆ ఇంటి వారసురాలు అని అందరితో చెప్పేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమని మనసులో అనుకుంటాడు కార్తీక్.

సూరజ్ ఇంటి బయటి నుంచి వీడియ్ కాల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. వేసిన తాళం వేసినట్లే ఉంది.. వీడు ఎలా బయటికి వచ్చాడా అనుకుంటున్నావా? నా పేరు సూరజ్ అంటే సూర్యుడు. తాళం వేసి వెలుగుని బంధించలేవని చెబుతాడు. నువ్వు తలుపులు వేస్తేనో, తాళం వేస్తేనో ఏది ఆగదని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. మీ బ్యాచ్ మొత్తానికి పొగరు పెరిగిపోయింది.. మీ అందరినీ తలదించుకునేలా చేస్తానని రగిలిపోతుంది జ్యోత్స్న. ఫుడ్ డెలివరీ చేయడానికి సూరజ్ వచ్చి చూడగా.. అక్కడ ఏ ఫంక్షన్ లేకపోవడంతో షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X