Karthika Deepam 2 June 20th: దీపని చావు దెబ్బకొట్టిన జ్యోత్స్న.. శివన్నారాయణ ముందు దోషిలా దీప

Photo Courtesy: JioHotstar

దీప కోసం పనిచేస్తూనే తన మనిషిగా ఉంటే సీఈవో అయ్యాక నీకు కూడా హెల్ప్ చేస్తానని చెబుతుంది సూరజ్‌తో చెబుతుంది జ్యోత్స్న. ఈ డీల్ నాకు ఓకే.. బాగా నచ్చిందని చెబుతాడు సూరజ్. నిన్ను ఎలా నమ్మడం అని జ్యోత్స్న అడగ్గా.. నా ఫోన్‌లో ఉన్న నీ వీడియోలని డిలీట్ చేసుకోమని ఇస్తాడు. ఇదే అదనుగా తన వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటుంది జ్యోత్స్న. నీ దగ్గర వీడియోలు లేవు, ఇప్పుడు నువ్వేం చేయలేవని జ్యోత్స్న చెప్పగా.. అయితే అటు పక్క చూడమని ఫోన్‌లో రికార్డ్ అవుతున్న వీడియోని చూపిస్తాడు సూరజ్. అది చూడగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను మార్కెట్‌లో దొరికే వస్తువుని కాదు.. నన్నెవరూ కొనలేరని చెబుతాడు సూరజ్. ఈ విసనకర్ర తీసుకుని నేను నిద్రపోయే వరకు విసురు.. లేకపోతే పెద్దాయనకి వీడియో షేర్ చేస్తానని సూరజ్ బెదిరించడంతో జ్యోత్స్న చచ్చినట్లుగా విసురుతుంది.

సూరజ్ నిద్రపోగానే.. అతని రెండు ఫోన్లు దాచేసి, రూమ్‌కి లాక్ చేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఈ వారం జ్యోత్స్న 30 శాతం ప్లస్‌లో ఉందని దశరథ చెప్పగా.. మరి దీప పరిస్ధితేంటీ అని అడుగుతుంది పారు. తనకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, త్వరలోనే 60 శాతం ప్లస్‌కి వెళ్లిపోతుందని చెబుతాడు దశరథ. ఆ మాటలతో పారు రగిలిపోతుంది. డెలివరీకి పంపించాల్సిన ఫుడ్‌ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయని మెచ్చుకుంటుంది దీప. రూమ్‌కి లాక్ చేయడంతో సూరజ్.. ఫుడ్ డెలివరీ చేయలేడని సంతోషపడుతుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ వీడియో కాల్ చేయడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫుడ్ డెలివరీ చేయాల్సిన ఇంటికి సూరజ్ వెళ్లి చూడగా అక్కడ ఏ ఫంక్షన్ ఉండదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 20వ తేదీ 702వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 702 June 20th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

బాలరాజు ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన సూరజ్‌కి తాము మోసపోయామని తెలిసి షాక్ అవుతాడు. ఇంత పెద్ద ఆర్డర్ డెలివరీ ఇవ్వకుండా ఆగిపోయిందంటే ఏంటీ పరిస్ధితి, పెద్దాయన ముందు తలదించుకోవాలి కదా అని బాధపడతాడు సూరజ్. ఇంతలో విషయం తెలుసుకున్న శివన్నారాయణ దీపపై మండిపడతాడు. మనిషి మాటలు నమ్మకంలాగే అనిపించాయి.. 50 శాతం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, పూర్తి వివరాలు రాసిచ్చాడు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడని అనుకోం కదా అంటుంది దీప.

1000 భోజనాలు ఏం చేయాలి.. వాడిని నువ్వు ఎంత నమ్మావో తెలియదు, నేను మాత్రం నిన్ను చాలా నమ్మాను. తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావని ఫైర్ అవుతాడు పెద్దాయన. ఇక్కడ ఒక్క ట్రక్ మాత్రమే ఉంది.. ఇంకా రెండు ట్రక్‌ల నిండా ఫుడ్ ఉంది అవన్నీ ఏం చేయాలో అంటూ జ్యోత్స్న మరింత రెచ్చగొడుతుంది. 50 భోజనాలకు, 100 భోజనాలకు పెద్దగా వివరాలు అవసరం లేదు 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్యమైన విషయం కాదు, 20 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఎంత జాగ్రత్తగా ఉండాలని అంటాడు శివన్నారాయణ

వాడిచ్చిన అడ్రస్ ఒరిజినాలా? ఫేకా అనేది ఫుడ్ డెలివరీకి ముందు తెలుసుకోవాలని మండిపడతాడు పెద్దాయన. నిన్ను చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది, ఇంతకు ముందు కూడా నీ అజ్ఞానంతో ఒక ఆర్డర్ పొగొట్టావు.. రెండోసారి ఛాన్స్ ఇచ్చినా మోసపోయావంటే ఇది నీ చేతగానితనమే. ఈ విషయం నాలుగు గోడల మధ్య ఉండిపోదు.. ఒకడు మనల్ని మోసం చేశాడని జనానికి తెలిస్తే నా పరువు పరిస్ధితి ఏంటని మండిపడతాడు శివన్నారాయణ. మన అదృష్టం బాగుండి కనీసం 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడని జ్యోత్స్న అంటుంది. ఆ వెంటనే మేనేజర్ వచ్చి ఆ చెక్ బౌన్స్ అయ్యిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

వాడు తక్కువ అమౌంట్‌కి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నా మీద పంతానికి పోయి, తక్కువ రేటుకే ఫుడ్ డెలివరీ చేస్తానని దీప ఈ ఆర్డర్‌కి ఒప్పుకుందని చెబుతుంది జ్యోత్స్న. బ్యాంక్ హాలీడే నాడు వాడు చెక్ ఇచ్చాడంటేనే వాడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, 20 లక్షల రూపాయల ఫుడ్ డెలివరి వచ్చిందని సంబరపడిపోవడం కాదు.. వాడు ఎవరు? ఎలాంటి వాడు? అనేది తెలుసుకోవాలి కదా అని మండిపడతాడు శివన్నారాయణ. నష్టం తనకైతే కదా? అందుకే ఏం ఆలోచించలేదు. దీపకి సాయంగా వచ్చిన మనిషితో నష్టం లక్షల్లోకి మారిందని రెచ్చగొడుతుంది జ్యోత్స్న.

బ్రాంచ్‌ని క్లోజ్ చేయాల్సిన పరిస్ధితి వచ్చిందని శివన్నారాయణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక్కడ మనం డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు, మర్యాద అన్ని నష్టపోతున్నాం. నా ఇన్నేళ్ల జీవితంలో ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చినాసరే ఇలా మోసపోలేదు.. మన మీద గెలవడానికి జరిగే మోసాల్ని కూడా కనిపెడుతూ ఉండాలి. ఆర్డర్ వచ్చింది.. డెలివరీ చేశాను నా పనైపోయిందని దీప అనుకుంటుంది. కానీ ఆ వంటలన్నీ పారపోయడానికి మాత్రమే పనికొస్తాయి. మనమంతా డ్రైవింగ్ దీపకే ఇచ్చాం.. అసలే నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌కి 20 లక్షల రూపాయల నష్టమంటే దానిని కంటిన్యూ చేయడం కంటే క్లోజ్ చేయడమే మంచిదని తేల్చేస్తాడు శివన్నారాయణ. నా పెద్దరికం ఒకడి చేతిలో మోసపోయి చచ్చిపోయిందని, దీప నన్ను పనికిరాని వాడిలా మార్చేసిందని రగిలిపోతాడు.

ఈ తప్పుని సరిదిద్దుకునేందుకు తనకొక అవకాశం ఇవ్వమని అడుగుతుంది దీప. ఈ నష్టం ఒక్క రెస్టారెంట్‌కే పరిమితం కాదు.. మొత్తం కంపెనీకే ఎఫెక్ట్ అవుతుందని చెబుతాడు. ఈవిడకి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం, ఎందుకంటే ఈ మనిషికి కల్మషం ఉండదు. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది, తను కడుపుతో ఉందని తెలిసినా ఫుడ్ డెలివరీ కోసమే ఆలోచించింది. పెద్దాయన గౌరవం కోసం నేను, నా బిడ్డ కష్టపడతామని దీప చెప్పింది.. ఈ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది తనకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రాధేయపడతాడు కార్తీక్. అయితే ఏ అవకాశం ఇవ్వొద్దని జ్యోత్స్న అడ్డుకుంటుంది.

నేను ఇప్పటికే అవకాశం ఇచ్చాను.. ఇప్పుడు మరోసారి క్షమించలేను, కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప మళ్లీ ఈ సంస్థలో అడుగుపెట్టడానికి వీల్లేదు, మళ్లీ జీవితంలో దీప ముఖం చూడనని దీపని వెళ్లిపోమ్మని చెబుతాడు శివన్నారాయణ. దాంతో ఒక్క అవకాశం ఇవ్వమని తాత కాళ్లపై పడుతుంది దీప. దాంతో కరిగిపోయిన శివన్నారాయణ.. నీకోక అవకాశం ఇస్తున్నాను, నీ దగ్గరున్న 1000 భోజనాలు సాయంత్రం వరకే ఉంటాయి. ఆ భోజనాలలో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు, అంతా సేల్ అయిపోవాలని కండీషన్ పెడతాడు పెద్దాయన. దీప ఏం చేయలేకపోతే అని జ్యోత్స్న అడగ్గా.. దీప ఈ సంస్థ వదిలి వెళ్లిపోతుంది, జ్యోత్స్న సీఈవో అవుతుంది. ఆఫీసులోనే కాదు నా ఇంట్లోకి కూడా దీప అడుగుపెట్టకూడదని తేల్చి చెబుతాడు.

ఆ మాటలు విన్న జ్యోత్స్న.. ఇది కదా మనకి కావాల్సిందని సంబరపడిపోవడంతో అంతా షాక్ అవుతారు. అవమానంతో బాధపడుతున్న సూరజ్‌కి జ్యోత్స్నకి కాఫీ ఇస్తుంది. మేం మోసపోలేదు.. మోసం చేశారు, బయటివాళ్లు కాదు తెలిసిన వాళ్లే, అది నువ్వేనని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. గెలవడానికి నువ్వు ఎంత నీచానికైనా దిగజారతావని ఆ మాణిక్యం గాడి గొడవలోనే అర్ధమైందని అంటాడు సూరజ్. సాక్ష్యం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. ఐదో తరగతి కూడా చదవని ఆ వంటలక్క.. ఇంతపెద్ద కంపెనీకి సీఈవో అయిపోతుందంటే నువ్వేలా నమ్మావు? దానికి సాయంగా ఎలా వచ్చావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.

సాయంత్రం లోపు సైలెంట్‌గా పారిపోవడం, నాతో చేతులు కలపడం మాత్రమే నీకున్న దారులు. లేని దెబ్బలు ఉన్నట్లు దీపని, మా బావని మోసం చేశావు. మా ఫ్యామిలీని చీట్ చేసి మా ఇంట్లో సెటిల్ అయ్యావు, నా గురించి నీకు తెలుసు కాబట్టి మనిద్దరం కలిసి పనిచేద్దామని అంటుంది జ్యోత్స్న. నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి నువ్వు కాదని చెబుతాడు సూరజ్. మా ఇంట్లో జీతం లేకుండా పనిచేస్తున్న దీప.. ఈ 20 లక్షల రూపాయల అప్పు తీర్చాలంటే దాని జీవితం సరిపోదు, దాని కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.

నాకు ఆఫర్‌తో పాటు ఆఫర్ ఇచ్చే మనిషి కూడా నచ్చాలి అంటూ ఐ లవ్ యూ చెబుతాడు సూరజ్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప దగ్గరికి వెళ్లి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించమని చెబుతాడు సూరజ్. మీరు గతంలో ఇండ్లీ బండి నడిపానని జరిగినవన్నీ దీప చెప్పడంతో సూరజ్‌కి ఒక ఐడియా వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X