Karthika Deepam 2 June 22nd: దీపని పెద్ద గండం నుంచి కాపాడిన సూరజ్.. జ్యోత్స్న సీఈవో ఆశలపై నీళ్లు

Photo Courtesy: JioHotstar

దీప ఇచ్చిన అడ్రస్‌కి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన సూరజ్‌కి అక్కడ ఎలాంటి ఫంక్షన్ లేకపోవడంతో షాక్ అవుతాడు. ఆ ఇంట్లో వాళ్లని పిలిచి అడగ్గా.. ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ జరగడం లేదు, మేం ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదని చెబుతారు. దాంతో తాము మోసపోయినట్లు గ్రహించి షాక్ అవుతాడు. 20 లక్షల రూపాయల భోజనం ఆర్డర్ తీసుకుని మోసపోవడంతో దీప మీద శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు.. నేను వ్యాపారంలో నష్టాలు చూశాను కానీ, మోసపోలేదని అంటాడు. నువ్వు జీవితంలో ఈ కంపెనీలోకి, మా ఇంటికి రావొద్దని తేల్చేస్తాడు.

ఆ మాటలతో పెద్దాయన కాళ్ల మీద పడిన దీపకి ఒక అవకాశం ఇస్తాడు. సాయంత్రం లోగా 20 లక్షల రూపాయల భోజనంలో ఒక్క మెతుకు కూడా లేకుండా ఖర్చు అయిపోవాలని లేదంటే కంపెనీని వదిలేసి వెళ్లిపోవాలని కండీషన్ పెడతాడు. సూరజ్ దగ్గరికి కాఫీ కప్పుతో వెళ్లిన జ్యోత్స్న.. ఇకనైనా ఆ వంటలక్కని వదిలేసి నాతో చేతులు కలపమని సూరజ్‌కి ఆఫర్ ఇస్తుంది. కోపంతో దీప దగ్గరికి వెళ్లిన సూరజ్.. ఇంతకు ముందు ఇడ్లీ కొట్టు ఉన్నప్పుడు వేస్ట్ అయిన ఫుడ్‌ని ఎలా హ్యాండిల్ చేసిందో వివరాలు కనుక్కుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 22వ తేదీ 703వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 703 June 22nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

1000 భోజనాలు ఎలా సేల్ చేయాలో తన దగ్గర ఒక ఐడియా ఉందని శివన్నారాయణకి చెబుతాడు సూరజ్. 1000 భోజనాలలో 800 మంది భోజనాలను మన దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్‌కి పంపించి ఫ్లాష్ సేల్ చేద్దాం.. మిగిలిన 200 భోజనాలను కంపెనీ పేరు మీద అనాథ శరణాలయానికి పంపిద్దామని అంటాడు సూరజ్. ఆల్రెడీ మన రెస్టారెంట్స్‌లో ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, దానిని ఏం చేస్తావని పెద్దాయన అడగ్గా.. ఎక్కువ ఫుడ్ సేల్ అవ్వాలంటే ఆఫర్స్ పెట్టాలి. వచ్చిన వాళ్లకి గోల్డ్ కాయిన్స్ ఇద్దామని దీప చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసా అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. ముందు వాళ్లు చెప్పే ప్లాన్ వినమని అంటాడు కార్తీక్. జ్యోత్స్న రెస్టారెంట్‌కి వచ్చిన వాళ్ల బిల్స్ కలెక్ట్ చేసి లాటరీ వేస్తాం.. ప్రతి గంటకి ఒక లాటరీ తీస్తాం, గెలిచిన వాళ్లకి గోల్డ్ కాయిన్ ఇస్తామని, అలాగే వాళ్లకి 10 రోజులు ఫ్రీ టిఫిన్ ఆఫర్ కూడా ఇస్తామని సూరజ్, దీపలు చెబుతారు. అంటే కంపెనీని దివాళా తీయిస్తే కానీ నిద్రపోవా అని మండిపడుతుంది జ్యోత్స్న. మీరు ఇవన్నీ చేయడానికి మీ దగ్గర టైం లేదు. మీరు ఆఫర్ పెట్టినా వచ్చే జనం వేలల్లో రారు, వచ్చిన వాళ్లకి చచ్చినట్లు లాటరీ తీయాల్సిందే, కాయిన్ ఇవ్వాల్సిందే. ఈ గోల్డ్ కాయిన్, ఫ్రీ ఆఫర్ వల్ల మరో 50, 60 వేలు లాస్ అని చెబుతుంది జ్యోత్స్న. అయితే ఏం చేయాలో నువ్వే చెప్పమని కార్తీక్ చెప్పగా.. నేను వద్దన్న ఆర్డర్ తీసుకుని తప్పు చేసింది దీప.. బండ్ల మీద ఇడ్లీలు అమ్ముకునే వారికి కార్పోరేట్ బిజినెస్ ఇస్తే ఇలాగే ఉంటుందని అంటుంది జ్యోత్స్న.

మనుషుల్ని అంచనా వేయడంలో దీప ఫెయిల్ కావొచ్చు.. కానీ వ్యాపారం చేయడంలో మాత్రం దీపది సక్సెస్‌ఫుల్ హ్యాండేనని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న, దీపలు గొడవ పడుతుండగా శివన్నారాయణ మండిపడతాడు. ఉన్న తక్కువ టైంలో మీరు గొడవ పడితే ఎలా? ఏదో ఒకటి చేసి ఫుడ్‌ని సేల్ చేయమని పర్మిషన్ ఇస్తాడు పెద్దాయన. అయితే భోజనాలన్నీ నా బ్రాంచ్‌కి మాత్రం పంపొద్దు, వీళ్లవి నా బ్రాంచ్‌కి వస్తే నా ఫుడ్ వేస్ట్ అవుతుందని అంటుంది జ్యోత్స్న. కంపెనీకి నష్టం వచ్చినా, ఫుడ్ వేస్ట్ అయినా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతాడు శివన్నారాయణ.

మీరు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు, ఆశీర్వదించారు .. ఈ కంపెనీని నమ్ముకుని బతుకుతున్న వారికి ఎట్టి పరిస్ధితుల్లో నష్టం కలగనివ్వమని చెబుతుంది దీప. భోజనాలు సేల్ చేసేందుకు దీప, కార్తీక్‌లు కష్టపడుతుండగా జ్యోత్స్న చూసి సెటైర్లు వేస్తుంది. ఓడిపోయే బ్యాచ్‌కి మాటలెక్కువ, మీరు పంపించిన ఫుడ్ మిగిలిపోయి దానిని కూడా అనాథాశ్రమంలో పంచాలని అంటుంది జ్యోత్స్న. ఇంతలో కస్టమర్స్ ఎవరూ రావడం లేదని మేనేజర్‌ల నుంచి ఫోన్ రావడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఈవినింగ్ నేను సీఈవోగా బాధ్యతలు తీసుకోబోతున్నాను, మంచి కేక్, ఫ్లవర్ బొకే ఆర్డర్ చేయమని మేనేజర్‌కు చెబుతుంది జ్యోత్స్న. అలాగే పారుకి ఫోన్ చేసి ఇకపై పర్మినెంట్ సీఈవో నేనే, సాయంత్రం ముహూర్తం బాగుందో లేదో చూడమని అంటుంది. దీపకి కార్తీక్ హెల్ప్ చేస్తుండగా అతనిని తీసుకుని వెళ్లిపోతుంది జ్యోత్స్న.

మనం ఓడిపోయేలా ఉన్నామని సూరజ్ దగ్గర బాధపడుతుంది దీప. కస్టమర్లు రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందని చెబుతాడు సూరజ్. సాయంత్రం వరకు నాతో ఎవ్వరూ మాట్లాడొద్దని అంటాడు శివన్నారాయణ. ఈవినెంట్ వరకు ఏ అద్భుతం జరగదు, వీళ్ల పబ్లిసిటీ ఏం పనిచేయలేదు, వంటలక్క స్పెషల్ థాలీ తినడానికి ఎవ్వరూ రావడం లేదని శివన్నారాయణకి చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో మేనేజర్ వంశీ వచ్చి సోషల్ మీడియాలో వంటలక్క ఫ్లాష్ సేల్‌ గురించి ఓ రీల్ ట్రెండ్ అవుతుందని అందరికీ చూపిస్తాడు. అది చూసిన జ్యోత్స్న షాక్ అవ్వగా.. కార్తీక్, దశరథలు సంతోషిస్తారు.

ఇతనిని ఎక్కడో చూసినట్లుగా ఉందని దశరథ అంటుండగా.. ఇంతలో కూల్‌డ్రింక్స్ తీసుకుని ఆఫీస్ బాయ్ నాని వస్తాడు. రీల్‌లో ఉన్న కుర్రాడు వీడే కదా అని శివన్నారాయణ అనగా.. రీల్ ఎందుకు చేశావని నానిపై మండిపడుతుంది జ్యోత్స్న. నేనేం చేయలేదు, సూరజ్ సార్ చేయించారు.. షర్ట్ మార్చమన్నారు, కళ్లజోడు పెట్టారు, డైలాగులు రాసి అలాగే చెప్పమన్నారని అంటాడు. కంపెనీ గురించి ఫేక్ పబ్లిసిటీలు చేయిస్తున్నారని జ్యోత్స్న మండిపడగా.. సూరజ్ వచ్చి ప్రాక్టీకల్‌ పబ్లిసిటీ చేయించానని చెబుతాడు.

నాని 10 రోజులు ఫ్రీ టిఫిన్ పాస్ గెలుచుకున్నాడు కాబట్టి.. మిగిలిన వారికి గోల్డ్ కాయిన్స్ గెలుస్తామన్న ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా జనాలు వస్తారు, కావాలంటే ఏదైనా బ్రాంచ్‌కి కాల్ చేసి కనుక్కోమని చెబుతాడు సూరజ్. ఇది చీటింగ్ అని జ్యోత్స్న రగిలిపోతుంది.. దీనిని స్ట్రాటజీ అంటారు, వంటలక్క స్పెషల్ ఫుడ్ బంగారం కంటే విలువైనదని చెబుతాడు కార్తీక్. దీంట్లో ఏ మోసం లేదని, నాని ఫ్రీ పాస్ గెలవలేదు.. కానీ గెలిచినట్లుగా వీడియో తీసి జనాన్ని రప్పిస్తున్నాడని శివన్నారాయణ మెచ్చుకుంటాడు.

ఫుడ్ సేల్స్ గురించి టెన్షన్ పడుతున్న దీప దగ్గరకి వెళ్లి.. సోషల్ మీడియాలో నీ వంటలక్క ఆఫర్ గురించి న్యూస్ వైరల్ అవుతోందని చెబుతాడు కార్తీక్. ఫేక్ పబ్లిసిటీకి జనం రారు.. ఈసారి నాని గాడితో గోల్డ్ కాయిన్ గెలిచారని పబ్లిసిటీ చేయించమంటూ సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. ఇంతలో మేనేజర్ నుంచి దీపకి ఫోన్ వస్తుంది. జనం రెస్టారెంట్ మీద ఎగబడుతున్నారు, వచ్చిన వాళ్లందరికీ టోకెన్స్ ఇచ్చేశాం, మీరు పంపిన భోజనాలు అయిపోయాయని చెబుతాడు. అలాగే అన్ని బ్రాంచ్‌ల నుంచి ఇదే రకమైన ఆన్సర్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు చెప్పిన కేక్ క్యాన్సిల్ చేయమంటారా అని జ్యోత్స్నని మేనేజర్ అడుగుతాడు. మరేం పర్లేదు, ఆ కేక్ రానీ మేం సెలబ్రేట్ చేసుకుంటామని అంటాడు కార్తీక్. సమర్ధుల్ని రెచ్చగొడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. సాయంత్రం గోల్డ్ కాయిన్ ప్రెజెంటేషన్ ఇక్కడే.. నీ క్యాబిన్‌కి తాళం వేసి పెట్టుకోమని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X