Karthika Deepam 2 June 23rd: దీపని గెలిపించిన సూరజ్.. ఫేక్ చెక్ కుట్రపై కార్తీక్ ఫోకస్, జ్యోత్స్నకి ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

1000 భోజనాలు ఎలా సేల్ చేయాలన్న దానిపై శివన్నారాయణకి ఐడియా ఇస్తారు సూరజ్, దీప. ఫ్లాష్ సేల్‌లా దీనిని అమ్మడంతో పాటు లక్కీ డ్రా పెట్టి గెలిచిన వారికి గోల్డ్ కాయిన్, 10 రోజుల పాటు తిన్నంత ఫ్రీ టిఫిన్ పెడదామని చెబుతారు. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న.. అప్పుడు కంపెనీ మూతపడిపోతుందని అంటుంది. భోజనాలకు 20 లక్షల రూపాయలు లాస్ అయితే ఎక్స్‌ట్రాగా మరో లక్ష రూపాయలు నష్టం తీసుకొస్తారా అని మండిపడుతుంది. అయితే శివన్నారాయణ మాత్రం మీకు ఇదే లాస్ట్ ఛాన్స్.. సాయంత్రం తర్వాత ఒక్క మెతుకు మిగిలినా జ్యోత్స్నే సీఈవో అవుతుందని చెబుతాడు.

పెద్దాయనకి చెప్పినట్లే ఒక్కొక్క బ్రాంచ్‌కి భోజనాలు పంపినా కస్టమర్లు వెళ్లకపోవడంతో దీప, సూరజ్‌లపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. ఆల్మండ్ కేక్‌తో పాటు బోకే ఆర్డర్ చేయ్, నా సీఈవో ఛాంబర్ రెడీ చేయమని మేనేజర్‌కు చెబుతుంది. ఇదంతా చూసిన సూరజ్.. ఆఫీస్ బాయ్ నానితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేయిస్తాడు. అది చూసిన దశరథ, శివన్నారాయణలు షాక్ అవుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా క్లిక్ కావడంతో అన్ని బ్రాంచ్‌లకు కస్టమర్లు ఎగబడతారు. ఈ విషయం తెలుసుకున్న సూరజ్, దీపలు చాలా సంతోషిస్తుండగా.. దీప గెలవకూడదని జ్యోత్స్న రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 23వ తేదీ 704వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 704 June 23rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

తన రెస్టారెంట్‌లో ఫుడ్ కాయిన్స్ గెలిచిన వారికి శివన్నారాయణ చేతుల మీదుగా అందజేస్తుంది దీప. అందరూ గోల్డ్ కాయిన్ తీసుకుని, జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ బాగుందని చెబుతారు. నేను పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు వ్యాపారంలో నా స్నేహితుడి చేతిలోనే మోసపోయాను, అయినా మోసపోయేంతగా నమ్మడం నాదే తప్పు. అప్పటి నుంచి మోసం చేయాలన్నా, మోసపోవాలన్నా నేనే భరించలేకపోయేవాడిని. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడు మన ఆఫీస్‌కి వచ్చి ఫేక్ చెక్ ఇచ్చి మనల్ని ఎర్రివాడిని చేశాడంటే మనమంతా వాడి చేతిలో ఫూల్స్ అయినట్లే. అందుకే పట్టరాని కోపంతో మీ మీద అరిచానని, మీ సమర్ధతని సవాల్ చేశానని చెబుతాడు శివన్నారాయణ. నిరూపించుకోలేకపోతే శిక్ష కూడా వేస్తానని చెప్పాను.. మీరు ఓడిపోయుంటే నా మాట నిలబెట్టుకునేవాడిని, మీరు గెలిచి నా అహంకారాన్ని చంపేశారని దీప, సూరజ్‌లకు థ్యాంక్స్ చెబుతాడు శివన్నారాయణ. ఈ సేల్ వల్ల సంస్థకు 20 శాతం ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని మేనేజర్ చెప్పడంతో శివన్నారాయణ సంతోషిస్తాడు.

మెచ్చుకోగానే సరిపోదు.. ఒక వార్నింగ్ బెల్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అదృష్టం మన పెంపుడు కుక్క కాదు.. ప్రతిసారి మనచుట్టూ తిరగడానికి, ఈ గోల్డ్ కాయిన్ చిట్కాలు ప్రతిసారి వర్కవుట్ కాకపోవచ్చని అంటుంది జ్యోత్స్న. దీప అంచనాలు బ్యాలెన్స్ తప్పుతాయి.. నేను వద్దు అన్న ఆర్డర్ ఆమె కూడా వద్దు అనుకుంటే ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇది మంచి వర్షాకాలమైతే పరిస్ధితి ఏంటీ? ఫుడ్ డెలివరీ చేయగలిగేవాళ్లమా? ప్రతిసారి వాతావరణం మనకి ఇంత అనుకూలంగా ఉండకపోవచ్చని జ్యోత్స్న అంటుంది. ఈ మాటలు విన్న శివన్నారాయణ.. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడమని చెబుతాడు. మీ బ్రాంచ్ కూడా లాభాల్లో ఉంది, హ్యాపీనెస్ లేదని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్.

కార్తీక్ చెప్పిన మాటలతో, ఏం జరగబోతుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇంతలో సూరజ్ వచ్చి కాఫీ ఇస్తాడు. నా మాటలు నాకే అప్పగిస్తావా అంటూ ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నాకేదో ఆఫర్ ఇచ్చావు కదా? ఈసారి నేను నీకు ఇస్తాను.. మాలాగే మంచిగా మారిపోమ్మని అంటాడు సూరజ్. ఇక్కడ ఎవరు మంచివాళ్లు అని ఉండరు, ఎవరి స్వార్ధానికి వాళ్లు బతుకుతారు. సందర్భాన్ని బట్టి మారిపోతారు. దీప గెలుస్తుందని నేను అనుకోలేదు.. కానీ నువ్వు గెలిపించావు, నా మీద కోపంతో గెలిపించావని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అయినా నువ్వు దీప కోసం రాలేదు.. నా కోసమే వచ్చావు, దీప సీఈవో అవుతుందని అనుకున్నావా అని ప్రశ్నిస్తుంది. అది మనం డిసైడ్ చేయనక్కర్లేదు.. టైం డిసైడ్ చేస్తుందని అంటాడు సూరజ్. ఈ కంపెనీకి నేనే సీఈవోని, చివరికి గెలిచేది నేనే, నేను ఛైర్మన్ గారి మనవరాలిని అంటుంది జ్యోత్స్న.

ఇదొక్కటే నీకున్న అర్హత.. అది కాస్తా తీసేస్తే నువ్వు ఆఫీస్‌లో అసిస్టెంట్ పీఏ పోస్ట్‌కి కూడా పనికిరావని అంటాడు సూరజ్. నాకంటే ఆ దీప ఎందులో గొప్ప అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మనం సాధించే విజయాలే మనమేంటో చూపిస్తాయని అంటాడు సూరజ్. నువ్వు ఇక ఆఫీస్‌లో ఎక్కువ రోజులు ఉండవని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నీకున్న తెలివిని మంచికి వాడితే సీఈవో పోస్ట్ ఏంటి.. ఏకంగా ఛైర్మన్ పోస్ట్ ఆఫర్ చేస్తారు, నువ్వు చాలా అందంగా ఉంటావని నానామాటలు అంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్న కాఫీ కప్పు విసిరేస్తుంది.

ఇంటికొచ్చిన దీపకి కాంచన దిష్టి తీస్తుండగా.. సుమిత్ర ఫోన్ చేసి దీపకి కంగ్రాట్స్ చెబుతుంది. దీప చేసిన పనికి మావయ్య గారు, మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆర్డర్ ఆగిపోవడం కూడా మంచే జరిగింది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టామన్న మంచి పేరు దక్కింది, రెస్టారెంట్‌లో భోజనం చేసిన వారికి గోల్డ్ కాయిన్ ఇచ్చారు. దాని వల్ల మన రెస్టారెంట్‌కు మంచి పేరొచ్చింది. దీపకి అప్పగించిన బ్రాంచ్‌లో వంటలక్క స్పెషల్ బాగా ఫేమస్ అయిపోయింది, అన్ని ఖర్చులు పోను 20 శాతం లాభాలు వచ్చాయని చెబుతుంది సుమిత్ర. ఈ పోటీలో దీప గెలుస్తుందా అని కాంచన అడగ్గా.. ఎవరు గెలిచినా సంతోషమేనని అంటుంది సుమిత్ర.

బావ ఏదో చేయబోతున్నాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. బయటికి వెళ్లేసరికి సూరజ్ వాకింగ్ చేస్తూ కనిపిస్తాడు. నువ్వు నా కోసమే బయట తిరుగుతున్నావా అని మండిపడుతుంది జ్యోత్స్న. ఈరోజు నవ్వు దీప, నా మీద గెలిచారు కదా ఆనందం పట్టలేక తిరుగుతున్నావా? నిద్ర రావడం లేదా? నువ్వు ఇచ్చిన కాఫీ మూడ్‌లోనే దిగులుగా బాల్కనీలో కూర్చొంటానని అనుకున్నావా అని ఫైర్ అవుతుంది. చదివిన చదువుకు ఎవరూ జాబ్ ఇవ్వక ప్లాట్‌ఫాం మీద దుకాణం పెట్టుకున్నావు, అలా చెప్పుకోవడం నీకు చిన్నతనం కాబట్టి.. నేను ఎవరి దగ్గరా పనిచేయనని డైలాగులు చెబుతున్నావు. గంతకు తగ్గ బొంత అన్నట్లు ఆ ఫిఫ్త్ క్లాస్ దీపకి ఈ పొగరుబోతు తోడు అయ్యాడు. ఏదో నాలుగు భోజనాలు అమ్మేసరికి, నాలుగు డబ్బులు కనిపించే సరికి సూపర్‌స్టార్‌లా ఫోజులు కొడుతున్నావు . మీరంతా పిల్ల బచ్చాలు, నేను ఈ బిజినెస్‌‌ని పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ గెలవడాలు, ఓడిపోవడాలు ఇవన్నీ ఫార్మాలిటీకే, ఎప్పటికైనా శివన్నారాయణ గారికి యావదాస్తికి ఏకైక వారసురాలు ఈ జ్యోత్స్నే అంటుంది.

సుమారుగా ఎంత ఉంటుందని సూరజ్ అడగ్గా.. నెంబర్ చెబితే కళ్లు తిరిగి కింద పడిపోతావని అంటుంది జ్యోత్స్న. 500 కోట్లు పైనే ఉంటుందని చెబుతుంది. మీ తాతయ్య గారి ఆస్తి కాదు.. నీకంటూ సొంతంగా ఎంత ఉంటుందని అడుగుతాడు సూరజ్. మా తాతది అంటే నాదే కదా? నా పెళ్లి అవ్వగానే ఈ ఆస్తి మొత్తం మా డాడీ నా పేరు మీరు రాస్తాడని చెబుతుంది జ్యోత్స్న. నీలాంటి నెపోకిడ్స్ అంతా తాతలు, తండ్రులు సంపాదించే ఆస్తులకు, గౌరవాలకు కష్టపడకుండా వారసులు అయిపోతారు అంటాడు సూరజ్. కానీ నీలాంటి వాడు మాత్రం మా లాంటి వాళ్ల మీద పడి ఏడస్తుంటాడని ఫైర్ అవుతుంది జ్యోత్స్న.

దీపని ఓడించేది నేనే అని జ్యోత్స్న చెప్పగా.. అది అంత ఈజీ కాదని చెబుతాడు సూరజ్. నేను ఒక గొప్ప ఇంట్లో పుట్టాను, అదే నా మొదటి విజయమని చెబుతుంది జ్యోత్స్న. మీ తాతగారు కూడా ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లోనే పుట్టారని చెబుతాడు సూరజ్. దీపగారు నిజాయితీ గల మనిషి, నీలాగా తలుపులకు గోళ్లాలు పెట్టాడం.. పాలల్లో మత్తుమందు కలిపి మనుషుల్ని గెలవాలని అనుకోరు, సామర్ధ్యంతోనే గెలుస్తారని అంటాడు సూరజ్. అలాగే జ్యోత్స్న అందం గురించి పొగుడుతూ ఉండటంతో ఆమె రగిలిపోతుంది.

దీపని మోసం చేసినవాడి మీద పోలీస్ కంప్లయంట్ ఇవ్వాల్సిందని అంటుంది కాంచన. మోసం చేసిన మనవరాలిని ఎందుకు శిక్షించడో అడుగుతాను మా నాన్నకి ఫోన్ చేయమని చెబుతుంది. దానికి తప్ప నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఎవరికుందని ప్రశ్నిస్తుంది కాంచన. బిర్యానీలో బొద్దింకలు వేయించింది ఎవరు? ఈ పని కూడా అదే చేయించి ఉంటుందని కాంచన అనుమానిస్తుంది. ఫేక్ చెక్ ఇష్యూ జ్యోత్స్న పనా? లేక మాది అనుమానమా? జ్యోత్స్న చేయకపోతే ఈ అవసరం ఎవరికుందని కార్తీక్ అనుమానిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X