Karthika Deepam 2 June 24th: బాలరాజును పట్టుకున్న కార్తీక్.. జ్యోత్స్నని వదలొద్దంటూ సుమిత్ర శివతాండవం
Photo Courtesy: JioHotstar
దీప పెట్టిన గోల్డ్ కాయిన్ స్కీమ్ బాగా వర్కవుట్ కావడంతో గెలిచిన వారికి గోల్డ్ కాయిన్స్‌ని శివన్నారాయణ చేతుల మీదుగా ఇప్పిస్తారు సూరజ్, కార్తీక్. మీరందరూ నా పరువు నిలబెట్టడంతో పాటు కంపెనీకి లాభాలు తీసుకొచ్చారని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. నష్టం రావడం కంటే మోసపోవడం భయంకరమైన శిక్ష. అందుకే మీ మీద అరిచాను, మీ సమర్ధతను ప్రశ్నించానని చెబుతాడు పెద్దాయన. దీప పోటీలో గెలవడం, భోజనాలు మొత్తం సేల్ అయిపోవడంతో జ్యోత్స్న తలపట్టుకుని కూర్చొంటుంది. ఇంతలో సూరజ్ వచ్చి కాఫీ కప్పు ఇచ్చి.. గతంలో జ్యోత్స్న తనని ఎలా హేళన చేసిందో అలాగే మాట్లాడి రెచ్చగొడతాడు.
పోటీలో గెలిచిన దీపకి దిష్టి తీస్తుంది కాంచన. ఇంతలో సుమిత్ర ఫోన్ చేసి దీపకి కంగ్రాట్స్ చెబుతుంది. భోజనం చేశాక అటు ఇటూ వాకింగ్ చేస్తున్న సూరజ్ దగ్గరికి వెళ్లి నీకు, దీపకి టైం దగ్గరపడింది, పోటీలో గెలిచేది నేనే, సీఈవో అయ్యేది నేనే అని అంటుంది. ఆ మాటలు విన్న సూరజ్.. దీప గారు నిజాయితీతో కష్టపడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా విజయం ఆమెదేనని అంటాడు. బిర్యానీలో బొద్దింక వేయించినట్లు ఈ ఫేక్ ఆర్డర్ కూడా జ్యోత్స్న పనే అని కాంచన అనడంతో కార్తీక్‌కి అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 24వ తేదీ 705వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీపకి ఫేక్ చెక్ ఇచ్చింది ఎవరు? ఆ వైరా గాడా? లేక దక్షిణామూర్తా అనేది తెలుసుకోవాలని కాంచన రగిలిపోతుంది. నీ అంత కోపం మాకు కూడా ఉంది. కానీ అంత టైం లేదు. వేస్ట్ అయిన ఫుడ్‌ని ఎలా సేల్ చేయాలా అని కూర్చొన్నాం. ఒక పక్క తాత తిడతాడు.. మరో పక్క ఫుడ్ వేస్ట్ అయిపోతుందన్న టెన్షన్ పడ్డామని కార్తీక్ చెప్పాడు. వాడి పాపాన వాడే పోతాడులే అని అనుకున్నా.. కానీ మనల్ని ఈజీగా మోసం చేయగలం అన్న ఆలోచన వచ్చిందంటే వాడికి మనం ఎంత లోకువగా కనపడుతున్నాం.. అలాంటి వాడిని వదిలేస్తామా అని కాంచన ప్రశ్నిస్తుంది.
పట్టుకోవడానికి ఆధారం కావాలి.. పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే పరువు పోతుందని తాత ఒప్పుకోడు. ఏం చేయాలో తాతనే అడుగుతానని చెబుతాడు కార్తీక్. అది నా మనసులో నుంచి పోవడం లేదని కాంచన చెప్పడంతో నీ అభిమాన సీరియల్ చూడమని కార్తీక్ ఫోన్ ఇస్తాడు. అందులో అచ్చం దీపకి చెక్ ఇచ్చిన బాలరాజు కనిపించడంతో కార్తీక్ షాక్ అవుతాడు. దాంతో ఉదయాన్నే బాలరాజు ఉన్న లోకేషన్‌కి వెళ్లి మీ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని మెచ్చుకుంటాడు. కార్తీక్‌ని చూసి మీరు ప్రొడ్యూసర్ కదా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారా అని అడుగుతాడు.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో నాకు హీరో కాకపోయినా సెకండ్ హీరో పాత్ర ఉంటే ఇవ్వమని అడుగుతాడు బాలరాజు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో హీరో నువ్వేనని కార్తీక్ బిల్డప్ ఇస్తాడు. అవసరమైతే హీరోయిన్‌ని బాంబే నుంచి తెప్పిస్తానని అంటాడు. అయితే నీకు అవకాశం ఇవ్వాలంటే లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి.. నేను చెప్పింది చెప్పినట్లు ఒకరి దగ్గరికి వెళ్లి యాక్ట్ చేయాలని అంటాడు కార్తీక్. అక్కడ కెమెరాలు, యాక్షన్, కట్‌లు ఉండవు.. పరిస్థితిని బట్టి నటిస్తూ వెళ్లాలని చెబుతాడు. నేను చెప్పిన ప్లేస్‌కి వచ్చి నటిస్తే చాలని కార్తీక్ అనడంతో బాలరాజు సరేనని అంటాడు.
ఉదయాన్నే జ్యోత్స్నని చూసి హాయ్ బంగారమని సూరజ్ పిలవడంతో ఆమె రగిలిపోతుంది. బంగారం విలువ, జ్యోత్స్న విలువ పెరుగుతూ వెళ్తుందని అంటాడు. నువ్వు నన్ను పొగిడినంత మాత్రాన నేను నిన్ను క్షమించను అంటుంది జ్యోత్స్న. నువ్వు నన్ను క్షమించినా దానిని నేను తీసుకోవాలి కదా అని సూరజ్ కౌంటర్ వేస్తాడు. యుద్ధాలన్నీ ఆడవాళ్ల కోసమే జరిగాయి. కానీ ఆ యుద్ధం చేసి ఆడవాళ్ల కోసం చచ్చినా పర్లేదని అంటాడు సూరజ్. అయితే నువ్వు తొందరలోనే పోతావని అంటుంది జ్యోత్స్న. నేను ఏ యుద్ధం చేయను, యుద్ధాన్ని జరిపిస్తాను.. నేను విలన్‌ని అంటాడు. హీరోయిన్ కోసం హీరో వస్తాడు.. అలాగే విలన్ కోసం విలనే వస్తాడని అంటుంది సూరజ్.
నువ్వు ఫ్యూచర్‌లో చాలా నష్టపోతావని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో కార్తీక్, దీపలు రావడంతో ఆఫీస్‌కి రాకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావని దీపపై మండిపడతాడు. మావయ్య ఫోన్ చేసి దీపని పిలిచాడని అంటాడు కార్తీక్. ఈరోజు ఈవినింగ్‌తో కంపెనీకి కాబోయే సీఈవో నేనే అని తెలిసిపోతుంది, ఆ తర్వాత దీప ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నా.. మేడం గారు మళ్లీ పాత డ్యూటీ చేసుకుంటారని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. దోసకాయ పచ్చడి చేసి, నువ్వుల ఉండలు చేసి మనుషుల్ని బుట్టలో వేసుకోవడం దీపకి బాగా అలవాటని నానామాటలు అంటుంది.
ఏ స్పెషల్స్ పెట్టి కస్టమర్స్‌ని దీప బుట్టలో వేసుకుందో.. నా బ్రాంచ్‌లో కూడా అవే స్పెషల్స్ ఉన్నాయి. నా బ్రాంచ్‌లో ఆర్డర్స్ కూడా ఆన్‌లైన్ హౌస్‌ఫుల్ అంటుంది జ్యోత్స్న. అందుకే నాకు జ్యోత్స్న గారి స్మార్ట్‌నెస్ నచ్చిందని అంటాడు సూరజ్. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. సంస్థ ఎదుగుల ముఖ్యమని సూరజ్ అంటాడు. మీ తాత కళ్లలో ఆనందానికి నువ్వే కారణమని జ్యోత్స్నతో అంటుంది పారు. మీ నలుగురిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది.. మీ నలుగురు మన జ్యోత్స్న రెస్టారెంట్‌కి ఊపిరి పోశారని మెచ్చుకుంటాడు శివన్నారాయణ.
సాయంత్రం తర్వాత కూడా నవ్వు నవ్వుతూ ఉండాలని దీపతో పారు అంటుంది. సాయంత్రం నువ్వు తీర్ధయాత్రలకు వెళ్తున్నావా అని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. మా పారు నాకు మంచి ఫ్రెండ్.. నేను ఎవరికీ చెప్పని విషయాలు మా పారుతో డిస్కస్ చేసుకుంటానని అంటాడు కార్తీక్. దీప, జ్యోత్స్న బ్రాంచ్‌లు లాభాల్లో ఈక్వెల్‌గా ఉన్నాయని చెబుతాడు శివన్నారాయణ. విన్నర్ మాత్రం మా జ్యోత్స్నేనని.. ఓడిపోయానని బాధపడొద్దని దీపతో అంటుంది పారు. రిజల్ట్స్ రాకుండా, ఛైర్మన్ గారు చెప్పకుండా ఈ పోటీలో దీప ఓడిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పావంటే మళ్లీ ఎక్కడైనా బొద్దింక పాకిందా అని పారుని ప్రశ్నిస్తాడు కార్తీక్.
ఎవరు గెలిచారో? ఎవరు ఓడిపోయారో తెలియాలో సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందేనని అంటాడు కార్తీక్. ఏ పోటీలో అయినా న్యాయంగా కష్టపడేవాళ్లే విజేతలు కావాలి.. వాళ్లకే గౌరవం దక్కాలని అంటుంది సుమిత్ర. లెక్కల్లో ఏదైనా తప్పున్నా, ప్రవర్తనలో అలాంటి తప్పున్నా అలాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని చెబుతుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. జ్యోత్స్న ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తావని కార్తీక్ అడగ్గా.. ఈ పోటీలో గెలవడానికి ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా వాళ్లు ఎవరైనా సరే ఇంట్లో అడుగుపెట్టనివ్వనని అంటుంది సుమిత్ర. తప్పు చేసేవాళ్లే కాదు.. తప్పుకు సహాయం చేసేవాళ్లు దోషులేనని సుమిత్ర చెబుతుంది.
నువ్వు చెప్పినట్లే విజేతను ప్రకటించే ముందు అన్ని కోణాలు పరిశీలించి సమర్ధులకే అధికారం కట్టబెడతాను, సుమిత్ర చెప్పినట్లు అలాంటి వారిని ఇంట్లో నుంచి వెళ్లగొడతానని చెబుతాడు శివన్నారాయణ. ఆఫీస్‌లు సీఈవో ఛాంబర్ క్లీన్ చేయమని ప్యూన్ నానికి చెబుతుంది జ్యోత్స్న. ఇంటి దగ్గరి నుంచి ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావని ప్రశ్నిస్తాడు సూరజ్. దీపకి హెల్ప్ చేయడం వల్ల నీకున్న అడ్వాంటేజ్ నీ ఫుడ్ బిజినెస్‌ని రెస్టారెంట్‌తో పాటు అమ్ముకోవడమే. దీప ఓడిపోతుంది కాబట్టి ఇక్కడ నీకు ఏ పని ఉండదు, నీ స్టాల్ నా రెస్టారెంట్‌లో ఉండేలా చేస్తాను, నేను సీఈవో అయ్యాక నీలాంటి వాడు నాకు అవసరమని అంటుంది జ్యోత్స్న. నాకు డబ్బులు అవసరం లేదు.. అలాగని డబ్బుల కోసం ఎవరి దగ్గరా పనిచేయనని తేల్చేస్తాడు సూరజ్. నువ్వొక కోటీశ్వరుడి మనవడివని, అనుకోగానే ఈయనగారి స్థాయి పెరిగిపోతుందా అని జ్యోత్స్న నానామాటలు అంటుంది. ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఆలోచించుకోమని చెబుతుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications