Karthika Deepam 2 June 25th: బాలరాజు వెనుక పారు.. జ్యోత్స్న కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సీఈవోగా దీప
Photo Courtesy: JioHotstar
దీపకి ఫేక్ చెక్ ఇచ్చింది ఎవరు? ఆ వైరాగాడా లేక దక్షిణామూర్తా అనేది తెలుసుకోవాలని కాంచన చెప్పడంతో కార్తీక్ కూడా దాని గురించే ఆలోచిస్తూ తన ఫోన్‌లో తల్లికి ఇష్టమైన సీరియల్ పెట్టిస్తాడు. అందులో ఉన్న నటుడు అచ్చం బాలరాజులా ఉండటంతో దొరికాడని సంబరపడిపోతాడు. నేరుగా సెట్‌కు వెళ్లి తనను తాను ప్రొడ్యూసర్‌గా పరిచయం చేసుకుని, తాను తీయబోయే సినిమాలో మీరే హీరో అని ఆఫర్ ఇస్తాడు. దాంతో బాలరాజు సంబరపడిపోతాడు. నేను చెప్పిన ఓ చిన్న లైన్‌ని లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలని, ఓ చోటికి రావాలని చెబుతాడు కార్తీక్.. దానికి బాలరాజు సరేనని అంటాడు.
ఉదయాన్నే ఆఫీస్‌కి రెడీ అవుతున్న సూరజ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఫ్యూచర్‌లో చాలా నష్టపోతావని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో కార్తీక్, దీపలు రావడంతో ఇంటికి రావొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని అడుగుతుంది. మా మావయ్య దోసకాయ పచ్చడి అడిగాడని వచ్చిందని చెబుతాడు కార్తీక్. దీప ఎలాగూ ఓడిపోబోతోంది.. గుండె రాయి చేసుకోమని ఆమె మీద సెటైర్లు వేస్తుంది పారు. ఏ పోటీలో అయినా న్యాయం జరగాలి, నిజాయితీగా గెలిచిన వాళ్లే విజేతలు కావాలని.. తప్పు చేస్తే ఎవరినీ క్షమించొద్దని శివన్నారాయణకి చెబుతుంది సుమిత్ర. తప్పు చేస్తే ఎవరినీ క్షమించనని, వాళ్లని ఇంటికి రానివ్వనని చెబుతుంది సుమిత్ర. ఆ మాటలతో జ్యోత్స్న, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 25వ తేదీ 706వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బోర్డ్ మీటింగ్ కోసం బోర్డ్ మెంబర్స్ అంతా వచ్చేస్తారు. సీఈవో ఎవరు అవుతారు అనుకుంటున్నారని కొందరు అనుకుంటూ ఉండగా.. జ్యోత్స్నగారే అవుతారని ఆమె మనుషులు చెప్పుకుంటారు. బోర్డ్ మీటింగ్ కోసం శివన్నారాయణ వస్తుండగా.. మీకొక వర్థమాన నటుడిని పరిచయం చేస్తానని కార్తీక్ చెబుతాడు. ఇంతలో ఆఫీస్‌కి పారిజాతం రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. పోటీ గురించి లైవ్‌లో చూద్దామని వచ్చానని అంటుంది పారు. కార్తీక్‌ను చూసిన బాలరాజు.. ఇప్పటి వరకు డైరెక్టర్ రాలేదు, నాకు సీన్ చెప్పలేదు.. కనీసం ప్రొడక్షన్ బాయ్ వచ్చి కుర్చీ వేసి కాఫీ కూడా ఇవ్వలేదని మండిపడతాడు.
ఇది సీరియల్ షూటింగ్ కాదు.. లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి, క్యారెక్టర్ల మాటలకు తగినట్లుగా నటిస్తూ వెళ్లాలి, సీక్రెట్‌గా రికార్డ్ చేస్తామని చెబుతాడు కార్తీక్. అయితే అతని కళ్లకు గంతలు కట్టి.. మీరు కోటీశ్వరుడు, ప్లేటు భోజనం 2 వేలు, పది లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని సీన్ చెబుతాడు. ఇలాంటి సీన్ ఈ మధ్య చేశానని అంటాడు బాలరాజు. ఇంతలో బాలరాజును తీసుకుని కార్తీక్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ యాక్షన్ చెప్పగానే గతంలో ఏం జరిగిందో అదే చేసి చూపిస్తూ చెక్ ఇవ్వబోతుండగా కోపంతో రగిలిపోయిన శివన్నారాయణ.. బాలరాజును లాగిపెట్టి కొడతాడు.
కిందపడి లేచిన బాలరాజు.. పారుని చూసి నమస్తే చెప్పి, మీరు ఇక్కడేందుకు ఉన్నారరని అడగటంతో ఈవిడ నీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నువ్వు నిజం చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ బెదిరించడంతో నాతో ఇదంతా చేయించింది ఈ మేడం గారేనని పారు పేరు చెప్పడంతో జ్యోత్స్న, పారులకు ముచ్చెమటలు పడతాయి. నేను జూనియర్ ఆర్టిస్ట్‌ని, క్యారెక్టర్ ఉందని చెప్పి నాతో ఫుడ్ ఆర్డర్ ఇప్పించారు.. రెమ్యునరేషన్ కింద మంచి పేమెంట్ ఇచ్చారని చెప్పడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. జరిగినదంతా నీకు అర్ధమైంది కదా అని కార్తీక్ చెప్పడంతో పోలీసులకు ఫోన్ చేయమని చెబుతాడు పెద్దాయన.
దాంతో భయపడిపోయిన బాలరాజు.. శివన్నారాయణ కాళ్ల మీద పడి డబ్బులకు కక్కుర్తిపడి ఇదంతా చేశాను, అదంతా యాక్టింగ్ అని చెబితే నమ్మేశాను. నాకు చదువుకునే పిల్లలున్నారని క్షమించాలని బతిమలాడతాడు. కళాకారులంటే సాక్షాత్తూ ఈశ్వరుని స్వరూపులు, ఒకప్పుడు కళాకారులను పూజించేవారు. నీలాంటి వారి వల్ల ఇప్పుడు కళాకారుల విలువ చిల్లర కాసులా తయారైంది. నువ్వు దిగజారిపోకు, కళను దిగజారిపోనివ్వొద్దు.. ఇక మీదట కెమెరా ముందు మాత్రమే నటించు, కెమెరా వెనుక కాదని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.
తప్పు చేసినవారి కంటే తప్పు చేయించిన వారే అసలైన దోషులు.. నేను ఇప్పుడు శిక్షించాల్సింది పారిజాతాన్ని అని అంటాడు శివన్నారాయణ. తాత గ్రానీనీ ఏం అనుకుండా ఉండాలంటే నేనే రివర్స్ అవ్వాలని అనుకుంటుంది జ్యోత్స్న. నీకు దీప మీద ఏదైనా పర్సనల్‌గా ఉంటే అది ఇంటి దగ్గరే చూసుకోవాలి కదా అని ప్లేట్ తిప్పేస్తుంది జ్యోత్స్న. నువ్వు చేసిన పని దీప జీవితానికి ఎంత ఎఫెక్ట్ అయ్యేదో? ఫుడ్ సేల్ అవ్వకపోయుంటే డబ్బు మొత్తం దీప కట్టాల్సి వచ్చేది, కనీసం తాత గురించైనా ఆలోచించాలి కదా అంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్‌ను మేం నెంబర్ వన్‌గా చేయాలని కష్టపడుతుంటే నువ్వు ఇంత తేలికగా మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతావా అని అంటుంది.
పగ మా ఆవిడ మీదే కాదు తాత మీద కూడా గట్టిగానే ఉన్నట్లుందని అంటాడు కార్తీక్. నీకు శిక్ష పడాల్సిందే, దానికంటే ముందే మనం బోర్డ్ మీటింగ్‌కి వెళ్లాలి. ఇంటి దగ్గర తేల్చుకుందామని చెబుతుంది. పారుకి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారని అడుగుతాడు కార్తీక్. నేనేం సపోర్ట్ చేయడం లేదు.. ఒకవేళ బాలరాజు ఆర్డర్ నేను తీసుకుని ఉంటే మునిగిపోయేదానిని అంటుంది జ్యోత్స్న. ఆ అవసరం మీకు రాదు.. ఎందుకంటే మీరు బాలరాజు ఆర్డర్ తీసుకోరు, 4 వేల రూపాయలకు ఓకే అన్నా మీరు తీసుకోరు. ఎందుకంటే బాలరాజును పారు చేత పురమాయించిందే నువ్వు కాబట్టి అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
దీపని సీఈవోని చేయడానికి నింద నా మీద వేస్తున్నావా? ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని అంటుంది జ్యోత్స్న. ఈ రోజుల్లో నోటితో చెప్పే మాటలకు విలువ లేదని నాకు తెలుసు.. అందుకే మీ కోసం కాల్ రికార్డింగ్ తీసుకొచ్చానని వినిపిస్తాడు కార్తీక్. అందులో జ్యోత్స్న - పారులు మాట్లాడుకున్న మాటలు ఉండటంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. మీరు నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను ఈ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నానని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వాళ్లు తప్పు చేస్తే నువ్వెందుకు వెళ్లిపోతున్నావు అని దీప అడగ్గా.. నేనే కాదు మీరు కూడా వెళ్లిపోండని చెబుతాడు సూరజ్. ఇలాంటి మనుషులతో మనం పోటీపడలం.. గెలుపు కోసం అడ్డదారులు తొక్కేవాళ్లతో ఎవరూ పోటీపడలేరు అని సూరజ్ అనడంతో పారు- జ్యోత్స్నలు రగిలిపోతారు.
ఈ సంస్థ పరువుపోయే పని.. ఈ సంస్థ ఛైర్మన్ గారి మనవరాలే చేస్తున్నారంటే భరించడం చాలా కష్టంగా ఉంది. పెద్దవాళ్లే దగ్గరుండి చేయిస్తున్నారు.. ఎవరినీ వేలెత్తి నిందించే అర్హత లేనివాడిని, అలాగని తప్పుచేసిన వాళ్లతో కలిసి పనిచేయలేను. నాకు పనే దైవం.. కానీ అవతలి వాళ్లకి పని ఒక ఆట. అది కూడా నిజాయితీ లేని ఆట.. ఇలాంటి వాళ్లు ఉండాల్సిన చోటు ఇది కాదు మనిద్దరం వెళ్లిపోదామని చెబుతాడు సూరజ్. జ్యోత్స్న తప్పు చేయాలనుకుంటే పారిజాతం అండగా నిలబడింది.. నా దృష్టిలో ఇద్దరూ నేరస్తులేనని అంటాడు శివన్నారాయణ. ఇందులో గ్రానీ తప్పేం లేదు.. నేను చెబితేనే చేసిందని జ్యోత్స్న చెబుతుంది.
ఇక్కడేం జరిగిందన్న దానిపై బోర్డ్ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అంటాడు శివన్నారాయణ. కాబోయే సీఈవో ఎవరో చెబితే విష్ చేసి వెళ్లిపోతామని బోర్డ్ మెంబర్స్ చెబుతారు. ఇప్పుడు తాత ఖచ్చితంగా దీప పేరే చెబుతారు.. ఇప్పుడు తాత మనసు గెలవాలంటే నేనొక పనిచేయాలని అనుకుని సీఈవోని నేను అనౌన్స్ చేస్తానని అంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి సీఈవో అంటే కొన్ని అర్హతలుండాలి, అధికారాలు అందుకునేది అర్హతలు ఉన్నవారే. ఈ సీఈవో అనే అధికారాన్ని అందుకునే మనిషి దీప అంటుంది జ్యోత్స్న. చదివింది ఫిఫ్త్ క్లాస్ అయినా తన తెలివితేటలు, ఓర్పుతో అధికారాన్ని అందుకునే అర్హతను సంపాదించుకుందని చెబుతుంది.
దీప గారు విన్నర్ అని మీరు అనౌన్స్ చేయడం ఏంటీ? అంటే మీ గెలుపుని త్యాగం చేస్తున్నారా అని ఒక బోర్డ్ మెంబర్ అడుగుతాడు. జ్యోత్స్న వద్దు అనుకోవడం వల్లే దీప గెలిచిందని ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్న గారు బాగా చదువుకున్నారు, పైగా మీ మనవరాలు అంటాడు ఒక బోర్డ్ మెంబర్. ఆస్తులకు వారసులు ఉంటారు కానీ, అర్హతలకు వారసులు ఉండరు, విజేత ఎవరో లెక్క ప్రకారమే చూద్దామని చెబుతాడు పెద్దాయన. జ్యోత్స్నకి అప్పగించిన బ్రాంచ్ 44 శాతం గ్రోత్ సాధించింది.. దీపకి అప్పగించిన బ్రాంచ్ 85 శాతం గ్రోత్ సాధించిందని శివన్నారాయణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications