Karthika Deepam 2 June 26th: దీపని సీఈవోగా ప్రకటించిన శివన్నారాయణ.. పారు, జ్యోత్స్నలకు పనిష్మెంట్

Photo Courtesy: JioHotstar

బోర్డ్ మీటింగ్ కోసం వెళ్తున్న శివన్నారాయణకి మీకొక వర్ధమాన నటుడిని పరిచయం చేస్తానని చెబుతాడు కార్తీక్. బాలరాజు దగ్గరికి వెళ్లి నువ్వొక లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలని కళ్లకు గంతలు కట్టి దీపతో ఎలా మాట్లాడాడో అచ్చం అలాగే చెబుతాడు కార్తీక్. బాలరాజును పెద్దాయన దగ్గరికి తీసుకెళ్లగా వాడిని చూసి జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నాకు 1000 భోజనాలు కావాలి, ప్లేట్ 2 వేలు ఉండాలి.. 10 లక్షల రూపాయల అడ్వాన్స్‌కి చెక్ అని బాలరాజు చెప్పగా కోపంతో లాగిపెట్టి కొడతాడు శివన్నారాయణ. వెంటనే పోలీసులకు ఫోన్ చేయమనగా బాలరాజు వెళ్లి కాళ్లపై పడటంతో క్షమించి వదిలేస్తాడు పెద్దాయన. అసలు నీతో ఈ పని ఎవరు చేయించారని శివన్నారాయణ అడగ్గా.. పారిజాతమని బాలరాజు చెబుతాడు. దాంతో విషయాన్ని డైవర్ట్ చేయాలని పారు మీద కావాలని కోప్పడుతుంది జ్యోత్స్న.

నేను, దీప గారు కంపెనీ నుంచి వెళ్లిపోతామని ఇలాంటి వాళ్లతో మేం పోటీపడలేమని సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. తప్పు చేసినవాళ్లే ఆఫీసును వదిలి వెళ్లిపోతారని అంటాడు శివన్నారాయణ. ఇంతలో బోర్డ్ మీటింగ్‌కి టైం అవ్వడంతో జ్యోత్స్న రెస్టారెంట్‌కి కాబోయే సీఈవో ఎవరంటే అని పెద్దాయన చెబుతుండగా.. జ్యోత్స్న లేచి దీప అని అనౌన్స్ చేస్తుంది. మీరు సీఈవో పోస్ట్ త్యాగం చేస్తున్నారా అని బోర్డ్ మెంబర్స్ అడగ్గా ఇది త్యాగాలతో కాదు.. పోటీలో లెక్కల ప్రకారమే చూద్దామని చెబుతాడు పెద్దాయన. జ్యోత్స్నకి ఇచ్చిన బ్రాంచ్ 40 శాతం గ్రోత్, దీపకి అప్పగించిన బ్రాంచ్ 80 శాతం గ్రోత్ సాధించాయని చెబుతాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 26వ తేదీ 707వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 707 June 26th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప ఈ కంపెనీకి కాబోయే సీఈవో అని శివన్నారాయణ ప్రకటించడంతో జ్యోత్స్న, పారులు రగిలిపోతారు. ఎవరో వదిలేసుకోవడం వల్ల దీప విన్నర్ కాలేదు, ఇది తను పోరాడి గెలుచుకున్న విజయమని అంటాడు. దీపకి అందరూ కంగ్రాట్స్ చెబుతుండగా పారిజాతం పారిపోతుంది. దాంతో పారు గొంతు పట్టుకుని దీపని సీఈవోగా నా నోటితోనే అనౌన్స్ చేసి చచ్చిపోయాను. నువ్వు ఇంకా దీపని నీ మనవరాలు అని నమ్ముతున్నావు కదా అని ప్రశ్నిస్తుంది. నీ మనవరాలిని సీఈవో చేయాలని బావతో కలిసి నన్ను మోసం చేశావు కదా అని మండిపడుతుంది. నువ్వే నా మనవరాలివి, ఎవరో గెలవాలని నేనెందుకు కోరుకుంటానని చెబుతుంది పారు.

అయితే ఫోన్ మాట్లాడుతూ బావకి ఎందుకు దొరికిపోయావని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అసలు ఫోన్ మాట్లాడించిందే వాడు, వాళ్లిద్దరికీ మనం దొరికిపోయాం. ఒక లైవ్ ఎవిడెన్స్ కోసం నన్ను వాడుకున్నాడు, నేను నీ పార్టీయే అంటుంది పారు. పార్టీ మార్చేశావా అని కార్తీక్ అడగ్గా.. పారు వెళ్లి తలబాదుకుంటుంది. నా ఫోటోని గోడ మీదకి ఎక్కించేలా ఉన్నావని పారు భయపడగా.. ఆ పని తాత చేస్తాడని కార్తీక్ ఇంకా భయపెడతాడు. మీరిద్దరూ తోడుదొంగలని అర్ధమైపోయాక మిమ్మల్ని వదిలిపెట్టను. నా భార్యను సీఈవో కాకుండా ఆపాలని చూశారు, ఇప్పుడు ఎదగనీయకుండా చేయాలని అనుకుంటున్నారు. అది మీ వల్ల కాదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.

బావకి నీతో ఇక పనిలేదు.. వాళ్లు చేయాలనుకున్న పనిని ఆ సూరజ్‌ని అడ్డుపెట్టుకుని చేసేశారు. వాళ్లంతా సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు, మనం కదా పార్టిసిపేట్ చేద్దామని అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. నిజాయితీగా పనిచేసేవాళ్లు ఎక్కడైనా గెలుస్తారని అంటాడు శివన్నారాయణ. ధర్మ యుద్ధంలో గొప్పగొప్ప యోధులంతా నమ్మినవాళ్లు గోతులు తీయడం వల్లే ప్రాణాలు వదిలేశారని అంటాడు సూరజ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? దీప గెలిచింది అందరూ సంతోషంగా ఉన్నాం.. కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని వదిలేయాలని అంటుంది పారిజాతం.

పొరపాటుని సరిదిద్దే నాయకుడు ఉన్నా కొన్నిసార్లు న్యాయం జరగదు, తప్పు చేసినవాళ్లు దొరికాక కూడా వదిలేస్తే ఇంకా పాపం అవుతుందని పెద్దాయనని రెచ్చగొడతాడు శివన్నారాయణ. దీప సీఈవో అయ్యిందంటే ఇక నీ పని అయిపోయినట్లే కదా? నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని మండిపడుతుంది పారు. బ్రదర్ మాట్లాడేది మీరిద్దరూ చేసిన తప్పులకు శిక్ష ఉండదా అని, మా తాత గురించి నువ్వేం అనుకుంటున్నావు బ్రదర్.. మోసం చేసేవాళ్ల నీడని కూడా ఇంటి మీద పడనివ్వడు, నష్టం తీవ్రతను బట్టి ఉంటుందని చెబుతాడు కార్తీక్. మన ఆఫీసులో జరిగింది చిన్న తప్పు కాదు.. మనమంతా ఉండాలా? లేదా అని నిర్ణయించేంత పెద్ద తప్పని అంటాడు.

ఆ మాటలు విన్న పెద్దాయన.. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. దీప కంపెనీకి సీఈవోగా ఉంటుంది, సూరజ్ దీపకి సహాయంగా ఉంటాడు. ఈ దోషుల గురించి ఇంట్లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెబుతాడు శివన్నారాయణ. దాంతో సుమిత్ర మాటలు గుర్తొచ్చి జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. దాంతో పారు వెళ్లి పెద్దాయన కాళ్ల మీద పడి ఈ విషయం సుమిత్రకు చెప్పొద్దని బ్రతిమలాడుతుంది. నా కాళ్లు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు.. ఒక భర్తగా, ఒక తాతగా, ఇంటి యజమానిగా, ఒక ఛైర్మన్‌గా తలదించుకున్న రోజున నేను వద్దని గెంటేసిన దీప, కార్తీక్‌.. ఈ ఇంటితో సంబంధం లేని సూరజ్ నా గౌరవం కోసం నిలబడ్డారు. నా వాళ్లు అని మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటే నాకిచ్చే మర్యాద ఇదేనా? మిమ్మల్ని ఎన్నిసార్లు దండించినా మీలో మాత్రం ఏ మార్పు రాలేదు. మిమ్మల్ని మార్చగలిగింది నా కోడలు మాత్రమే.. సుమిత్ర ముందే మిమ్మల్ని నిలబెడతాను, నిర్ణయం తనదేనని తేల్చేస్తాడు శివన్నారాయణ.

మమ్మీకి చెప్పొద్దని జ్యోత్స్న కూడా అడుగుతుంది. దీప కూడా ఇంట్లో చెప్పొద్దని పెద్దాయనని బతిమలాడుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటాడో తాతని తీసుకోని, తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. మనం తప్పు చేసినప్పుడు ఇంకా రెచ్చగొట్టారు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, తాత నిర్ణయమే మన నిర్ణయమని చెబుతాడు కార్తీక్. అసలు ఈ భయం ఎందుకు ఉండటం లేదు, పోటీ నిజాయితీగా జరగడం లేదు.. కఠినంగా శిక్షించాలని సుమిత్ర ముందే చెప్పింది, ఈ విషయం ఆమెకు తెలిస్తే మిమ్మల్ని క్షమించదు. పట్టుదలకు వస్తే కన్నతండ్రినే వదులుకున్న సుమిత్ర.. కన్నకూతురు ఒక లెక్క కాదు, రేపు దీప సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాక నీ గురించి నిర్ణయం తీసుకుంటానని చెబుతాడు పెద్దాయన. రేపటికి వాయిదా వేశాడంటే నా విషయంలో ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడని భయపడుతుంది జ్యోత్స్న. పారిజాతం గురించి ఇంటి దగ్గర మాట్లాడతానని చెబుతాడు. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయల్దేరతానని సూరజ్ అంటాడు. నువ్వు ఈ సంస్థలో ఉంటావు, ఉండాల్సిందేనని తేల్చేస్తాడు శివన్నారాయణ.

ఇంటి దగ్గర సుమిత్ర ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. ఒక అమ్మగా నా కూతురు గెలవాలని కోరుకుంటాను, కానీ ఒక మనిషిగా నిజాయితీ గెలవాలని నేను కోరుకుంటాను. వీళ్లద్దరి ముఖాలు ఇలా ఉన్నాయేంటీ అని అనుమానిస్తుంది సుమిత్ర. నేను ఈ పోటీని స్పోర్టీవ్‌గానే తీసుకున్నానని అంటుంది జ్యోత్స్న. పెద్ద మేడం గారు అందరి మనసులు గెలుచుకున్నారు. అంతా అయిపోయింది పారుకి పనిష్మెంట్ ఏంటో చెబితే మేం వెళ్లిపోతామని కార్తీక్ అనడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. అత్తయ్య గారికి శిక్ష ఏంటీ అని సుమిత్ర అడుగుతుండగా దశరథ ఆమెను పక్కకి తీసుకెళ్తాడు.

సుమిత్రకి తెలిసేలా చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నావని మండిపడుతుంది పారు. రేపు నిర్ణయం తీసుకునేది పెద్ద మేడం గురించి, నీకు మాత్రం ఈరోజే శిక్ష పడాలని చెబుతాడు కార్తీక్. తనకి ఎలాంటి శిక్ష వేస్తే న్యాయం జరుగుతుందో మీరే చెప్పమని కార్తీక్‌ని అడుగుతాడు పెద్దాయన. నేను దీపని ఎన్ని మాటలు అన్నానో నాకు తెలుసు, ఆ ఫుడ్‌ని సేల్ చేయడానికి దీప, సూరజ్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, కడుపుతో ఉన్న భార్య కష్టపడుతుంటే కార్తీక్ ఎంత నష్టపోయాడో నాకు తెలుసు. అందుకే ఒకరు బాధపడుతుంటే ఎలా ఉంటుందో ఆ నొప్పి మీకు కూడా తెలియాలని అంటాడు శివన్నారాయణ.

అయితే ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పమని కార్తీక్‌ని అడుగుతాడు పెద్దాయన. ఎలాంటి తీర్పు వచ్చినా పర్లేదు కానీ నా భార్యకు న్యాయం జరగాలని అంటాడు కార్తీక్. నెల రోజుల పాటు పారిజాతం దీక్ష చేయాలి, పట్టుచీరలు కట్టుకోవడం మానేసి నేత చీరలు కట్టుకోవాలి, నగలు వేసుకోకూడదు, ఒంటిపూట భోజనం చేయాలి, నేల మీద పడుకోవాలి అని శిక్ష వేస్తాడు కార్తీక్. ఒక్కరోజు తప్పినా మరో వారం శిక్ష పెరుగుతుంది. ఇవన్నీ చేయించే బాధ్యత నీదేనని అంటాడు శివన్నారాయణ. గ్రానీకి ఇలాంటి శిక్ష వేస్తే ఇక నా పరిస్ధితి ఏంటోనని జ్యోత్స్న వణికిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X