Karthika Deepam 2 June 27th: జ్యోత్స్నపై సుమిత్రలో అనుమానం.. సూరజ్‌ని గెంటేసేలా పారు, జ్యోత్స్న కుట్ర

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న రెస్టారెంట్ సీఈవోగా దీపను శివన్నారాయణ అనౌన్స్ చేయడంతో పారు, జ్యోత్స్నలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. చేయాల్సినదంతా చేసి ఎక్కడికి వెళ్లిపోతున్నావని పారు పీక పట్టుకుంటుంది జ్యోత్స్న. బావ నువ్వు కలిసి నన్ను ఓడించారు, దీపని నా నోటితోనే సీఈవోగా అనౌన్స్ చేసేలా చేశారని మండిపడుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి పార్టీ మార్చేశావా అని సెటైర్లు వేయడంతో పారు షాక్ అవుతుంది. మీ ఇద్దరినీ వదిలిపెట్టనను తాతని పిలుస్తాడు. ఇంతలో శివన్నారాయణ, దీప, సూరజ్‌లు అక్కడికి వస్తారు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాల్సిందేనని శివన్నారాయణని రెచ్చగొడతాడు సూరజ్. నీ పని దీపని సీఈవోని చేయడమే ఇక నువ్వు వెళ్లిపోవచ్చని పారు మండిపడుతుంది.

నేను వచ్చిన పని అయిపోయింది ఇక నేను బయల్దేరతానని సూరజ్ అనగా నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు.. నువ్వు ఈ కంపెనీలోనే దీపతో పాటే ఉంటావు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు.. నేను మిమ్మల్ని దండించి అలసిపోయాను, ఇక నా కోడలే చూసుకుంటుందని అంటాడు శివన్నారాయణ. మమ్మీతో ఈ విషయం చెప్పొద్దని జ్యోత్స్న బతిమలాడటంతో సరేనని ఇంటికి వెళ్తారు. సీఈవోగా గెలిచిన వెంటనే సుమిత్ర ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. పోటీలో దీప గెలవకుండా చేసినందుకు గాను నెలరోజుల పాటు పారు నేత చీరలు కట్టుకుని, నేల మీద పడుకోవాలని ఈ బాధ్యతను కార్తీక్‌కి అప్పగిస్తాడు. దాంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 27వ తేదీ 708వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 708 June 27th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

తాత విధించిన శిక్షను వెంటనే అమల్లోకి తీసుకొస్తాడు కార్తీక్. పారిజాతంను పనిమనిషి గెటప్‌లో చూసి అంతా షాక్ అవుతారు. అందరూ నిద్రపోయాక గదిలో ఏసీ వేసుకుని పడుకుంటుందేమో, ఆన్‌లైన్‌లో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఆర్డర్ చేసుకుని తినేస్తుందేమో.. పారుకు గది ఎందుకు? ఏసీ ఎందుకు అని ప్రశ్నిస్తాడు కార్తీక్. దానికి నా దగ్గర పరిష్కారం ఉందని చెబుతాడు శివన్నారాయణ. పారు రూమ్‌‌కి పెద్దాయన సీల్ వేస్తాడు. మళ్లీ మీ తాత తన చేత్తో ఈ గది తలుపులు తెరిచే వరకు నేను ఈ కురులు ముడి వేయనని మంగమ్మ శపథం చేస్తుంది పారిజాతం. ఇప్పటికే నిన్ను ఈ గెటప్‌లో చూడలేకపోతున్నాం.. ఇప్పుడు జుట్టు విరబోసుకుని తిరిగితే నీకు ఏదో గాలి సోకిందని భూత వైద్యుడిని పిలిపిస్తారని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. రేపు ఆఫీస్‌లో కలుద్దామని జ్యోత్స్నకి చెబుతాడు కార్తీక్. వస్తేనే కదా కలవడానికి అని జ్యోత్స్న అంటుంది. నన్నే గతంలోకి తీసుకెళ్లారు, దానిని భవిష్యత్‌లోకి తీసుకెళ్తావని కార్తీక్‌తో అంటుంది పారిజాతం.

దీప సీఈవో అయినందుకు నాకు సంతోషంగా లేదని చెబుతుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇది కోడలు, అది మేనకోడలు. దీపంటే జ్యోత్స్నకి చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు లాగా ఉండేవాళ్లు. ఎప్పుడైతే దీప మెడలో నువ్వు తాళి కట్టావో ఆ క్షణం జ్యోత్స్నకి దీప శత్రువు అయిపోయింది. అసలు దీపని నీ భార్యగానే ఉండనివ్వకూడదని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దీప తట్టుకుని నిలబడింది. నీ కోసం పోటీపడిన వీరిద్దరూ ఇప్పుడు సీఈవో పోస్ట్‌‌కి కూడా పోటీపడ్డారు, ఈసారి కూడా దీపే గెలిచింది. ఇప్పుడు కూడా దీపని గెలవనివ్వకూడదని రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ దీప తట్టుకుని నిలబడి గెలిచింది. సీఈవో పదవి కోసం సొంత కంపెనీని ఇన్ని కష్టాల్లో పడేసిన జ్యోత్స్న ఆ పదవిలో దీపని ఉండనిస్తుందా? అని ప్రశ్నిస్తుంది కాంచన.

నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివి, ఇది రోజు రోజుకు తగ్గేది కాదు.. పెరిగేది. ఏం జరిగినా నష్టపోయేది మనమే. మిగిలిపోయిన భోజనాలు ఏదో చేయగలిగావు కానీ, కడుపుకి ఏమైనా అయితే ఏం చేయలేవని అంటుంది కాంచన. దీపకి కడుపుతో ఉన్న బిడ్డకి ఏం కాదు... దీపని ఆఫీస్‌కి వెళ్లకుండా చేయాలని అనుకున్నాను, కానీ దీపే సీఈవో అయ్యింది. నా కొడుకు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే నువ్వు గౌరవంగా బాధ్యతలు తీసుకోబోతున్నావని మెచ్చుకుంటుంది కాంచన. ఇంతలో శౌర్య వచ్చి.. మా అమ్మ సీఈవో అని మా ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను అంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్‌లో సీఈవోలంతా మన ఇంటి నుంచే అవుతున్నారు. ముందు నువ్వు, తర్వాత మీ నాన్న.. ఇప్పుడు నీ భార్య అయ్యారని చెబుతుంది కాంచన. తర్వాత నేను కూడా సీఈవో అవుతానని అంటుంది శౌర్య.

జ్యోత్స్న తప్పు చేసింది కదా మరి మా వదిన ఏం అనలేదా? అని కాంచన ప్రశ్నిస్తుంది. అత్తకి చెప్పొద్దని పారు తాత కాళ్లు పట్టుకుంది, అందుకే ఈ విషయాలు మా అత్తకి తెలియవు అంటాడు కార్తీక్. తెలిస్తే మా వదిన ఊరుకోదు, తెలియకుండా ఎన్నాళ్లు దాస్తారు.. మీ ప్రవర్తన చూసైనా అనుమానం వస్తుంది. అప్పుడు మా అన్నయ్యని, మా నాన్నని అడుగుతుంది. మరోవైపు.. రాత్రి శివన్నారాయణ, దశరథలతో సుమిత్ర మాట్లాడుతుంది. నా కూతురు ఏదైనా తప్పు చేసిందా అని ప్రశ్నిస్తుంది. గెలిచినందుకు దీప సంతోషంగా ఉంది, కానీ జ్యోత్స్న ఓడిపోయిన దానికంటే దీప గెలిచినందుకే ఎక్కువ బాధపడినట్లుగా అనిపించింది. అది బాధ కూడా కాదు.. తను అనుకున్నది జరగలేదన్న కోపం అని అంటుంది సుమిత్ర. అత్తయ్యగారి విషయంలోనూ మీరు చాలా కోపంగా ఉన్నారు. ఆవిడ ఏదో పాపం చేసిందని శిక్ష విధించారు.. ఆ పాపంలో నా కూతురికి భాగం ఉందా? ఉంటే మాత్రం క్షమించకండి అని అంటుంది సుమిత్ర.

నీ కూతురిని సరిచేసే బాధ్యత నాదేనని చెబుతాడు పెద్దాయన. అంటే నా కూతురు తప్పు చేసిందని నాకు అర్ధమైంది. నా కూతురు ఇలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా? నువ్వు కోరుకుంటున్నట్లుగా నీ కూతురిని తీర్చిదిద్దుతా. పందెంలో నీ కూతురు గెలవకపోచ్చు.. కానీ జీవితమనే ఆటలో నీ కూతురిని నేను గెలిపిస్తాను అంటాడు శివన్నారాయణ. కానీ సుమిత్ర మాత్రం వద్దు అంటుంది. అలా గెలిపిస్తే గెలుపు విలువ దానికి తెలియదు, దానినే ఆడనివ్వమనండి.. తప్పు చేస్తే శిక్షించండి, అది క్షమించరాని తప్పయితే నాతో చెప్పండి అంటుంది సుమిత్ర. ఏం చేస్తావని దశరథ అడగ్గా.. నన్ను కన్నవాళ్లనే వద్దు అనుకున్న దానిని, నేను కన్నవాళ్లు కావాలని ఎలా అనుకుంటాను. తప్పు చేసింది తండ్రయినా, కూతురైనా క్షమించను అంటుంది. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న.. నేను తప్పుచేశానని తెలిస్తే అమ్మ నన్ను ఇంట్లో ఉండనివ్వరని టెన్షన్ పడుతుంది. ఆఫీస్ వ్యవహారాలకి, ఇంటి వ్యవహారాలకి నీ మనసును దూరంగా ఉంచమని చెబుతాడు దశరథ. జ్యోత్స్న నీ అసలు కూతురు కాదని తెలిసే రోజు దగ్గరిలోనే ఉందని అనుకుంటాడు.

బెడ్‌పై దెయ్యంలా కూర్చొన్న పారుని చూసి భయపడుతుంది జ్యోత్స్న. నువ్వు ఈ శిక్షకు పూర్తిగా అర్హురాలివి, అసలు నువ్వు బావకి దొరక్కపోయుంటే బాలరాజు విషయంలో దొరికేవాళ్లం కాదు అని అంటుంది జ్యోత్స్న. అసలు నీలాంటిది నాకు మవవరాలిగా పుట్టకపోయుంటే నాకు ఈ తిప్పలు వచ్చేవి కాదని అంటుంది పారు. నేను నిన్ను యువరాణిని చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను పేదరాణిని చేశావని మండిపడుతుంది. బావ గుర్తుచేయకపోయుంటే తాత నీకు శిక్ష వేసేవాడు కాదు. సూరజ్‌ని అడ్డుపెట్టుకుని బావ, దీప ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారని అంటుంది జ్యోత్న్న. సూరజ్‌తో బావ ఆడిస్తున్న ఆట ఇది అని చెబుతుంది.

పోటీ అయిపోతే సూరజ్‌గాడు పోతాడు అనుకుంటే వాడు ఇక్కడే ఉండిపోయాడు. వాడు ఉన్నంత కాలం మనం ఏం చేయలేమని చెబుతుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు కనీసం బంధువులమని వదిలేస్తాడు, కానీ ఈ సూరజ్ గాడు మనల్ని ఏదో ఒకటి చేసే వరకు వదిలిపెట్టడని చెబుతుంది పారు. మన పాతరోజులు మనకి రావాలంటే ఆ సూరజ్ గాడు ఉండకూడదని అంటుంది జ్యోత్స్న. ఆ సూరజ్ గాడు పెద్ద 420 ఆ క్యారెక్టర్‌ని తాత ముందు బయటపెట్టాలని జ్యోత్స్న, పారు ప్లాన్ చేస్తారు. పారు ఏం చేయబోతుందోనని జ్యోత్స్న కంగారుపడుతుంది. ఇంతలో కార్తీక్, కాంచనలకి స్వీట్స్ చేసి పెడుతుంది దీప. అవి తిన్న వారిద్దరూ చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు. నువ్వు గెలవడానికి ముఖ్య కారణమైన సూరజ్ బ్రదర్‌కి ఒక బాక్స్‌లో పెట్టివ్వమని చెబుతాడు కార్తీక్. ఆ తర్వాత దీపకి బట్టలు, బంగారు నెక్లెస్‌ని కానుకగా ఇస్తుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్‌ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X