Karthika Deepam 2 June 30th: సీఈవో ఛైర్‌లో దీప.. జ్యోత్స్నకి శివన్నారాయణ ఊహించని శిక్ష, సూరజ్‌కి వదినగా దీప
Photo Courtesy: JioHotstar
సీఈవో అయిన దీపకి కాంచన ఖరీదైన చీరలు, బంగారు తాళిబొట్టు చేయిస్తుంది. దీప వద్దని చెప్పగా.. నువ్వు ఇకపై నా పుట్టింటి గౌరవాన్ని కాపాడాలని, సీఈవోగా నిత్యం ఎందరితోనో మాట్లాడాల్సి ఉంటుందని చెబుతుంది. ఇవన్నీ కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని కార్తీక్ అడగ్గా.. మీ నాన్న ఇచ్చారని గతంలో శ్రీధర్ డబ్బు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తుంది కాంచన. కోడలికి చీరలు, నగలు కొనివ్వడం మామగారి బాధ్యత అని చెబుతుంది. దాంతో పసుపు తాడు ప్లేస్‌లో కొత్త బంగారు తాడుని కార్తీక్ చేతితో వేయించుకుని సంబరపడిపోతుంది.
సూరజ్‌ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేసిన పారిజాతం.. ఓ అమ్మాయిని పిలిపించి సూరజ్ గదిలోకి వెళ్లి వాడితో గడిపినట్లుగా నటించమని చెబుతుంది. ఆ అమ్మాయి లోపలికి వెళ్లగానే తలుపు గడియపెట్టి శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, జ్యోత్స్నలను పిలుస్తుంది పారు. సూరజ్ గదిలో అమ్మాయి ఉందని తలుపు తాళం తీసి చూపిస్తుంది. నిజంగానే అక్కడ సూరజ్‌తో అమ్మాయి కనిపించడంతో అంతా షాక్ అవుతారు. నిప్పులాంటి శివన్నారాయణ గారింట్లో ఉంటూ ఇలాంటి పనులు ఏంటీ? ఈ కుర్రాడిని ఇంట్లో నుంచి గెంటేయమని గొడవ చేస్తుంది పారు. ఇంతలో లోపలి నుంచి కార్తీక్, దీపలు రావడంతో పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఈ అమ్మాయి మా వీధిలోనే ఉంటుంది, సూరజ్ గదిని శుభ్రం చేయడానికి మేమే తీసుకొచ్చామని దీప చెప్పడంతో అంతా అవాక్కవుతారు. నిజానిజాలు తెలుసుకోకుండా సూరజ్ మీద నిందలు వేస్తావా అంటూ పారుపై మండిపడతాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 30వ తేదీ 710వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సూరజ్‌ని కాపాడిన తర్వాత పారుకి కార్తీక్ క్లాస్ పీకుతాడు. ఔట్‌హౌస్‌కి తాళం కప్ప కొన్నదే నేనే, మూడు కీలలో రెండు దానికే ఉంటే ఒకటి నా దగ్గరే ఉంది. సూరజ్ కాల్ చేశాడు, మేం వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లాం.. నీ ప్లాన్ అర్ధమయ్యే వాచ్‌మెన్‌ని పిలిపించి బయటి నుంచి తాళం వేయించి మేం లోపల కూర్చొన్నాం అంటాడు కార్తీక్. మంచోడిని నాశనం చేయాలని అనుకోవడం చాలా తప్పు ఇప్పటికే చేసిన తప్పులకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు, ఈ విషయం తాతకి తెలిస్తే ఎవ్వరికీ మంచిది కాదు.. మరోసారి ఇలాంటిది జరిగితే అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
ప్లాన్ ఫెయిల్ కావడంతో పారుపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. ఆ క్యారెక్టర్ ద్వారా సూరజ్ గాడిని ఉత్తముడిని చేసి తాత దృష్టిలో వాడిని మరో రెండు మెట్లు పైకి ఎక్కించేలా చేశావని మండిపడుతుంది. కార్తీక్ గాడు వస్తాడని ఊహించలేదని చెబుతుంది పారు. అమ్మాయిని తీసుకొస్తావా? ఇంకా నయం దీంట్లో నువ్వు ఇరుక్కోలేదని అంటుంది. నువ్వు ఇరుక్కుంటే తర్వాత అనుమానం వచ్చేది నా మీదేనని జ్యోత్స్న అంటుంది. మీ తాతకి దొరక్కపోయినా కార్తీక్ గాడికి దొరికిపోయినట్లేనని చెబుతుంది పారు. దొరికిపోయినా అమ్మాయి చేత నిజం చెప్పించలేదంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది? అవకాశం దొరికినా మనతో ఆడుకోకుండా సైలెంట్‌గా ఉన్నాడంటే మనం ఊహించలేనిది ఏదో జరగబోతోందని జ్యోత్స్న అనుమానిస్తుంది.
క్యారెక్టర్ మీద బురద జల్లే రాజకీయాలు ఇలాగే ఉంటాయని సూరజ్‌తో చెబుతాడు కార్తీక్. టైంకి వచ్చి సేవ్ చేసినందుకు సూరజ్ థ్యాంక్స్ చెబుతాడు. డూప్లికేట్ కీ నా దగ్గరే ఉంది పారుకి ఓ కథ చెప్పాను, తాతకి ఓ కథ చెప్పానని సూరజ్‌కి స్వీట్ తినిపిస్తుంది దీప. దాంతో దీపని థ్యాంక్స్ వదిన అంటాడు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఎందుకో మిమ్మల్ని వదిన అని పిలవాలని అనిపించింది నాకు కూడా ఓ బంధం ఉంది అంటాడు. ఇలాంటి పరిస్ధితులు ఫ్యూచర్‌లో కూడా రావొచ్చు అని సూరజ్‌ని హెచ్చరిస్తాడు.
నిద్రపోతూ సూరజ్ అన్న మాటలు గుర్తొచ్చి.. సూరజ్ వదిన అని పిలవడం నాకు కూడా నచ్చిందని కార్తీక్‌తో అంటుంది దీప. నాకొక మరిది, మీకొక తమ్ముడు దొరికాడని సంతోషిస్తుంది. ఈరోజు ఉండి రేపు వెళ్లిపోయే మనిషి మీద అభిమానం పెంచుకోకూడదు, నువ్వు సీఈవో అయినా నీకు సాయంగా ఉండటానికి నేను ఒప్పించానని చెబుతాడు కార్తీక్. నేను వెళ్లిపోతానంటే సూరజ్‌ను మనం ఆపలేమని అంటాడు కార్తీక్. సూరజ్ మనతోనే ఉండాలంటే నువ్వొక పనిచేయాలి, ముందు తనెవరో తెలుసుకోవాలి.. నాకొక మరిది ుంటే బాగుండు అనే కోరిక సూరజ్‌తో తీరిందని చెబుతుంది దీప. అతని కోసం మనం ఏం చేయలేమా? అని అడుగుతుంది. వీళ్లిద్దరి మాటలతో శౌర్య లేచి మీరిద్దరూ పడుకుంటే నేను కూడా పడుకుంటానని అంటుంది.
ఉదయాన్నే మేనేజర్‌పై ఫోనులో అరుస్తుంది జ్యోత్స్న. పదవి లేనోడు అంటే పనివాడికి కూడా లోకువే, పది నిమిషాల్లో ఆఫీసులో ఉండాలట అని పారుతో చెబుతుంది జ్యోత్స్న. మీ తాత నీకు ఏ శిక్ష వేస్తాడో తెలుసుకోవడానికి నేను కూడా ఆఫీస్‌కి వస్తున్నానని చెబుతుంది పారు. తాత జరిగింది మరిచిపోయి ఉంటాడని జ్యోత్స్న చెప్పగా.. అయినా ఆఫీస్‌కి ఎందుకు రమ్మని చెబుతున్నాడని అడుతుంది పారు. ఆఫీస్‌కి వెళ్లడానికి కారు లేదని చెప్పడంతో సూరజ్ వచ్చి లిఫ్ట్ ఇస్తానని చెబుతాడు. మా బావ స్కూటీ నీ దగ్గరకి ఎలా వచ్చిందని సూరజ్ అంటుంది. నీ స్కూటీ నేను ఎక్కనని జ్యోత్స్న చెప్పడంతో పారు ఎక్కమని గొడవ చేస్తుంది.
జ్యోత్స్నని తీసుకుని ఆఫీస్‌కి బయల్దేరతాడు సూరజ్.. గోతుల్లోకి, నూతుల్లోకి తీసుకెళ్లకుండా నడపమని చెబుతుంది జ్యోత్స్న. అయినప్పటికీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ బైక్ మీద వెళ్తారు. సూరజ్ గోతిలోకి బండిని నడిపించడంతో హెయిర్ పిన్‌తో గుచ్చడంతో అతను బాధపడతాడు. దీప, కార్తీక్‌లు ఆఫీస్‌కి వెళ్లేసరికి చప్పట్లతో స్వాగతం పలుకుతారు శివన్నారాయణ, ఇతర స్టాఫ్ మెంబర్స్. తన జీవితం మొదలైన నాటి నుంచి ఈ స్థాయికి చేరుకోవడం వరకు జరిగిన ప్రతి సంఘటనను గుర్తుచేసుకుని ఎమోషనల్ అవుతుంది దీప. జ్యోత్స్న స్వీట్ తినిపిస్తుండగా వద్దని పక్కకి వెళ్తుంది దీప.
సీఈవో ఛైర్‌లో దీపని కూర్చోబెట్టి ఈరోజు నుంచి ఈ సంస్థ బాధ్యతలన్నీ నిర్వర్తించాలని ఆల్ ది బెస్ట్ చెబుతాడు. భార్యను సీఈవో ఛైర్‌లో చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. భర్తకి స్వీట్ తినిపించి ఆశీస్సులు తీసుకుంటుంది. ఈ చప్పట్లు ఈ పూలబోకేలు, ఈ శుభాకాంక్షలు, ఈ పదవి, ఈ బతుకు అంతా నువ్వు ఇచ్చిందే. అందరూ నన్ను వదిలేసినా నువ్వే చేరదీశావు, కొత్త జీవితాన్ని ఇచ్చావు అని దీప కంటతడి పెడుతుంది. నువ్వు నా కోసం పుట్టావు.. ఈ పారిజాతం, ఈ జ్యోత్స్నలు ఎవరు? ఎక్కడ ఉండాల్సిన వాళ్లు ఎక్కడికి వచ్చారు? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నువ్వు సీఈవో స్థానం నుంచి మనవరాలి ప్రయాణం వరకు చేర్చాల్సిన ప్రయాణం మరొక ఎత్తు అంటాడు. నిన్ను అత్త, మావయ్య పక్కన కూతురిగా నిలబెట్టిన రోజున థ్యాంక్స్ చెప్పమని అంటాడు కార్తీక్.
ఈ బిడ్డ సుమిత్ర మనవరాలిగా లేదా మనవడిగానే పుట్టాలి. నీ జీవితానికి అన్యాయం చేసినవారికి చెడుకాలం మొదలైంది. ఇకపై మనం గెలుస్తూనే ఉంటాం, వాళ్లు ఓడిపోతారని చెబుతాడు కార్తీక్. ఏదో ఒకరోజు నేను నీ మనవరాలిని కాదని తాతతో జ్యోత్స్న చెప్పే పరిస్ధితి వస్తుందని, అందరి కాళ్లు పట్టుకునే పరిస్ధితి పారుకు వస్తుందని అంటాడు కార్తీక్. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న రగిలిపోతుంది. ఆల్రెడీ ఒక దోషిని శిక్షించారు... అసలైన దోషికి ఎలాంటి శిక్ష వేస్తారోనని అంటాడు కార్తీక్. నేను అన్నీ ఈ కాగితంలో వివరంగా రాశాను, నువ్వే చదివి జ్యోత్స్నకి వినిపించమని అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న ప్రతిరోజూ ఆఫీస్‌కి రావాలి, మీకు డీఏ అనే పెద్ద పోస్ట్ ఇచ్చారని చెబుతాడు కార్తీక్. పారిజాతం ఏదో పెద్ద పోస్ట్ అని సంబరపడుతుండగా.. డీఏ అంటే దీప అసిస్టెంట్ అని చెబుతాడు కార్తీక్. ఈ మాటలతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications