Karthika Deepam 2 July 1st: దీప మెడలో బంగారు తాళిపై జ్యోత్స్న కన్ను.. కార్తీక్- దీపలను విడదీసేలా కుట్ర
Photo Courtesy: JioHotstar
సూరజ్‌ని కాపాడిన తర్వాత పారుకి కార్తీక్ క్లాస్ పీకుతాడు. నా దగ్గర వేరే కీ ఉండబట్టి సూరజ్‌ని కాపాడాం. ఇప్పటికే చేసిన తప్పులకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు, ఈ విషయం తాతకి తెలిస్తే అని కార్తీక్ వార్నింగ్ ఇవ్వడంతో పారు సైలెంట్ అవుతుంది. సూరజ్‌ని మరో రెండు మెట్లు పైకి ఎక్కించావు కానీ నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. నీ ప్లాన్‌ని తాత ముందు బయటపెట్టకుండా సైలెంట్‌గా ఉన్నాడంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉందని అనుకుంటుంది జ్యోత్స్న. నీ క్యారెక్టర్ మీద బురద జల్లే రాజకీయాలు ఇలాగే ఉంటాయని జాగ్రత్తగా ఉండమని చెప్పి సూరజ్‌కు సలహా ఇస్తాడు కార్తీక్. ఇంతలో దీప ఇచ్చిన స్వీట్స్ తిన్న సూరజ్.. చాలా బాగున్నాయి వదిన అని అనడంతో కార్తీక్, దీపలు సంతోషిస్తారు.
సూరజ్ మనతోనే ఉండేలా ఏదో ఒకటి చేయమని కార్తీక్‌కు చెబుతుంది దీప. ఉదయాన్నే జ్యోత్స్నని అర్జెంట్‌గా ఆఫీస్‌కు రమ్మని ఫోన్ వస్తుంది. ఇంట్లో కార్లు లేకపోవడంతో సూరజ్ తన స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడు. దారిలో ఇద్దరూ గొడవ పడుతూ, తిట్టుకుంటూ ఉంటారు. సీఈవో చైర్‌లో దీపని కూర్చోబెట్టి ఆల్ ది బెస్ట్ చెబుతాడు శివన్నారాయణ. ఎక్కడో మొదలైన తనకు ఈ జీవితాన్ని ఇచ్చింది నువ్వేనంటూ కార్తీక్ ఆశీర్వాదాలు తీసుకుంటుంది దీప. జ్యోత్స్నని పిలిచిన శివన్నారాయణ.. చేసిన తప్పుకు శిక్షగా దీపకి అసిస్టెంట్‌గా ఉండమని శిక్ష విధించడంతో పారు షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 1వ తేదీ 711వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీపకి అసిస్టెంట్ జ్యోత్స్న ఉంటుంది. సీఈవో కంటే ముందే రావాలి.. సీఈవో గారు వెళ్లాకే ఇంటికి వెళ్లాలి, సీఈవో రాత్రంతా ఆఫీసులో ఉంటే ఆమెతో పాటే ఉండాలి. ఈ రోజు నుంచి జ్యోత్స్నకి ఎలాంటి సౌకర్యాలు ఉండవని కార్తీక్ రూల్స్ మొత్తం చదివి వినిపించడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. అంటే కారు, డ్రైవర్, ఇలాంటివేవీ ఉండవు, జ్యోత్స్న అకౌంట్స్ మొత్తం లాక్ చేయబడతాయి. కంపెనీ అకౌంట్ నుంచి కానీ, పర్సనల్ అకౌంట్ నుంచి కానీ డబ్బులు వాడటానికి వీల్లేదు, అప్పులు చేయడానికి, తప్పులు చేయడానికి వీల్లేదని అంటాడు కార్తీక్.
తనకు కంపెనీ కారు ఇవ్వబడదు, తను ఎలా వెళ్లాలో, ఎలా రావాలో తనే నిర్ణయించుకోవాలి. దీప అసిస్టెంట్‌గా ఉన్నందుకు గాను ప్రతినెలా జీతం వస్తుంది.. దానిలోనే తన అవసరాలు తీర్చుకోవాలి, తన ప్రతిభను గుర్తించి భవిష్యత్తులో జీతం పెంచే అవకాశం ఉంది. జీతం ఎంత ఇవ్వాలో దీప నిర్ణయిస్తుంది, ఇందులో ఏదైనా లోపం ఉంటే ఛైర్మన్ గారికి ఫిర్యాదు చేయబడతాయి. ఈ రూల్స్ నచ్చకపోతే జ్యోత్స్న గారు ఆఫీస్ నుంచి వెళ్లిపోవచ్చు, ఆఫీస్ నుంచి వెళ్లిపోతే ఇంట్లో కూడా చోటు లేదని కార్తీక్ చదివి వినిపించడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
అవన్నీ నీకు సమ్మతమేనని సంతకం పెట్టు.. లేదంటే బయటికి వెళ్లమని తేల్చేస్తాడు శివన్నారాయణ. మనవరాలికి ఇంత కఠినమైన శిక్ష వేయడం తప్పని చెబుతుంది పారు. పూర్వం రాజులు తమ పిల్లల్ని ఏం చేసేవాళ్లో తెలుసా? యుక్త వయసు రాగానే మంచి చెడు తెలుసుకోవడానికి సాధారణమైన మనిషిలా బతకమని రాజ్యానికి దూరంగా ఉంచేవాళ్లని చెబుతాడు పెద్దాయన. మీ మనవరాలిని అలాగే వదిలేశారు, కష్టాల మధ్య బతికింది, కష్టాలను తట్టుకుని ఎదగాలి, తన రాజ్యాన్ని తనే వెతుక్కుంటూ వచ్చిందని, తనే పరిపూర్ణమైన మనిషిలా మారిన తర్వాత మళ్లీ రాజ్యంలో అడుగుపెట్టింది, అధికారం సంపాదించుకుందని దీప గురించి గుర్తు చేసుకుంటాడు కార్తీక్.
నా ఇంటి రక్తం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను, నచ్చితే సంతకం పెట్టు.. వద్దు అనుకుంటే వెళ్లిపోవచ్చని తేల్చేస్తాడు పెద్దాయన. యుద్ధాలు ఎదుర్కోలేని వారికి, సవాళ్లు తట్టుకోలేని వారికి రాజ్యాలు ఏలే అర్హత ఉండదని శివన్నారాయణ చెప్పడంతో రూల్స్‌పై సంతకం పెడుతుంది జ్యోత్స్న. తనకు తాత శిక్ష విధించడంతో రగిలిపోతూ ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ వచ్చి నేను శివన్నారాయణ గారి మనవరాలిని అన్నావు కదా? నేను ఆరోజే చెప్పాను కదా శివన్నారాయణ గారి మనవరాలివి కాకపోతే నువ్వెందుకు పనికిరావని అంటాడు. ఒక తప్పు నీ పొజిషన్‌ను మార్చేసింది, ఒక సంతకం నీ తలరాతని మార్చేసింది.. నువ్వేదో ప్రత్యేకమైన దానివని ఫీలయ్యావు, రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడ్డావని చెబుతాడు సూరజ్. నీ అహంకారం, నీ పొగరు, నీ బలుపు మమ్మల్ని కొంతకాలం మాత్రమే ఆపగలవని అంటాడు.
మీరంతా ఎక్కడి నుంచో వచ్చి నా స్థానాన్ని, నా అధికారాన్ని, నా గౌరవాన్ని లాగేసుకుంటే ఊరికే ఇచ్చేస్తానా? ఆపాలని అనుకున్నాను.. ఏం చేసైనా సరే గెలవాలని అనుకున్నాను. మా గ్రానీ చేసిన ఒకే ఒక్క తప్పు నా ఆఫీస్‌లో నన్నే అసిస్టెంట్‌ని చేసింది. నన్నెంత కసిగా తొక్కాలనుకుంటే అంత కసిగా పైకి ఎదుగుతాను అంటుంది జ్యోత్స్న. ఈ పొగరు తగ్గించుకోకపోతే ఇంకా పతనమైపోతావని సూరజ్ నచ్చచెబుతాడు. నేను ఇలాగే బతుకుతాను, పొగరుతోనే బతుకుతాను, నా పొగరే నా ఐడెంటిటీ అంటుంది జ్యోత్స్న. ఈరోజు నుంచి నీ సరదా తీరిపోతుందని అంటాడు సూరజ్.
ఇంతలో కార్తీక్ ఫోన్ చేసి జ్యోత్స్నని తీసుకురమ్మని చెబుతాడు కార్తీక్. అది సుకుమారంగా పెరిగిన పిల్ల.. పెద్ద పెద్ద పనులు చెప్పొద్దని కార్తీక్‌తో అంటుంది పారు. ముందు మీ సీట్లో మీరు కూర్చోవాలని చెప్పి బయట చిన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు కార్తీక్. చిన్న సంతకానికి జీవితాలు మారిపోతాయా? అన్యాయమని అంటుంది పారు. ఆవిడ కూడా చిన్న సంతకంతోనే జీవితాలు మార్చేశారని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తాడు కార్తీక్. నువ్వేమో జ్యోత్స్నకి అగ్రిమెంట్ ఉన్న బానిస.. జ్యోత్స్న ఏమో నీ పెళ్లానికి అగ్రిమెంట్ లేని బానిస అంటుంది పారు. దీనినే కర్మ రిటర్న్స్ అంటారని కార్తీక్ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న అసిస్టెంట్.. మేనేజర్ వంశీ వచ్చి మేడం గారి పరిస్ధితి చూడలేకపోతున్నానని ఏడుస్తాడు. అయితే ఏదైనా టవర్ దూకి చావమని మండిపడతాడు కార్తీక్.
ఇంతలో జ్యోత్స్నని పిలుస్తూ దీప బెల్ కొట్టడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఈ బెల్ ఐడియా ఇచ్చింది ఎవరు అని పారు మండిపడుతుండగా.. నేనే అని సూరజ్ అంటాడు. సీఈవో గారు ప్రతిక్షణం నోటితో పిలవాలంటే అలసిపోతారని ఈ ఏర్పాట్లు చేశానని చెబుతాడు. పెద్దాయనకి తెలిసిందంటే ఏం జరుగుతుందోనని వెళ్లమని జ్యోత్స్నకి చెబుతుంది పారు. జ్యోత్స్న లోపలికి వెళ్లి ఎందుకు పిలిచావని అడుగుతుంది జ్యోత్స్న. ఈ బెల్ పనిచేస్తుందా లేదా అని ట్రై చేశానని అంటుంది దీప. అయితే అదే పనిగా బెల్ నొక్కుతుండటంతో జ్యోత్స్న ఫైర్ అవుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఒకటి తగ్గిందని అంటుంది దీప. ఇంతలో నాని వచ్చి మేడం కాఫీ అంటాడు. ఇప్పుడు నీకు అర్ధమైందా అని చెబుతుంది దీప. దాంతో దీపని మేడం అని పిలుస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న తట్టుకోలేకపోతోందని దీప చెప్పగా.. ఇది ఆరంభం మాత్రమే, ముందుంది ముసళ్ల పండుగ అంటాడు కార్తీక్.
దీప, కార్తీక్‌లతో కలిసి భోజనం చేస్తుండగా దీప మెడలో ఉన్న బంగారు తాళిని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. ఇది నీ మెడలోకి వచ్చింది కాబట్టే నీ జాతకం మారిపోయింది, నా మెడలో పడుంటే ఈరోజు నీకు అసిస్టెంటే కాదు, ఈ సంస్థకే ఛైర్మన్ అయ్యేదానిని అనుకుంటుంది జ్యోత్స్న. భోజనం చేస్తుండగా తన స్పూన్ కిందపడిపోవడంతో కార్తీక్ స్పూన్ తీసుకుని తినబోతుండగా దీప ఫైర్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications