Karthika Deepam 2 July 2nd: కార్తీక్‌ని వదలకపోతే నీకు మొగుడిని అవుతా.. జ్యోత్స్నకి సూరజ్ వార్నింగ్
Photo Courtesy: JioHotstar
దీపకి అసిస్టెంట్‌గా జ్యోత్స్నని నియమిస్తూ శివన్నారాయణ శిక్ష విధిస్తాడు. ఈరోజు నుంచి జ్యోత్స్నకి ఎలాంటి సౌకర్యాలు ఉండవు, నెలకి జీతం వస్తుంది, దానిలోనే తన అవసరాలు తీర్చుకోవాలి. దీనికి ఒప్పుకోకపోతే ఆఫీస్‌లోనూ, ఇంట్లోనూ స్థానం ఉండదని రూల్స్ మొత్తం చదివి వినిపిస్తాడు కార్తీక్. మనవరాలి మీద జాలి చూపించమని పారిజాతం ప్రాధేయపడుతుంది. ఎదురుదెబ్బలు, సవాళ్లు తట్టుకోలేకపోతే రాజ్యం దక్కదని శివన్నారాయణ చెప్పడంతో.. దీప ఎదిగిన తీరును గుర్తుచేసుకుని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.
తాత విధించిన శిక్షను గుర్తుచేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న.. ఇంతలో సూరజ్ వచ్చి నేను శివన్నారాయణ మనవరాలిని అన్నావు కదా? శివన్నారాయణ మనవరాలివి కాకపోతే ఎందుకు పనికిరావని అంటాడు. ఓ తప్పు నీ పొజిషన్‌ను మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతని మార్చేసింది, నువ్వేదో ప్రత్యేకమైన దానివని ఫీలయ్యావని సెటైర్లు వేస్తాడు. ఇంతలో కార్తీక్ వచ్చి జ్యోత్స్నని తీసుకుని ఆమె కోసం ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. ఆ వెంటనే జ్యోత్స్నని పిలుస్తూ దీప బెల్ కొట్టడంతో లోపలికి పిలుస్తుంది. ఆ తర్వాత కార్తీక్ కూడా మరదలిని ఆడుకుంటాడు. దీప, కార్తీక్‌లతో భోజనం చేస్తుండగా జ్యోత్స్న స్పూన్ కిందపడిపోవడంతో కార్తీక్ స్పూన్‌తో తింటుండగా దీప సీరియస్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 2వ తేదీ 712వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కార్తీక్ దగ్గరి స్పూన్ లాక్కుని తింటున్న జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తుంది దీప. తింటే తప్పేంటీ అని జ్యోత్స్న ప్రశ్నించగా.. కార్తీక్ నా భర్త అంటుంది దీప. నా మెడలో తాళి కట్టుంటే నా భర్త అయ్యేవాడు. నువ్వు, దీప భార్యాభర్తలు కావడానికి ముందు.. భార్యాభర్తలు కావాల్సింది మనిద్దరమే. నీ ఎంగిలి నేను ఎన్నిసార్లు తినుంటాను, నువ్వు సగం తాగిన కూల్‌డ్రింక్స్ నేను తాగే దానిని. ఇద్దరం కలిసి ఒకే ఐస్‌క్రీమ్ తినేవాళ్లమని చెబుతుంది జ్యోత్స్న. ఎప్పుడో చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో చేసినవి కూడా నువ్వు ప్రేమ అనుకుంటే నీ అంత పిచ్చిది ఎవరూ ఉండరు. మరోసారి మా ఆయన ఎంగిలి తింటే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది దీప.
కార్తీక్‌కి, దీప భార్య అనేది ఎప్పటికీ కాలేదు. నువ్వు పుట్టకముందే బావకి పెళ్లాన్ని అయ్యాను, ఏదో ఒకరోజు నిజంగానే అవుతానని చెబుతుంది జ్యోత్స్న. వీరంతా మాట్లాడుకుంటున్నది సూరజ్ వినడం గమనించిన కార్తీక్ ఇద్దరినీ కూల్ చేస్తాడు. సూరజ్ భోజనానికి కూర్చోబోతుండగా జ్యోత్స్న లేచి వెళ్లిపోతుంది. నా స్కూటీ నీతోనే ఉండనీ, సీఈవో గారికి కంపెనీ కారు ఇచ్చింది. ఇప్పటి నుంచి మా ఆయనకి నేనే డ్రైవర్‌ని అంటాడు కార్తీక్. కొన్ని నువ్వుపట్టించుకోవద్దు, నీకు ఈపాటికే చాలా విషయాలు తెలిసుంటాయని చెబుతాడు కార్తీక్.
జ్యోత్స్నని ఎక్కించుకుని ఇంటికి వెళ్తుండగా దారిలో ఆమెను దించి మాట్లాడతాడు సూరజ్. నీ ప్రవర్తన చూస్తే అసహ్యం వేస్తోంది, డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు చేసిన పని ఏం బాలేదని అంటాడు. దీపకి, నాకు జరిగిన దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ మండిపడతాడు. పెళ్లయిన ఒక మగాడి వెనుక ఒక ఆడపిల్ల పడటం అంటే దానికి అర్ధం ఏంటో తెలుసా? ఈ సొసైటీ దానిని ఏ పేరుతో పిలుస్తుందో తెలుసా? నిన్నొక బజారు అని చెప్పబోతుండగా సూరజ్ ఆగిపోతాడు. నేను ఆగిపోయినా జనం ఆగిపోర అంటాడు. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు? నన్ను అడగటానికి నువ్వెవరు? అని చొక్కా పట్టుకుని జ్యోత్స్న నిలదీస్తుంది. నేను నీ మొగుడిని అని సూరజ్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
నువ్వు నా మొగుడివి ఎలా అవుతావు? నా మెడలో తాళి కట్టావా? అని జ్యోత్స్న నిలదీస్తుంది. మరి కార్తీక్ నీ మొగుడు ఎలా అవుతాడు? నీ మెడలో ఏమైనా తాళి కట్టాడా అని నిలదీస్తాడు సూరజ్. బావే నా మొగుడని చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ చెప్పిందని అంటుంది జ్యోత్స్న. నువ్వే నా భార్యవని నా మనసు చెబుతోంది, నేను నిన్ను భార్యగా ఊహించుకోవచ్చా? ఆడదాని మెడలో మగాడు తాళి కడితేనే మొగుడు అవుతాడు. ఎవరో ఊహించుకుంటేనే, చెబితేనే అవ్వరు అంటాడు. కార్తీక్ విషయంలో నీది తప్పు కాదు అంటే.. నీ విషయంలో నాది కూడా తప్పు కాదు. నువ్వు కార్తీక్‌ని మొగుడు అనుకో, నేను నిన్ను పెళ్లాన్ని అనుకుంటానని అంటాడు సూరజ్.
దాంతో సూరజ్ మీదకి రాయి తీసుకొచ్చి కొట్టబోతుంది జ్యోత్స్న. నా మనసు నా ఇష్టమని చెబుతుంది. ఆ రోజు గిఫ్ట్ షాపులో నా వస్తువు మీద ఆశపడినప్పుడే చెప్పాను, నా వస్తువు ఎలాగైతే నీది కాదో అలాగే కార్తీక్ కూడా నీవాడు కాదు, అతను దీపగారి భర్త అని చెబుతాడు. నేను నీ మొగుడిని అన్నందుకే నీకు అంత కోపం వచ్చింది.. మరి అలాంటప్పుడు నీ మీద ఆమెకు కోపం రావడంలో తప్పేం లేదు, వాళ్ల జీవితంలో నుంచి నువ్వు తప్పుకోమని సూరజ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు కార్తీక్‌ని కోరుకుంటున్నాడు కానీ, కార్తీక్ నిన్ను కోరుకోవడం లేదు.. నువ్వంటే ఒక్క శాతం ఇష్టం ఉన్నా దీప గారి మెడలో తాళి కట్టేవాడే కాదు. దీప అంటే ఇష్టం ఉంది కాబట్టే తాళి కట్టాడు, కాపురం చేశాడు, తండ్రి కూడా అయ్యాడని చెబుతాడు సూరజ్. ఆ మాటలతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఇది నీ జీవితం.. కోట్ల ఆస్తికి వారసురాలివి. ఇలాగే ఉంటే నీ జీవితం నాశనమైపోతుంది. అన్నింటిలోనూ నెంబర్ వన్‌గా ఉండాలనుకునే నువ్వు, ఇందులో మాత్రం నెంబర్ టూగా ఉండాలనుకోవడం బాలేదు అంటాడు సూరజ్.
శౌర్యకు తక్కువ మార్కులు రావడంతో కార్తీక్, దీపలు క్లాస్ పీకుతారు. మా ఫ్రెండ్స్‌కి వాళ్ల పేరెంట్స్ ట్యూషన్ చెబుతారు, నాకెవరు చెబుతారు అని ప్రశ్నిస్తుంది. తప్పు మనదే.. మనం ట్యూషన్ ఫీజు కట్టలేమని దానిని ఇంట్లోనే చదువుకోమన్నామని కార్తీక్ బాధపడతాడు. సూరజ్‌తో జరిగిన గొడవ గురించి జ్యోత్స్న ఆలోచిస్తుండగా.. సూరజ్ వాయిస్ మెసేజ్ పెడతాడు. ఇకనైనా మారు.. పెళ్లయిన మగాడిని కోరుకోవద్దని వార్నింగ్ ఇస్తాడు సూరజ్. ఈ మాటలన్నీ విన్న పారు.. సూరజ్ చెప్పిందే కరెక్ట్ అంటుంది. ఆ సూరజ్ గాడు నాకు సైట్ కొడుతున్నాడు, అప్పుడప్పుడు నా దగ్గర చిల్లర వేషాలు వేస్తుంటాడు అని చెబుతుంది జ్యోత్స్న. అప్పుడప్పుడు సూరజ్ లాంటి వాళ్లు ఇచ్చిన సలహాలు వినాల్సిందే, మంచి కోటీశ్వరుడిని చూసి పెళ్లి చేసుకో అంటుంది పారు. బావనే పెళ్లి చేసుకుంటానని అనుకుంటే చివరికి అడుక్కు తినడానికి కూడా పనికిరావు అంటుంది.
నీ పెళ్లి కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు, దీప ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్స్‌కే సీఈవో. నువ్వు దీపకి అసిస్టెంట్‌వి, ఇదంతా కార్తీక్‌గాడు చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాడు. ఈ ఇంటి వారసురాలిని వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. తొందరలోనే దీపని సుమిత్ర కూతురని రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని నీ పేరు మీదకి రాయించుకోకపోతే దీపకి సేవలు చేసుకుంటూనే బతకాలని చెబుతుంది. దీపకి బావ, సూరజ్, ఈ ఫ్యామిలీ మొత్తం పోరాడుతోంది.. నేను ఒంటరి పోరాటం చేస్తున్నానని అంటుంది జ్యోత్స్న. పెళ్లి అనేది నీకు శ్రీరామరక్ష.. పెళ్లితే నీ జీవితం మారిపోతుంది అంటుంది పారు. శౌర్యని ఆఫీస్‌కి తీసుకెళ్లి అక్కడ చదివిస్తానని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications