Karthika Deepam 2 July 3rd: శివన్నారాయణకి పోటీగా దక్షిణామూర్తి హోటల్స్.. సూరజ్ గుట్టురట్టు, షాక్‌లో కార్తీక్
Photo Courtesy: JioHotstar
కార్తీక్ స్పూన్‌తో ఫుడ్ తింటున్న జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది దీప. తింటే తప్పేంటి అని దీపని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. కార్తీక్ నా భర్త.. అతని ఎంగిలి నువ్వు తినడం ఏంటీ అంటూ మండిపడుతుంది దీప. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బావ ఎంగిలి తిన్నానని చెబుతుంది జ్యోత్స్న. చిన్నప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. మరోసారి మా ఆయన ఎంగిలి తింటే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా వింటున్న సూరజ్‌ని గమనించిన కార్తీక్.. కొన్ని పట్టించుకోకూడదని అంటాడు. సూరజ్ భోజనానికి కూర్చోగానే జ్యోత్స్న లేచి వెళ్లిపోతుంది.
ఆఫీస్ అయిపోగానే జ్యోత్స్నను స్కూటీ మీద ఇంటికి తీసుకెళ్తూ క్లాస్ పీకుతాడు సూరజ్. భోజనం చేస్తూ నువ్వు చేసిన పని ఏం బాలేదు.. కార్తీక్ గారు దీప భర్త వాళ్లిద్దరికీ జోలికి వెళ్లొద్దని చెబుతాడు. నన్ను అడగటానికి నువ్వెవరు? అని సూరజ్ చొక్కా పట్టుకుని జ్యోత్స్న నిలదీస్తుంది. నేను నీ మొగుడిని అని సూరజ్ అనడంతో ఆమె షాక్ అవుతుంది. కార్తీక్ తాళి కట్టకుండానే నీ మొగుడు అయినప్పుడు, నేను కూడా అంతే అంటాడు సూరజ్. నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివి, వందల కోట్ల ఆస్తికి వారసురాలివి.. ఇలా పరాయి మగాడి మీద ఆశపడితే నీ జీవితం నాశనమైపోతుందని వార్నింగ్ ఇస్తాడు. సూరజ్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ రగిలిపోతున్న జ్యోత్స్న దగ్గరికి వచ్చిన పారుకి అంతా చెబుతుంది. ఆ సూరజ్ గాడు చెప్పింది నిజం.. ఆ కార్తీక్ గాడిని వదిలేసి కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది పారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 3వ తేదీ 713వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
స్కూటీపై ఆఫీస్‌కి వెళ్తుంటారు సూరజ్, జ్యోత్స్న. నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతాడు సూరజ్. పారు చెప్పిన మాటల్ని కూడా జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, ప్రతీది నీకు చెప్పలేను అంటుంది. వీరిద్దరి గొడవ చేసిన ఓ వ్యక్తి.. దీంతో వేగలేకపోతున్నావా? నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, విడాకులు ఇచ్చేయమని అంటాడు. ఆ మాటలతో జ్యోత్స్న రగిలిపోతుంది. వాటర్ కావాలని జ్యోత్స్న అడగటంతో సూరజ్ వెళ్లగానే బైక్‌లో గాలి తీసేస్తుంది. దాంతో జ్యోత్స్నని ఎక్కించుకుని బైక్ తోసుకుంటూ వెళ్తాడు సూరజ్. అనవసరమైన సలహాలు ఇస్తే ఇలాంటి కష్టాలే పడాలి, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
ఆఫీసులో దీప ముందు ఫైల్స్ ఉండటంతో షాక్ అవుతుంది. ఇవన్నీ స్టడీ చేసి ఈరోజు వరకు సిస్టమ్‌లో అప్‌డేట్ చేయాలని చెబుతాడు కార్తీక్. నేను నీకు హెల్ప్ చేద్దామంటే అగ్రిమెంట్ అడ్డుపెట్టుకుని జ్యోత్స్న నన్ను ఏ పని చేయనివ్వదు అంటాడు. సూరజ్‌ని జ్యోత్స్న ఎన్ని ఇబ్బందులు పెడుతుందోనని అడుగుతుంది దీప. బ్రదర్ అక్కడి వరకు తీసుకురాడు అంటాడు కార్తీక్. బైక్ పంక్చర్ కావడంతో జ్యోత్స్నని ఎక్కించుకుని, బైక్ తోసుకుంటూ ఆఫీస్‌కి వస్తాడు సూరజ్. నువ్వు పడిన కష్టానికి నేను కట్టిన ఖరీదు అని చేతిలో 500 రూపాయలు పెడుతుంది జ్యోత్స్న. నా దగ్గర డబ్బులు పెట్టుకుని నిన్ను వాటర్ బాటిల్ ఎందుకు తీసుకురమ్మన్నాను అని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. జరిగింది చెప్పుకుంటే పోయేది నీ పరువే అని సెటైర్లు వేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో జ్యోత్స్న బ్యాగ్‌లో నుంచి లిప్‌స్టిక్ కిందపడిపోవడంతో దానిని తీసుకుని నీకెలా బుద్ధి చెబుతానో చూడమని అనుకుంటాడు.
ఆఫీస్‌కి ఇంత లేటుగా వచ్చావేంటీ అని జ్యోత్స్నని అడుగుతాడు. బైక్‌ని తోసుకుంటూ వచ్చేసరికి లేట్ అయ్యిందని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ రావడంతో దారిలో ఏవో అద్భుతాలు జరిగాయట అని అడుగుతాడు కార్తీక్. ఆవిడ గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి వెళ్లిపోతుండగా.. నీ షర్ట్‌పై ఆ రెడ్ సింబల్ ఏంటీ అని అడుగుతాడు. ఆ వెంటనే దీపని పిలిచి బ్రదర్ షర్ట్ వెనుక ఏం ఉందో చూడమని చూపించడంతో దీప నవ్వుకుంటుంది. మా ముందు మీరిద్దరూ శత్రువుల్లా ఉంటూ మీరు మీరు కలిసిపోయారా అని జ్యోత్స్నపై సెటైర్లు వేస్తాడు కార్తీక్. అప్పుడే మేటర్ ముద్దుల దాకా వెళ్లిందంటే మీరు మామూలు స్పీడ్‌గా లేరని కార్తీక్ అనడంతో జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
బావ అనే పేరు నా పక్కన తీసేసి సూరజ్ ముందు పెట్టావని అంటాడు కార్తీక్. దాంతో అదెలా వచ్చిందో చెప్పమని సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. మీరు దొరికిపోయారు.. మేమైతే ఈ విషయం ఎవ్వరికీ చెప్పం, మాకు పార్టీ కావాలని అడుగుతాడు కార్తీక్. ఈ నూతన దంపతులతో సెల్ఫీ దిగుదామని ర్యాగింగ్ చేయడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. అసలు ఏం జరిగిందని దీప అడగ్గా.. జ్యోత్స్నని ఏడిపించడానికి మనోడు ఏదో చేసుంటాడని చెబుతాడు కార్తీక్. సూరజ్‌ని పిలిచి నేను నీకు ముద్దుపెట్టానా? మా బావ అడుగుతుంటే సిగ్గుపడుతున్నావ్ అని నిలదీస్తుంది జ్యోత్స్న. నిన్ను కిలోమీటర్ పాటు స్కూటీ తోయించానని నా మీద రివేంజ్ తీర్చుకున్నావు కదా? అని ప్రశ్నిస్తుంది.
దాంతో జ్యోత్స్న చేతిలో లిప్‌స్టిక్ పెట్టడంతో ఇది నీ చేతిలోకి ఎలా వచ్చిందని అడుగుతుంది. నువ్వు కిందపడేసినప్పుడు అని అంటాడు సూరజ్. నాకు ఐ లవ్ యూ చెప్పావు నేను లెక్క చేయలేదు, అడ్వాంటేజ్ తీసుకుని నేనే నీ మొగుడిని అన్నావు, ఇప్పుడు మన మధ్య ఏదో ఉందని మా బావ, ఆ దీప అనుకునేలా చేశావు. ఇది కూడా నేను లెక్కచేయనని అంటుంది జ్యోత్స్న. నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావని వార్నింగ్ ఇస్తుంది. దాంతో జ్యోత్స్న చేతిలో 500 పెట్టి వెళ్లిపోతాడు సూరజ్.
జ్యోత్స్న, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా దక్షిణామూర్తి ఆఫీస్‌కి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నేను నా మనవరాలి కోసం వచ్చానని జ్యోత్స్న వంక చూపిస్తాడు. నా కోసమే వచ్చుంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి బయల్దేరండి అంటుంది జ్యోత్స్న. నువ్వు లోపల కేబిన్‌లో ఉండాలి కదా? బయట ఎందుకు ఉన్నావని ప్రశ్నిస్తాడు దక్షిణామూర్తి. ఇంతలో ఆఫీస్ బాయ్ రావడంతో తను బయట ఎందుకు కూర్చొందని అడుగుతాడు పెద్దాయన. జ్యోత్స్నగారు.. సీఈవో దీపగారికి అసిస్టెంట్ అని చెప్పడంతో దక్షిణామూర్తి సీరియస్ అవుతాడు. నా మనవరాలు ఎలా ఉండాలి? ఏ స్థానంలో ఉండాలి? నా కూతురికే కాకుండా నా మనవరాలికి కూడా వాడు అన్యాయం చేశాడని రగిలిపోతాడు.
ఇంతలో శివన్నారాయణ వచ్చి.. ఎందుకొచ్చావని అడుగుతాడు. బయట మాట్లాడటం బాగోదని లోపలికి తీసుకెళ్లి దక్షిణామూర్తితో మాట్లాడతాడు పెద్దాయన. నా మనవరాలిని ఎందుకు నీ కూతురి కోడలికి అసిస్టెంట్‌ని చేశావని నిలదీస్తాడు దక్షిణామూర్తి. అది నీ మనవరాలు కాదు ఈ శివన్నారాయణ మనవరాలు. నీ గురించి, మనిద్దరి వైరం గురించి నేను అందరికీ చెప్పేశాను అని అంటాడు శివన్నారాయణ. మామూలుగా అయితే నిన్ను మెడపట్టి గెంటేయాలి, మర్యాదను కాపాడుకుంటాను.. అందుకే లోపలికి రమ్మన్నాను అని చెబుతాడు పెద్దాయన. కాఫీలు రావడంతో దక్షిణామూర్తికి ఎక్కువ షుగర్ ఉన్న కాఫీ కలుపుతాడు శివన్నారాయణ. నాతో వైరాన్ని గట్టిగానే కోరుకుంటున్నావని ఫైర్ అవుతాడు దక్షిణామూర్తి. మాదాపూర్ సర్కిల్ దగ్గరున్న నీ రెస్టారెంట్ ఎదురుగా ఓ పాత రెస్టారెంట్ ఉంది కదా అని దక్షిణామూర్తి అడగ్గా.. మాతో పోటీపడలేక మూసేశారని చెబుతాడు శివన్నారాయణ.
దానిని ఇప్పుడు నేను తీసుకున్నాను, రేపే ఓపెనింగ్. నువ్వు ఎక్కడెక్కడ బ్రాంచీలు పెట్టావో పోటీగా నేను అక్కడ కొత్త హోటల్స్ ఓపెన్ చేశాను. తొందరలోనే మనం మళ్లీ కలుస్తాం, నిన్ను అంత తేలికగా వదిలిపెట్టనని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. నా బ్రాంచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని ఇంత సీక్రెట్‌గా ఎలా ప్లాన్ చేయగలిగాడు? నా దగ్గరున్న మనుషుల్లో వీడి మనుషులు లేరు కదా? ఉంటే అది ఎవరై ఉంటారని ఆలోచిస్తుండగా సూరజ్‌తో దక్షిణామూర్తి మాట్లాడటం చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. దీప, కార్తీక్‌లు కూడా అది చూసి అవాక్కవుతారు. సూరజ్ లోపలికి వస్తుండగా నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని నిలదీస్తాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications