Karthika Deepam 2 July 4th: దక్షిణామూర్తితో సంబంధం ఏంటీ? సూరజ్‌ను నిలదీసిన శివన్నారాయణ

Photo Courtesy: JioHotstar

స్కూటీపై ఆఫీస్‌కి వెళ్తుండగా నిన్న నేడు అడిగిన దాని గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు సూరజ్. నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది జ్యోత్స్న. దాంతో ఓ చోట బైక్ ఆపించి వాటర్ బాటిల్ కావాలని అడుగుతుంది జ్యోత్స్న, ఆ వెంటనే పిన్‌తో టైర్ పంక్చర్ చేస్తుంది. సూరజ్ వచ్చి చూసేసరికి బైక్ పంక్చర్ పడటంతో జ్యోత్స్నని కూర్చోబెట్టి బైక్ నడుపుకుంటూ ఆఫీసుకి తీసుకొస్తాడు సూరజ్. నువ్వు పడిన కష్టానికి ఇదిగో 500 అని అతని చేతిలో పెడుతుంది, నీకు జరిగిన దానిని చెప్పుకుంటే నీ పరువే పోతుందని వెళ్తండగా జ్యోత్స్న లిప్‌స్టిక్ కిందపడుతుంది. దాంతో దానిని తీసుకుని జ్యోత్స్నని ఇరికించడానికి షర్ట్ వెనుక లిప్‌స్టిప్ ముద్ర వేస్తాడు.

సూరజ్ షర్ట్ మీద లిప్‌స్టిక్ గుర్తుచూసిన కార్తీక్.. జ్యోత్స్నని ర్యాగింగ్ చేస్తాడు. నిన్ను కిలోమీటర్ దూరం బైక్ తోయించానని నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నావా అని సూరజ్‌పై మండిపడుతుంది. జ్యోత్స్న, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా.. ఆఫీస్‌కి దక్షిణామూర్తి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నా మనవరాలు ఇలా అసిస్టెంట్‌గా ఉండటం ఏంటని శివన్నారాయణపై రగిలిపోతాడు. ఇంతలో బయటికొచ్చిన పెద్దాయన దక్షిణమూర్తిని తీసుకెళ్లి మాట్లాడతాడు. నీ హోటల్స్‌కి పోటీగా నా హోటల్స్ కూడా ఉంటాయని, ఇకపై నీతోనే వార్ మొదలుపెడతానని దక్షిణామూర్తి వార్నింగ్ ఇస్తాడు. నా ఆఫీస్‌లో దక్షిణామూర్తి మనుషులు ఉన్నారని శివన్నారాయణ ఆలోచిస్తుండగా.. దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 4వ తేదీ 714వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 714 July 4th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని సూరజ్‌ను అడుగుతాడు శివన్నారాయణ. దక్షిణామూర్తి ఎవరని అడుగుతాడు సూరజ్. నువ్వు ఇప్పటి వరకు మాట్లాడిన మనిషి అతనే.. తెలియకుండానే ఇంతసేపు మాట్లాడావా అని మండిపడతాడు. మీ ఇంట్లో వాళ్ల వివరాలు అడుగుతుంటే, అలాంటివన్నీ అడగొద్దు లోపల మా సార్ ఉన్నాడు ఆయనని అడగమని చెప్పానని అంటాడు సూరజ్. మరోసారి ఆ మనిషితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఎందుకు అని సూరజ్ అడగ్గా.. మాట్లాడొద్దని చెప్పాను కదా అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఇదంతా చూసిన కార్తీక్ .. సూరజ్‌ని పక్కకి పిలిచి లోపలికి తీసుకెళ్తాడు.

శౌర్య స్కూల్ నుంచి నేరుగా ఆఫీస్‌కి రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. నేను చెప్పడం ఎందుకు చూపిస్తానని ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తుంది. ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయని అడుగుతాడు శివన్నారాయణ. ఫిఫ్త్ క్లాస్ కూడా పూర్తి చేయని దీప కూతురు క్లాస్ ఫస్ట్ వస్తుందా? తల్లికి తగ్గ తెలివితేటలే పిల్లలకు వస్తాయని నువ్వే అన్నావు కదా? దానికి శౌర్య ఏం చేస్తుందని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను చెప్పిన సందర్భం వేరు, దానిని నువ్వు అర్ధం చేసుకున్న విధానం వేరని అంటాడు పెద్దాయన. ఈరోజు నుంచి ప్రతిరోజూ సాయంత్రం శౌర్య ఇక్కడికి వస్తుంది, శౌర్యకి నువ్వే ట్యూషన్ చెప్పాలని పెద్దాయన చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఒకరి వ్యక్తిగత విషయాల గురించి నీకెందుకు? ఏ నోటితో అయితే శౌర్య చదువుని ఎగతాళి చేశావో అదే నోటితో నువ్వు శౌర్యకి చదువు చెప్పాలని అంటాడు శివన్నారాయణ. అసలు నిన్నెవరు దాని చదువు గురించి మాట్లాడమన్నారు? అందుకే నువ్వే చదువు చెప్పు.. పైగా నీ అంత అందమైన టీచర్ నా కూతురికి దొరకొద్దు అని అంటాడు కార్తీక్. పిన్ని దగ్గర బాగా నేర్చుకోమని చెబుతుంది దీప. పిన్ని అని కాదు జ్యో అని పిలవమని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. తను నీకు పాఠాలు చెబుతుంది కాబట్టి మిస్ అని పిలవమని అంటాడు కార్తీక్. దాంతో జ్యో మిస్.. జ్యో మిస్ అని జ్యోత్స్నని ఆటపట్టిస్తుంది శౌర్య.

శౌర్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జ్యోత్స్న తల పట్టుకుంటుంది. ఇంతలో పారు వచ్చి నువ్వు ఇక్కడేందుకు ఉన్నావని శౌర్యని అడుగుతుంది. ఇదే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా వల్ల కాదని అంటుంది జ్యోత్స్న. పిల్లలకు చదువు చెప్పడం ఒక ఆర్ట్ అని పారు అనడంతో ఆమెను కూర్చోబెట్టి జ్యోత్స్న జారుకుంటుంది. శౌర్య ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రగిలిపోతుంది పారు. సూరజ్ సీరియస్‌గా పనిచేసుకుంటూ ఉండగా.. అతని గురించి తెలుసుకోమని కార్తీక్‌కి చెబుతుంది దీప. దాంతో సూరజ్ దగ్గరికి వెళ్లి అమ్మనాన్నలు ఎవరు? మీది ఏ ఊరు? మీది ఖచ్చితంగా పెద్ద ఫ్యామిలీయే అయ్యుంటుంది. లేకపోతే ఇన్ని మంచి లక్షణాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తాడు కార్తీక్.

చెప్పడానికి, చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు నాకు ఒక అన్నయ్య, వదిన ఉన్నారని సూరజ్ చెప్పగా.. ఎక్కడుంటారని కార్తీక్ అడుగుతాడు. ఇక్కడే నాతోనే ఉన్నారని సూరజ్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నా ఒంటరి జీవితంలోకి దేవుడిచ్చిన బంధవులు.. అందుకే ఈ ఆఫీస్‌కి నేనొచ్చిన పని అయినా మీరు అడగ్గానే ఉండిపోయానని చెబుతాడు సూరజ్. నీకు ఎవరూ లేరనే ఆలోచన మరిచిపో.. నీకు మేం ఉన్నామని అంటుంది దీప. ఆఫీస్‌కు వచ్చిన పెద్దాయన ఎవరు? సార్ ఎందుకు అంత సీరియస్ అయ్యాడని అడుగుతాడు సూరజ్.

ఆయన పేరు దక్షిణామూర్తి.. మా తాత చిన్నప్పటి ఫ్రెండ్, ప్రస్తుతం వీరిద్దరూ శత్రువులు, దక్షిణామూర్తి నీడని కూడా మా తాత తట్టుకోలేడు. ఇది ఆఫీస్ కాబట్టి సరిపోయింది? అదే ఎవరూ లేని సమయంలో వీళ్లు ఎదురుపడితే కొట్టుకోకుండా మనం అడ్డుపడాలని చెబుతాడు కార్తీక్. ఛైర్మన్ గారికి శత్రువు అంటే మనకి కూడా శత్రువే అని అంటాడు సూరజ్. గొప్ప గొప్ప సంస్థలన్నీ అందులో ఉన్న నమ్మకస్తుల వాళ్లే నాశనమైపోయాయని అంటాడు కార్తీక్. నేను మీలో ఒకడిని, మీ బంధాన్ని నేను జీవితాంతం కాపాడుకుంటానని చెబుతాడు సూరజ్. ఏంటీ ఆ బంధం అని జ్యోత్స్న వచ్చి అడగ్గా.. దీప గారు నా వదిన, కార్తీక్ గారు నాకు అన్నయ్య అని చెబుతాడు సూరజ్.

మీరంతా ఏదో ఒకరోజు బంధువులు అయిపోతారని నేను ఊహించా.. అవసరానికి కలుపుకునే బంధాలు ఎక్కువ కాలం నిలబడవని చెబుతుంది జ్యోత్స్న. వదిన అన్న పిలుపు అభిమానం వల్ల పుట్టింది, కొన్ని చెప్పినా అర్ధం చేసుకునే స్థాయి నీకు లేదని అంటాడు సూరజ్. మీరంతా ఒక్కటైంది నన్ను లేకుండా చేయడానికే అని నాకు తెలుసు.. మీరు ఎంతమందితో వచ్చినా నేనొక్కదానిని చాలని అనుకుంటుంది జ్యోత్స్న.

శౌర్యకి పారిజాతం పద్యాలు వాటి అర్ధాలు చెబుతుంటుంది. అయితే శౌర్య అడిగే ప్రశ్నలకు పారు విచిత్రంగా సమాధానాలు చెప్పడంతో శౌర్య వాటిని సరిచేస్తుండగా శివన్నారాయణ వచ్చి మెచ్చుకుంటాడు. చంటిదానికి తెలిసింది కూడా నీకు తెలియనప్పుడు తెలుసని ఎందుకు చెప్పడం అని పారుపై మండిపడతాడు శివన్నారాయణ. ఇప్పటి నుంచి పారిజాతానికి నువ్వు ట్యూషన్ చెప్పు, కనీసం నీ వల్లనైనా నేర్చుకుంటుంది అని పెద్దాయన అంటాడు. జ్యోత్స్న కోసం బోల్డెన్నీ ఫైల్స్ తీసుకొచ్చి స్టడీ చేయమని చెబుతాడు కార్తీక్. ఇదంతా నా వల్ల కాదని చేతులెత్తేస్తుంది. సీఈవో గారు చెప్పిన పని చేయకపోతే పెద్ద సార్.. వేరే పనిష్మెంట్ ఇస్తాడని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఆ దెబ్బతో చేస్తానని ఒప్పుకుంటుంది జ్యోత్స్న. రేపు ఉదయం నాటికి ఈ పని పూర్తి చేసి పెద్దసార్‌కి ఇవ్వాలని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఇన్నాళ్లు ఇంత వర్క్ మేమే చేశాం.. మీరు తిని తిరగడం తప్పించి ఏం చేశారని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఇప్పుడు మీకు పనిచేయాల్సిన అవసరం, అవకాశం రెండూ వచ్చాయని అంటాడు. నిన్ను, మీ ఆవిడ కలిసి నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారా అని మండిపడుతుంది జ్యోత్స్న. నేను పగ తీర్చుకోవాలని అనుకుంటే బాలరాజు సంగతి సుమిత్ర అత్తకి ఎప్పుడో చెప్పేవాడిని అంటాడు కార్తీక్. మీరు అవకాశం కోసం చూస్తున్నారు, ఆ రోజు నా సంగతి ఏంటో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న. తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే దీప పుట్టినిప్పుడు మీ నానమ్మ ఎక్కడ వదిలేసిందో నిన్ను కూడా అక్కడే వదిలేస్తారని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X