Karthika Deepam 2 July 6th: సూరజ్‌‌‌ని కొట్టిన శివన్నారాయణ.. కొత్త రెస్టారెంట్స్‌తో దక్షిణామూర్తి మైండ్‌గేమ్

Photo Courtesy: JioHotstar

దక్షిణామూర్తితో మాట్లాడుతున్న సూరజ్‌ను చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. దక్షిణామూర్తితో నీకెంటీ సంబంధం అని పెద్దాయన నిలదీయగా.. ఆయనెవరు అని సూరజ్ అడుగుతాడు. నువ్వు ఇప్పటి దాకా మాట్లాడిన వ్యక్తి అతనే అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఇకపై అతనితో నువ్వు మాట్లాడొద్దని పెద్దాయన చెబుతాడు. ఇదంతా చూసిన దీప, కార్తీక్‌లు సూరజ్‌ను పక్కకి తీసుకెళ్తారు. ఇంతలో బ్యాగ్ తీసుకుని శౌర్య రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దీప లాంటి ఫిఫ్త్ క్లాస్ చదివిన తల్లి.. ఏం ట్యూషన్ చెబుతుందని జ్యోత్స్న సైటైర్లు వేస్తుంది

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివన్నారాయణ.. శౌర్యకి చదువు చెప్పే బాధ్యతను జ్యోత్స్నకి అప్పగిస్తాడు. పిల్లలకు చదువు చెప్పడం ఒక మధ్యలో దూరిన పారిజాతానికి శౌర్యని అప్పగించి తప్పుకుంటుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి ఎవరో అతనితో శివన్నారాయణ గారికి వైరం ఏంటో సూరజ్‌కు చెబుతాడు కార్తీక్. అలాగే సూరజ్ గతం గురించి అడగ్గా.. నాకు ఎవరూ లేరు, మీరే నాకున్న బంధమని చెబుతుండగా జ్యోత్స్న వింటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 6వ తేదీ 715వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 715 July 6th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఆఫీస్‌లో చాలా వర్క్ ఉండటంతో సూరజ్‌ని హెల్ప్ అడుగుతుంది జ్యోత్స్న. నేను చేయను అంటాడు సూరజ్. అయితే నేను మా తాతతో చెబుతానని అంటుంది. దాంతో పెద్దాయన కోసం ఏమైనా చేస్తానని ఫైల్స్ చూడటం మొదలు పెడతాడు. సూరజ్ కష్టపడుతుంటే జ్యోత్స్న మాత్రం ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన సూరజ్.. నేను నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు గేమ్స్ ఆడుతున్నావా అని మండిపడతాడు. నిన్ను ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసని అనుకుంటాడు.

ఉదయాన్నే ఇచ్చిన వర్క్ మొత్తం ఫినిష్ చేశానని శివన్నారాయణకి చూపిస్తుంది జ్యోత్స్న. టిఫిన్ చేశావా అని దీపని అడగ్గా, జ్యోత్స్నని ఏ మాత్రం పట్టించుకోడు. ఫైల్స్ చూస్తున్న శివన్నారాయణ అందులో తప్పు చూసి నీ డిగ్రీ తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేయమని అంటాడు. నువ్వెళ్లి కాఫీ తీసుకురా అని పారుపై మండిపడతాడు. బ్రాంచ్ కోడ్ తప్పు రాయడంతో ఇన్నాళ్లూ సీఈవోగా ఏం చేశావని సీరియస్ అవుతాడు. సూరజ్ గాడు అన్ని బాగానే చేశానని చెప్పాడు, ఇదేంటీ అని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.

నిజాయితీగా పోటీలో గెలవడం చేతకాదు, నిజాలు మాట్లాడటం చేతకాదు, చివరికి అసిస్టెంట్‌గా పనిచేయడం కూడా చేతకావడం లేదు. మీ నాన్న ఊరిలో లేడు.. ఆయన కనుక ఫైల్ చూసుంటే తలకేసి కొట్టుకునేవాడని అంటాడు శివన్నారాయణ. పారు కాఫీ తీసుకుని రావడంతో అది దీపకి ఇవ్వమని చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. పారిజాతం కనీసం కాఫీ ఇవ్వడానికైనా సరిపోతుంది, ఈ జ్యోత్స్న అందుకు కూడా పనిచేయడం లేదు. పనిచేశాక ఒకసారి చెక్ చేసుకోవాలి కదా? అని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఇంతలో సూరజ్ వచ్చి ఇదే మాట నేను కూడా చెప్పానని ఫైల్స్ తీసుకొచ్చి చూపిస్తాడు. జ్యోత్స్న గారికి నేను హెల్ప్ చేశాను, వర్క్ అయిపోయాక ఒకసారి చెక్ చేద్దామని చెబితే వర్క్ నీకు కొత్త.. నాకు కొత్త కాదు, నేను ఒకసారి ఫైల్ ప్రిపేర్ చేస్తే దానిని పట్టుకోవడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదని చెప్పిందని అంటాడు సూరజ్.

నైట్ మొత్తం పనిచేసి అలిసిపోయిన మీ జ్యోత్స్న మేడంకి కాఫీ ఇవ్వమని పారుతో సీరియస్ అవుతాడు పెద్దాయన. సీఈవోగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే అసిస్టెంట్ పోస్ట్‌కి వచ్చావు. ఇది కూడా చేయకపోతే అని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు చెప్పింది సూరజే కరెక్ట్.. జ్యోత్స్నకి సూరజే సరైన వ్యక్తని కార్తీక్‌తో అంటుంది దీప. గార్డెన్‌లోకి వెళ్లి నువ్వు కావాలనే తప్పులు చేశావని సూరజ్‌తో గొడవ పడుతుంది జ్యోత్స్న. బ్రాంచ్‌ కోడ్‌లు ఎందుకు తప్పులు చేశావని సీరియస్ అవుతుంది. పని మానేసి మొబైల్‌లో రీల్స్ చూస్తూ కూర్చుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అరిస్తే పోయేది నీ పరువేనని మండిపడతాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని అనుకుంటుంది జ్యోత్స్న.

పారు ఇంటిపని చేస్తుండగా దానిని ఫోటోలు, వీడియో తీస్తాడు కార్తీక్. నేను అందంగా అలంకరించుకున్నప్పుడు ఒక్కసారి కూడా ఫోటోలు తీయలేదు, ఇప్పుడెందుకు తీస్తున్నావని అంటుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి రెస్టారెంట్స్ అసోసియేషన్ మీటింగ్ ఉందని సార్ ఉన్నారా అని అడుగుతాడు. అతని ముందు ఇంటి ఓనర్‌లా బిల్డప్ ఇస్తుంది పారు. వాళ్లు వెళ్లిపోయే వరకు నేను ఈ ఇంటి ఛాయల్లో కనిపించనని చెబుతుంది పారు. రెస్టారెంట్స్ ఓనర్స్ అంతా వచ్చి ఎలా ఉన్నారని అడుగుతుంది. నా మనవళ్లు, మనవరాళ్లు వల్ల హ్యాపీగానే ఉందని చెప్పి దీపని అందరికీ పరిచయం చేస్తాడు శివన్నారాయణ.

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ది బెస్ట్ రెస్టారెంట్స్ కాంపీటిషన్ పెడుతున్నామని వచ్చినవాళ్లు చెబుతారు. ఈసారి లైవ్‌లో రెస్టారెంట్ చెఫ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పడంతో కార్తీక్ సంతోషిస్తాడు. ఈసారి ఒక కొత్త రెస్టారెంట్ పోటీకి దిగుతుందని చెప్పడంతో అది ఎవరిదని అడుగుతాడు శివన్నారాయణ. అది నాదేనంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. దక్షిణామూర్తి లోపలికి రావడంతో సుమిత్ర, శివన్నారాయణలు షాక్ అవుతారు. మీ రెస్టారెంట్స్‌కి ఎదురుగా కొత్త బ్రాంచ్‌లని ఈరోజే ఓపెన్ చేశాను, రెస్టారెంట్ ఓనర్స్‌ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నాను. దక్షిణాది వంటలు చేయడంలో తిరుగులేని వంటవాళ్లు నా దగ్గర ఉన్నారు. మీతో పోటీ పడాలని నిర్ణయించుకున్నాం, ప్రతిసారి మీరే గెలుస్తారని చెబుతాడు దక్షిణామూర్తి. మేమిచ్చే ఫుడ్ వల్లే గెలుస్తున్నామని.. కార్తీక్ నన్ను గెలిపిస్తాడని అంటాడు శివన్నారాయణ.

రెస్టారెంట్స్‌ కొత్తవి కానీ, వ్యాపారానికి కొత్త కాదు. మీలాంటి వాళ్లతో పోటీపడటం నాకు చాలా సంతోషంగా ఉందని అంటాడు శివన్నారాయణ. ఇంతలో దక్షిణామూర్తి ఇళ్లంతా చూస్తూ ఎవరి కోసమో వెతుకుతాడు. అది గమనించిన శివన్నారాయణ.. వీడి చూపులు వెతికేది సూరజ్ కోసమేనా అని అనుమానిస్తాడు. మీరు కలిసింది 3 నిమిషాల క్రితమే అయినా బంధువులా మాట్లాడుతున్నారని మెచ్చుకుంటారు రెస్టారెంట్స్ ఓనర్స్. దక్షిణామూర్తిని ఆపి నువ్వు వెళ్లి సూరజ్‌ని తీసుకుని రమ్మని చెబుతాడు శివన్నారాయణ. లోపలికి రాగానే సూరజ్‌ని కొడతాడు పెద్దాయన. ఇది చూసి అంతా షాక్ అవుతారు.

దక్షిణామూర్తిలో ఎలాంటి చలనం లేకపోవడంతో శివన్నారాయణ సంతోషిస్తాడు. కారణం లేకుండానే సూరజ్‌ని ఎందుకు కొట్టావని తాతని అడుగుతాడు కార్తీక్. అది నేను చెబుతాను.. అనుమానం తీర్చుకోవడానికి అని సూరజ్ అంటాడు. ఇప్పుడొచ్చిన పెద్దాయనతో నాకు సంబంధం ఉందని ఛైర్మన్ గారి అనుమానం, నన్ను కొడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలని ఛైర్మన్ గారు కొట్టారని చెప్పడంతో సూరజ్‌ని మెచ్చుకుంటాడు పెద్దాయన. నా అనుమానాన్ని నువ్వు అర్ధం చేసుకున్నావు, ఇప్పడు నా అనుమానం తీరింది. నేను నా అనుకున్నవాళ్ల మీదే చేయి ఎత్తుతాను, నీ మనసులో ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దని చెబుతాడు శివన్నారాయణ. సూరజ్‌తో జాగ్రత్తగా ఉండాలని జ్యోత్స్నని పారిజాతం హెచ్చరిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X