Karthika Deepam 2 July 8th: దక్షిణామూర్తి కోడలే మాలిని దేవి.. శివన్నారాయణపై ప్రతీకారానికి పథకం రెడీ
Photo Courtesy: JioHotstar
సూరజ్ మీద నాకు కూడా అనుమానంగానే ఉందని దీపతో అంటాడు కార్తీక్. తాతకి శత్రువైన దక్షిణామూర్తితో మాట్లాడటం, పైగా ఆయన రెస్టారెంట్స్ పెట్టి మన మీదకి పోటీకి రావడం తేడాగా ఉందని చెబుతాడు కార్తీక్. ఇన్నేళ్లుగా తిండి పెట్టిన కుటుంబానికి జ్యోత్స్నే ద్రోహం చేసింది.. బయటివాళ్లు మోసం చేయరని గ్యారెంటీ ఏంటీ అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఇంత జరుగుతుంటే నాన్న ఎక్కడికి వెళ్లాడని దీప అడగ్గా.. రెస్టారెంట్స్ ఓనర్స్ వాళ్లు పెట్టిన టూర్‌కి వెళ్లాడని చెబుతాడు కార్తీక్.
మా తాత నిన్ను కొట్టాడు కదా? మరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్లిపోతున్నావని సూరజ్‌ని అడుగుతుంది జ్యోత్స్న. నా అనుకున్నవాళ్లు కొడితే నేను పెద్దగా పట్టించుకోను, నమ్మకం ఉన్నచోటే అనుమానం కూడా ఉంటుందని చెబుతాడు సూరజ్. మా తాతని ఇంత అర్ధం చేసుకున్నవాడివి నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నిన్ను అర్ధాంగిని చేసుకుంటానని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. నీ రేంజ్ వేరు.. నా రేంజ్ వేరని ఆమె పొగరు చూపించడంతో.. శివన్నారాయణ గారి మనవరాలు కాకపోతే నీ బతుకు దారుణమని చెబుతాడు. నిన్ను నన్ను కలపడానికి ఒకరు వస్తారని సూరజ్ చెప్పగా.. కథలోకి మాలిని అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఓ హోటల్‌కి వెళ్లి కాఫీ తాగి నీ రెస్టారెంట్‌ని అమ్ముతావా? లేదా? అంటూ ఓనర్‌తో గొడవపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 8వ తేదీ 717వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీకు ఇల్లు, ఆఫీస్ తప్పించి ఎలాంటి పనులు ఉండవు కదా? రెండు గంటలు టైం ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. నీకు ఎవరు లేరని తెలిసింది, సొంత విషయాలేంటీ అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? సొంతవాళ్లు ఎవరూ లేనప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నాకు దోషం ఉంది, దాని నివారణ కోసం శనీశ్వరుడిని కలవడానికి వెళ్తున్నానని చెబుతాడు సూరజ్. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని జ్యోత్స్నని చూస్తూ అంటాడు. ఆ మాటలతో పారు నవ్వుతుంటుంది.
మొన్న ఛైర్మన్ గారు నా పెళ్లి గురించి అడిగారు.. మిమ్మల్ని, వదినగారిని చూసి నేను కూడా పెళ్లి చేసుకుని మీలాగే ఆదర్శ దాంపత్యాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో రెండు మూడు సంబంధాలు చూశాను కానీ రిజెక్ట్ అయ్యాయని చెబుతాడు సూరజ్. నిన్ను రిజెక్ట్ చేసిన ఆ దురదృష్టవంతురాలు ఎవరు? నీకు ఎవరు ఇష్టమో చెప్పు.. నేనే వెళ్లి ఆ పెద్దవాళ్లతో మాట్లాడి నీ పెళ్లికి ఒప్పిస్తానని అంటాడు కార్తీక్. నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యాను.. నవగ్రహా దోషాలు పోగొట్టుకోకపోతే పెళ్లికాని వాళ్లకి పెళ్లయిన వాళ్ల మీద వ్యామోహం కలుగుతుందని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది.
రేపు శని త్రయోదశి కదా? గుడిలో పూజ చేయించుకుని ఆఫీస్‌కి వస్తానని చెబుతాడు సూరజ్. అయితే మేం కూడా రేపు గుడికి వెళ్తామని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్నకి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా? నీ జాతకంలో కూడా దోషం ఉందని పంతులుగారు చెప్పారు కదా? రేపు మంచిరోజు నవగ్రహాలకు అభిషేకం చేసుకుందామని అంటాడు శివన్నారాయణ. సూరజ్‌ని కూడా మాతో కలిసి భోజనం చేయమని చెబుతాడు పెద్దాయన.
మాలిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు బాలా. నా హోటల్‌లో చెఫ్‌లు అందరినీ ఒకేసారి కొనేస్తే నేనేం చేయాలి? హోటల్ ముసుకోవాలా? అని మండిపడతాడు. వారికి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి, హోటల్ అమ్మను అన్నానని చెఫ్‌లను కొనేశారు. ఇది వ్యాపార లక్షణం కాదని మండిపడతాడు. నాకు అవసరం ఉంది, వాళ్లకు అవకాశం వచ్చింది.. నిజాయితీగా పనిచేసే వాళ్లని ఎవరూ కొనలేరు, అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు అంటుంది మాలిని. నువ్వు ఇచ్చిన దానికంటే డబుల్ పేమెంట్ ఇచ్చి నేను వాళ్లని తీసుకుని వెళ్తాను, నా హోటల్ మాత్రం నీకు అమ్మను అంటాడు బాలా.
ఇంతలో హోటల్‌పై రాళ్లదాడి జరుగుతున్నట్లుగా ఫోన్ రావడంతో బాలా షాక్ అవుతాడు. ఇది ఇక్కడితో ఆగదు, రాళ్లకు బదులు అగ్గిపెట్టే విసిరారు అనుకో.. హోటల్ పరిస్ధితి ఏంటీ? కాలిపోతే బూడిదే మిగులుతుంది, అమ్ముకుంటే డబ్బు మిగులుతుందని చెబుతుంది మాలిని. హోటల్ కొనేదాకా మీరు వదిలిపెట్టరు, నేను అక్కడ బిజినెస్ చేయను. నా హోటల్ మీరే తీసుకోండి అని చెబుతాడు బాలా. సేల్ అగ్రిమెంట్ పేపర్ తెప్పిస్తే సంతకం పెడతాను, 4 కోట్లు ఇస్తాను అన్నారు కదా ఇవ్వండి అని అడుగుతాడు బాలా. మీ కస్టమర్లు మీకు ఉన్నప్పుడు అమ్ముకోవడం దేనికి, మీరే రన్ చేయండి అని చెబుతుంది మాలిని. క్వాలిటీని మీరు కొనేసిన తర్వాత నా దగ్గరికి ఎవరొస్తారు? నాకు అమ్మడం తప్పించి వేరే దారి లేదని సంతకం పెట్టబోతుండగా హోటల్ ఖరీదు 2 కోట్ల రూపాయలే ఉంటుంది. దీనిపై బాలా ప్రశ్నించగా.. నేను అడిగినప్పుడు నువ్వు అమ్ముంటే 4 కోట్లు.. నువ్వు అడిగినప్పుడు నేను కొంటే 2 కోట్లేనని తేల్చేస్తుంది మాలిని. ఆ మాటలతో బాలా షాక్ అవుతాడు.
ఓడిపోయేవాడు వాడి బలహీనతను వాడే చెబుతాడు. నీ బలహీనతే ఏంటో మీరే నాకు చెప్పారని అలాంటప్పుడు మిమ్మల్ని ఇక్కడి వరకు రప్పించడం చాలా ఈజీ అని అంటుంది మాలిని. ఇంతలో అక్కడికి దక్షిణామూర్తి వస్తాడు. ఆయన మనింటికి ఎందుకు వచ్చాడని అడగ్గా.. తన హోటల్‌ని మనకి అమ్మేశారని చెబుతుంది మాలిని. మంచి హోటల్ బాగా రన్ అవుతుంది, మనకి ఎందుకు అమ్మాడని అడుగుతాడు దక్షిణామూర్తి. రేసులో బాగా పరిగెత్తే గుర్రాల మీదే పందెం కాస్తారని మీరే చెప్పారు కదా? మనం గెలవాలంటే బాగా పరిగెత్తే గుర్రాలని కొనాలని అంటుంది మాలిని. నాకు కొడుకువైనా, కోడలివైనా అన్ని నువ్వేనని అంటాడు దక్షిణామూర్తి. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్ధమైంది.. అది కూడా తొందరలోనే జరుగుతుందని అనుకుంటుంది మాలిని.
శివన్నారాయణ ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా జ్యోత్స్న వాళ్లతో కలిసి తినకుండా వడ్డిస్తానని చెబుతుంది. సూరజ్‌కి పప్పు వడ్డిస్తానని చెప్పి షర్ట్ మీద పప్పు పడేస్తుంది. దాంతో జ్యోత్స్నపై మండిపడుతుంది సుమిత్ర. అతనికి సారీ చెప్పమని అంటుంది. అలాంటిదేం వద్దని పొరపాటున పడింది తప్పించి, బయటివాళ్లు మా ఇంట్లో భోజనం చేస్తున్నారని అవమానించాలని పడేయలేదు కదా అంటాడు సూరజ్. దీపగారి చేతిలో జ్యోత్స్న గారు ఓడిపోయారు.. పరోక్షంగా నేను కూడా కారణమై ఉంటానని పగతో ఇలా చేసింది అనుకుంటున్నారా? అని చెబుతాడు సూరజ్. జ్యోత్స్నగారు కావాలని ఇది పొరపాటున జరిగింది.. ఆవిడని ఏం అనొద్దని అంటాడు సూరజ్.
ఆ షర్ట్ బయటపడేస్తే నేను క్లీన్ చేయిస్తానని చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నతోనా అని పారు అడగ్గా.. తనవల్లే షర్ట్ పాడైంది కాబట్టి, తనే క్లీన్ చేస్తుందని అంటుంది. రేపు అత్తారింటిలో అత్తగారి మీదనో, భర్త మీదనో పోస్తే మీ నానమ్మ నిన్ను సరిగా పెంచలేదని అంటుందని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నా షర్ట్ నా చేతితో ఉతుక్కుంటానని అంటాడు సూరజ్. వాడు సారీ వద్దు అన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడని జ్యోత్స్నని హెచ్చరిస్తుంది పారు. ఇంతలో సూరజ్ వీడియో కాల్ చేస్తాడు. పప్పు పడిన షర్ట్ నా షర్ట్ ఉతకపోతే మీ శారీని తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications