Karthika Deepam 2 July 9th: జ్యోత్స్నపై పగ తీర్చుకున్న సూరజ్..శివన్నారాయణకి ఎదురుపడ్డ మాలిని దేవి

Photo Courtesy: JioHotstar

నీకు ఎవరూ లేరు అని చెప్పావు? మరి నీకు రెండు గంటలు టైం ఎందుకు? ఎవరిని కలుస్తున్నావని కార్తీక్, శివన్నారాయణలు సూరజ్‌ని అడుగుతారు. రేపు నేను దోష పరిహారం కోసం గుడికి వెళ్తున్నానని చెబుతాడు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమెతో పెళ్లి కావాలంటే శని అడ్డుపడుతున్నాడని అందుకే నవగ్రహాలకు పూజ చేయించుకుంటున్నాను అంటాడు సూరజ్. అయితే మనం కూడా గుడికి వెళ్దామని సుమిత్రతో చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న జాతకంలో కూడా దోషం ఉందని గుర్తుచేస్తాడు.

మాలిని దేవిని వెతుక్కుంటూ బాలా పరిగెత్తుకుంటూ వస్తాడు. నా హోటల్‌లో చెఫ్‌లను కొనేశారు, మనుషుల్ని పెట్టి రాళ్లు వేయిస్తున్నారు ఇక ఆ ఏరియాలో నేను వ్యాపారం చేయలేనని అంటాడు. మీరు చెప్పినట్లే హోటల్‌ని అమ్మేస్తానని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేస్తాడు. ఇంతలో దక్షిణామూర్తి రావడంతో మంచి హోటల్‌ని కొన్నావని కోడల్ని మెచ్చుకుంటాడు. ప్రతీకారానికి అన్ని రెడీ అయ్యాయి.. ఇక పగ సాధించడమేనని మనసులో అనుకుంటుంది. తనతో పాటు భోజనం చేస్తున్న సూరజ్ మీద కావాలని పప్పు పడేయటంతో అతని షర్ట్ పాడైపోతుంది. ఈ షర్ట్‌ని నేను ఉతుక్కుంటాను, జ్యోత్స్న గారిని ఏం అనొద్దని అంటాడు సూరజ్. ఆ వెంటనే జ్యోత్స్నకి వీడియో కాల్ చేసి నువ్వు నా షర్ట్ వాష్ చేయకపోతే నేను నీ కాస్ట్‌లీ చీరని తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 9వ తేదీ 718వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 718 July 9th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మర్యాదగా నా షర్ట్ ఉతుకుతావా లేదా అని సూరజ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఎవ్వరితో చెప్పుకుంటావో చెప్పుకో నేను మాత్రం షర్ట్ ఉతకనని తేల్చేస్తుంది జ్యోత్స్న. నువ్వు ఉతకకపోతే నా గదిలోకి అమ్మాయిని ఎవరు పంపారో? ఎవరో క్యారియర్ పంపారో అన్ని ఆధారాలతో సహా ఉన్నాయని సూరజ్ చెప్పడంతో పారిజాతం వణికిపోతుంది. వీడు ఈ విషయాన్ని ఇంకా మరిచిపోలేదు.. ఉతకవే అని మనవరాలితో అంటుంది. నేను మాత్రం ఉతకనని తేల్చేస్తుంది జ్యోత్స్న.

మరోవైపు.. హోంవర్క్ చేసుకుంటూ కునికిపాట్లు పడుతుంది శౌర్య. అది చూసిన కాంచన మండిపడుతుంది. నేనింక చదువుకోను మానేస్తాను.. జాబ్ చేస్తానని అంటుంది శౌర్య. తమరు చదివేది ఫోర్త్ క్లాస్.. ఎంబీఏ ఏం కాదు, ఫోర్త్ క్లాస్‌కి జాబ్ ఎవరిస్తారు అని అడుగుతుంది కాంచన. మీ నాన్న, ముద్దుల తాత జాబిస్తాడు. ఫిఫ్త్ క్లాస్ చదివిన అమ్మకి సీఈవో జాబ్ ఇచ్చినప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్న నాకు ఆ మేనేజర్ పోస్ట్ అయినా ఇవ్వడా అని శౌర్య అనడంతో కార్తీక్, కాంచన, దీపలు షాక్ అవుతారు.

నేను ఆఫీస్‌కి వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయాను, స్కూల్‌కెళ్లి చదువుకోవడానికి ముందు ఇప్పుడే జాబ్‌లోకి వెళ్లిపోతే అప్పుడు నానమ్మ అన్ని కొనిస్తుందని చెబుతుంది శౌర్య. పిల్లల్ని పిల్లల దగ్గరే ఉంచమంటే మీరు ఆఫీస్‌కి తీసుకెళ్లారు. అది అన్ని చూసి ఇలా మాట్లాడుతోందని చెబుతుంది కాంచన. దీనిని ట్యూషన్‌లో వేసేద్దామని అంటుంది దీప. మా మమ్మీ సీఈవో అని, ఐదో తరగతి చదివింది అని చెబితే మా మిస్ నవ్వింది. ఫిఫ్త్ క్లాస్‌కి సీఈవో అవుతారా అని మా మిస్ అడిగింది అని చెబుతుంది శౌర్య.

ఆఫీస్ వర్క్ ఆఫీస్‌లోనే వదిలేయ్.. నెత్తిమీద ఇంకా బరువులు వేసుకోవద్దని టైం ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతుంది కాంచన. కబుర్లు చెప్పుకుని కాలాన్ని మరిచిపోయి బతకడంలోనూ చాలా ఆనందం ఉంటుంది. ఎంత వయసొచ్చినా భార్యాభర్తలు మాట్లడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయని అంటుంది కాంచన. నీ కొడుకు విషయంలో నువ్వు కోరుకున్నట్లే నీ విషయంలో నీ కొడుకు కోరుకుంటే నువ్వేం సమాధానం చెబుతావని కార్తీక్ అడగటంతో కాంచన షాక్ అవుతుంది.

జ్యోత్స్న చేత షర్ట్ ఉతికిస్తాడు సూరజ్. కావాలనే చాలా పద్ధతిగా నా మీద పప్పు పోసిందని పారుతో అంటాడు సూరజ్. సారీ చెప్పిపోయే దానికి చాకీరావు దాకా తెచ్చుకున్నావని మనవరాలిపై మండిపడుతుంది పారు. ఇటువైపు ఎవరూ రారు.. నేనే షర్ట్ ఉతుక్కుంటున్నానని అనుకుంటారని అంటాడు సూరజ్. మా ఇంట్లో మా కన్నా నీకే ఎక్కువ విషయాలు తెలుసని మెచ్చుకుంటుంది పారు. చివరికి షర్ట్ ఉతికి ఇచ్చినట్లే ఇచ్చి దానికి పెద్ద బొక్క పెడుతుంది జ్యోత్స్న. అది చూసి సూరజ్ షాక్ అవుతాడు. ఈ షర్ట్‌ని నా జ్ఞాపకంగా దాచుకోమని చెబుతుంది జ్యోత్స్న. నీ పొగరే నీ ఐడెంటిటీ.. నీ మెడలో మూడు ముళ్లు వేసే వరకు వదిలిపెట్టనని అనుకుంటాడు సూరజ్.

నువ్వు చెప్పినట్లుగానే మేం ఉంటాం.. మరి మేం కోరుకున్నట్లుగా నువ్వు ఉంటావా అని అడుగుతాడు కార్తీక్. ఇంతలో కాంచనకి శ్రీధర్ వీడియో మెసేజ్ పంపిస్తాడు. మేం వెళ్లి పడుకుంటాం, నువ్వు పర్సనల్‌గా చూసుకోమని చెబుతాడు కార్తీక్. దాంతో అందరిముందే దానిని ఓపెన్ చేద్దామని అంటుంది కాంచన. వీడియో మెసేజ్‌లో శ్రీధర్ మాట్లాడుతూ.. నా గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, దేవుడికి ఇంకా నా మీద జాలి ఉంది, నీతో ఉంచడానికే నా ఆపరేషన్ సక్సెస్ చేశాడు. రేపే బయల్దేరి ఇండియా వస్తున్నాను, రాగానే మొదట నిన్నే కలుస్తాను అని చెబుతాడు శ్రీధర్.

నాన్నకి నువ్వంటే ప్రాణం. ఆ ప్రాణాల్ని నిలబెట్టుకుని నీకోసం వస్తున్నాడు, నువ్వు నోటితో ఏం చెప్పకపోయినా నీ కళ్లే చెబుతున్నాయని అంటాడు కార్తీక్. రేపు మీరు ఎక్కడికి వెళ్లొద్దు.. ఆయన మీ కోసమే వస్తున్నాడని అంటుంది కాంచన. రేపొద్దున గుడికి వెళ్లాలి, జ్యోత్స్నకి దోషం ఉందని నవగ్రహాలకు పూజ చేయాలని అందరం గుడికి వెళ్దామని తాత చెప్పాడని అంటాడు కార్తీక్. కొడుకు వెళ్లిపోగానే భర్త గురించి ఆలోచిస్తుంది కాంచన. నేను మిమ్మల్ని వద్దు అనుకున్నాను, నా ఐదోతనం నాతో ఉన్నంత కాలం మీరు నాతో ఉన్నట్లే. మీ భార్యగా మీ క్షేమం కోరుకోకుండా ఎలా ఉంటాను, ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగిందని అనుకుంటుంది.

ఉదయాన్నే కుటుంబంతో కలిసి గుడికి వస్తాడు శివన్నారాయణ. అయితే అక్కడ టిఫిన్, అన్నదాన కార్యక్రమాలు చూసి ఎవరు చేయిస్తున్నారని పంతులుగారిని అడుగుతాడు పెద్దాయన. వాళ్లది కూడా మీలాగే పెద్ద కుటుంబమని చెప్పి చూపించగా అక్కడ దక్షిణామూర్తి, మాలిని హోమం చేయిస్తూ ఉంటారు. అది చూసి అంతా షాక్ అవుతారు. చేసిన పాపాలు కడుక్కోవడానికి అనుకుంటానని అంటుంది జ్యోత్స్న. నాకు ఒక కొడుకు, కోడలు ... నా కూతురి క్షేమం కోసం చేస్తున్న శాంతి హోమం, నా కూతురి పేరు సుమిత్ర, అల్లుడి పేరు దశరథ, మనవరాలి పేరు జ్యోత్స్న అంటాడు దక్షిణామూర్తి. వాళ్లంతా క్షేమంగా ఉండాలని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X