Karthika Deepam 2 July 10th: సూరజ్‌- మాలినిల బంధంపై జ్యోత్స్న అనుమానం.. దీపని టార్గెట్ చేసిన మాలిని

Photo Courtesy: JioHotstar

మర్యాదగా నా షర్ట్ ఉతుకుతావా లేక నీ కాస్ట్‌లీ చీరను కాల్చేయాలా? అని సూరజ్ బెదిరించడంతో జ్యోత్స్న వణికిపోతుంది. అంతేకాకుండా నా గదిలోకి అమ్మాయిని ఎవరు పంపారో? ఎవరు క్యారియర్ పంపారో? ఎవరు తలుపుని లాక్ చేశారో అన్ని ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని సూరజ్ చెప్పడంతో పారు షాక్ అవుతుంది. అర్ధరాత్రి వరకు ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉండటంతో దీపపై సీరియస్ అవుతుంది కాంచన. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకునే విషయాలు కొన్ని ఉంటాయి.. మీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారని అంటుంది. ఇంతలో శ్రీధర్ నుంచి వీడియో మెసేస్ వస్తుంది.. నాకు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. రేపే ఇండియాకు వస్తున్నామని చెబుతాడు శ్రీధర్. దాంతో కాంచన, దీప, కార్తీక్‌లు సంతోషిస్తారు.

సూరజ్ దెబ్బకు జ్యోత్స్న షర్ట్ ఉతుకుతుంది. అయితే షర్ట్ ఉతికినట్లే ఉతికి దానికి బొక్క పెడుతుంది జ్యోత్స్న. నీ పొగరే నీ ఐడెంటిటీ.. నీ మెడలో మూడు ముళ్లు వేసే వరకు నేను వదిలిపెట్టనని అనుకుంటాడు సూరజ్. ఉదయాన్నే కుటుంబంతో సహా గుడికి వెళ్తాడు శివన్నారాయణ. అక్కడ ప్రసాదం, అన్నదానం నిర్వహించడం చూసి మెచ్చుకుంటాడు. ఇంత మంచి పని చేస్తున్నది ఎవరని అడగ్గా.. పూజారి గారు వెంటనే దక్షిణామూర్తి, మాలినిలను చూపించడంతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 10వ తేదీ 719వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 719 July 10th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

గుడిలో దక్షిణామూర్తిని చేసి వెళ్లిపోదామని చెబుతాడు శివన్నారాయణ. దాంతో దక్షిణామూర్తి వెళ్లి అడ్డుకుంటాడు. కనీసం వచ్చే జన్మలో అయినా నా కూతురు నన్ను నాన్న అని పిలిచే అదృష్టం ఇవ్వమని కోరుకుంటూ ఈ హోమం చేస్తున్నానని చెబుతాడు. కూతురికి అమ్మ అనే పిలుపుని దూరం చేసి నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? గుండెల్లో లేని ప్రేమను గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఇంతలో మాలిని జోక్యం చేసుకుని సీరియస్ అవుతుంది.

మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తోంది.. ఎవరు ఈవిడ అని జ్యోత్స్న అడగ్గా.. మాలిని.. దక్షిణామూర్తిగారి కోడలు అని సూరజ్ చెబుతాడు. నీకెలా తెలుసు అని జ్యోత్స్న అడగ్గా.. స్నేహితుల కంటే శత్రువుల గురించి ఎక్కువగా తెలుసుకుంటానని చెబుతాడు సూరజ్. కార్తీక్‌కి ఏం అర్ధం కాక దిక్కులు చూస్తుంటాడు... తను నా కోడలు, పేరు మాలిని వరుసకు నీకు పిన్ని అవుతుందని చెబుతాడు దక్షిణామూర్తి. వరసలు అవసరం లేదని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. మా ఇంటి ఆడపడచు మీ ఇంటి కోడలు అయిన తర్వాత వరసలు కలుపుకోకుండా ఎలా ఉంటామని అంటుంది మాలిని. జ్యోత్స్నని కూడా ఎలా ఉన్నావని ప్రశ్నిస్తుంది. నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది జ్యోత్స్న.

మీది సిటీలో పేరున్న రెస్టారెంట్.. గూగుల్ సెర్చ్ చేస్తే మీ పేర్లు, ఫోటోలు అన్ని బయటకు వస్తాయని చెబుతుంది మాలిని. ఆ మాటలు, సూరజ్ చెప్పిన మాటలు ఒకేలా ఉండటంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. మీ అమ్మ ఎలా ఉందని కార్తీక్‌ని అడుగుతుంది? దశరథ అన్నయ్య ఎక్కడ అని ప్రశ్నిస్తుంది మాలిని. శాంతంగా మాట్లాడుతున్నానని గతాన్ని మరిచిపోలేదు.. ఇక్కడ రెండు హోమాలు జరుగుతున్నాయి ఒకటి అక్కడ, మరొకటి ఈ గుండెల్లో అని చెబుతాడు శివన్నారాయణ. గుడిలో మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.. అంతకుమించిన శాంతి లేదని కోపంగా వెళ్లిపోతాడు.

ఆ ఇంట్లో ఎవ్వరూ శివన్నారాయణ గీసిన గీతను దాటరని చెబుతాదు దక్షిణామూర్తి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మీ కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటే సుమిత్ర దూరమవుతోంది. మీ ఇద్దరి కోసం శాంతి హోమం చేయిస్తున్నాను, ఏదో ఒకరోజు వస్తుందని చెబుతుంది మాలిని. నవగ్రహాలకు పూజ చేయించడానికి సూరజ్, జ్యోత్స్న రావడంతో వాళ్లిద్దరినీ భార్యాభర్తలు అనుకుంటాడు పంతులు. ఆ మాటలతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. గుడికి ఎంతోమంది కలిసొస్తారు.. వచ్చినవాళ్లంతా భార్యాభర్తలు కాదు అంటుంది. ఇద్దరితో పూజ చేయిస్తుండగా జ్యోత్స్న ఎలా చేస్తే అలా పూజ చేస్తాడు.

సూరజ్‌ని తన జీవితంలో నుంచి బయటికి పంపించేయమని శనీశ్వరుడిని కోరుకుంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న అనుకున్నది మాత్రం జరగకూడదని కోరుకుంటాడు సూరజ్. నేను నా దోషం పోవాలని ఈ పూజ చేయించాను, అయితే నా మనసులో ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వస్తుందా అని పూజారిని అడుగుతాడు. పెళ్లికి లైన్ క్లియర్ అయినట్లే, నీ మనసులో ఉన్న పిల్లతో ఏడడుగులు నడిచే టైం దగ్గరపడింది. నీ పెళ్లి నేనే చేస్తాను, నన్ను మరిచిపోవద్దు.. మీ పెళ్లేం కర్మ మీ పిల్లలకు బారసాల కూడా నేనే చేస్తానని అంటాడు పూజారి. మీకు లక్షా 116 రూపాయలు చదివిస్తానని చెబుతాడు సూరజ్. ఆ మాటలన్నీ విన్న జ్యోత్స్న మండిపడుతుంది.

నేను సైలెంట్‌గా ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని సీరియస్ అవుతుంది. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటానని అన్నానా? జ్యోత్స్న నాకు కాబోయే పెళ్లామా అని చెప్పానా? అని కౌంటర్ వేస్తాడు సూరజ్. తర్వాత జ్యోత్స్నతో కలిసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. దక్షిణామూర్తి గారు మీ తాతగారికి శత్రువు అని చెప్పారు.. చూస్తుంటే మీరు చుట్టాల్లాగా ఉన్నారని సూరజ్ అడుగుతాడు. ఆ మాలిని స్వయంగా మా మమ్మీ వాళ్ల భార్య.. ఆయన మా మమ్మీవాళ్ల నాన్న అని చెబుతుంది. మరి మీ మావయ్య ఏమయ్యాడని సూరజ్ అడగ్గా నాకు తెలియదని అంటుంది జ్యోత్స్న.

నాకంటే ముందే మాలిని గురించి నీకు తెలుసు, ఆన్‌లైన్‌లో చూశానని అంటాడు సూరజ్. ఆవిడ కూడా అచ్చం నీలాగే చెప్పిందని డౌట్ పడుతుంది జ్యోత్స్న. వీరిద్దరూ కలిసి నడుస్తుండటం చూసిన పారు రగిలిపోతుంది. అది గమనించిన కార్తీక్.. శివన్నారాయణ గొంతుతో మాట్లాడటంతో పారు వణికిపోతుంది. నువ్వు గొంతులే మారుస్తావు, వాడు మనుషుల్నే మార్చేస్తాడని అంటుంది. జ్యోత్స్నతో సూరజ్ షర్ట్ ఉతికించడం నేను సీసీ కెమెరాలో చూశానని అంటాడు కార్తీక్. ఆ మాలినితో నువ్వేం మాట్లాడలేదని అడగ్గా.. ఆ మాలిని.. దీపని ఎలా చూస్తుందో నన్ను అది అలాగే చూస్తుందని చెబుతుంది పారు. ఆకాశంలో చందమామలా ఉండేదానిని.. ఆటలో అరటిపండుని చేశారని మండిపడుతుంది. ఇంతకీ దీప ఎక్కడ అని అడగ్గా ప్రసాదాలు పంచుతోందని మనం కూడా వెళ్దామని పారుని లాక్కెళ్తాడు కార్తీక్. ఇంతలో ప్రదక్షిణలు చేస్తుండగా జ్యోత్స్న చీరను సూరజ్ తొక్కడంతో ఆమె వెనక్కి పడిపోతుండగా పట్టుకుంటాడు.

గుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటున్న మాలినికి దీప ప్రసాదం ఇస్తుంది. దాని రుచి చూసి నువ్వు వంటలు బాగా చేస్తావనుకుంటా అని మెచ్చుకుంటుంది మాలిని. నా దగ్గర పనిచేస్తావా? మా రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తావా అని అడుగుతుంది. మనిషిని మొదటిసారి చూసినప్పుడే అంత పెద్ద పోస్ట్ ఎలా ఆఫర్ చేస్తారని ప్రశ్నిస్తుంది దీప. నేను చక్రపొంగలిని ఇష్టంగా తింటాను, కానీ ఇలాంటి టేస్ట్ మొదటిసారిగా తింటున్నానని అంటుంది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది.. నువ్వు ఎంత బాగా వంటలు చేయగలవో ఈ చక్రపొంగలి చెబుతోంది. నువ్వు ఊహించనంత శాలరీ ఇస్తాను, రేపే వచ్చే జాయిన్ అవ్వమని చెబుతుంది మాలిని. మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పింటి వాళ్లలా ఉన్నారు.. మీ మాటల్ని చూస్తుంటే బాగా కలవారిలా ఉన్నారని అంటుంది దీప. కుదిరితే ఈరోజు ఇంటికొచ్చి కలవమని చెబుతుంది మాలిని.

తప్పకుండా వస్తాను.. కాకపోతే ఒకరిని ఏదైనా అడిగే ముందు అవతలి వాళ్లు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అని అంటుంది దీప. నన్ను చూసి అంచనా వేసినట్లే.. నిన్ను చూసి నేను అంచనా వేయగలను కదా? అని చెబుతుంది మాలిని. నీకు ఎంత కావాలో అడుగు.. నిజాయితీకి ఉన్న విలువ ఆ మనిషికి ఉన్న అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుందని చెబుతుంది. వంటలు ఇంత బాగా చేస్తున్నావు కాబట్టి.. ఎక్కడైనా వంట మనిషిగా పనిచేస్తున్నావా అని అడుగుతుంది మాలిని. ఇంతలో కార్తీక్ వచ్చి తను వంట మనిషి కాదు.. జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈవో, తను నా భార్య అని కూడా చెబుతాడు. ఈ విషయం మాలినికి తెలియదు అనుకున్నావా అని శివన్నారాయణ అంటాడు. ఆ మనిషికి అన్నీ తెలిసే కావాలని అడుగుతుందని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X