Karthika Deepam 2 July 11th: దక్షిణామూర్తితో సుమిత్రని కలపడానికి మాలిని స్కెచ్.. దీపకి పొంచివున్న ప్రమాదం

Photo Courtesy: JioHotstar

గుడిలో తనను చూసి వెళ్లిపోతున్న శివన్నారాయణను అతని కుటుంబాన్ని ఆపుతాడు దక్షిణామూర్తి. ఈ శాంతి హోమం నా కూతురి కోసం చేస్తున్నానని చెబుతాడు. కూతురికి అమ్మ అనే పిలుపు దూరం చేసి శాంతి హోమాలు చేయిస్తావా అంటూ ఫైర్ అవుతుంది సుమిత్ర. ఇంతలో మాలిని జోక్యం చేసుకుని ఎలా ఉన్నావని సుమిత్రని అడుగుతుంది దాంతో అంతా షాక్ అవుతారు. ఆమె దక్షిణామూర్తి గారి కోడలు మాలిని అని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. జ్యోత్స్నని, కార్తీక్‌ని ఎలా ఉన్నారని అడుగుతుంది మాలిని. మీది సిటీలోనే పేరున్న రెస్టారెంట్.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీ ఫోటోలతో సహా వచ్చాయని అంటుంది మాలిని. సూరజ్ చెప్పినట్లే మాలిని కూడా చెప్పడంతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

జ్యోత్స్న, సూరజ్‌లు పూజ చేస్తుండగా మీ ఇద్దరు భార్యాభర్తల్లా ఉన్నారని పంతలు అనడంతో జ్యోత్స్న మండిపడుతుంది. ఇద్దరూ కలిసి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుండగా సూరజ్‌పై పడుతుంది జ్యోత్స్న. ఇదంతా చూసిన పారు రగిలిపోతుంది, అది గమనించిన కార్తీక్.. ఆమెను పక్కకి తీసుకొచ్చేస్తాడు. దీపం పెడుతున్న మాలినికి ప్రసాదం పెడుతుంది దీప. ఆ ప్రసాదం చాలా రుచిగా ఉండటంతో తన దగ్గర చెఫ్‌గా చేరితే ఎంతైనా ఇస్తానని ఆఫర్ ఇస్తుంది మాలిని. తను చెఫ్ కాదు.. నా భార్య దీప.. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి సీఈవో అని కార్తీక్ చెబుతాడు. మాలినికి ఈ విషయాలన్నీ ముందే తెలుసని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 11వ తేదీ 720వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 720 July 11th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మాలినికి దీప ఎవరో తెలియదు అనుకున్నావా?తెలిసే అన్ని చేస్తుందని అంటాడు శివన్నారాయణ. ఈవిడ ఎవరు అని దీప అడగ్గా.. నీకు అత్త అవుతుందని దక్షిణామూర్తి చెబుతాడు. నా కోడలు.. సుమిత్రకు వదిన అంటాడు. మనుషుల్ని పరీక్షించడానికి కొందరు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, మనం ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండాలని చెబుతాడు శివన్నారాయణ. నీ వాళ్ల దగ్గర నీకున్న విలువ ఏంటో తెలుసుకోవడానికి అనుకోవచ్చు కదా అని అంటాడు దక్షిణామూర్తి. నా వాళ్ల విలువ ఏంటో నాకు తెలుసు, నా వాళ్ల దగ్గర నాకెంత విలువ ఉంటుందో నాకు తెలుసు అని చెబుతాడు శివన్నారాయణ.

కూతురిని ఇంట్లో నుంచి పంపించినప్పుడు నీ విలువ ఏమైంది? పెళ్లయిన మనవడిని నడిరోడ్డు మీదకి గెంటేసినప్పుడు ఏమైంది? ఆస్తిలో వాటాలు పంచాల్సిన మనవడిని ఇంటి డ్రైవర్‌ని చేశావు? కూతురి కోడలిని ఇంటి పనిమనిషిని చేశావు? పనిమనిషిని సీఈవోని చేశావు? బ్రహ్మదేవుడు రాసిన తలరాతని కూడా మార్చి రాయగల శక్తి నీకుంది బాబాయి. మేం వ్యాపారంలో బయటివాళ్లతోనే ఆడుకుంటాం, నువ్వు సొంతవాళ్ల జీవితాలతోనే ఆడుకుంటావని నానామాటలు అంటుంది మాలిని.

జీవితాలతో ఆడుకోవడం గురించి మీలాంటి వాళ్లు మాట్లాడకపోతేనే మంచిదని కౌంటర్ ఇస్తాడు శివన్నారాయణ. నేను దుర్మార్గుడిని అయితే నా వాళ్లు నాతో ఉండేవాళ్లు కాదు, జీవితంలో నడవటానికి రెండే దారులు, ఒకటి నిజాయితీ, రెండు నమ్మకద్రోహం. మనం ఏ దారిలో నడుస్తున్నామన్నది మన పక్కన నిలబడ్డ జనం సంఖ్యని బట్టి తెలుస్తుంది. నీ వైపు ఎంతమంది ఉన్నారు. నా వైపు ఎంతమంది ఉన్నారు? అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నేను కూడా నీ కూతురి లాంటి దానినే కదా బాబాయి.. నన్నెందుకు తప్పుగా అర్ధం చేసుకుంటున్నావని అడుగుతుంది మాలిని. ఇలాంటి దుర్మార్గుడికి నువ్వు కూతురిలా పుట్టొద్దని మండిపడతాడు దక్షిణామూర్తి.

గొడవ పెరిగిపోతుండటంతో కంట్రోల్ చేయడానికి కార్తీక్ ప్రయత్నిస్తాడు. మేం మీ జోలికి రావడం లేదు కదా? వదిలేయండి. కలిసి సంతోషంగా బతకలేనప్పుడు విడిపోవడమే మంచిదని అంటాడు కార్తీక్. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మా వ్యాపారాలు మేం చేసుకుంటామని చెబుతాడు. చేసిన పాపం మనిషి నీడలాంటిది, అది జీవితాంతం వెంటాడుతుంది.. ఈ కుటుంబం కారణంగానే నా కోడలు అని దక్షిణామూర్తి చెప్పబోతుండగా మాలిని అడ్డుపడుతుంది. ఇది చెప్పాల్సిన టైం ఇది కాదని నచ్చచెబుతుంది. మా ఇంటి ఆడపడుచు సుఖ సంతోషాలతో ఉండాలని శాంతి హోమం చేయించడానికి వచ్చాం, ఎవ్వరి మనసులు గాయపరచాలని కాదని అంటుంది మాలిని. చాలా రోజుల తర్వాత మీ కుటుంబాన్ని చూశాను, అందరినీ గుర్తుపట్టాను కానీ ఈ కుర్రాడిని గుర్తుపట్టలేకపోయాను. ఎవరీ అబ్బాయి అని అడుగుతుంది మాలిని.

పరిచయం చేయాల్సినంత వ్యక్తి కాదని జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. తనకు మాకు ఏ సంబంధం లేకపోయినా తను మా కుటుంబంలోని మనిషే అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నని కాపాడిన సూరజ్‌ని మీ ఇంట్లో పెట్టుకుని దానికి కృతజ్ఞత అని పేరు పెట్టారు? మా మావయ్య గారిని కాపాడిన దీపని నా మనిషిని చేసుకోవాలంటే దానికి అతి తెలివి అని పేరు పెట్టారని.. కార్తీక్, దీపలకి థ్యాంక్స్ చెబుతుంది. మిమ్మల్ని మేం ఎప్పటికీ గుర్తుపెట్టుకోమని కోపంగా వెళ్లిపోతుంది సుమిత్ర. నా పేరు మాలిని.. ఈ పేరు ఎప్పటికీ గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీకు ఏ సాయం కావాలన్నా ఈ మాలిని అండగా ఉంటుందని మాలిని మాట ఇస్తుంది. జ్యోత్స్న దగ్గరికి వెళ్లి చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటుంది.

తాతయ్య వస్తాడని, నాకు సైకిల్ తీసుకొస్తాడని గోలగోల చేస్తుంది శౌర్య. ఇంతలో తలుపు కొట్టిన శబ్ధం వినిపించగానే వెళ్లి చూడగా అనసూయ కనిపించడంతో కాంచన, శౌర్యలు షాక్ అవుతారు. ఎవరి కోసమైనా ఎదురుచూస్తున్నావా అని అడుగుతుంది అనసూయ. అమెరికా నుంచి ఆపరేషన్ చేయించుకుని ఆయన వస్తున్నాడని కాంచన చెప్పడంతో అనసూయ సంతోషిస్తుంది. దీప- కార్తీక్ కనిపించడం లేదు.. ఎక్కడున్నారని అడుగుతుంది అనసూయ. జ్యోత్స్నకి దీప నివారణ పూజ చేయించడానికి మా నాన్న గుడికి తీసుకెళ్లారని చెబుతుంది కాంచన. ఆ పూజలు గట్టిగా చేస్తే మెడలో మూడు ముళ్లు వేసేవాడిని ఆయనే పంపిస్తాడని చెబుతుంది అనసూయ.

మాలిని కనిపించడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నాకు కూడా ఒక అత్తుంది, ఈరోజు కళ్లముందుకు వచ్చింది? అసలు వాళ్లంతా ఎక్కడున్నారు అని కార్తీక్‌ని నిలదీస్తుంది దీప. వాళ్లు తాతకి వద్దు అన్నప్పుడు మనకి కూడా వద్దని సీరియస్ అవుతాడు. ఇంతలో సూరజ్ రావడంతో మాట మార్చేస్తాడు. నా కూతురి పేరు మీద నలుగురికి భోజనం పెట్టగలిగాను కానీ నా కూతురితో నాన్న అని పిలిపించుకోలేకపోయాను అని దక్షిణామూర్తి బాధపడతాడు. దగ్గరివాళ్లని కలుపుకోవడం అంటే మనం ఊహించని ప్రమాదం పొంచి ఉంది.. నువ్వు జాగ్రత్త అని జ్యోత్స్నని హెచ్చరిస్తాడు శివన్నారాయణ. మీ కూతురిని మళ్లీ మీకు దగ్గర చేస్తానని దక్షిణామూర్తికి మాటిస్తుంది మాలిని.

జ్యోత్స్నని తీసుకుని సూరజ్ బైక్ మీద తీసుకెళ్తుండగా నన్ను కూడా మీ బావని అనుకోమని చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. ఇకపై నువ్వు నా జోలికి రావొద్దు.. నన్ను బంగారం ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తుంది. గుడిలో నవగ్రహాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండగా నాకు కాబోయే భార్య కనిపించింది, నీ జోలికి రాను అంటాడు సూరజ్. అయితే ఆ దురదృష్టవంతురాలిని చూపించు అని అడుగుతుంది జ్యోత్స్న. ఫోన్‌లో తన ఫోటో చూపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X