Karthika Deepam 2 July 13th: శివన్నారాయణని ట్రాప్ చేసిన దక్షిణామూర్తి... తండ్రితో సుమిత్ర సవాల్
Photo Courtesy: JioHotstar
మాలినికి దీప ఎవరో తెలుసు.. అన్నీ తెలిసే ఆ మనిషి ఇలా మాట్లాడుతుందని అంటాడు శివన్నారాయణ. ఈవిడ ఎవరు అని దీప అడగ్గా.. నాకు కోడలు, సుమిత్రకు వదిన అని దక్షిణామూర్తి చెబుతాడు. మాలిని, దక్షిణామూర్తి, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరుగుతుండటంతో కార్తీక్ ఆపుతాడు. ఈ కుటుంబం కారణంగానే నా కోడలు అని దక్షిణామూర్తి చెప్పబోతుండగా మాలిని అడ్డుపడుతుంది. ఆ నిజం చెప్పే టైం ఇంకా రాలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుదామని అంటుంది.
చాలారోజుల తర్వాత మీ కుటుంబాన్ని చూశాను కానీ ఈ అబ్బాయి ఎవరు? కొత్తగా ఉన్నాడు అని సూరజ్ గురించి అడుగుతుంది. అతని పేరు సూరజ్ నా కుటుంబానికి సంబంధం లేదు, కానీ మా కుటుంబంలో ఒకడు అని అంటాడు శివన్నారాయణ. మాలిని కనిపించడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నాకు కూడా ఒక అత్త ఉందని కార్తీక్ దగ్గర బాధపడుతుంది. మీ కూతురిని మీ దగ్గరకు చేరుస్తానని దక్షిణామూర్తికి మాట ఇస్తుంది మాలిని. బైక్ మీద ఆఫీస్‌కి వెళ్తున్న జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకుంటానంటూ విసిగించడంతో ఆమెకు కిందకు దిగేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 13వ తేదీ 721వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
గుడిలో ఒక అమ్మాయిని చూశా.. నీకంటే చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని సూరజ్ చెప్పడంతో ఆ అమ్మాయి ఫోటో చూపించమని చెబుతుంది జ్యోత్స్న. ఫోన్‌లో తన ఫోటో చూపించడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. మనిద్దరం అనుకోకుండా కలిశాం.. గొడవపడ్డాం, ఇప్పుడు ఒకే ఆఫీసులో ఒకే మనిషి దగ్గర పనిచేస్తున్నామని చెబుతాడు సూరజ్. నీ సంగతి మా తాత దగ్గర చెబుతానని చెబుతానని మండిపడుతుంది. మీ తాతగారు ఈరోజు ఆఫీస్‌కి రావడం లేదు. ఏదో మీటింగ్ ఉందని వెళ్లారని చెబుతాడు సూరజ్. మా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెబితే కానీ తెలియడం లేదని అనుకుంటుంది జ్యోత్స్న.
రెస్టారెంట్ ఓనర్స్ మీటింగ్‌లో మాలినిని శివన్నారాయణకి పరిచయం చేస్తారు మెంబర్స్. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చారా అని ఏం తెలియనట్లుగా అడుగుతారు పెద్దాయన. ఇంతకుముందు మేం వేరే ఊరిలో ఉన్నాం.. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం, ఇల్లు కొనుక్కున్నామని చెబుతుంది మాలిని. ఇక్కడ మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. శివన్నారాయణ గారు అని మాలిని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈ అసోసియేషన్‌లో ఉన్న వాళ్లంతా మాకు బంధువులేనని చెబుతుంది మాలిని.
చాలా తక్కువ టైంలోనే జ్యోత్స్న రెస్టారెంట్స్‌తో డీఎం రెస్టారెంట్స్ కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయని చెబుతాడు దక్షిణామూర్తి. ఈ సిటీలో బెస్ట్ చెఫ్స్ అంతా నా దగ్గరే ఉన్నారు.. నాతో పోటీపడి మిగిలిన వాళ్లంతా ఓడిపోయారు. ఇక మిగిలింది మీరొక్కరే, మేం మీతో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నామని దక్షిణామూర్తి చెప్పడంతో మేం సిద్ధంగా లేమని అంటాడు శివన్నారాయణ. అందరితో పోటీపడాలి కానీ, మీతో ఒక్కరితో మేం పోటీలో పాల్గనలేమని చెబుతాడు. జ్యోత్స్న రెస్టారెంట్సే సిటీలో నెంబర్ వన్ రెస్టారెంట్.. పోటీ ఏదైనా గెలిచేది నేనే అని చెబుతాడు శివన్నారాయణ. పోయినసారి ఓడిపోయారు కదా అని అంటుంది మాలిని. ఓడిపోయింది మనవడి చేతిలోనే, నాకు వ్యాపార పాఠాలు నేర్పించిందే మా తాత, అయినా సత్యరాజ్ రెస్టారెంట్స్ ఎప్పుడో జ్యోత్స్న రెస్టారెంట్స్ చేతిలోకి వెళ్లిపోయిందని అంటాడు కార్తీక్.
బెస్ట్ రెస్టారెంట్స్ అంటే చాలా విభాగాలు ఉంటాయి. అందుకే బెస్ట్ వంటకం ఎవరిది అన్న దానిపై పోటీ పడదామని మాలిని చెబుతుంది. మేం మీతో కానీ, శివన్నారాయణ గారితో కానీ పోటీపడలేమని అసోసియేషన్ వాళ్లు చెబుతారు. కానీ మేం శివన్నారాయణ గారితో పోటీపడతామని దక్షిణామూర్తి తేల్చేస్తాడు. ఈ పోటీకి మీరు సిద్ధమే కదా అని మాలిని రెచ్చగొట్టినా మేం సిద్దంగా లేమని చెబుతాడు శివన్నారాయణ. మరోసారి ఎవరి ముందు మేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీటింగ్‌లో నుంచి వెళ్లిపోతాడు. బాబాయిని పోటీలోకి ఎలా దించాలో నాకు తెలుసని దక్షిణామూర్తితో అంటుంది మాలిని.
జరిగిన దాని గురించి ఇంట్లో రగిలిపోతుంటాడు శివన్నారాయణ. సిటీలో మనదే నెంబర్‌వన్ రెస్టారెంట్స్.. ఇప్పుడు కొత్తగా డీఎం రెస్టారెంట్స్‌తో పోటీ పడాల్సిన అవసరం లేదని అంటుంది జ్యోత్స్న. దాంతో సూరజ్ కలగజేసుకుని ఈ పోటీలో గెలిస్తే జ్యోత్స్న రెస్టారెంట్‌కి వచ్చేది లేదు, పోయేది లేదు.. కానీ పోటీపడాలని చెబుతాడు. పోటీలో మిగిలింది డీఎం రెస్టారెంట్స్, జ్యోత్స్న రెస్టారెంట్స్ మాత్రమే.. ఈ రెండింటిలో టేస్టీ వంటకాలు ఎవరి దగ్గర ఉన్నాయన్న దాని గురించే పోటీ అంటాడు సూరజ్. పోటీ పడాలని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్న మండిపడుతుంది. తను ఏదో చెప్పాలని అనుకుంటుంటే మధ్యలో ఎందుకు అడ్డొస్తున్నావని దీప అంటుంది. ఇది మా ఫ్యామిలీ మేటర్ మధ్యలో ఎవరూ వేలు పెట్టొద్దని చెబుతుంది పారు.
దాంతో రగిలిపోయిన కార్తీక్.. మేం కూడా ఈ ఫ్యామిలేయేనని చెబుతాడు, అయితే సూరజ్ బయటివాడు కదా అంటుంది పారు. ఇక్కడున్న వాళ్లంతా నా వాళ్లే.. సూరజ్‌తో సహా అంటాడు శివన్నారాయణ. ఒక కొత్త రెస్టారెంట్‌ని చూసి అందరూ తప్పుకుంటుంటే తెలియకుండానే దానికి ఒక గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు ఓటమి ఎరుగని జ్యోత్స్న రెస్టారెంట్‌తో సవాల్ చేస్తున్న డీఎం రెస్టారెంట్స్ గురించి జనంలోకి ఎలా వెళ్తుందని సూరజ్ చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. సూరజ్ చెబుతున్న దానికి దీప, కార్తీక్‌లు సపోర్ట్‌గా నిలబడతారు.
డీఎం రెస్టారెంట్స్‌తో పోటీ వద్దని తాత సైలెంట్‌గా వచ్చేస్తే సూరజ్ ఎందుకు రెచ్చగొడుతున్నాడు, దానికి దీప ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇదంతా వెనుక నుంచి నువ్వే నడిపిస్తున్నావని అంటుంది జ్యోత్స్న. మా తాత ఎవరెస్ట్ ఎవరి ముందు తలవంచడని చెబుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో కొత్త నెంబర్ చూసి దక్షిణామూర్తి అని చెప్పి మండిపడతాడు శివన్నారాయణ. ఎందుకు ఫోన్ చేశావో చెప్పమని పెద్దాయన సీరియస్ అవుతాడు. దక్షిణామూర్తిని చూసి మొట్టమొదటి సాసి నువ్వు భయపడ్డావని నవ్వుతూ ఉంటాడు. గాయపడ్డ సింహాన్ని చూసి నక్క తోడకొడితే తల తెగిపోతుందని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. అంత దమ్ముంటే పోటీకి రా అని సవాల్ విసురుతాడు దక్షిణామూర్తి.
ఎవరూ చేయి పట్టుకుని నన్ను నెంబర్‌వన్ స్థానంలో కూర్చోబెట్టలేదు.. నేనే నిజాయితీగా కష్టపడి ఈ స్థానానికి వచ్చాను. శివన్నారాయణ భయపడ్డాడని ఒక్కడు చెప్పినా నా తలదీసి నీ కాళ్ల దగ్గర పెడతానని అంటాడు శివన్నారాయణ. మాతో పోటీపడితే నువ్వు ఓడిపోతావని నాకు తెలుసు.. అందుకే మాటలతో గారడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీకు పౌరుషం ఉంటే వచ్చి నాతో పోటీపడమని సవాల్ విసురుతాడు దక్షిణామూర్తి. ఇంతలో సుమిత్ర జోక్యం చేసుకుని మరోసారి మా మావయ్య గారితో అలా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు పోటీకి వెళ్లొద్దని పారు చెప్పగా... పోటీకి వెళ్లాల్సిందే, నా మెట్టినింటి పౌరుషం ఏంటో ఆ ఇంటి మనుషులకు తెలియాలి. ఈ పోటీలో మనం పాల్గొంటున్నామని సుమిత్ర తేల్చేయడంతో అంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications