Karthika Deepam 2 July 14th: శివన్నారాయణకి జ్యోత్స్న వెన్నుపోటు.. దక్షిణామూర్తిని గెలిపించేలా పారు ప్లాన్
Photo Courtesy: JioHotstar
గుడిలో అమ్మాయిని చూశానని, తననే పెళ్లి చేసుకుంటానని సూరజ్ చెప్పడంతో ఆ అమ్మాయి ఫోటో చూపించమని అడుగుతుంది జ్యోత్స్న. ఫోన్‌లో తన ఫోటో తనకే చూపించడంతో రగిలిపోతుంది. ఈ విషయం మా తాత దగ్గరే తేల్చుకుంటానని జ్యోత్స్న అనగా మీ తాతగారు, కార్తీక్‌గారు ఆఫీస్‌లో లేరు ఏదో మీటింగ్‌కి వెళ్లారని చెబుతాడు సూరజ్. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్‌లో మరోసారి ఎదురవుతారు దక్షిణామూర్తి- శివన్నారాయణ. ఆ సమావేశానికి మాలిని కూడా రావడంతో ఆమెను పరిచయం చేస్తారు సభ్యులు. సిటీలోనే ది బెస్ట్ చెఫ్స్ మా దగ్గర ఉన్నారు.. మాతో పోటీపడలేక చాలా రెస్టారెంట్స్ పోటీలో నుంచి తప్పుకున్నాయి.. చివరికి మన రెండు రెస్టారెంట్స్ మాత్రమే మిగిలాయని, జ్యోత్స్న రెస్టారెంట్‌తో పోటీకి మేం సిద్ధమని చెబుతాడు దక్షిణామూర్తి.
కానీ నేను సిద్ధంగా లేనని తేల్చేస్తాడు శివన్నారాయణ. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, ఇప్పడు కొత్తగా మా వంటలు రుచిగా ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదని ఇంటికి వచ్చేస్తాడు. జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోటీ చేయాల్సిందేనని సూరజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్, దీప కూడా అందుకు సపోర్ట్‌గా నిలబడటంతో జ్యోత్స్న, పారులు నానామాటలు అంటారు. ఇంతలో దక్షిణామూర్తి ఫోన్ చేసి మాతో పోటీ చేసే దమ్ము లేదని అనడంతో సుమత్ర వచ్చి నా మెట్టింటి పౌరుషం చూపిస్తాం, శివన్నారాయణ గారు పోటీ చేస్తారని చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 14వ తేదీ 722వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు.. మీరు పోటీకి వెళ్లొద్దని చెబుతుంది పారు. కానీ సుమిత్ర మాత్రం వెళ్లాల్సిందేనని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా మెట్టినింటి పౌరుషం ఏంటో ఆ ఇంటి మనుషులకు తెలియాలి. ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం, ఇది నా కోసం.. నిలబడటమే కాదు గెలవాలి కూడా అని చెబుతుంది సుమిత్ర. కోడలి మాట ప్రకారం పోటీకి సిద్ధమని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. కంపెనీ సీఈవో నువ్వే కాబట్టి బాధ్యత నీదేనని దీపకి చెబుతాడు పెద్దాయన. ఇది పోటీ కాదు.. ఈ ఇంటి కోడలిగా నా ఆత్మగౌరవం, దానిని నువ్వు గెలిపించాలని దీపని అడుగుతుంది సుమిత్ర. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్లే, పంతాన్ని వదులుకోవడం కంటే ప్రాణాన్ని వదులుకోవడం చాలా చిన్న విషయమని చెబుతాడు శివన్నారాయణ. మనం గెలుస్తామని కార్తీక్, దీప, సూరజ్‌లు చెబుతారు.
శివన్నారాయణ పోటీకి దిగడని మాలినితో అంటాడు దక్షిణామూర్తి. బాబాయి గురించి తెలిసే మిమ్మల్ని పోటీ చేయమన్నానని చెబుతుంది మాలిని. ఓడిపోతే మళ్లీ తలెత్తుకోలేను, శివన్నారాయణ మాటల మనిషి కాదు చేతల మనిషి. ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే రావాలని చెబుతాడు దక్షిణామూర్తి. మీ నమ్మకాన్ని కోల్పోను, బాబాయి ఇప్పుడు యుద్ధానికి దిగాడని అంటుంది మాలిని. శివన్నారాయణ వల్ల నాకంటే నీకే ఎక్కువ నష్టం జరిగింది. నా కూతురు నా అల్లుడు నా దగ్గర ఉండుంటే ఆ శివన్నారాయణకి ఈ దక్షిణామూర్తి అంటే ఏంటో చూపించేవాడిని. నా కూతురు నా బలహీనత అదే వాడి బలం.. అందుకే నేను అన్ని వదిలేసి కలవాలని చాలా అడుగులు ఇంటికి వేశాను. వెళ్లిన ప్రతిసారి అవమానం తప్పించి మాటలు లేవని చెబుతాడు దక్షిణామూర్తి.
సుమిత్ర మీకు కూతురు మాత్రమే కాదు నాకు ఆడపడచు.. సుమిత్ర ఈ ఇంట్లో అడుగుపెట్టాలని మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో? నేను కూడా అంతే ఎదురుచూస్తున్నాను అని చెబుతుంది మాలిని. శివన్నారాయణ రానివ్వడు, మన గురించి సుమిత్రను మంచిగా ఆలోచించనివ్వడు. ఇప్పుడు నా కూతురు నా గురించి ఏమనుకుంటుంది అని బాధపడతాడు దక్షిణామూర్తి. శివన్నారాయణ నా కూతురిని రానివ్వడని అంటాడు. కానీ సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తానని నేను నీకు మాటిచ్చానని చెబుతుంది మాలిని. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం.. సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తున్నామని చెబుతుంది మాలిని. నేను మిమ్మల్ని అడ్డుపెట్టుకుని బాబాయిని యుద్ధంలోకి లాగాను. ఒకరిని క్షమించి, మరొకరిని శిక్షించాలని అనుకుంటున్నాను. నేనైతే ఎవ్వరినీ క్షమించను, శివన్నారాయణని ఇంటి పునాదుల్ని కదిలిస్తా.. బాబాయిని ఎవరు కాపాడుకుంటారో నేను చూస్తానని అనుకుంటుంది మాలిని.
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల నా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల రాలేకపోతున్నానని శ్రీధర్ మెసేజ్ చేయడంతో కాంచన, కార్తీక్ బాధపడతారు. చాలారోజుల తర్వాత అనసూయ రావడంతో దీప సంతోషిస్తుంది. నా వాళ్లంతా నాతోనే ఉండాలని చెబుతుంది దీప. నానమ్మ వంట తిని నా కడుపంతా టైట్ అయిపోయిందని శౌర్య చెబుతుంది. ఇది ఇలా అల్లరి చేసి ఎన్నిరోజులు అవుతుందో, దీనినే మేం మిస్ అవుతున్నామని కార్తీక్ బాధపడతాడు. నేను వచ్చింది మిమ్మల్ని చూసి వెళ్లిపోవడానికేనని మనసులో అనుకుంటుంది అనసూయ.
మనవాళ్లు పోటీకి దిగలేదు.. దింపారు. మాలిని అంటే ఏమనుకున్నావు .. అదొక ప్రతీకారంతో రగిలిపోతున్న అగ్నిపర్వతం లాంటిది. ఈ ఇంటిని తగలబెట్టడానికే హోమంతో ముహుర్తం పెట్టింది. మీ తాత బలహీనత రెచ్చిపోవడం.. జరగబోయే ఈ గొడవకి పోటీ అని పేరు పెట్టారు. ఈ సూరజ్ గాడికి ఇదేం తెలియక పోటీకి దిగుదామని మీ తాతని గోతిలోకి దించాడు అని చెబుతుంది దక్షిణామూర్తి. వాళ్లే గెలుస్తారని నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు అని అడుగుతుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి బలం ఏంటీ అని అడగ్గా.. మాలిని, అది రెండు వైపులా పదునున్న కత్తి. అది చీరకట్టుకున్న తుపాకి లాంటిదని చెబుతుంది పారు.
నేను మా అత్తలాగా డైరెక్ట్‌గా యుద్ధంలోకి దిగను.. దీప మీద తాతకున్న నమ్మకాన్ని చంపేస్తానని చెబుతుంది జ్యోత్స్న. మనల్ని మనమే కష్టపడి ఓడించుకోవాలి. బావని నేను కంట్రోల్ చేస్తా, సూరజ్‌గాడి సంగతి నువ్వు చూసుకోమ్మని పారుకి చెబుతుంది జ్యోత్స్న. నాకు డీఏ అని పేరు పెట్టిన సూరజ్‌గాడికి, బావకి చుక్కలు చూపించాలని అంటుంది. నీ పెళ్లానికి సపోర్ట్ చేసే ఎవ్వరినీ మేం వదిలిపెట్టమని అనుకుంటుంది పారు. అనసూయ వెళ్లిపోతానని చెప్పడంతో వెళ్లిపోని అంటుంది దీప. ఆ మాటలతో కార్తీక్, కాంచనలు షాక్ అవుతారు. నేను తన సొంత మేనకోడలిని కాదు కదా? చిన్నప్పటి నుంచి పరాయిదానిలాగే చూసిందని మండిపడుతుంది దీప. నేను ఎక్కడికి పోతాను ముత్యాలమ్మ గూడెనికి వెళ్తాను, ఆ ఇంటిలో ఉంటే నేను నా తమ్ముడితో ఉన్నట్లే ఉంటుందని చెబుతుంది అనసూయ.
నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని దీప అంటుంది. నీకు అడ్డుగా ఉండటం తప్పించి, నాతో ఎలాంటి ఉపయోగం లేదని చెబుతుంది అనసూయ. నిన్ను చూసుకున్నాను వెళ్లిపోతానని అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి మాతోనే ఉండిపోమ్మని చెబుతుంది. నువ్వుంటే సరదాగా ఉంటుంది.. మనిద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటామని అంటుంది శౌర్య. చిన్నారి మాటలతో ఉండిపోతానని చెబుతుంది అనసూయ. అది చూసి కార్తీక్, దీప, కాంచనలు సంతోషిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications