Karthika Deepam 2 July 15th: మాలిని రక్తచరిత్ర చెప్పిన కాంచన.. చావు నుంచి తృటిలో తప్పించుకున్న సూరజ్
Photo Courtesy: JioHotstar
దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు పోటీకి వెళ్లొద్దని చెబుతుంది పారు. కానీ సుమిత్ర మాత్రం మనం పోటీలో పాల్గొంటున్నాం, గెలుస్తున్నమని చెబుతుంది. మనం పోటీలో పాల్గొంటున్నామని రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెప్పమని కార్తీక్‌తో అంటాడు శివన్నారాయణ. కంపెనీ సీఈవో నువ్వే కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత నీదేనని దీపకి చెబుతాడు పెద్దాయన. ఇది పోటీయే కాదు.... నా ఇంటి కోడలి ఆత్మగౌరవం దానిని నువ్వు గెలిపించాలని దీపకి చెబుతుంది సుమిత్ర. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్లే.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు కార్తీక్.
శివన్నారాయణ పోటీకి దిగేలా కనిపించడం లేదని మాలినితో అంటాడు దక్షిణామూర్తి. బాబాయి ఖచ్చితంగా పోటీకి వస్తాడని అంటుంది మాలిని. నా కూతురు నా ఇంటికి తిరిగొస్తే అంతే చాలని అంటాడు దక్షిణామూర్తి. నేను ఎవ్వరినీ క్షమించను, అందరికీ శిక్ష ఉంటుందని అనుకుంటుంది మాలిని. అమెరికా నుంచి రావడం లేదని శ్రీధర్ చెప్పడంతో కాంచన, దీప, కార్తీక్‌లు బాధపడతారు. నేను మీ అందరికీ అడ్డుగా ఉంటాను, మా ఊరికి వెళ్లిపోతానని అనసూయ అంటుంది. శౌర్య ఏడుస్తూ బతిమలాడటంతో ఉండటానికి ఒప్పుకుంటుంది అనసూయ. ఈ పోటీలో ఎలాగైనా మనం ఓడిపోవాలి.. తాతకి దీప మీదున్న నమ్మకం పోవాలి, ఇదంతా జరగాలంటే ఆ సూరజ్ గాడు ఇక్కడ ఉండకూడదని ప్లాన్ చేస్తారు జ్యోత్స్న, పారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 15వ తేదీ 723వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే ఎక్సర్‌సైజులు చేస్తున్న పారు దగ్గరకి జ్యోత్స్న వచ్చి రాత్రి నేను చెప్పినది ఏం చేశావని అడుగుతుంది. కోనసీమ కొబ్బరి లాంటి ఐడియా వచ్చింది. నీకు చెప్పను, నేనే చేసి చూపిస్తానని అంటుంది పారు. నువ్వు చేశావంటే ఖచ్చితంగా అట్టర్ ఫ్లాపేనని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. నన్ను అంత తక్కువ అంచనా వేయొద్దు, ఈ పారిజాతం ఐడియానే దాస్ కూతురిగా పెరగాల్సిన నిన్ను దశరథకు కూతురిని చేసింది. ఈ పారిజాతం ఐడియానే దీపలా అష్టకష్టాలు పడాల్సిన నిన్ను.. రాజభోగాలు అనుభవించేలా చేసిందని అంటుంది పారు.
నేను మామూలు రాజభోగాలు అనుభవించలేదు.. సొంతింటిలో విలువ లేదు, ఆఫీస్‌లో పరువు లేవు, దీప దగ్గర మర్యాద లేదు. టోటల్‌గా నా బతుక్కే గుర్తింపు లేదు.. ఈ దరిద్య్రాలు అన్నీ నీ వల్లనే అని మండిపడుతుంది జ్యోత్స్న. బావని అదుపు చేయడానికి అగ్రిమెంట్ ఉంది.. సూరజ్ గాడిని ఆపడానికి ఏం లేదని అంటుంది. వాడిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో ఆల్రెడీ చేశానని ముఖానికి నల్లరంగు పూసుకుంటుంది. ఇప్పుడు ఈ కారుకి బ్రేకులు లేవు.. రాత్రంతా వీడియోలు చూసి బ్రేకులు ఎలా తీయాలో నేర్చుకున్నాను అని చెబుతుంది పారు. నడిపితే పోతారని ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ సూరజ్ గాడిని కారు నడిపేలా చేయాలి.. యాక్సిడెంట్ జరిగితే కాలో చేయ్యో విరుగుతుంది. ఎదురుగా లారీ వస్తే మన కోరిక నెరవేరినట్లేనని ఇద్దరూ సంబరపడిపోతారు.
ఉదయాన్నే దీప టిఫిన్ చేయకుండా ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో అనసూయ మండిపడుతుంది. నాతో ఎలాగూ మాట్లాడటం లేదు.. నీతో అయినా మాట్లాడుతుందా అని కార్తీక్‌ని అడుగుతుంది. మొత్తానికి అన్ని వదిలేసింది.. కాస్త నువ్వే భయం చెప్పాలని చెబుతాడు కార్తీక్. 24 గంటలూ ఫోన్‌లోనే ఉంటున్నావట కదా అని దీపపై మండిపడుతుంది అనసూయ. పొద్దున్నే అత్తతో తిట్టిస్తున్నావేంటీ అని అడుగుతుంది దీప. నా భార్యకు నా తర్వాతే కడుపులోని బిడ్డ కూడా అని కార్తీక్ అనడంతో కాంచన, అనసూయలు సంబరపడిపోతారు. చిన్న మరదలి పెళ్లి బాధ్యతే మీరే తీసుకున్నారట కదా? త్వరగా ఎవరో ఒకరిని చూసి ముడి వేసేయండి అంటుంది అనసూయ.
సూరజ్‌ని ఎలాగైనా కారుని నడిపేలా చేయాలని కారు స్టార్ట్ కావడం లేదని డ్రామా ఆడిస్తుంది. కారు స్టార్ట్ కావడం లేదని సూరజ్‌ని ఇద్దరూ పిలుస్తారు. సూరజ్ కారుని స్టార్ట్ చేసి ఇవ్వడంతో నువ్వు చాలా గ్రేట్ అని మెచ్చుకుంటుంది. కారు ఎవరైనా స్టార్ట్ చేస్తారు.. కాస్త నడిపి చెక్ చేయమని అంటుంది పారు. నేను కాఫీ తాగుతూ లోపలే ఉంటే బాగుండేది, అనవసరంగా వచ్చానని అనుకుంటాడు సూరజ్. నువ్వొక ఒక రౌండ్ వేసి చెక్ చేసుకుని వస్తే అప్పుడు నేను కారులో బయల్దేరతానని రెచ్చగొడుతుంది పారు. ఇద్దరి మాటలకు రగిలిపోయిన సూరజ్ కారుని తీసుకుని డ్రైవ్ చేయడానికి వెళ్తాడు. సూరజ్ గాడు తిరిగిరాడు.. నువ్వు 108కి ఫోన్ చేసి రెడీగా ఉండమని జ్యోత్స్నతో చెబుతుంది పారు. రేయ్ కార్తీక్.. నీ బ్రదర్ టికెట్ చినిపోయిందని సంబరాలు చేసుకుంటుంది.
కార్తీక్, దీపలు ఆఫీస్‌కి వెళ్తుండగా ఇద్దరూ కలిసే వెళ్లొచ్చు కదా? నువ్వు, దీపలు వేరు వేరుగా వెళ్లడం దేనికి అని అడుగుతుంది కాంచన. నువ్వేం చెప్పకపోయినా వంటల పోటీ ఎవరితో జరుగుతుందో నాకు తెలుసని కాంచన చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. దక్షిణామూర్తితో పోటీ అని తెలుసు.. మాలిని వచ్చిందని కూడా తెలుసు అని అంటుంది కాంచన. మా అన్నయ్య ఊరిలో లేడు.. అందుకే జరిగే విషయాలు నా వరకు రావడానికి కాస్త ఆలస్యమవుతోందని అంటుంది. ఇందులో బావ తప్పేం లేదు.. నేనే చెప్పొద్దన్నని చెబుతుంది దీప. మాలిని రంగంలోకి దిగుతుందని.. దక్షిణామూర్తి తన కూతురి కోసం నా పుట్టింటికి వచ్చినప్పుడే నాకు తెలుసని చెబుతుంది కాంచన.
మాలిని అంటే మేనిప్యూలేటర్.. తన స్వార్ధం కోసం ఎదుటివాళ్లని ఉపయోగించుకునే వ్యక్తి. మాయ మాటలతో తనపని చేయించుకునే వ్యక్తి. అలాంటి వాళ్ల నీడ కూడా మనింటి మీద పడకూడదని చెబుతుంది కాంచన. తాత చెప్పిన గతంలో ఆవిడ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు కదా అని కార్తీక్ అడుగుతాడు. తన వల్ల ఎవరైనా నష్టపోయారా అని ప్రశ్నిస్తుంది. మనుషులే చెడ్డవాళ్లు అయినప్పుడు చేతల గురించి చెప్పుకోనక్కర్లేదు.. పోటీలో మనం దిగేవరకు వాళ్లు వదిలిపెట్టరు. కార్తీక్ గాడు ఎవరి జోలికి వెళ్లడు.. వీడి జోలికి వస్తే ఊరుకోడు. కానీ మాలిని అలా కాదు.. మనుషుల్ని రెచ్చగొట్టించి చావకుండా బతక్కుండా చేస్తుందని వార్నింగ్ ఇస్తుంది కాంచన.
మాలినిగారు తాత కుటుంబానికి ఏం చేశారు? అని కార్తీక్ అడుగుతాడు. నేను నీతో ఇదంతా చెప్పింది మీరిద్దరూ ఆవిడతో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. పులి చేయి పట్టుకుందంటే ఆ చేయి పోయినట్లే. ఆ మాలిని కూడా బోనులో ఉన్న పులి లాంటిదే, ఇప్పుడే వేటకి బయల్దేరింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండమని కొడుకు కోడలిని హెచ్చరిస్తుంది కాంచన. అత్త చెబుతున్న దానిని బట్టి ఆ మాలిని ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుస్తోందని కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉంటారు.
సూరజ్ ఎంతకి తిరిగిరాకపోవడంతో వెయిట్ చేస్తుంటారు జ్యోత్స్న, పారు. ఇంతలో సూరజ్ క్షేమంగా ఇంటికి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. సూరజ్ రాగానే బండి కండీషన్‌లోనే ఉందా? అని అడుగుతుంది పారు. ఇంతలో కార్తీక్ వచ్చి ఏం జరిగిందని అడగటంతో సూరజ్ జరిగినదంతా చెప్పి బండి కండీషన్‌లోనే ఉందని అంటాడు. పార్లర్‌కి వెళ్లాలి అన్నావు కదా బయల్దేరమని సూరజ్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. ముఖానికి ఆయిల్ ఎందుకు పూసుకున్నావని పారుని అడుగుతాడు కార్తీక్. త్వరగా పార్లర్‌కి వెళ్లి వచ్చేద్దామని పారుని తీసుకెళ్తుంది జ్యోత్స్న. పారు, జ్యోత్స్నలు కారులో వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడంతో వెళ్లి చెట్టును ఢీకొడతారు. దాంతో కార్తీక్, సూరజ్‌లు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications