Karthika Deepam 2 July 16th: మాలినితో దీప సై.. మాలిని ప్లాన్ తిప్పికొట్టిన సూరజ్.. శివన్నారాయణ ప్రశంసలు
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే ఎక్సర్‌సైజులు చేస్తున్న పారు దగ్గరకి జ్యోత్స్న వచ్చి ఆ సూరజ్ గాడిని అడ్డు తొలగించుకోవడానికి ఏం చేస్తున్నావని అడుగుతుంది. రాత్రంతా వీడియోలు చూసి బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ చేశానని చెబుతుంది పారు. ఈ కారుకి బ్రేక్‌లు తీసేశాను.. సూరజ్ వచ్చి కారు నడిపితే చాలు ఏ కాలో, చెయ్యో విరుగుతుందని అంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్న దీపపై సీరియస్ అవుతుంది అనసూయ. నన్ను కూడా పట్టించుకోవడం లేదు.. నువ్వే గట్టిగా బుద్ధి చెప్పమని అంటాడు కార్తీక్. దాంతో దీపకి క్లాస్ పీకుతుంది అనసూయ.
దీప చాలా మంచిది, నా తర్వాతే కడుపులోని బిడ్డయినా అని భార్యని మెచ్చుకుంటాడు కార్తీక్. మీరిద్దరూ ఇలాగే ఉండాలి, ముందు ఆ జ్యోత్స్నకి ఎవరో ఒకరితో ముడి వేసేయమని చెబుతుంది అనసూయ. మరోవైపు.. సూరజ్‌తో ఎలాగైనా బ్రేక్‌లు తీసేసిన కారును నడిపించాలని జ్యోత్స్న, పారులు ప్లాన్ చేస్తారు. కాఫీ తాగుతున్న సూరజ్‌ని పిలిచి కారు స్టార్ట్ కావడం లేదు.. ఒకసారి స్టార్ట్ చేసి పికప్‌లో ఉందో లేదో చూడమని రెచ్చగొడతారు. దాంతో సూరజ్ కారును నడుపుకుంటూ వెళ్లి క్షేమంగా తిరిగి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. కారు బాగానే ఉంది మీరిద్దరూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లమని సూరజ్ చెప్పగా నానమ్మ మనవరాలు వణికిపోతారు. చేసేదేం లేక ఇద్దరూ కారులో వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిలై చెట్టును ఢీకొడతారు. ఆ శబ్దం విన్న కార్తీక్, సూరజ్‌లు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 16వ తేదీ 724వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
యాక్సిడెంట్‌లో దెబ్బలు తగలడంతో మెడకు బెల్ట్ వేయించుకుంటుంది పారు. కారుకి బ్రేక్‌లు పడలేదు యాక్సిడెంట్ అయ్యింది.. మరి నీ ముఖానికి ఆయిల్ ఏంటీ? అని శివన్నారాయణ అడగటంతో పారు షాక్ అవుతుంది. యాటిట్యూడ్ కోసం ఆయిల్ రాసుకుందని కార్తీక్ చెప్పడంతో పారు ఉలిక్కిపడుతుంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందా? అని ఆలోచిస్తున్నా.. కారుని సర్వీస్ చేయించేది నేనే కదా? ఏ కారుకి ఏ కంప్లంట్ ఉందో నాకు బాగా తెలుసు అనడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అంటే నీ ఉద్దేశం ఎవరైనా బ్రేకులు తీసేశారా అని అడుగుతాడు శివన్నారాయణ. ముందు కారుని బ్రదర్‌ని టెస్ట్ చేయమన్నారు సార్.. బ్రదర్ బాగానే వచ్చాడు. జ్యోత్స్న కారెక్కింది కానీ, పారు కారెక్కడానికి ఇబ్బంది పడిందని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్నతో నేను ఎందుకులే అని ఆగిపోయాను, గేటు శుభ్రం చేస్తుంటే ఈ ఆయిల్ అంటుకుందని చెబుతుంది పారు. గేటుకు ఉండేది గ్రీజు ఆయిల్ కాదు. బ్రదర్‌ని వేసేయడానికి కారు బ్రేక్‌లు తీసేసి మర్దర్ ప్లాన్ చేశారేమోనని కార్తీక్ అనుమానించడంతో అంతా షాక్ అవుతారు. సూరజ్ ఇప్పుడు పరాయి వాడు కాదు కదా మనోడేనని చెబుతుంది పారు. మనకు కాంపీటిషన్‌కి టైం అవుతోంది.. వెళ్దామని పెద్దాయన చెబుతాడు. నేను కూడా వస్తాను.. మీరంతా వెళ్లిపోతే ఒంటి కన్ను రాక్షసిలా ఉండలేనని అంటుంది పారు. దాంతో సరేనని అంటాడు పెద్దాయన.
గార్డెన్‌లో ఒక రెంజ్ దొరికింది దాని సంగతి ఏంటీ? అని పారుని కార్తీక్ అడగ్గా నానమ్మ మనవరాలు షాక్ అవుతారు. ఎన్ని వేషాలు వేసినా బ్రదర్ ఇక్కడి నుంచి పోడు, ముందు ఈరోజు కాంపీటిషన్‌లో దీపని గెలవనీ, ఆ తర్వాత మీ సంగతి చెబుతానని అనుకుంటాడు కార్తీక్. పోటీ కోసం రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్లు భారీ ఏర్పాట్లు చేస్తారు. బయటివాళ్లు ఎవరూ రారు.. అంతా మనవాళ్లే, వంటలను టేస్ట్ చేయడానికి ఒక చెఫ్ వస్తారని చెబుతారు అసోసియేషన్ వాళ్లు. ఇంతలో దక్షిణామూర్తి - మాలినిలు రావడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు.
మనిద్దరం పరిచయం లేని పరాయి వాళ్లం అని అంతా అనుకుంటున్నారు.. దానిని అలాగే ఉండనివ్వమని దక్షిణామూర్తితో అంటాడు శివన్నారాయణ. చెప్పుకోనంత మాత్రాన బంధుత్వాలు ఎక్కడికి పోతాయని మాలిని అడుగుతుంది. మీ మావగారు రెచ్చగొట్టి మరి పోటీకి పిలిచాడు.. ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేదిక సిద్ధం చేశాడని ఫైర్ అవుతాడు. పోటీ అనేది అనురాగం పెంచుకోవడానికి, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదని చెబుతుంది మాలిని. నువ్వు వస్తావని అనుకోలేదని సుమిత్రను పలకరిస్తుంది.
నా మెట్టినింటి గౌరవాన్ని నువ్వు ఎక్కడ నాశనం చేస్తావోనన్న భయంతో వచ్చానని అంటుంది సుమిత్ర. కూతురి పరువు గురించి ఈ తండ్రి ఆలోచించడా? అని ప్రశ్నిస్తాడు దక్షిణామూర్తి. ఆలోచించే కదా ఇంట్లో నుంచి గెంటేశావని పారు అనగా.. ఇది మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం నువ్వెందుకు మాట్లాడుతున్నావని ఫైర్ అవుతుంది మాలిని. పారు మా తాత భార్య.. మా అత్తకి అత్తగారు.. కోడలి గురించి అత్తగారు మాట్లాడకుండా ఎలా ఉంటారు? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. నా అల్లుడు ఈవిడ కొడుకు కాదని అంటాడు దక్షిణామూర్తి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.
కుటుంబాన్ని విడదీశారు.. ఇప్పుడు మనుషుల్ని కూడా విడదీస్తారా అని సుమిత్ర ఫైర్ అవుతుంది. ఫోన్‌లో నువ్వు మాట్లాడిన మాటలు.. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉంటావో కూడా అర్ధం చేసుకున్నానని ఫైర్ అవుతుంది. మీరొచ్చింది వంటల పోటీకి కాదు, మాటల పోటీకి అని శివన్నారాయణ అంటాడు. మీరు పాత స్నేహాన్ని మరిచిపోలేదని నాకు తెలుసు.. ఎందుకు నటిస్తారు, మీకంత ప్రేమ లేకపోతే రక్తం ఇచ్చి మావయ్య గారి ప్రాణాలు ఎందుకు కాపాడతారు? నువ్వు ఎలా నీ స్నేహితుడి మీద ప్రేమను చంపుకోలేదో.. మా మావయ్య గారు కూతురి మీదున్న ప్రేమను చంపుకోలేదు, నీ తండ్రి ఆరాటపడేది నీ కోసమేనని చెబుతుంది మాలిని.
నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది కూడా నా కోసమే.. కన్నకూతురి పసుపు కుంకుమలనే దూరం చేయాలని అనుకున్నాడు. దూరం చేసుకోవాలనుకున్న బంధం ఎలా దగ్గరవుతుంది? దీనికి ప్రక్షాళన తప్పించి క్షమాపణ లేదని తేల్చేస్తుంది సుమిత్ర. ఇక్కడికి మనిద్దరం పోటీ పడటానికి వచ్చాం.. అలాగే ఉందాం, అలాగే మాట్లాడుకుందామని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఒక గంట వ్యవధిలో 5 వంటలు చేయాలి, మీ చెఫ్‌లు చేసిన వంటలను జడ్జిలు టేస్ట్ చేసి ఎవరు విజేత అని నిర్ణయిస్తాం. అయితే ఇందులో శివన్నారాయణ గారు ఓ పాయింట్ యాడ్ చేశారు.. ఓడిపోయిన వాళ్లే గెలిచిన వారికి బహుమతి ఇవ్వాలని అసోసియేషన్ మెంబర్స్ రూల్స్ చెబుతారు.
సూరజ్ గాడిని, దీపని తాత దృష్టిలో చెడ్డవాళ్లను చేయాలని పారు, జ్యోత్స్నలు మాట్లాడుకుంటూ ఉండగా.. మాలిని ఉంగరం పడిపోవడంతో సూరజ్ పిలిచి ఇస్తాడు. నువ్వు తాత దగ్గరికి వెళ్లి మాలినితో సూరజ్ చేతులు కలుపుతున్నాడని చెప్పు.. మిగతాది నేను చూసుకుంటానని పారుకి ప్లాన్ చెబుతుంది జ్యోత్స్న. నా చేయి నుంచి జారిపోయి నీ చేతికి వచ్చిందంటే అది నీకు రాసిపెట్టుందని సూరజ్‌తో అంటుంది మాలిని. జ్యోత్స్న చెప్పినట్లే శివన్నారాయణని లాక్కొస్తుంది పారు. అయితే దొంగచాటుగా ఆ మాటలు విని తర్వాత సూరజ్ గురించి నిర్ణయం తీసుకోమని శివన్నారాయణకి చెబుతాడు కార్తీక్.
నా ఆర్గానిక్ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి దీప గారు అనుమతి ఇచ్చారు.. అందుకు కృతజ్ఞతగా దీప గారికి సాయం చేస్తున్నానని చెబుతాడు సూరజ్. నీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే మంచి ఛాన్స్ ఇస్తానని మాలిని ఆఫర్ ఇస్తుంది. నువ్వు నాకు అడ్వైజర్‌గా ఉంటావా? అని అడుగుతుంది. దానికి ఉండను అని సమాధానం చెబుతాడు సూరజ్. నా లైఫ్‌ని నాకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకున్నాను.. నాకు చేసే పనులే కాదు మనుషులు కూడా నచ్చాలి. నన్ను మోసం చేసేవాళ్ల గురించి నేను ఆలోచించను, నన్ను నమ్మినవాళ్లని మాత్రం నేను మోసం చేయను అని సూరజ్ చెబుతాడు. మీరు బంగారం ఉంగరమే కాదు.. వజ్రాల ఉంగరం ఇచ్చినా నాకు అక్కర్లేదని మాలినికి ఇచ్చి వెళ్లిపోతాడు సూరజ్. ఈ మాటలన్ని విన్న శివన్నారాయణ చప్పట్లు కొట్టి ప్రశంసిస్తారు. ముందే ముందుకొస్తే బేరసారాలు సాగవని అంటాడు శివన్నారాయణ. నా దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు ఉండరు.. నా వాళ్లని నీ డబ్బుతో కొనలేవని తేల్చిచెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications