Karthika Deepam 2 July 17th: శివన్నారాయణ చెఫ్‌ని కొనేసిన మాలిని.. జ్యోత్స్నతో చేతులు కలిపిన సూరజ్, షాక్‌లో దీప
Photo Courtesy: JioHotstar
యాక్సిడెంట్‌లో దెబ్బలు తగలడంతో మెడకు బెల్ట్ వేయించుకుంటుంది పారు. కారుకు బ్రేక్‌లు పడక యాక్సిడెంట్ అయ్యింది.. అయినా నీ ముఖానికి ఆయిల్ ఏంటీ అని కార్తీక్ అడగ్గా గేట్ క్లీన్ చేస్తుంటే అయ్యిందని చెబుతుంది పారు. బ్రదర్‌ని చంపడానికి ఏదైనా కుట్ర జరిగిందా? అని కార్తీక్ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. శివన్నారాయణ కుటుంబం మొత్తం కలిసి రెస్టారెంట్స్ మధ్య జరిగే పోటీకి వెళ్తారు. అక్కడికి మాలిని, దక్షిణామూర్తి రావడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. మనిద్దరికీ ఎలాంటి పరిచయం లేదని అంతా అనుకుంటున్నారు. దానిని అలాగే ఉండనివ్వమని చెబుతాడు శివన్నారాయణ.
కుటుంబాన్ని విడదీశారు ఇప్పుడు మనుషుల్ని కూడా విడదీస్తారా అని మండిపడుతుంది సుమిత్ర. ఇంతలో పోటీకి సంబంధించిన రూల్స్ చెబుతారు అసోసియేషన్ వాళ్లు. గంటలో 5 రకాల వెరైటీలు చేయాలని, అసోసియేషన్ నిర్ణయించిన జడ్జిలు ఎవరి ఫుడ్ బాగుందో నిర్ణయిస్తారని చెబుతారు. దీప, సూరజ్‌ల మీద తాతకున్న నమ్మకాన్ని చంపేయాలని పారు, జ్యోత్స్నలు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మాలిని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండగా ఆమె ఉంగరం కింద పడిపోతుంది. అది చూసిన సూరజ్ ఆమెకు ఇస్తాడు. ఇదే సమయంలో మాలినికి సూరజ్ అమ్ముడుపోయాడని నమ్మించాలని జ్యోత్స్న ప్లాన్ చేసి శివన్నారాయణని బయటికి రప్పిస్తుంది. మాలినికి సూరజ్ కౌంటర్ ఇవ్వడం చూసి పెద్దాయన మెచ్చుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 17వ తేదీ 725వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా దగ్గర నీ డబ్బుకి అమ్ముడుపోయేవాళ్లు లేరని మాలినిపై మండిపడతాడు శివన్నారాయణ. నిజాయితీ ఉన్నవాళ్లే కాదు.. అవసరం ఉన్నవాళ్లు కూడా ఉంటారని అంటుంది మాలిని. మీరంతా ఎప్పుడొచ్చారు అని సూరజ్ అడగ్గా.. ఇలా వెళ్తుండగా నువ్వు కనిపించావు ఆగిపోయామని చెబుతాడు కార్తీక్. ఇప్పటికైనా సూరజ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా అని పారుకి చెబుతాడు. అందుకే ఈ మనిషిని ఇంటి దగ్గరే ఉండమన్నది అని శివన్నారాయణ రగిలిపోతాడు.
వంటల పోటీ మొదలవ్వబోతోందని రెండు రెస్టారెంట్స్‌కి చెందిన చెఫ్‌లు ఇక్కడికి రమ్మని చెప్పగా జ్యోత్స్న రెస్టారెంట్‌కి చెందిన చెఫ్ కిరణ్.. మాలిని రెస్టారెంట్స్ వైపు వెళ్లడంతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. తను ఎంచుకున్న చోటే తను నిలబడ్డాడని చెబుతుంది మాలిని. అక్కడెందుకు నిలబడ్డావు? ఏం జరిగిందని కార్తీక్ ప్రశ్నించగా.. నాకేం కాలేదు, నేను డీఎం రెస్టారెంట్స్ తరపున వంటలు చేయడానికి వచ్చానని కిరణ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. డీఎం రెస్టారెంట్స్ తరపున వంటలు చేయడం ఏంటీ? నువ్వు నా ఉద్యోగివి, నీకు జీతం మేం ఇస్తున్నామని చెబుతాడు శివన్నారాయణ.
రెండు గంటల క్రితమే మీ రెస్టారెంట్స్‌లో జాబ్‌కి రాజీనామా చేసి మా రెస్టారెంట్‌లో జాయిన్ అయ్యాడని మాలిని చెప్పడంతో అంతా అవాక్కువతారు. నువ్వు మరి ఇంత నీతి లేని మనిషివా? రాత్రికి రాత్రే మా మనిషిని కొనేస్తావా? అని మండిపడతాడు శివన్నారాయణ. నిజాయితీని మీ డబ్బుతో కొనలేనని అన్నావు కదా? ఇప్పుడు చూశావా అని అడుగుతుంది మాలిని. వాళ్ల చెఫ్ మన దగ్గర జాయిన్ అవ్వడం ఏంటీ అని మాలినిని అడుగుతాడు దక్షిణామూర్తి. మీకు ముందుగానే చెప్పి ఉండాల్సింది.. నిన్న రాత్రి ఈ చెఫ్ నాకు ఫోన్ చేసి మీ రెస్టారెంట్స్‌లో జాయిన్ అవుతానని అడిగాడని మాలిని చెబుతుంది.
మీరు వద్దని చెప్పొచ్చు కదా అని కార్తీక్ అనగా.. నాకు చెఫ్ అవసరం ఉంది, ఇంతకు ముందు ఎక్కడ పనిచేశావని అడగ్గా.. మీ పేరు చెప్పాడని అంటుంది మాలిని. దాంతో క్షణం ఆలోచించకుండా ఉద్యోగం ఇచ్చేశావా అని ఫైర్ అవుతాడు శివన్నారాయణ. ఆ కంపెనీతో నాకు ఎలాంటి అగ్రిమెంట్ లేదు.. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూసుకుంటానని చెప్పాడు. మీరు తననే పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసు అని అంటుంది మాలిని. మా అత్త దెబ్బ అదుర్స్ కదా? కానీ దీని వల్ల దీప తాత ముందు చెడ్డ అవ్వలేదని పారుతో అంటుంది జ్యోత్స్న.
మన రెస్టారెంట్స్‌లో బెస్ట్ చెఫ్ ఇతనే .. ఏ వంటకం ఎలా వండాలో తనతో చెప్పాను, కనీసం అప్పుడైనా నాతో చెప్పాల్సిందని అంటుంది దీప. బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అని దీపని నానామాటలు అంటుంది పారు. నా కోడలు తప్పు చేయదు, నీ కింద పనిచేసేవాళ్లు నీకు చెప్పకుండా ఉద్యోగం మానేశారంటే నువ్వు వాళ్లని ఎంత బాగా చూసుకుంటున్నావో అర్ధమవుతోంది. ఈ మాత్రం దానికి నిజాయితీ, నీతి అని గొప్పలు చెప్పాల్సిన అవసరం ఏంటీ అని దక్షిణామూర్తి మండిపడతాడు.
వ్యాపారంలో ఇలాంటివి కామన్.. ఓడిపోయినవాడు మోసం అంటాడు, గెలిచిన వాడు లౌక్యం అంటాడు. ఎవరెమన్నా.. నిజాయితీగా మాత్రం ఒప్పుకోవాల్సిందే. మా చెఫ్ పోటీకి రెడీగా ఉన్నాడు, మీ చెఫ్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది మాలిని. పోటీని వాయిదా వేయడానికి వీల్లేదు.. అది కూడా ఇప్పుడే జరగాలని పట్టుబడుతుంది. విజేత ఎవరో ఈరోజే తెలియాలని చెబుతుంది మాలిని. పోటీదారులకు పోటీ చేసే సమయం లేకపోవడంతో రెండు అవకాశాలు ఉంటాయి. పోటీ నుంచి తప్పుకుని డీఎం రెస్టారెంట్స్‌ని విజేతగా ప్రకటించడం.. రెండు ఒక 10 నిమిషాలు టైం తీసుకుని మరో వ్యక్తిని పిలిపించడం అని మాలిని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈ చెఫ్‌ని మొదటి నుంచి సిద్ధం చేశాను.. ఇప్పటికిప్పుడు అంటే ఎవరు దొరుకుతారని అంటుంది దీప. శివన్నారాయణ దేనికీ భయపడడని కోపంగా వెళ్లిపోతాడు. నేనే ఆ చెఫ్‌కి డబ్బు ఆశ చూపించి మరి అతనిని కొనేశాను, నాకు కావాల్సింది శివన్నారాయణ పతనం, దాని కోసం నేను ఏమైనా చేస్తానని మనసులో అనుకుంటుంది మాలిని.
సూరజ్ దగ్గరికి వెళ్లి పోటీ మొదలవ్వకుండానే మనం ఓడిపోయామని జ్యోత్స్న అంటుంది. నువ్వు కోరుకున్నది అదే కదా నా దగ్గర నటించకు అని మండిపడతాడు సూరజ్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నేను చెప్పినట్లు వినాలని సూరజ్‌తో చెబుతుంది. అప్పుడు ఫుడ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నువ్వే సాల్వ్ చేశావు.. ఇప్పుడు కూడా నువ్వు వెళ్లి ఏదో రకంగా హెల్ప్ చేయొద్దని చెబుతుంది జ్యోత్స్న. మా తాత దీపని నమ్ముతున్నాడు.. ఆ నమ్మకం చచ్చిపోవాలని అంటుంది. నేను మా వదినను ఓడించలేను అని తేల్చేస్తాడు సూరజ్. జ్యోత్స్న బతిమలాడటంతో ఈ ఒక్కరోజు నేను నీ వైపు ఉంటానని చెబుతాడు సూరజ్. నేను మా వదిన దీపకి కాకుండా నీకు సపోర్ట్ ఉంటానని అంటాడు.
నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే ఇలాగే ఉంటుందని శివన్నారాయణ అంటాడు. సొంత మనవరాలు ఉండి కూడా బాధ్యత నీకు అప్పగించారు కదా? పోటీలో ఓడిపోతే నేను చచ్చిపోయినట్లే అని మీరు అన్నారంటే ఈ దీప అర్ధం చేసుకోవాలి కదా అని పారు నానామాటలు అంటుంది. ఇప్పుడు మనకి రెండే దారులు ఉన్నాయి.. పోటీలో నుంచి తప్పుకోవడం లేదంటే పోటీకి దిగడం. ఎక్కడైనా ఇద్దరినో ముగ్గురినో పెట్టుకుంటారు. కానీ మేడం గారు ఒకే ఒకరిని పెట్టారని జ్యోత్స్న కూడా నానామాటలు అంటుంది. ఆ కిరణ్ గాడు రెస్టారెంట్స్‌లో బెస్ట్ చెఫ్.. ఏం వంటలు చేయాలో ముందుగానే దీప ప్రాక్టీస్ చేయించింది. ఇప్పుడు వాడు వెళ్లి అటు వైపు నిలబడ్డాడని అంటుంది జ్యోత్స్న.
తాతయ్య గారు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడిపోరని చెబుతుంది దీప. మనం గెలవాలంటే మనకొక బెస్ట్ చెఫ్ కావాలని కార్తీక్.. మేడం జ్యోత్స్న గారే తాతగారి పరువు నిలబెడతారని, ఆవిడే బెస్ట్ చెఫ్ అని సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. దానికి కాఫీ పెట్టడమే సరిగా రాదని పారు చెప్పగా.. జ్యోత్స్న గారే వంట చేసి తాతగారిని గెలిపిస్తారని అంటాడు సూరజ్. నన్ను మీరు నమ్ముతున్నారా లేదా? అని సూరజ్ అడగ్గా... అందరూ నమ్ముతున్నామని చెబుతారు. ప్లాన్ ఏంటో తెలియకుండా వంట రాని మనిషితో పోటీకి ఎలా వెళ్తామని అంటాడు శివన్నారాయణ. సూరజ్ అంత నమ్మకంగా చెబుతున్నాడంటే మనం ధైర్యంగా ఉందామని అంటుంది దీప. నేను ఒకడిని నమ్మాను.. వాడు మోసం చేశాడు, నేను ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను అని సూరజ్‌తో అంటాడు శివన్నారాయణ. నా మనవరాలికి వంట రాదు.. దాని పరువు తీయడానికే ఇలా చేస్తున్నావా అని సూరజ్‌పై మండిపడుతుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications