Karthika Deepam 2 July 18th: బెడిసికొట్టిన సూరజ్ ప్లాన్.. దీప వంటని చెడగొట్టిన జ్యోత్స్న, షాక్‌లో శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
కార్తీక్‌ను కొనాలని చూసిన మాలినికి నీ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్లు నా దగ్గర లేరని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నిజాయితీ ఉన్నవాళ్లే కాదు, అవసరం ఉన్నవాళ్లు కూడా ఉంటారని అంటుంది మాలిని. వంటల పోటీ మొదలవ్వడంతో ఇరు వర్గాలకు చెందిన చెఫ్‌లను రమ్మని నిర్వాహకులు చెబుతారు. జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి చెందిన కిరణ్ అనే చెఫ్.. దక్షిణామూర్తి రెస్టారెంట్స్ వైపు నిలబడటంతో దక్షిణామూర్తి ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇతను రెండు గంటల క్రితమే మీ దగ్గర ఉద్యోగం మానేసి మా రెస్టారెంట్‌లో చెఫ్‌గా జాయిన్ అయ్యాడని మాలిని చెప్పడంతో శివన్నారాయణ రగిలిపోయి.. దక్షిణామూర్తిని నానా మాటలు అంటాడు.
మీకు ముందే చెప్పాల్సింది ఇతను నిన్న రాత్రి నా దగ్గర చేరతానని వచ్చాడని దక్షిణామూర్తితో అబద్ధం ఆడుతుంది మాలిని. మీ తరపున వంట చేసే వాళ్లు లేరు కాబట్టి పోటీ నుంచి తప్పుకుంటారా? లేక కొత్త వంట వాడిని వెతుక్కుంటారా అని అంటుంది. అవమానంతో బయటికి వచ్చేస్తాడు శివన్నారాయణ. హాయిగా జ్యూస్ తాగుతున్న సూరజ్ దగ్గరికి వచ్చి ఈ ఒక్కసారికీ నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది జ్యోత్స్న. నమ్మిన వాళ్లని నేను మోసం చేయలేను, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను గెలిపిస్తానని చెబుతాడు సూరజ్. నీ నిర్లక్ష్యం వల్ల శివన్నారాయణ గారు అవమానపడే స్థాయికి చేరుకున్నారని దీపని నానామాటలు అంటుంది పారు. ఆ వెంటనే సూరజ్ వచ్చి మనకి చెఫ్ దొరికాడని జ్యోత్స్న చేయ్యెత్తి చూపిస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నాకొక అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానని సూరజ్ అనడంతో శివన్నారాయణ సరేనని అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 18వ తేదీ 726వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
చెఫ్‌గా జ్యోత్స్నని ఎంపిక చేయడంపై సూరజ్‌పై మండిపడుతుంది పారిజాతం. నా మనవరాలి పరువు తీయడానికి కాకపోతే ఇది చెఫ్ ఏంటీ అని అంటుంది. కారుకు బ్రేక్‌లు తీసింది మీరేనని నాకు తెలుసు, ఎవరు తీసిన గోతిలో వాడే పడతాడు అని అంటాడు సూరజ్. ఈరోజు నీకు గట్టిగానే మూడిందని భయపడుతుంది పారు. నాకు సపోర్ట్‌గా ఉండమంటే నన్నే ఇరికిస్తావా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నీకు ఓడిపోవడమే కావాలి కదా.. నువ్వు వంట చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామని అంటాడు సూరజ్.
నీ షర్ట్ చించినందుకు, కారు బ్రేక్‌లు తీసినదానికి ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నావు. నువ్వు నన్ను బంగారం అని ఎందుకు పిలుస్తావో మాలినితో మాట్లాడుతున్నప్పుడే నాకు తెలిసింది అంటుంది సూరజ్. నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో కానీ, నా ప్లాన్ ఫాలో అయితే మాత్రం ఓడిపోవని చెబుతాడు. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పమని అడుగుతుంది. మరోవైపు.. మీ చెఫ్ ఎక్కడ అని శివన్నారాయణని అడుగుతాడు దక్షిణామూర్తి. 2 నిమిషాలు టైం ఇవ్వమని దీప అడగ్గా మాలిని సరేనని అంటుంది.
కార్తీక్‌ను పక్కకి తీసుకెళ్లిన దీప.. పోటీలోకి నేను దిగుతానని చెప్పడంతో అతను షాక్ అవుతాడు. ఒకసారి తాతని, అమ్మని చూడు.. దక్షిణామూర్తి తాత ముందు తాత ఓడిపోతే తట్టుకోలేడు.. పైగా పోటీకి అమ్మ కారణంగా ఒప్పుకున్నాడు. అమ్మ తట్టుకోలేదు.. జ్యోత్స్న పోటీలోకి దిగితే ఓడిపోవడం ఖాయమని అంటుంది. సీఈవో పోటీలో దిగకూడదు.. దీనికి వాళ్లు ఒప్పుకోరు, ఇలాంటి క్లాజ్ ఉంది కాబట్టే సూరజ్ నిన్ను వంట చేయమని అడగలేదు. పైగా నువ్వు ప్రెగ్నెంట్‌వి ఆ ప్రెజర్ నువ్వు తట్టుకోలేవు అని చెబుతాడు కార్తీక్.
మరి మన ఫ్యామిలీని ఎలా గెలిపించాలి? మనం దారుణంగా మోసపోయాం.. నేను ఉండికూడా నా వాళ్లని గెలిపించుకోలేకపోయాను బాధపడుతుంది దీప. వాళ్లు అడిగిన టైం అయిపోయింది.. శివన్నారాయణ గారి నిర్ణయం ఏంటీ? వాళ్లు తప్పుకుంటే మేం బహుమతి తీసుకుని వెళ్లిపోతాం.. అది కూడా శివన్నారాయణ గారి చేతుల మీదుగా అని చెబుతుంది మాలిని. ఇంతలో జ్యోత్స్న వచ్చి మేం పోటీలోకి దిగుతున్నామని చెబుతుంది. మీ చెఫ్ ఎక్కడ అని మాలిని అడగ్గా.. సీఈవో దీపే మా చెఫ్ అని జ్యోత్స్న చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. దీప వంట చేస్తే నేను ఓడిపోతాను.. ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది మాలిని.
సీఈవోగా ఉన్న దీప వంట చేయకూడదని మాలిని చెప్పగా.. వంట నేను చేస్తాను, దీప సాయం చేస్తుందని చెబుతుంది జ్యోత్స్న. ఈ సలహా సూరజ్ ఇచ్చుంటాడని దీప అంటుంది. ఒకప్పుడు దీప కూడా మా రెస్టారెంట్‌కి చెఫ్.. సత్యరాజ్ రెస్టారెంట్‌లో తను చెఫ్‌గా ఉంటూ ఏ వంటకాలు చేయాలో తనే చెబుతుంది. తను సీఈవో మాత్రమే కాదు మంచి చెఫ్ కూడా .. దీనికి మీరు ఒప్పుకోను అంటే పోటీని క్యాన్సిల్ చేయమని చెబుతుంది జ్యోత్స్న. ఐదో తరగతి చదివిన దీప.. కలరి ఆర్ట్‌లో డిగ్రీ తీసుకున్న చెఫ్‌తో పోటీపడతానంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కడుపుతో ఉన్న మనిషిని పోటీకి దించడం న్యాయం కాదు, అందుకే దీప లేకుండా జ్యోత్స్న మాత్రమే పోటీకి దిగాలని చెబుతుంది మాలిని.
నా యోగక్షేమాలు గురించి పట్టించుకున్నందుకు మీకు థ్యాంక్స్.. నా మొదటి కాన్పు సమయంలో 8 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇడ్లీ బండి నడిపేదానిని. ఇప్పుడంటే కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ అప్పుడు నాకు సైకిల్ తప్పించి ఏం లేదు. నా వర్షంలో గోతిలో పడిపోయా.. సాయం చేయడానికి ఎవరూ లేరు, నా మీద నాకు నమ్మకం తప్ప. ఇప్పుడు మీ ముందు గౌరవంగా నిలబడ్డాను. ఒక మనిషి రుచికరంగా ఎలా తినగలడో నాకు మా నాన్న నేర్పించాడు. ఐదో తరగతి చదివిన నాతో పోటీకి మీరు ఒప్పుకోకపోతే ఓడిపోయామని చెప్పి తప్పుకోండి అని అంటుంది దీప.
జ్యోత్స్న, దీపలు పోటీకి దిగొచ్చని మాలిని ఒప్పుకుంటుంది. పోటీని చూసేందుకు సుమిత్ర పక్కనే కూర్చొంటాడు శివన్నారాయణ. ప్రెగ్నెంట్ కావడం వల్ల ఎక్కువసేపు నేను నిలబడలేనని జ్యోత్స్నకి చెబుతుంది దీప. ఇంతలో చెఫ్ కిరణ్ వచ్చి.. నాతో పోటీపడి గెలుద్దామనేనా అని హేళనగా మాట్లాడతాడు. దాంతో దీప కత్తి తీసి.. అన్నం పెట్టిన చేతిని మరిచిపోకూడదు అంటారు. మరిచిపోవడం తప్పయితే నమ్మకద్రోహం మరింత పెద్ద తప్పు. దానికి శిక్ష భగవంతుడు వద్దన్నా వేస్తాడని వార్నింగ్ ఇస్తుంది దీప. నువ్వు ఓడిపోతే అటు సూరజ్ గాడు, ఇటు నువ్వు ఇద్దరూ పోతారని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దీప వంట చేస్తుండగా మొత్తం చెడగొడుతుంది జ్యోత్స్న.
శివన్నారాయణ గారి మనవరాలు తాతని గెలిపించిందని అందరూ అనుకుంటారు. నువ్వు తాతని గెలిపిస్తే నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా? ఒకసారి గెలిచి చూడు నిన్ను అందరూ ఎంత గొప్పగా చూస్తారో అర్ధమవుతుంది. మనం ఇక్కడి నుంచి ఆ బహుమతి తీసుకుని వెళ్దాం.. చేయి కలపమని అడుగుతుంది దీప. ఇంతలో చివరి 30 నిమిషాలు మాత్రమే మిగిలి ఉందని అనౌన్స్ చేస్తారు. ఈ గెలుపు నా కంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తుందని చెబుతుంది దీప. దాంతో జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications