Karthika Deepam 2 July 20th: ఒక్కటైన దీప- జ్యోత్స్న, శివన్నారాయణ విక్టరీ, మాలినికి అవమానం
Photo Courtesy: JioHotstar
చెఫ్‌గా జ్యోత్స్నను ఎంపిక చేయడంతో సూరజ్ వైపు అందరూ అనుమానంగా చూస్తారు. కానీ నేను నిన్ను నమ్ముతున్నానని అంటుంది దీప, కార్తీక్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు చెబుతాడు. సూరజ్ మీద నమ్మకంతో అతనికి ఒక అవకాశం ఇస్తాడు శివన్నారాయణ. చెఫ్‌గా జ్యోత్స్నని ఎంపిక చేయడంతో నా మనవరాలి పరువు తీయాలని అనుకుంటున్నావా అంటూ మండిపడుతుంది పారు. నీ షర్ట్ చించేశాను అని, కారు బ్రేక్స్ తీసేశాను అని నా మీద పగ తీర్చుకుంటున్నావా అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో కానీ నా ప్లాన్ ఫాలో అయితే మాత్రం నువ్వు గెలుస్తావని జ్యోత్స్నకి ధైర్యం చెబుతాడు సూరజ్. చెఫ్ రాకపోవడంతో తానే రంగంలోకి దిగుతానని కార్తీక్‌తో అంటుంది దీప. కడుపుతో ఉన్న నువ్వు ప్రెజర్ తట్టుకోలేవు.. పైగా సీఈవో పోటీలో ఉండకూదని కార్తీక్ అనడంతో దీప షాక్ అవుతుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి నేనే పోటీలో దిగుతానని, నాకు దీప హెల్ప్ చేస్తుందని చెబుతుంది. దానికి మాలిని ఒప్పుకోకపోవడంతో దీప తన మాటలతో ఒప్పిస్తుంది. దీప చేస్తున్న వంటల్ని చెడగొట్టేందుకు జ్యోత్స్న నానా ప్రయత్నాలు చేస్తుంది. దాంతో మనిద్దరం తర్వాత చూసుకుందాం.. ముందు తాత పరువుని కాపాడమని జ్యోత్స్నని బ్రతిమలాడుతుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 20వ తేదీ 727వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దీపతో జ్యోత్స్న కలిపి మనం గెలుస్తున్నాం.. ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది జ్యోత్స్న. సూరజ్ పక్కనే ఉన్నాడేమో అనుకుని మనం గెలుస్తున్నామని అనుకుంటున్నావా? మనం గెలవం అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ విన్న శివన్నారాయణ నీ సంగతి ఇంటి దగ్గర చెబుతానని వార్నింగ్ ఇస్తాడు. పోటీలో ఏమైనా తేడా జరిగితే నేను మాత్రమే ఇంటికి వెళ్తాను నువ్వు కాదని చెబుతుంది దీప. చివరి రెండు నిమిషాల్లో కూడా దీప స్వీట్ చాలా వేగంగా చేస్తుంది. అనుకున్న టైంకి వంటలన్నీ పూర్తి చేయడంతో దీపని జ్యోత్స్న మెచ్చుకుంటుంది.
వంటలను రుచి చూసిన జడ్జిలు డీఎం రెస్టారెంట్స్ చేసిన మసాలా కర్రీ, చికెన్ బిర్యానీ చాలా బాగున్నాయని చెబుతారు. అలాగే జ్యోత్స్న రెస్టారెంట్స్ చేసిన దమ్ బిర్యానీ, కర్రీ బాగున్నాయి.. ఈ రౌండ్‌లో ఇద్దరి వంటకాలు సమానమేనని అంటారు. చివరి రౌండ్‌లో ఎవరి వంటకాలు బాగున్నాయోనని ఇరు వర్గాలు టెన్షన్‌కు గురవుతారు. దీప చేసిన స్వీట్, జ్యోత్స్న రెస్టారెంట్స్ చేసిన స్వీట్ నచ్చాయని జడ్జిలు తమలో తామే గొడవ పడతారు. అయితే మరో జడ్జి రెండు స్వీట్స్ టేస్ట్ చేసి జ్యోత్స్న రెస్టారెంట్స్ స్వీట్ బాగుందని చెప్పడంతో శివన్నారాయణ ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంటుంది. మాలిని, దక్షిణామూర్తిల ముఖం అవమానంతో రగిలిపోతుంది. విజేతలకు మేడం మాలిని గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తామని అంటారు. దాంతో దానిని సాధించింది మీరిద్దరూ కాబట్టి మీరే అందుకోవాలని దీప- జ్యోత్స్నలను పంపిస్తాడు శివన్నారాయణ.
న్యాయంగా ఈ విజయం, బహుమతి మా జ్యోత్స్నకి దక్కాలి. తను లేకపోతే అనుకున్న టైంలో వంటలు పూర్తయ్యేవి కావు అందరి ముందు తనకు థ్యాంక్స్ చెబుతున్నానని జ్యోత్స్నని హత్తుకుంటుంది దీప. ఈ బహుమతిని నువ్వే తాతకి ఇవ్వాలని దీప చెప్పడంతో జ్యోత్స్నని చూసి గర్వంగా ఉందని మురిసిపోతాడు శివన్నారాయణ. దీప, జ్యోత్స్నలకు కంగ్రాట్స్ చెప్పిన మాలిని.. రెస్టారెంట్స్ ఓనర్స్‌కు మీరేంటో మరోసారి ప్రూవ్ చేశారని అంటుంది. నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి.. నువ్వు నా షెఫ్‌ని కొనేయకపోతే నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా వాళ్లేనని భ్రమలో ఉండేవాడిని. నువ్వు వాడిని కొని నాకొక జ్ఞానోదయం చేశావని చెబుతాడు శివన్నారాయణ.
షెఫ్‌లు లేరని నా మనవరాళ్లు పోటీకి దిగారు. వాళ్లు దిగకపోతే పోటీకి నేనే దిగేవాడిని అని చెబుతాడు శివన్నారాయణ. నువ్వు పెద్ద వంట వాడివని నాకు తెలుసు అని దక్షిణామూర్తి అంటాడు. మీరిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? అని అసోసియేషన్ వాళ్లు అడగ్గా.. కొత్త పరిచయంలోనే పాత విషయాలన్నీ తెలిశాయని చెబుతాడు శివన్నారాయణ. ఈ శివన్నారాయణ అద్భుతమైన వంటగాడు.. ఆ రుచులు తిన్నవాడికి జీవితాంతం గుర్తుంటాయని అంటాడు. పోటీ ముగియడంతో అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారు.
గెలుపు ఎలా ఉందని జ్యోత్స్నని అడుగుతాడు సూరజ్. చివరికి వచ్చేసరికి ఇది వంటల పోటీ అనిపించలేదు.. ఏదో ఒలింపిక్స్‌లా అనిపించింది. నీలో మొదటి సారి ఆడపిల్లను చూశానని చెబుతాడు. నిన్ను గెలిపిస్తే నాకు ఏదైనా ఇస్తానని చెప్పావు కదా అడగమంటావా అంటాడు.. అయితే వెళ్లి దీపని అడగమని కౌంటర్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు ఎంత తెలివైన వాడివి అంటే నాకు తెలియకుండా ఒక సర్కిల్ గీసి నన్ను దాంట్లో నిలబెట్టావని మండిపడుతుంది జ్యోత్స్న. నా చేతులతోనే దీపని పోటీకి దిగేలా చేశావు.. దీప నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసింది. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే నువ్వు అల్లిన సాలెగూడులో నేను ఇరుక్కుపోయాను, దీప అనే సాలె పరుగు నన్ను పూర్తిగా తినేసింది. దీనికి నీకు స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
మన కుటుంబం గురించి, మన గురించి బయటివాళ్ల ముందు ఇంటి దగ్గర పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్న, దీపలకు సుమిత్ర చేత దిష్టి తీయిస్తాడు. ఈ శివన్నారాయణ ఓటమి తెలియని మనిషి కాదు. ఆ దక్షిణామూర్తి మన దగ్గరి నుంచి చెఫ్‌ని లాగేసుకున్నా.. నా ఆత్మగౌరవం ఓడిపోతుందని అనుకున్నా. అప్పుడే వచ్చాడు సూరజ్ తన ప్లాన్ ఏంటో దీప వెళ్లి టేబుల్ దగ్గర నిలబడే వరకు నాకు అర్ధం కాలేదు. ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్పాలని అనడంతో శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటాడు సూరజ్. శివన్నారాయణ మనవరాలివి అనిపించుకున్నావని జ్యోత్స్నని మెచ్చుకుంటాడు. దీప, జ్యోత్స ఇద్దరూ కలిసి నన్ను గెలిపించారని ప్రశంసిస్తాడు.
నేను దిగకపోతే పోటీకి నేనే దిగేవాడిని అన్నావు కదా? దాని బట్టి నువ్వు మంచి వంటవాడివని అర్ధమవుతోందని అంటాడు కార్తీక్. మా కోసం వంట చేయమని అడుగుతారు కార్తీక్, సూరజ్. ఇప్పుడు నా వల్ల కాదు.. మీ కోసం పార్టీ ఉంది ఏంజాయ్ చేయండి అని అంటాడు శివన్నారాయణ. మావయ్య గారు అద్భుతంగా వంట చేస్తారు.. కానీ ఇప్పుడే చేయలేరని చెబుతుంది సుమిత్ర. దీపతో కలిసిపోయావా అని జ్యోత్స్నని అడుగుతుంది పారు. తాత దగ్గర మంచిదానిలా మార్కులు కొట్టేయాలని అలా నటించానని చెబుతుంది జ్యోత్స్న. దీపని గెలిపించడానికి నన్ను ఇంత మోసం చేస్తావా అని సూరజ్‌పై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. ఈరోజు కూడా నువ్వు మోసంతోనే గెలవాలని అనుకున్నావని సీరియస్ అవుతాడు సూరజ్.
నిన్నే గెలిపించాను.. కాకపోతే నీ స్టైల్‌లో మోసం చేసి కాదు, నా స్టైల్‌లో నిజాయితీగా ఉండి గెలిపించాను. నిజాయితీతో గెలిస్తే ఆ గెలుపు ఎంత బాగుంటుందో నీకు చూపించానని అంటాడు. మీ తాత నీతో ఇంత ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్లు అవుతోంది... మీ అమ్మ నిన్ను ఇంత అప్యాయంగా దగ్గరకి తీసుకుని ఎన్నాళ్లు అవుతుంది. నువ్వు పెద్దదానివి అయిపోయావు కానీ, లేదంటే మీ తాత నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఇళ్లంతా తిరిగేవాడు. దీప గారికి అసిస్టెంట్‌గా తప్పించి ఎందుకు పనికిరావన్న మీ తాతే.. వారసురాలు అంటే నువ్వేనని చెప్పాడంటే ఈ గెలుపు నీకెంత గౌరవం తీసుకొచ్చిందో నీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నిస్తాడు సూరజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications