Karthika Deepam 2 July 21st: దీపపై ప్రతీకారానికి మాలిని స్కెచ్.. జ్యోత్స్న- సూరజ్ ప్రేమపై దీపలో అనుమానం

Photo Courtesy: JioHotstar

నాకు నీ సాయం కావాలి? తాతని గెలిపించాలని దీప ఎమోషనల్ కావడంతో జ్యోత్స్న చేతులు కలుపుతుంది. ఏం చేయాలో చెప్పు.. చేస్తానని వేగంగా పనులు చేస్తుంది. నిర్దేశించిన టైమ్ మేరకు వంటలను పూర్తి చేస్తారు దీప- జ్యోత్స్న. డీఎం రెస్టారెంట్స్, జ్యోత్స్న రెస్టారెంట్స్‌లు వంటలలో సమానంగా నిలవడంతో పోటీ టఫ్‌గా మారుతుంది. చివరిలో స్వీట్ బాగుందని ఇద్దరూ జడ్జిలు జ్యోత్స్న రెస్టారెంట్స్‌కే ఓటేయడంతో శివన్నారాయణ గెలుస్తాడు. దాంతో కుటుంబమంతా సంతోషిస్తుంది. దక్షిణామూర్తి, మాలినిలు అవమాన భారంతో రగిలిపోతుండగా అవార్డు ఇవ్వాల్సిందిగా మాలినిని పిలుస్తారు. జ్యోత్స్న- దీపలు సంయుక్తంగా అవార్డును అందుకుంటారు.

ఈ గెలుపు నాది కాదు జ్యోత్స్నది అని దీప అనగా.. నా మనవరాళ్లు ఇద్దరూ కలిసి నన్ను గెలిపించారని శివన్నారాయణ పొంగిపోతాడు. షెఫ్‌లు కనుక సమయానికి దొరక్కపోతే పోటీకి నేను దిగేవాడిని అంటాడు. నువ్వు పెద్ద వంటగాడివి అని మాకు తెలుసు అని అంటాడు దక్షిణామూర్తి. నా చేతులతోనే దీపని పోటీకి దిగేలా చేశావు.. నువ్వు అల్లిన సాలెగూడులో దీప అనే సాలె పురుగు నన్ను తినేసిందని సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. ఇంటి దగ్గర మనవరాళ్లని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. సుమిత్ర అయితే ఇద్దరికీ దిష్టి తీస్తుంది. నువ్వు పెద్ద వంట వాడివని దక్షిణామూర్తి అన్నాడు.. మా కోసం వంట చేయొచ్చు కదా అని అంటాడు కార్తీక్. నేను గెలిపించబట్టే మీ తాత నిన్ను మనవరాలిగా, మీ అమ్మగారు నిన్ను కూతురిలా దగ్గరకు తీసుకున్నారని జ్యోత్స్నతో అంటాడు సూరజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 21వ తేదీ 728వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 728 July 21st 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నువ్వంటే నాకు ఇష్టం.. అందుకే నిన్ను గెలిపించాను, నువ్వు గెలుపు కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా గెలవాలని అనుకున్నానని జ్యోత్స్నతో చెబుతాడు సూరజ్. అసలు నా మంచి చెడు గురించి ఆలోచించడానికి నువ్వెవరు అని అడుగుతుంది జ్యోత్స్న. ప్రస్తుతానికి నీ లవర్‌ని, తాళి కడితే నీ మొగుడిని.. నా అభిప్రాయానికి నీ అంగీకారం అవసరం లేదు. మనసు ఇవ్వడం నా ఇష్టం.. అది తీసుకోకపోవడం నీ ఇష్టం అని అంటాడు సూరజ్. మనం ప్రేమించిన వాళ్లు బాగుండాలని కోరుకోవడం కూడా స్వార్ధమే.. కానీ నువ్వు మారాలని అనుకుంటున్నా, నా ప్రేమ ఎప్పటికీ నీకే అంటూ చేతిలో గులాబీ పువ్వు పెడతాడు. దానిని కిందపడేసి తొక్కుతుంది జ్యోత్స్న.

గుండెని తొక్కుతున్నంతగా బాధగా ఉందా అని అడుగుతుంది. పువ్వు ఇవ్వాలనుకోవడం నా ఇష్టం.. దానిని ఏం చేసుకుంటావో నీ ఇష్టమని అంటాడు. పోయి డాక్టర్‌కి చూపించుకో మరీ ఇంత తేడాగా ఉన్నావేంటీ అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. నేను నిన్ను ప్రేమించడం నిజమైతే నువ్వేం చేసినా హ్యాపీయే అంటాడు సూరజ్. మాలినిపై గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది శివన్నారాయణ ఫ్యామిలీ. కేక్ కట్ చేసి దీప- కార్తీక్, సూరజ్- జ్యోత్స్నలకి తినిపిస్తాడు పెద్దాయన.

ఎవరైనా చూస్తే మీకు ఇద్దరు మనవరాళ్లు, ఇద్దరు మనవళ్లు అనుకుంటారని అంటుంది పారు. ఎవరో ఎందుకులే.. నువ్వేం అనుకుంటున్నావో చెప్పమని అడుగుతాడు శివన్నారాయణ. నిప్పు లేనిదే పొగరాదు, ఎంతో కొంత నువ్వే అనుకుంటున్నావని నువ్వు అనుకునే ఉంటున్నావని అంటాడు. ఆ వెంటనే పారుకి కూడా కేక్ తినిపిస్తాడు కార్తీక్. తాత చాలా భరిస్తాడు, అలాగే క్షమిస్తాడు కూడా అని శివన్నారాయణని మెచ్చుకుంటాడు. జీవితాన్ని గెలవాలని అనుకునే వారికి భరించడం, క్షమించడం రెండూ తెలియాలని అంటుంది దీప. నువ్వంటే ఎన్నో డక్కా మొక్కీలు తిని ఇక్కడి దాకా వచ్చావు కదా? నీకు అన్నీ అనుభవాలేనని దీపని నానామాటలు అంటుంది పారు.

నీకు ఎన్నిసార్లు చెప్పినా.. మళ్లీ మళ్లీ చెప్పించుకుంటావని పారుపై సీరియస్ అవుతాడు. మనం మాట్లాడితే పిల్లలు దానిని నేర్చుకునేలా ఉండాలి? నొచ్చుకునేలా కాదు.. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అని చెబుతాడు శివన్నారాయణ. ఆ వెంటనే పెద్దాయన వెనక్కి వెళ్లి నిలబడుతుంది పారు. నేను చెప్పింది దీప గురించి.. ఈ గెలుపు తనది, ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్లే.. ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు. దీప విజయం వెనుక కార్తీక్ ఉన్నాడు అని అంటాడు శివన్నారాయణ. నా మనసులోని మాటని చెప్పారని దీప కూడా పొంగిపోతుంది.

ఒక మనిషి బలమైన సంకల్పంతో పనిచేస్తే అతను ఎన్ని తరాలను ప్రభావితం చేయొచ్చో మిమ్మల్ని చూస్తుంటేనే అర్ధమవుతోంది, మీరు ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటారని పెద్దాయనని పొగుడుతాడు సూరజ్. గెలిచినందుకు మేమంతా ఆనందంగా ఉన్నాం.. ఓడిపోయినందుకు మాలిని అత్త ఎంత రగిలిపోతుందో అనుకుంటుంది దీప. మాలిని ఓటమి గురించి బాధపడుతుండగా.. దక్షిణమూర్తి వచ్చి ఓడిపోయినందుకు బాధపడుతున్నావా అని అడుగుతాడు. మనం ఓడిపోలేదు, కొత్త పాఠాలు నేర్చుకున్నాం.. బాబాయి చాలా బలవంతుడని అంటుంది మాలిని. నేను ఇకపై తలెత్తుకోలేను, నేను ఓడిపోయాను.. నా మీద గొంతెత్తడానికి ఆ శివన్నారాయణికి నేనే అవకాశం ఇచ్చినట్లయ్యిందని బాధపడతాడు శివన్నారాయణ.

గతాన్ని మరిచిపోకపోతే భవిష్యత్తు ఉండదని అంటుంది మాలిని. అయితే నువ్వు గతాన్ని మరిచిపోగలవా? గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోగలవా? ఆ శివన్నారాయణ కుటుంబం కారణంగా నువ్వు ఇన్నాళ్ల నుంచి పడుతున్న బాధ, నువ్వు ఏం నష్టపోయావోనని దక్షిణామూర్తి చెబుతుండగా మాలిని అడ్డుకుంటుంది. నష్టం మన కుటుంబానికి జరిగింది, గతంలో జరిగిన దానికి నాతో పాటు మీరూ మోస్తున్నారు. కానీ నేను మళ్లీ ఈ రెండు కుటుంబాలు ఒక్కటి కావాలని కోరుకుంటున్నాను.. మీ కూతురు మీ దగ్గరికి రావాలి, నేను దశరథ అన్నయ్య కోసం ఎదురుచూస్తున్నాను.

మన ప్రయత్నం మనం చేద్దాం.. మీ కన్నకూతురి దృష్టిలో మీరు చెడ్డదానిగా మిగిలిపోకూడదు, మనం ఓడిపోలేదు మీ కూతురిని గెలిపించాం.. ఎక్కడో దూరాన ఉన్న మీ కూతురిని మీ పక్కన కూర్చోబెట్టాను. అది గెలుపు కదా. దీనికి మీకు ఆనందంగా లేదా? ఈ సంతోషం మీరు అందుకునే బహుమతి కంటే ఎక్కువా? అని మాలిని ప్రశ్నిస్తుంది. నా కూతురి కంటే నాకు ఏది ఎక్కువ కాదు.. నువ్వు నన్ను గెలిపించావు, నా కూతురు మళ్లీ నా దగ్గరికి వస్తుందన్న నమ్మకం కలిగించావని అంటాడు దక్షిణామూర్తి. ఓడిపోయింది మీరు కాదు నేను.. ఇది మీకు కాదు నాకు అవమానం. అయినా బాబాయి గెలుపు తెలిసింది, నీకు మరో సెలబ్రేషన్ లేకుండా చేసే బాధ్యత నాది అనుకుని రగిలిపోతుంది మాలిని.

జ్యోత్స్న మెట్ల మీదకి ఎక్కుతుండగా కిందపడిపోయి రక్తం కారుతుండగా సూరజ్ ఆ రక్తాన్ని తుడుస్తూ కట్టుకడతాడు. నాకు దెబ్బ తగిలిన దానికంటే సూరజ్ చేష్టలే తేడాగా ఉన్నాయని అనుకుంటుంది జ్యోత్స్న. అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇలా జరిగిందని బాధపడతాడు సూరజ్. జ్యోత్స్న గారికి గాయమై రక్తం వస్తుంటే చూడలేకపోతున్నానని అలా చేశానని అంటాడు. అయితే పూలకుండీ ఇక్కడికి ఎలా వచ్చిందా? అని ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. కుడికాలి బోటన వేలికే దెబ్బ తగలడంతో ఇది వీడు కావాలని చేశాడా? అనుకోకుండా చేశాడా అని డౌట్ వస్తుంది.

ఈరోజు నాకొక కొత్త విషయం తెలిసింది.. జ్యోత్స్నని సూరజ్ ఇష్టపడుతున్నాడని కార్తీక్‌తో అంటుంది దీప. వాడు మంచోడు కాబట్టి జ్యోత్స్నకి కట్టు కట్టాడని చెబుతాడు కార్తీక్. ఇంతలో పారు వచ్చి వాడు మంచోడు కాదు.. పెద్ద జాదుగాడు అంటుంది. అసలు ఆ పూల కుండీ పెట్టిందే వాడు అని పారు జరిగింది చెబుతుంది. పూలకుండీ మెట్లకు ఎడమ పక్కన లేకపోతే ఇంటి పెద్దావిడకు మంచిది కాదని అంటాడు సూరజ్. దాంతో భయపడ్డ పారు.. సరేనని చెప్పడంతో పూలకుండీని మార్చేస్తాడు సూరజ్. జరిగింది విన్న కార్తీక్- దీపలు షాక్ అవుతారు. ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ అడగ్గా.. పూలకుండీ జరిపింది మీ కోసమేనని సూరజ్ చెబితే నా పని అవుట్ అంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X