Karthika Deepam 2 July 22nd: జ్యోత్స్నతో క్లోజ్‌గా సూరజ్.. సుమిత్రలో అనుమానం.. కార్తీక్, దీపలకు మాలిని ఆఫర్

Photo Courtesy: JioHotstar

నన్ను గెలిపిస్తానని చెప్పి ఆ దీపని గెలిపిస్తావా అంటూ సూరజ్‌పై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు గెలుపు కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా గెలిపించాలని అనుకున్నానని అంటాడు సూరజ్. ప్రస్తుతానికి నీ లవర్‌ని, నువ్వు ఒప్పుకుంటే నీకు కాబోయే మొగుడిని అని చేతిలో పువ్వు పెడతాడు. దానిని కిందపడేసి కాలితో తొక్కుతుంది. ప్రేమించడం నా ఇష్టం.. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం నీ ఇష్టమని చెబుతాడు సూరజ్. నువ్వింత తేడాగా ఉన్నావని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న. మాలిని, దక్షిణామూర్తిలపై గెలిచినందుకు గాను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు శివన్నారాయణ. దీప- కార్తీక్, సూరజ్- జ్యోత్స్నలకు కేక్ తినిపిస్తాడు.

మరోవైపు.. అవమాన భారంతో రగిలిపోతుంటుంది మాలిని. నేను ఓడిపోయాను, శివన్నారాయణ ముందు తలెత్తుకోలేకపోయానని బాధపడతాడు దక్షిణామూర్తి. మనం ఈ పోటీలో గెలిచాం.. మీ అమ్మాయిని నీ పక్కన కూర్చొనేలా చేశాను, ఎప్పటికైనా మీ అమ్మాయిని మీ దగ్గరికి చేరుస్తానని చెబుతుంది మాలిని. దీపపై శివన్నారాయణ ప్రశంసలు కురిపించడం చూసి తట్టుకోలేక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుండగా పూలకుండీ తగిలి రక్తం వస్తుంది. దాంతో సూరజ్ వెంటనే ఆమె కాలికి కట్టుకట్టడంతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్నని సూరజ్ ఇష్టపడుతున్నాడని కార్తీక్‌తో అంటుంది దీప. ఇంతలో పారు వచ్చి అసలు అక్కడ పూలకుండీ పెట్టిందే సూరజ్ అని చెప్పడంతో దీప- కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 22వ తేదీ 729వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 729 July 22nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

పోటీలో మాలిని, దక్షిణామూర్తిలపై శివన్నారాయణ తాతని దీప గెలిపించిందని కాంచనకు చెప్పి కేక్ తినిపిస్తాడు కార్తీక్. నా కోడలికి దిష్టి తీయాలని చెబుతుంది కాంచన. అలా అయితే ఒక బస్తా ఎండు మిరపకాయలు, ఒక బస్తా ఉప్పు కావాలని.. అందరికంటే ముందు మా పారు దిష్టి బాగా ఎక్కువగా ఉంటుందని అంటాడు. దీపని ఏమైనా అంటే మా నాన్న ఊరుకోడని కాంచన చెబుతుండగా.. తాత మీద పారుకి పీకలదాకా కోపం ఉంది. అందుకే పురిటిలో బిడ్డను అని చెప్పబోతూ ఆగిపోతాడు. పురిటిలో బిడ్డ ఏంటీ అని కాంచన అడగ్గా.. జ్యోత్స్నని పురిటిలో ఉన్నప్పటి నుంచే తన మనవరాలిలా, తన బుద్దులు నేర్పించిందని కవర్ చేస్తాడు కార్తీక్.

నువ్వు ఇంట్లోనే ఉన్నావు.. మా అమ్మ నాన్న ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారు కదా? ఆకలి వేస్తుంది వాళ్లని వదిలేయమని చెబుతుంది శౌర్య. నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా పెద్ద నానమ్మ పెన్షన్ తెచ్చుకోవడానికి ఊరికి వెళ్లింది.. నువ్వు వెళ్లిపోతే నాకు బువ్వ ఎవరు తినిపిస్తారని అంటుంది శౌర్య. మా అమ్మని ఏమైనా అంటే మీ అమ్మకి పనిష్మెంట్ ఇస్తానని కార్తీక్ చెప్పడంతో నానమ్మ, నువ్వు, అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది చిన్నారి.

జ్యోత్స్న కాలికి దెబ్బ తగలగానే మా కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యావని సూరజ్‌ని నిలదీస్తుంది సుమిత్ర. అంత చనువు తీసుకోవడం నా పొరపాటే.. కానీ ఆ క్షణంలో నాకు ఇలాంటివేవి గుర్తురాలేదు. అందరి విషయంలో ఎలా రియాక్ట్ అవుతానో, అలాగే రియాక్ట్ అయ్యాను. నా ప్రవర్తన మీకు ఏమైనా తప్పుగా అనిపించిందా? నా ప్రవర్తన మీద మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? అని సూరజ్ అడుగుతాడు. అందుకే అడగటానికి వచ్చానని సుమిత్ర చెప్పడంతో సూరజ్ షాక్ అవుతాడు. నా ప్రవర్తన మీద మీకు అనుమానం వచ్చిందంటే అది నా తప్పే.. మరోసారి ఇలా జరగదని చెబుతాడు సూరజ్. మరోసారి జ్యోత్స్న కూడా పూలకుండీని తన్నుకోదని అంటుంది సుమిత్ర. నేను అడగటానికి వచ్చింది వేరే విషయం.. కానీ ఇప్పుడు అది అవసరం లేదని అనిపిస్తోందని చెబుతుంది.

జరిగిన దానికి మీరు బాధపడ్డారని మీ మాటలను బట్టి తెలుస్తోంది.. సారీ మేడం అని చెబుతాడు. కూతురికి సాయం చేసిన మనిషి నుంచి తల్లి క్షమాపణలు కోరుకోదు. మామూలుగా అయితే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.. మనం ఎంత బలవంతులం అయినా మన బలం మనమే మర్చిపోతాం. అది గుర్తుచేయడానికి సాయంగా నిలబడే స్నేహితుడు ఎవరూ గొప్పవాడే. ఈరోజు జ్యోత్స్న పోటీకి దిగిందంటే నీ వల్లే. మీ వాళ్లు నీకు మంచి సంస్కారం నేర్పించారు, నా కూతురికి సాయం చేసి కూడా గర్వం లేకుండా వినయంగా నా ముందు నిలబడ్డావు. మీ అమ్మనాన్న ఎవరు? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? నీకు తోబుట్టువులు ఉన్నారా? ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వాళ్లకి మమతల విలువ తెలుస్తుందని మా అమ్మ నాకు చెప్పిందని అంటుంది సుమిత్ర.
సూరజ్ చెప్పబోతుండగా పారు పిలవడంతో సుమిత్ర వెళ్లిపోతుంది.

ఉదయాన్నే గుమ్మం ముందు మాలిని ఉండటం చూసి దీప, కాంచనలు షాక్ అవుతారు. నా ఇంటికి ఎందుకు వచ్చావని కాంచన అడగ్గా.. ఎలా ఉన్నావో పలకరించి వెళ్తానని చెబుతుంది మాలిని. ఇంటికొచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా అని అంటుంది. శివన్నారాయణ గారి కూతురివి కదా? ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది. నీ తండ్రి నీకు దేవుడు కావొచ్చేమో కానీ అందరికీ కాదని అంటుంది మాలిని. నా తండ్రి రాజులా గొప్ప మనసున్న వ్యక్తి, మచ్చలేని మనిషి అని కాంచన చెప్పడంతో మాలిని నవ్వుకుంటుంది. నీకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా గెంటేసినందుకా? నిన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న శ్రీధర్ లాంటి ఉత్తముడిని నీకు భర్తగా చేసినందుకా అని మాలిని నానా మాటలు అంటుంది.

ఇంతలో కార్తీక్ వచ్చి అక్కడితో ఆగిపోతే నీకు మంచిది, నాకు మంచిదని అంటాడు. మా మధ్యలో జరిగిన గొడవలు మాతోనే ఆగిపోవాలి.. మీకు వీటికి సంబంధం లేదని చెబుతుంది కాంచన. నా ఫ్యామిలీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను రియాక్ట్ అవుతానని చెబుతాడు కార్తీక్. మీ తాత ఎలా బ్రతుకుతున్నాడు, మీరు ఎలా బ్రతుకుతున్నారని మాలిని అంటుంది. నీ తండ్రే నీ కోడలిని తన ఇంటికి పనిమనిషిని చేశాడని చెబుతుంది. ఇప్పుడు నా కోడలు సీఈవో అని అంటుంది కాంచన. పోస్ట్ మారింది.. ఇదేం బతుకు అని నానామాటలు అంటుంది మాలిని. ఎవరి నుంచి ఏం ఆశించకుండా ఇలా సాధారణ జీవితం బతకడం కూడా అంత తేలికకాదు. తాతలు, తండ్రులు, భార్య ఆస్తిపై ఆశపడే మగాళ్లని చూసుకుంటారు.. కానీ ఎవ్వరి నుంచి ఏం ఆశించని మనిషి మా బావ అని గొప్పగా చెబుతుంది దీప. నా ముందు నా భర్తని అవమానిస్తే నేను చూస్తూ ఉండలేనని వార్నింగ్ ఇస్తుంది.

ఈ మిడిల్ క్లాస్ జీవితం శివన్నారాయణ రాసిపెట్టిన శాపమని మాలిని అనడంతో కార్తీక్ ఫైర్ అవుతాడు. మా బతుకుల్ని వెక్కిరించింది చాలు.. ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. మిమ్మల్ని ఈ దరిద్ర్యం నుంచి బయటపడేయాలని వచ్చానని అంటుంది మాలిని. ఇది మీ జీవితాల్ని మారుస్తుందని బ్లాంక్ చెక్ పెడుతుంది. మిమ్మల్ని ఎలాగూ మీ నాన్న ఈ స్థితి నుంచి మార్చలేడు.. మీరు నాతో కలిసిపోతే మీ అందరి జీవితాలు మారిపోతాయని అంటుంది మాలిని. మనుషుల్ని కొనడం నీకు బాగా అలవాటు అని మండిపడుతుంది కాంచన. నువ్వు తెలివైన దానివి.. నీ గురించి కాకపోయినా నీ పిల్లలు, పుట్టబోయే మనవళ్ల గురించి ఆలోచించమని చెబుతుంది మాలిని. నువ్వేం మాట్లాడకుండా ఉండిపోయావని తల్లిపై ఫైర్ అవుతాడు కార్తీక్.

సూరజ్ ఆఫీస్‌కి వెళ్తుండగా శివన్నారాయణ ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే అక్కడే ఆగిపో నేను వస్తున్నానని సీరియస్‌గా చెబుతాడు. ఆ మాటలతో సూరజ్‌కు ముచ్చెమటలు పడతాయి. మా అమ్మ ఎందుకు నన్ను మాట్లాడనివ్వడం లేదు.. మనల్ని ఆ మనిషి సంతలో పశువుల్ని చేసింది. మాకు అమ్ముడు పోమ్మని ఆఫర్ ఇచ్చి వెళ్లిపోయింది. మామూలుగా అయితే నీకు అమ్ముడుపోయే వాళ్లు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరని చెక్కు ముఖం మీద వేసి కొట్టేవాడినని దీపతో అంటాడు కార్తీక్. అత్తయ్యకి అన్ని తెలుసు.. ఏం చేయాలో అది చేస్తుందని అంటుంది దీప. వెంటనే మనం ఏదో ఒకటి చేయాలని కార్తీక్ అనగా.. అత్తయ్య ఊరుకునే మనిషి కాదు, ఆవిడకి కోపం వస్తే నువ్వే నేను కూడా సరిపోమని చెబుతుంది. ఇంతలో ఇంట్లో నుంచి శివన్నారాయణ గొంతు వినిపిస్తుంది. వెళ్దాం పదా ఆ ఫ్రూట్స్, చెక్కు రెండూ తీసుకుని నా వెంట రమ్మని చెబుతాడు పెద్దాయన. కార్తీక్, సూరజ్, శివన్నారాయణ కలిసి దక్షిణామూర్తి ఇంటికి వస్తారు.

ఈ ఇంటికి తీసుకొచ్చారేంటీ అని సూరజ్ అడగటంతో కార్తీక్, శివన్నారాయణ షాక్ అవుతారు. ఈ ఇల్లు ఎవరిదో నీకు తెలుసా? అని పెద్దాయన అడుగుతాడు. కార్తీక్ సైతం అనుమానంగా చూస్తాడు. ఇది నా శత్రువు దక్షిణామూర్తి ఇల్లు.. ఈ ఇంటి మనిషి నా కూతురింటికి వచ్చి మర్యాద చేసింది. అదే మర్యాదని మర్యాదగా ఇచ్చేద్దామని వచ్చానని అంటాడు శివన్నారాయణ. ఈ విషయం నీకెలా తెలుసని కార్తీక్ అడగ్గా.. నేనే చెప్పాను అని దీపతో కాంచన అంటుంది. మాలిని ఈ ఇంటికి వచ్చిన విషయం వేరొకరి ద్వారా మా నాన్నకి తెలుసుంటే ముందు నన్ను తిట్టి తర్వాత మాలినిని తిడతాడు. నాన్న వెళ్లింది భవిష్యత్తులో మళ్లీ గొడవ రాకుండా చేయడానికి అంటుంది కాంచన. కోపంగా దక్షిణామూర్తి ఇంటి తలుపులు తీస్తాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X