Karthika Deepam 2 July 24th: మాలిని బుట్టలో పడ్డ జ్యోత్స్న.. మనవరాలినే శివన్నారాయపై అస్త్రంగా

Photo Courtesy: JioHotstar

దక్షిణామూర్తి ఇంటికి సూరజ్, కార్తీక్‌లతో కలిసి కోపంగా వెళ్తాడు శివన్నారాయణ. నా గుమ్మం తొక్కను అన్నావు.. నేను అడ్రస్ ఇవ్వకుండా నువ్వే వచ్చావని శివన్నారాయణతో అంటాడు దక్షిణామూర్తి. గతంలో మన రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం, బంధాలు వద్దుకున్నాం విడిపోయాం. అందుకే మీకు కనిపించనంత దూరంగా వచ్చి వ్యాపారం మొదలుపెట్టాను. మీరు మాత్రం ఇంకా పాత మనుషుల్లాగే మిగిలిపోయారని అంటాడు శివన్నారాయణ. కాంచనను నువ్వు అనాథలా వదిలేశావని మాలిని అనడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు.

లండన్‌లో చదువుకున్నది మీ మరదలికి డ్రైవర్‌గా పనిచేయడానికా? అని అవమానిస్తుంది మాలిని. నా వాళ్ల కోసం నేను ఏమైనా అవుతానని చెబుతాడు కార్తీక్. కాంచన ఏం కోరుకుంటే అది ఇవ్వడానికి ఈ శివన్నారాయణ సిద్ధం. కానీ ఆమె ఏం అడగదని చెబుతాడు. మరోసారి నా జోలికి, నా కంపెనీ జోలికి, నా కుటుంబం జోలికి రావొద్దని చెక్ మీద రూపాయి పెట్టి వెళ్లిపోతాడు శివన్నారాయణ. ఇంటికి వెళ్లేసరికి కాంచన వచ్చి ఉంటడటంతో రేపు శ్రీధర్ అమెరికా నుంచి రాబోతున్నాడని చెబుతాడు. అలాగే నేను నీకు అన్యాయం చేశావని బాధపడుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటలతో కాంచన, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 24వ తేదీ 731వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 731 July 24th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఒకసారి గెలిచినవాడికి రెండోసారి మన మీద గెలిచే అవకాశం ఇవ్వకూడదు.. అసలు కాంచన ఇంటికి నువ్వెందుకు వెళ్లావని మాలినిని నిలదీస్తాడు దక్షిణామూర్తి. కార్తీక్, దీపలు మీ ప్రాణాలు కాపాడారు.. వాళ్లకు ఎంతో కొంత సాయం చేసి రుణం తీర్చుకుందామనిఇ అనుకున్నాను. నేను ఊహించిన దాని కంటే పేదరికంలో ఉన్నారు. అందుకే డబ్బులు ఇస్తే తీసుకోరని చెక్ ఇచ్చానని చెబుతుంది మాలిని. అందుకే కాంచన వెళ్లి తండ్రితో చెప్పి అన్ని ఇచ్చి వెనక్కి పంపించిందని అంటాడు దక్షిణామూర్తి. ఇప్పటికీ ఆ అమాయకులంతా బాబాయికి సపోర్ట్ చేస్తున్నారని అంటుంది. నా కూతురే వాడిని అమాయకంగా నమ్ముతున్నప్పుడు వాడి కూతురు నమ్మడంలో తప్పులేదని చెబుతాడు దక్షిణామూర్తి.

నీ మంచితనం వాడికి అర్ధం కాదని దక్షిణామూర్తి చెప్పగా.. మీకు అర్ధమైంది కదా? అని అంటుంది మాలిని. నేను నా కూతురి గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేను అంటాడు. మనిషిని బతికించేది ఆశ మాత్రమే కాదు.. పగ, ప్రతీకారం కూడా. బాబాయ్ ఏం చేశాడు? ఆ కుటుంబం కారణంగా మనం ఏం నష్టపోయామనేది మనకి తెలుసు. మనం మాత్రమే బాధపడాలా? శివన్నారాయణ సంతోషంగా అందరితో ఉండాలా? బాబాయ్ బలం తగ్గించాలి? బాబాయ్ దగ్గర ఉన్న వాళ్లందరినీ దూరం చేస్తున్నానని చెబుతుంది మాలిని. మరోసారి ఇలాంటివి చేసేటప్పుడు నాకు ఒకసారి చెప్పమని అంటాడు దక్షిణామూర్తి. అన్నింటికి సమాధానం చెప్పి తీరతానని చెబుతానని అనుకుంటుంది మాలిని.

సూరజ్ తనను చూస్తుండటంతో అతనిపై మండిపడుతుంది జ్యోత్స్న. మా తాత అవసరానికి మించిన చనువు ఇవ్వడం వల్లే వీడు ఇలాంటి పోకిరి వేషాలన్నీ వేస్తున్నాడని అనుకుంటుంది. ఫైల్ తీసుకుని వచ్చేసరికి కళ్లజోడు పెట్టుకుని ఉండటంతో ఇలా ఆఫీసులో అందరి ముందు సైట్ కొట్టడానికి సిగ్గు లేదా అని మండిపడుతుంది జ్యోత్స్న. నేను సైట్ కొడుతున్నట్లు నీకెలా తెలుసు అని సూరజ్ అడగ్గా.. నువ్వు చూస్తున్నావో లేదో చూస్తున్నాను అంటుంది. నేను కూడా అలాగే చూస్తున్నానని చెబుతుంది జ్యోత్స్న.

నాకు పెళ్లీడు వచ్చిన తర్వాత నా కంట్లో పడిన పిల్లవి నువ్వేనని చెబుతాడు సూరజ్. గొప్పింటి పిల్ల కదా? పడేసి లైఫ్ సెటిల్ చేసుకుందామని అనుకుంటున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు మొదటి సారి నా చెంపను తాకావో? పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా? నేను వెంటపడే రకం కాదు.. వెంట తిప్పించుకునే రకమని చెబుతాడు. నన్ను ప్రేమించమని నేను నీ వెంట తిరుగుతానా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. తిరుగుతావేమో చూద్దామని అంటాడు సూరజ్. నా చిటికెన వేలు అందుకోవాలని ఆశపడకు.. మరో 100 జన్మలు బ్రహ్మాచారిగా మిగిలిపోతావాని అంటుంది జ్యోత్స్న. అంత ఓపిక నాకు లేదు.. ఈ జన్మలోనే నేను నీ మొగుడిని అవుతానని అంటాడు సూరజ్. నేను ఏదైనా కావాలనుకుంటే అదే నా దగ్గరికి వచ్చేలా చేస్తానని చెబుతాడు. వీరిద్దరూ గొడవ పడుతుండగా దీప వచ్చి వీరి మాటలు ఉంటుంది.

ఇంతలో జ్యోత్స్నకి పారు ఫోన్ చేసి మనం అర్జెంట్‌గా ఒకచోటికి వెళ్లాలి.. ఎందుకు? ఏమిటీ? అని అడక్కుండా రమ్మని చెబుతుంది పారు. ఫోన్ తీసుకురాకుండా అక్కడే పెట్టేసి రమ్మని చెబుతుంది. జ్యోత్స్న బయటికి వెళ్తుండగా సూరజ్ ఎదురై ఎక్కడికి వెళ్తున్నావు? పర్మిషన్ తీసుకున్నావా? అని అడుగుతాడు. నేను మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నానని జ్యోత్స్న చెప్పడంతో సూరజ్ షాక్ అవుతాడు. మన పెళ్లి గురించి మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నానని అనడంతో సూరజ్‌ సైలెంట్ అవుతాడు.

ఈ ఇల్లు ఎవరిది అని పారిజాతంపై కోప్పడుతుంది జ్యోత్స్న.. ఇంతలో ఈ ఇల్లు మనదేనని మాలిని ఎంట్రీ ఇవ్వడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు పుట్టిన తర్వాత మొదటిసారి ఈ మేనత్త ఇంటికి వచ్చావని చెబుతుంది మాలిని. ఎవరు మేనత్త, ఎవరికి మేనత్త అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఇది మీ ఇల్లు అని తెలిస్తే గుమ్మంలోకి కూడా అడుగుపెట్టే దానిని కాదని అంటుంది. ఈ విషయం తాతకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని పారుపై మండిపడుతుంది. మీ తాతకి పారిజాతం చెప్పదని మాలిని అనగా.. పారిజాతం అని పేరు పెట్టి పిలుస్తున్నారేంటీ? మీ కంటే మా గ్రానీ వయసులో పెద్దది కదా? అని జ్యోత్స్న చెబుతుంది. మా మమ్మీయే వద్దు అనుకున్నాకా మీరు నాకెందుకు అని ప్రశ్నిస్తుంది.

మాలిని గారితో ఎవరూ మాట్లాడొద్దని తాత చెప్పాడు కదా? అని జ్యోత్స్న గుర్తుచేస్తుంది. నువ్వు నా మేనకోడలివి, నా ఆడపడుచు కూతురివి.. నాకు కనుక కొడుకు ఉండుంటే నీకిచ్చి పెళ్లి చేసి నేను నిన్ను కోడలిగా చేసుకునేదానిని అంటుంది మాలిని. ఆశకు కూడా హద్దుండాలని కౌంటర్ వేస్తుంది జ్యోత్స్న. మరోవైపు.. ఆఫీసులో ఫైల్స్ అన్నీ పెండింగ్ పడిపోవడంతో దీపని అడుగుతాడు కార్తీక్. అది సరిగా చేయడం లేదు.. జ్యోత్స్నకి సూరజ్‌తో గొడవ పెట్టుకోవడానికే టైం సరిపోవడం లేదు. ఇక వర్క్ ఏం చేస్తుందని అంటుంది దీప. వీళ్లిద్దరూ కొట్టుకుంటున్నారా? లేక మన ముందు నటించి ప్రేమించుకుంటున్నారా అని డౌట్ పడతాడు కార్తీక్. వీళ్ల సంగతి నేను తెలుస్తానని బయటికి వెళ్లి చూడగా సూరజ్, జ్యోత్స్నలు కనిపించరు.

ఇంతలో పెద్దాయన వచ్చి జ్యోత్స్న గురించి అడిగి ఫోన్ చేయమని చెప్పగా... ఫోన్ సౌండ్ ఇక్కడే వినిపించడంతో ఆమె టేబుల్ మీద ఫోన్ కనిపిస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. వెళ్లేముందు ఒక ఫోన్ కాల్ మాట్లాడారు.. నేనైతే వాళ్ల గ్రానీగారితో మాట్లాడారని అనుకుంటున్నాను అంటాడు సూరజ్. దాంతో సుమిత్రకి శివన్నారాయణ కాల్ చేసి పారు ఎక్కడుందని అడుగుతాడు. నాకు తెలియదని ఆమె సమాధానం చెప్పడంతో పారుకి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుంది. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అని డౌట్ పడతాడు శివన్నారాయణ.

నీకు మీ అమ్మ పోలికలు రాలేదేంటీ అని మాలిని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అలా అని మిగతా వాళ్ల పోలికలు లేవు.. మీ నానమ్మ కూడా నీలా ఉండదు, నీ పొగరు, నీ కోపం, నీ ఆవేశం కొత్తగా ఉన్నాయి. ఇవి ఎవరి లక్షణాలు అని మాలిని ప్రశ్నించడంతో పారు, జ్యోత్స్నలకి ముచ్చెమటలు పడతాయి. మనం రక్త సంబంధాలున్న బంధువులం... నీ యోగక్షేమాలు తెలుసుకునే అధికారం నాకుందని అంటుంది మాలిని. దీప దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నావా? మీ తాతయ్య చాదస్తం కాకపోతే ఐదో తరగతి చదివిన మనిషి దగ్గర ఇంటి వారసురాలిని అసిస్టెంట్‌గా పెట్టడం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది మాలిని. నీకు పెళ్లి జరిగే వరకు దీప దగ్గర అసిస్టెంట్‌గానే ఉంటావా? పెళ్లెప్పుడు చేసుకుంటావని అడుగుతుంది.

దగ్గరి బంధువుల్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నీకు కార్తీక్‌కి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా అని చెబుతుంది మాలిని. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు.. వాడితో నేను పెళ్లి చేస్తానని అంటుంది. అప్పుడు దీని తాత నీ ఫోటోకి దండ వేస్తాడని పారు వార్నింగ్ ఇస్తుంది. ఆ ఇంట్లో నీ పరిస్ధితి బాలేదని తెలిసింది. నా ఆడపడుచు కూతురి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నాకుంది.. మిమ్మల్ని పిలిపించాను, నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను అంటుంది మాలిని. ఇంకా నయం నీ ఆస్తిలో వాటా ఇస్తానని అనలేదని సెటైర్లు వేస్తుంది పారు. జ్యోత్స్న ఊ అంటే చాలు నా ఆస్తిలో సగం వాటా ఇస్తానని మాలిని చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నా ఆస్తిలో సగం వాటా ఎప్పుడూ నా ఆడపడుచుకే కదా? నా ఆడపడుచు కూతురంటే నా మేనకోడలే కదా అని అంటుంది మాలిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X