Karthika Deepam 2 July 25th: మాలినితో పారు దోస్తీ.. శ్రీధర్ రీ ఎంట్రీ, పారు- జ్యోత్స్నల గుట్టు పట్టేసిన సూరజ్
Photo Courtesy: JioHotstar
శివన్నారాయణ ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మాలినిపై కోప్పడతాడు దక్షిణామూర్తి. నువ్వు అనవసరంగా కాంచన ఇంటికి వెళ్లావని సీరియస్ అవుతాడు. కాంచన కుటుంబం పేదరికంలో ఉండటం చూసి తట్టుకోలేక చెక్ ఇచ్చాను, అయినా బాబాయి బలం కుటుంబం, దానిని తగ్గించాల్సిందేనని చెబుతుంది. మరోసారి ఇలాంటివి చేసేటప్పుడు నాతో చెప్పి చేయమని అంటాడు దక్షిణామూర్తి. ఆఫీస్‌లో సూరజ్ తనను అదేపనిగా చూస్తుండటంతో కోప్పడుతుంది జ్యోత్స్న. నాకు సైట్ కొట్టడానికి నీకు సిగ్గులేదా? అని నిలదీస్తుంది. నేను నీకు సైట్ కొడుతున్నానని నీకెలా తెలుసని సూరజ్ అడగ్గా.. నువ్వు చూస్తున్నప్పుడు నేను చూశానని అంటుంది.
ఇంతలో దీప రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. జ్యోత్స్నకి పారు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఒకచోటికి వెళ్లాలని, వచ్చేటప్పుడు ఫోన్ అక్కడే వదిలేసి రమ్మని చెబుతుంది. పారు ఏదో ప్లాన్ చేసినట్లుగా ఉందని అనుకుని ఆమె చెప్పినట్లే చేస్తుంది జ్యోత్స్న. దాంతో ఆమెను మాలిని ఇంటికి తీసుకెళ్తుంది పారు. మాలినిని చూడగానే తాత చెప్పింది మరిచిపోయావా? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని గ్రానీ మీద ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నీలో మీ తాత లక్షణాలు కానీ, మీ కుటుంబంలో ఎవరి లక్షణాలు కనిపించడం లేదని మాలిని చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నువ్వు అడిగితే నా ఆస్తిలో సగం రాసిస్తానని మాలిని ఆఫర్ ఇవ్వడంతో జ్యోత్స్న, పారులు ఉలిక్కిపడతారు. జ్యోత్స్న కనిపించకపోవడం, పారు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో శివన్నారాయణ, కార్తీక్‌లు కంగారుపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 25వ తేదీ 732వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా ఆస్తిలో సగం వాటా ఇస్తానని మాలిని చెప్పడంతో .. నువ్వంటే నీ మేనత్తకి ఎంత ప్రేమో చూశావా అని అంటుంది పారు. నాకు ఎవరి ప్రేమలు అవసరం లేదు, నేను వెళ్తానని అంటుంది జ్యోత్స్న. నీకేం కావాలన్నా.. ఏం కావాలన్నా ఈ మేనత్త మాలిని ఉందని మరిచిపోవద్దని చెబుతుంది. మీరు నా యోగక్షేమాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇంతలో మాలిని ఉంగరం కిందపడటంతో కిందకి వంగి తీస్తుంది పారు. ఆ దెబ్బకి ఆమె మెడ నొప్పి తగ్గిపోతుంది. ఈ ఉంగరాన్ని నీ దగ్గరే ఉంచుకో.. అడగ్గానే నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చావు, నా గుర్తుగా ఈ ఉంగరాన్ని నీ దగ్గరే పెట్టుకోమని చెబుతుంది మాలిని. మన మధ్య స్నేహం ఇలాగే ఉండాలని అంటుంది. జ్యోత్స్న మనసులో ఉన్న అబ్బాయి ఎవరు అని మాలిని అడగ్గా.. దాని శత్రువు మొగుడు అని పారు చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. నీతో ఆడుకోవడానికి నాకో అవకాశం దొరికింది శివన్నారాయణ అనుకుని సంతోషపడుతుంది.
భర్త కోసం కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనం నీకేనా నాకు లేదా అని శ్రీధర్ అడగ్గా.. భర్తను చూడగానే కుర్చీలోంచి లేవబోతుంది కాంచన. నువ్వు లేవలేవు.. నన్ను చూసి నిన్ను నువ్వే మరిచిపోయావంటే నా కోసం ఎంత ఎదురుచూస్తున్నావో అర్ధమవుతుందని అంటాడు. ఆపరేషన్ ఎలా జరిగింది? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? డాక్టర్ గారు ఏం చెప్పారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాంచన. అవన్నీ కాదు ఆకలి వేస్తోంది భోజనం పెడతావా అని శ్రీధర్ అడగ్గానే ప్లేట్ తీస్తుంది. పక్కన మరో ప్లేట్ పెట్టుకున్నావంటే నేను వస్తానని ముందే తెలుసా అని శ్రీధర్ అడుగుతాడు. నాన్న చెప్పారని చెబుతాడు. ప్లేట్‌లో కాదు.. చేతిలో పెట్టమని అడగటంతో కాంచన ఎమోషనల్ అవుతుంది.
నీ కోసం నేను మళ్లీ పుట్టాను.. నీ ప్రేమను పొందడానికి ఈ జన్మ సరిపోదు.. నువ్వు పెట్టేది ముద్ద కాదు, మెడిసిన్. నాలుగు ముద్దలు తిన్నానంటే నా గుండె ఆగకుండా పరిగెడుతుందని చెబుతాడు శ్రీధర్. ఆపరేషన్ చేయడానికి కత్తి నా గుండె మీద పెట్టినప్పుడు మళ్లీ నీతో కలిసి భోజనం చేస్తానో లేదో అనుకున్నాను, నేను కోలుకోవాలని నువ్వు బలంగా కోరుకున్నావు. నేను వచ్చిన విషయం కార్తీక్‌కి చెప్పొద్దు.. సర్‌ప్రైజ్ చేస్తాను, అలాగే నా కొడుకు వచ్చే వరకు నేను మీ ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చా అని శ్రీధర్ అడుగుతాడు. ఇది మీ కొడుకు ఇల్లు అని అంటుంది కాంచన. నా కొడుకు ఇల్లు నా ఇల్లే.. కానీ నా కొడుకు ఇంటికి యజమానిని నేను కాదని అంటాడు శ్రీధర్. మన మేనకోడలికి పెళ్లి సంబంధం ఏమైనా సెట్ అయ్యిందా? అని అడుగుతాడు. అదే పనిలో ఉన్నారని చెబుతుంది కాంచన.
జ్యోత్స్న వచ్చేసరికి కార్తీక్, దీప, సూరజ్‌లు ఎదురుచూస్తుంటారు. ఎక్కడికి వెళ్లావు? ఫోన్ ఎందుకు తీసుకెళ్లలేదని జ్యోత్స్నని ప్రశ్నిస్తుంది దీప. నేను ఆఫీస్ వదిలి వెళ్లిపోయానని తాతతో చెప్పావా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను చెప్పానని సూరజ్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంటిలో పారు మిస్, ఆఫీస్‌లో నువ్వు మిస్.. రెండింటికీ ఎక్కడో కనెక్షన్ ఉంది. నువ్వు పారుతోనే వెళ్లావు కదా? అని కార్తీక్ అడుగుతాడు. నేను వెళ్లలేదని జ్యోత్స్న చెప్పగా.. నీ ఫోన్‌లో ఇన్‌కమింగ్ కాల్స్ చెక్ చేస్తే అదే తెలుస్తుందని అంటాడు. మేడం చాలా క్లవర్.. ఎప్పుడో డిలీట్ చేసి ఉంటారని సెటైర్లు వేస్తాడు సూరజ్. నేను ఎక్కడికి వెళ్లినా నీ పర్మిషన్ తీసుకోవాలా అని జ్యోత్స్న మండిపడుతుంది. నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ తెచ్చుకోవడానికి వెళ్లానని చెప్పడంతో సూరజ్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నీ బాధ్యత నాదేనని చెబుతుంది దీప. ఛైర్మన్ గారికి జ్యోత్స్న చెప్పింది నమ్మరు.. ఎందుకంటే ఆయనకి అసలు నిజం తెలిసిపోయిందని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు రాగానే ఇంటికి తీసుకురమ్మన్నారని అంటాడు కార్తీక్.
పారిజాతం ఇంటికి వెళ్లేసరికి శివన్నారాయణ సహా కుటుంబం మొత్తం ఉండటంతో షాక్ అవుతుంది. నువ్వు జ్యోత్స్నని తీసుకుని ఎక్కడికి వెళ్లావో తెలిసిందని పెద్దాయన చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నిజం చెప్పకపోతే పనిష్మెంట్ దారుణంగా ఉంటుందని భయపడ్డ పారిజాతం అసలు విషయం చెప్పాలని అనుకుంటుంది. అయితే జ్యోత్స్న వద్దని సైగలు చేయడంతో ఇదేమీ చెప్పలేదని అనుకుని ఊపిరి తీసుకుంటుంది పారు. నా మెడకు ఉండాల్సిన పట్టి నా చేతిలో ఉంటే మీకు అడగాలని అనిపించలేదా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్లానని చెబుతుంది. నువ్వు లేని టైంలోనే, జ్యోత్స్న కూడా బయటకు వెళ్లింది.. మీరిద్దరూ కలిసే వెళ్లారని ఛైర్మన్ గారి అనుమానం అని కార్తీక్ చెబుతాడు.
ఇంతలో మాలిని ఇచ్చిన ఉంగరం కిందపడటంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇది ఎక్కడిదని కార్తీక్, శివన్నారాయణ నిలదీయడంతో చీరకి మ్యాచింగ్‌గా ఉంటుందని కొనుక్కున్నాను అంటుంది. ఆ ఉంగరం చూడగానే ఆరోజు మాలినితో గొడవ పడినప్పుడు ఆమె చేతికి ఉండటాన్ని గుర్తుచేసుకుంటాడు సూరజ్. నేను క్లినిక్‌కి వెళ్లాను, జ్యోత్స్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లిందని మనవరాలిని ఇరికించేస్తుంది పారు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్లినట్లు నాతో చెప్పలేదని కార్తీక్ అనడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. పారిజాతం గారు చెబుతున్నారంటే జ్యోత్స్న గారు ఫ్రెండ్ దగ్గరికి వెళ్లినట్లే, కాకపోతే ఆ ఫ్రెండ్ ఎవరో జ్యోత్స్న గారే చెప్పాలని సూరజ్ అనడంతో మా గురించి ఆరాలు తీయడానికి నువ్వెవరు? అంటూ ఫైర్ అవుతుంది పారిజాతం. మీ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ పెళ్లయిపోయి ఉంటుంది కాబట్టి.. సరదాగా మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. పోనీ మీకు ఏదైనా పెళ్లి సంబంధం వచ్చి కాబోయే భర్తను కలవడానికి వెళ్లారా? అని ప్రశ్నిస్తాడు సూరజ్. అసలు ఇన్ని ఆరాలు తీస్తున్నావు, మా ఫ్యామిలీ విషయం నీకెందుకు అని మండిపడుతుంది పారు. ఇది ఫ్యామిలీ విషయం కాదు.. ఆఫీస్ విషయం, ఎవరు బాధ్యతగా లేకపోయినా ఛైర్మన్ గారు క్షమించరని చెబుతాడు సూరజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications