Karthika Deepam 2 July 27th: దీప- దశరథల బంధంపై శ్రీధర్‌లో అనుమానం.. జ్యోత్స్న జ్ఞాపకాలలో సూరజ్
Photo Courtesy: JioHotstar
ఈ ఆస్తిలో సగం నా ఆడపడుచు సుమిత్రదే.. నువ్వు అడిగితే నా ఆస్తిలో సగం ఇస్తానని మాలిని ఆఫర్ ఇవ్వడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నా మేనకోడలు అంటే నాకు చచ్చేంత ప్రాణం, ఇష్టమని చెబుతుంది. నాకు ఎవరి ప్రేమలు వద్దు అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. మాలిని ఉంగరం కిందపడిపోవడంతో దానిని తీసుకుని ఇవ్వబోతుండగా పారు మెడనొప్పి తగ్గిపోతుంది. నా మేనకోడలిని నా ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వే దానిని ఉంచుకోమని పారుకి చెబుతుంది మాలిని. భోజనం చేస్తూ శ్రీధర్ అమెరికా నుంచి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటుంది సుమిత్ర. ఇంతలో శ్రీధర్ రావడంతో కాంచన చాలా సంబరపడిపోతుంది..
నాకు బాగా ఆకలిగా ఉందని శ్రీధర్ చెప్పగా ప్లేటులో భోజనం పెట్టబోతుండగా ముద్దలు పెట్టమని అడుగుతాడు శ్రీధర్. దాంతో భర్తకు అన్నం పెడుతుంది. ఛైర్మన్ గారికి కానీ, సీఈవోగారికి కానీ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్నని కార్తీక్, దీపలు నిలదీస్తారు. ఇంటి దగ్గర కూడా ఇదే పంచాయతీ పెడతాడు శివన్నారాయణ. జ్యోత్స్న, పారులు చెబుతున్న దానికి పొంతన ఉండదు. ఇంతలో పారిజాతం చేతికి మాలిని ఉంగరం చూసి సూరజ్‌కి వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లాడో అర్ధమైపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 27వ తేదీ 733వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యోత్స్న, పారులను ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుండగా దశరథ ఎంట్రీ ఇస్తాడు. మన ఆఫీసులో పనిచేసే ఎవరికైనా జవాబుదారీతనం, నిజాయితీ, బాధ్యత ఉండాల్సిందేనని చెబుతాడు. జ్యోత్స్న చెప్పకుండా వెళ్లిపోయింది కాబట్టి నిజాయితీ లేనట్లేనని అంటాడు కార్తీక్. ఆ తాడు బొంగరం లేనోడు ఏదిపడితే అది మాట్లాడతాడు, నువ్వు కూడా అలాగే మాట్లాడతావా అని మండిపడుతుంది పారు. తాడు బొంగరం లేకపోవడం అంటే ఏంటీ అని అడుగుతాడు సూరజ్. పెళ్లి, పెటాకులు లేవు అని అర్ధమని అంటుంది. అంటే మీరు జ్యోత్స్న గారిని, నన్ను కలిపి తిట్టినట్లేనని ఇరికిస్తాడు సూరజ్. జ్యోత్స్నకి నాకు సంబంధం లేదని అంటుంది పారు.
నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్లానని చెప్పాను, నా మీద నమ్మకం లేక తాత దగ్గర పంచాయతీ పెట్టారని చెబుతుంది జ్యోత్స్న. మన ఆఫీసులో పనిచేసే వాళ్లయినా, మన ఇంట్లో ఉండేవాళ్లయినా క్షమశిక్షణతో ఉండాలి. అది ఎవరు తప్పినా నేను సీరియస్‌గా తీసుకుంటాను, ఎవరైనా ఎక్కడికైనా వెళితే ఎవరో ఒకరికి చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. నేను మీ పెళ్లి గురించి మాట్లాడినందుకు నన్ను తప్పుగా అనుకోలేదు కదా అని సూరజ్ మళ్లీ రెచ్చగొడతాడు.
దాని పెళ్లి గురించి మాట్లాడే హక్కు నీకు లేదని పారు సీరియస్ అవ్వగా.. మరి సూరజ్ పెళ్లి గురించి మాట్లాడే రైట్ నీకుందా అని దశరథ కౌంటర్ వేస్తాడు. తాడు బొంగరం లేనోడు అన్నావు.. అది తప్పు కదా? నీ కూతురి పెళ్లెప్పుడు అని నేను బయటికి వెళ్తే జనం అడుగుతున్నారు. నీ పెళ్లి గురించి నీకు బెంగ లేదు కానీ, మాకుందని చెబుతాడు దశరథ. నువ్వు దీని గురించి, మా గురించి కూడా ఆలోచించమని జ్యోత్స్నకి చెబుతాడు. నీ ఇగోని టచ్ చేశావని సూరజ్‌పై రగిలిపోతుంది జ్యోత్స్న. మాలినిని కలిసిన విషయం బయటకు రాకపోవడంతో పారు ఊపిరి పీల్చుకుంటుంది.
కార్తీక్, దీపలను ఇంటి దగ్గర దించిన దశరథ.. జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడాలని చెబుతాడు. జ్యోత్స్న చాలా తెలివిగా పెళ్లి బాధ్యత బావదేనని చెప్పింది. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఫోటో కూడా చెప్పకుండా నచ్చడం లేదని చెబుతోంది. ఇమలా అయితే జ్యోత్స్న పెళ్లి చేసుకునేది ఎప్పుడు? నా కూతురు జ్యోత్స్న నా ఇంట్లో అడుగుపెట్టేది ఎప్పుడు? అని బాధపడతాడు దశరథ. నిజాలు తెలిసిన తర్వాత కూడా నా బిడ్డ ఇంకా ఇంటికి రాకుండా ఎందుకుండాలని అంటాడు.
ఇంతలో దీప, కార్తీక్, దశరథలను చూసిన శ్రీధర్.. వీళ్లకి సర్‌ప్రైజ్ ఇస్తానని అనుకుంటాడు. దీప జీవితం జ్యోత్స్న పెళ్లితో ముడిపడి ఉంది. దీప జీవితం చీకటిలో నుంచి వెలుతురులోకి రావాలంటే వెంటనే జ్యోత్స్న పెళ్లి జరగాలి. జ్యోత్స్న నా తోబుట్టువు లాంటిది తనకు పెళ్లి చేసే బాధ్యత మాది అని దీప చెబుతుంది. ఇక నీ పెళ్లి కూతురు పెళ్లయిపోయినట్లే.. మంచి సంబంధం తీసుకొస్తాం, అందరి మాటలు నిలబెట్టే బాధ్యత నాది అని చెబుతాడు కార్తీక్. వీలైనంత త్వరగా ఆ కూతురు పెళ్లి చేసే ఈ కూతురు అని కార్తీక్ చెబుతుండగా గుమ్మంలో శ్రీధర్ కనిపించడంతో ఇద్దరూ సంతోషిస్తారు.
మీ వల్ల కొత్త విషయాలు తెలిశాయి.. మీరు బావతో మాట్లాడింది తెలిశాయని శ్రీధర్ చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ముగ్గురికి మాత్రమే తెలిసిన విషయం నాలుగో వ్యక్తికి తెలిస్తే ఏమవుతుందో మీరే చెప్పాలని అంటాడు శ్రీధర్. మీరు నా దగ్గర ఏమీ దాయలేరని చెబుతాడు. నీతో చాలా మాట్లాడాలని చెప్పి తండ్రిని లోపలికి తీసుకెళ్తాడు కార్తీక్. మరోవైపు.. జ్యోత్స్న ఫోటో ఆల్బమ్ చూస్తూ మురిసిపోతుండగా జ్యోత్స్న రావడంతో షాక్ అవుతాడు. సూరజ్ చేతిలో తన ఫోటోలు చూసి ఉలిక్కిపడుతుంది జ్యోత్స్న.
నా ఫోటోలు ఎందుకు తీశావని నిలదీస్తుంది జ్యోత్స్న. నా మొబైల్ నా ఇష్టం.. ఈ ప్రపంచంలో నాకు నచ్చినది తీస్తానని చెబుతాడు సూరజ్. ఒకరికి నచ్చుతుందో, నచ్చలేదోనని నేను బతకను. ఫోటోలు తీయడం ఒక ఆర్ట్ దాని వాల్యూ హార్ట్ ఉన్నవారికే తెలుస్తుందని చెబుతాడు సూరజ్. మా డాడీ దగ్గర నా పెళ్లి గురించి ఎందుకు వాగావని అడుగుతుంది జ్యోత్స్న. అది నేను కావాలనే చెప్పాను, నువ్వు తలనొప్పి టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్లావో? ఇంకెవరినో కలవడానికి వెళ్లావో నాకు తెలియదా అంటాడు సూరజ్. పారిజాతం గారు హాస్పిటల్‌కు, నువ్వేమో మెడికల్ షాపుకు వెళ్లారు.. మీ ఇద్దరికీ బాగా సెట్ అయ్యిందని సెటైర్లు వేస్తాడు. నేను నాకు నచ్చిన ప్లేస్‌కి వెళ్తాను అడగటానికి నువ్వెవరు అని మండిపడుతుంది జ్యోత్స్న. నా ఫోటోలు నీ దగ్గర పెట్టుకున్నావంటే పామును నీ ఇంట్లో పెట్టుకున్నట్లేనని అంటుంది. నాకు ప్రమాదాలంటే చాలా ఇష్టమని చెబుతాడు సూరజ్. నీకు టైం దగ్గర పడింది, రోజులు లెక్కపెట్టుకోమని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న.
కార్తీక్, దీపలతో కలిసి శ్రీధర్ భోజనం చేస్తుండగా.. నువ్వు ఇక్కడే ఉంటే నానమ్మ ఫోన్ మొగదని చెబుతుంది శౌర్య. ఆ మాటలతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక్కడే ఉంటాడని చెబుతాడు కార్తీక్. పెద్దమ్మ ఊరిలో లేదు, నీకు రెస్ట్ చాలా అవసరమని అంటాడు. మరి పెద నానమ్మ వస్తే అని శౌర్య అడుగుతుంది. మా రూమ్ మా నాన్నకి ఇచ్చి మేం హాల్‌లో పడుకుంటామని అంటాడు కార్తీక్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమని చెప్పడంతో శ్రీధర్ మురిసిపోతాడు. నువ్వు చేయాల్సిన హోంవర్క్ వేరే ఉంది.. జ్యోత్స్నకి పెళ్లి చేయాలని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అన్నయ్య ఇంటికొచ్చి అటు నుంచి అటే వెళ్లిపోయాడని శ్రీధర్ చెప్పడంతో కాంచన ఉలిక్కిపడుతుంది. జ్యోత్స్న పెళ్లికి మరికొందరు జీవితాలతో ముడిపడి ఉంటాయని శ్రీధర్ చెప్పడంతో జ్యోత్స్న, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఎవరైనా ఎన్నాళ్లు దాచగలరు? ఏదో ఒక రోజు చెప్పాల్సిందేనని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications