Karthika Deepam 2 July 28th: పెళ్లిచూపులతో జ్యోత్స్న షాక్.. దీప పుట్టుకపై మాలిని అవమానం, కార్తీక్ కౌంటర్
Photo Courtesy: JioHotstar
మన ఆఫీసులో పనిచేసే ఎవరికైనా జవాబుదారీతనం, నిజాయితీ, బాధ్యత ఉండాల్సిందేనని అంటాడు దశరథ. ఆ తాడు బొంగరం లేనోడు ఏదిపడితే అది వాగుతూ ఉంటాడని సూరజ్‌పై పారు సీరియస్ అవుతుంది. తాడు, బొంగరం లేకపోవడం అంటే ఏంటని అడుగుతాడు సూరజ్. పెళ్లి పెటాకులు లేనివాళ్లని అలా అంటారని పారు చెప్పగా.. అంటే జ్యోత్స్నగారిని, నన్ను కలిపి తిట్టారని ఇరికిస్తాడు సూరజ్. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై ఎవరైనా బయటికి వెళ్లేటప్పుడు చెప్పి వెళ్లమని వదిలేస్తాడు శివన్నారాయణ.
కార్తీక్, దీపలను ఇంటి దగ్గర దించిన దశరథ.. త్వరగా జ్యోత్స్న పెళ్లి అయ్యేలా చూడండి, ఈ పెళ్లితోనే దీప జీవితం ముడిపడి ఉందని బతిమలాడతాడు. ఈ మాటలన్నీ విన్న శ్రీధర్.. నాకు తెలియకుండా వీళ్లిద్దరూ ఏదో జరుగుతుందని అనుకుంటాడు. ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన శ్రీధర్‌ను చూడగానే కార్తీక్, దీపలు సంతోషిస్తారు. తన ఫోటోలు చూస్తున్న సూరజ్‌పై కోప్పడుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలు నా దగ్గర ఏదో దాస్తున్నారని కాంచనకి ఇన్‌డైరెక్ట్‌గా చెబుతాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూలై 28వ తేదీ 734వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే సూరజ్, జ్యోత్స్నలతో శివన్నారాయణ మాట్లాడుతుండగా పెళ్లిచూపులు చూసుకోవడానికి కొందరు వస్తారు. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? అని పెద్దాయన అడగ్గా.. మేడం గారు అంటారు. ఇంతలో దశరథ వచ్చి నిన్ననే జ్యోత్స్న పెళ్లి గురించి కార్తీక్, దీపలతో మాట్లాడాను, జ్యోత్స్న నా తోబుట్టువు లాంటిది, తనకి పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పిందని అంటాడు దశరథ. దీప సీఈవో కదా అందుకే మేడం అని పిలుస్తున్నారని చెబుతాడు. పెళ్లి కొడుకు జ్యోత్స్నకి హాయ్ అని చెప్పడంతో మండిపడుతుంది. సుమిత్ర వచ్చి నాకేం చెప్పలేదని కంగారుపడుతుంది.
శ్రీధర్‌కు కనిపించకుండా బయటకు వచ్చేస్తారు కార్తీక్, దీప. ఇది ఇల్లులా కనిపించడం లేదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్‌లా ఉంది.. ఎక్కడ నుంచి మన మాటలు వింటున్నాడోనని కంగారుపడతాడు కార్తీక్. మనం ఏదో దాస్తున్నామని మావయ్యగారికి మొదటి నుంచి అనుమానంగానే ఉంది, అందరికీ నిజం తెలిసే వరకు మనకు ఈ ఇబ్బంది తప్పదని అంటుంది దీప. అయితే జ్యోత్స్నకి మంచి కుర్రాడిని చూడు.. పెళ్లే చేసేద్దాం, ఆ తర్వాత నువ్వు ఎవరో అందరికీ చెప్పేద్దామని అంటాడు కార్తీక్.
మనమే పెళ్లిళ్ల పేరయ్యని పట్టుకుందామని దీప చెబుతుండగా శివన్నారాయణ ఫోన్ చేస్తాడు. పెళ్లివాళ్లు ఇంటి దగ్గరుంటే ఆఫీస్‌కి ఎందుకు, త్వరగా మీరిద్దరూ ఇంటికి వచ్చేయమని చెబుతాడు. నాన్న నీకంటే స్పీడుగా ఉన్నాడు.. జ్యోత్స్నని చూసుకోవడానికి పెళ్లివాళ్లు వచ్చారని దీపతో చెప్పగా ఆమె షాక్ అవుతుంది. ఈ అబ్బాయి ఎవరు అని సూరజ్ గురించి అడుగుతారు పెళ్లివాళ్లు. మా ఔట్‌హౌస్‌లో ఉంటాడు, మా కంపెనీ అడ్వైజర్ అని చెబుతాడు పెద్దాయన. జ్యోత్స్నగారి గురించి మీరు అనుకున్నది తప్పు... అది అర్ధం చేసుకున్నవాళ్లకే తెలుస్తుంది. మా జ్యోత్స్నగారు కూడా మనసున్న కవిరాసిన అందమైన కవితలాంటిది అంటాడు సూరజ్.
ఆవిడ ఉదయాన్నే గార్డెన్‌లో నడుస్తుంటే చుక్కల మధ్యలో ఉన్న చందమామలా ఉంటారు. ఓర్పుగా ఉండే గుణం, చూపుల్లో కరుణ, చేతల్లో దయ ఒక్కమాటలో చెప్పాలంటే పదహారణాల తెలుగమ్మాయి. చంద్రుడిలో మచ్చ ఉన్నట్లుగానే ఈ అమ్మాయిలోనూ ఒక మచ్చ ఉందని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఆవిడలో ఉన్న లోపం వంట చేయడం రాదు.. కానీ మంచి వంట ఎలా చేయాలో తెలుసని అంటాడు సూరజ్. జ్యోత్స్న గారి గురించి ఇంత బాగా చెబుతున్నారంటే మీకు ఆవిడ చిన్నప్పటి నుంచి తెలుసా అని అడుగుతాడు పెళ్లికొడుకు. అతను వచ్చి రెండు నెలలు కూడా కావడం లేదని పారిజాతం అంటుంది. 2 నెలలు కూడా కాకముందే జ్యోత్స్న గురించి ఇంత బాగా చెప్పాడంటే గ్రేట్ అంటాడు పెళ్లికొడుకు.
సంబంధం ఎవరు తీసుకొచ్చారని కార్తీక్ చెప్పడంతో అది నువ్వే చెప్పాలని అంటాడు పెద్దాయన. వీళ్లు నా మనవడు మనవరాలు.. వీళ్లు పంపిస్తేనే కదా మీరొచ్చిందని శివన్నారాయణ అడగ్గా పెళ్లి సంబంధం వాళ్లు కాదని సమాధానం చెబుతారు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మేడం అంటే సీఈవో దీపగారు కాదా అని దశరథ ప్రశ్నించగా.. మేడం అంటే డీఎం రెస్టారెంట్స్ ఎండీ మాలిని గారు అని చెప్పడంతో శివన్నారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇంతలో మాలిని ఎంట్రీ ఇస్తుంది. వీళ్లు నా మనుషులే.. నేనే మీ ఇంటికి పంపించానని చెబుతుంది మాలిని.
దక్షిణామూర్తి, మాలినిలు మళ్లీ మన జీవితాల్లోకి వచ్చారని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఈసారి ఎన్ని ఘోరాలు చూడాలో అని బాధపడతాడు. మాలిని ఈ ఇంటికొచ్చింది, జరిగినదంతా మా నాన్నకి చెప్పానని అంటుంది కాంచన. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వాళ్లు మన కథలోకి వచ్చారంటే మన మీద పగ తీర్చుకోవడానికే అంటాడు శ్రీధర్. మరోవైపు.. మీరు మాలినిగారి మనుషులని తెలిస్తే మిమ్మల్ని గేటు బయటే పంపించేవాడిని బయల్దేరండి అని సీరియస్ అవుతాడు. మాకు గతిలేక ఇక్కడికొచ్చామా అని పెళ్లివాళ్లు మండిపడుతుండగా.. అవమానించడం వాళ్లకి అలవాటేనని అంటుంది మాలిని. ఆ మాటలతో సుమిత్ర సీరియస్ అవుతుంది.
వియ్యంకుడు, స్నేహితుడు ఒక్కడే అయినప్పుడు చనువు తీసుకోవడంలో తప్పులేదని నట్టింటిలో కూర్చొంటారు మాలిని, దక్షిణామూర్తి. లేచిపోతారా లేదా అని దశరథ సీరియస్ అవుతాడు. ఎవరు చెల్లి? ఎవరు అన్నయ్య అని సీరియస్ అవుతాడు దశరథ. నాకొస్తున్న కోపం మాటల్లో చెప్పాలంటే మీరు కూర్చొన సోఫాని తగలబెట్టాలి.. కానీ నా తండ్రి నన్ను అలా పెంచలేదు. క్షమించమని శత్రువు ఇంటికొస్తే ప్రేమించమని చెప్పాడని అంటాడు. నువ్వు నాకు శత్రువు కాదు.. నా చావువి, నువ్వు కళ్లముందే కనిపిస్తుంటే కాలుతున్న నిప్పుని చేతితో పట్టుకున్నట్లుగా ఉందని అంటాడు దశరథ. నా కూతురికి సంబంధం చూసి చనువు మీకు ఎవరిచ్చారని నిలదీస్తుంది సుమిత్ర.
నువ్వు నా ఆడపడుచువి, నీ కూతురు నాకు మేనకోడలు.. ఈ బంధం సరిపోదా సంబంధం తీసుకోవడానికి అంటుంది మాలిని. నీతో బంధుత్వం ఉందని మేం అనుకోవాలి.. మా మేనకోడలి కోసం బంధుత్వాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నామని అంటుంది మాలిని. నా కూతురి విషయంలో మీకు సంబంధం లేదు.. దానికి పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసని అంటాడు దశరథ. ఇది అసలు నిజంగానే మీ కూతురేనా? ఎవరైనా ఇస్తే పెంచుకున్నావా అని నానామాటలు అంటుంది మాలిని. ఆ మాటలతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు.
మీ కూతురి జీవితాన్ని మీరిద్దరూ నాశనం చేశారు. జ్యోత్స్నతో కార్తీక్ పెళ్లి గురించి అనుకున్నారు. మీకు చేతకాక కార్తీక్ ఎవరో అనాథ మెడలో తాళి కడితే అడిగే దమ్ము లేక వదిలేశారని అంటుంది మాలిని. ఆ మాటలతో కార్తీక్ సీరియస్ అవుతాడు. నువ్వు నాతో మాట్లాడాలంటే మాట్లాడు.. నా భార్య గురించి మాత్రం మాట్లాడొద్దని మండిపడతాడు. అనాథ కాకపోతే ఎవరు దాని తండ్రి? ఎవరి దాని తల్లి అని ప్రశ్నిస్తుంది మాలిని. నేనే దీప తల్లిని, నేనే దీప తండ్రిని అని చెబుతాడు కార్తీక్. నేను దీపని పెళ్లి చేసుకోకపోయినా జ్యోత్స్న మెడలో తాళి కట్టేవాడిని కాదు.. అలాగని దీప మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టలేదని చెబుతాడు కార్తీక్.
నువ్వే కట్టావో? తనే కట్టించుకునేలా చేసిందో ఎవరికి తెలుసు అని ప్రశ్నిస్తుంది మాలిని. దీప సీరియస్ అవుతుంది. జ్యోత్స్నని మా బావ ఇష్టపడలేదని చెబుతుంది దీప. కన్నతల్లిదండ్రులు అయ్యుండి కూతురికి న్యాయం చేయలేకపోయారు. దాని వయసు పిల్లలంతా పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేసుకుంటుంటే ఇది మాత్రం ఏ సంతోషం లేకుండా కార్తీక్‌ని మనసులో పెట్టుకుని బతుకుతోంది. నా మాట అబద్ధమని తళ్లి మీద ఒట్టేసి చెప్పమని అంటుంది మాలిని. నీకేం అర్హత ఉందని సుమిత్రకి వత్తాసు పలుకుతున్నావని దీపపై మాలిని ఫైర్ అవుతుంది. సుమిత్రమ్మ మా అమ్మ అని దీప చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications