Karthika Deepam 2 Weekly: సుమిత్ర- దీపలను విడదీసిన జ్యోత్స్న.. భార్య కోసం నిజం దాచిన దశరథ

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు 643 నుంచి 648వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 13వ తేదీ 643వ ఎపిసోడ్‌లో..
తనతో తాళి కట్టించుకోవాలని చూసిన జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చి కార్తీక్ ఇంటికి బయల్దేరుతుండగా.. మార్గమధ్యంలో దీప స్కూటీపై ఎదురొస్తుంది. నువ్వు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి నా భార్య షాకిస్తుందని చెబుతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‌ని ముద్దు పెట్టుకోవాలని దగ్గరికొస్తుండగా జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది దీప. ఆ వెంటనే ముగ్గురూ కలిసి జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీసులో పంచాయతీ పెట్టుకుంటారు. నువ్వు, మా నాన్న, బావ ఆడిన డ్రామాలన్నీ నాకు తెలుసు.. ఎందుకంటే నువ్వే సుమిత్ర కూతురివి అనడంతో దీప షాక్ అవుతుంది. బావకి ఈ నిజం తెలిసినా నీకు చెప్పలేదా? అని నిలదీస్తుంది. నువ్వు తిరిగి వస్తే నీకు అమ్మ ఉంది.. నాకు ఎవ్వరూ లేరు. నువ్వే అసలైన వారసురాలివని తెలిసిన రోజున నేను ఇంట్లోంచి బయటకి వచ్చేయాలి. చేతికి సంచి తగిలించుకుని తిరిగే తండ్రి, హాఫ్ మైండ్ నానమ్మ, పెళ్లాం ఇంట్లో డ్రైవర్‌గా చేసే సాఫ్ట్‌వేర్ తమ్ముడు తప్ప నాకు ఎవరూ లేరని దీప ముందు కన్నీటి పర్యంతమవుతుంది జ్యోత్స్న. నీకు మంచి జీవితాన్ని మేం ఇస్తాం.. మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెబుతారు దీప, కార్తీక్. బావని తప్ప మరొకరిని నేను భర్తగా ఊహించుకోలేనని తేల్చేస్తుంది జ్యోత్స్న.

ఏప్రిల్ 14వ తేదీ 644వ ఎపిసోడ్‌లో..
ఈ జ్యోత్స్న ఎలా బతికిందో అలాగే చస్తుంది.. మీ దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదని కార్తీక్ - దీపలకు చెబుతుంది. బావ చేతులతో నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జ్యోత్స్నే కాదంటూ దీపకి సవాల్ విసురుతుంది. నీకు ఆస్తి, అమ్మనాన్న, తాతయ్య, వంశ ప్రతిష్ట అన్నీ నా దగ్గర ఉన్నాయి.. నీ దగ్గర ఏం ఉన్నాయని దీపని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు కోరుకున్న వ్యక్తి నా దగ్గర ఉన్నాడని కార్తీక్‌ని పట్టుకుంటుంది దీప. అయితే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం.. నువ్వే సుమిత్ర కూతురివని అందరికీ చెప్పేస్తాను, నీ ఆస్తినీ నీకు ఇచ్చేస్తాను.. బావని నాకిచ్చేయమని చెబుతుంది జ్యోత్స్న. నేను తన కూతురిని కాదని తెలిస్తే నీ తల్లి చచ్చిపోతుంది, చిన్నప్పుడు పెంచిన తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడు కన్నతల్లిని చంపుకుంటావా అని బ్లాక్‌మెయిల్ చేస్తుంది జ్యోత్స్న. ఒక్కటే ఇంటికొచ్చిన జ్యోత్స్నని చూసి సుమిత్ర మండిపడుతుంది. చెంపపై ఎర్రగా కమిలిపోవడంతో ఏం జరిగిందని అడుగుతుంది. ఎండ వల్ల అలా అయ్యిందని కవర్ చేస్తుంది జ్యోత్స్న. దీప జోలికి రావొద్దని జ్యోత్స్నకి మరోసారి వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. ఆలస్యంగా ఇంటికొచ్చిన కార్తీక్‌కి క్లాస్ తీసుకుంటుంది కాంచన.

Karthika deepam 2 Serial Weekly Episodes April 13th to April 18th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 15వ తేదీ 645వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న అన్న మాటల్లో నిజం ఉందని.. నా వల్లే తను నీ భార్య కాలేకపోయిందని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. కొంపతీసి నువ్వు త్యాగాలు లాంటివి ప్లాన్ చేయడం లేదు కదా అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ వదులుకోనని చెబుతుంది దీప. కానీ జ్యోత్స్న ఇలా కావడానికి పారిజాతం గారే కారణమని దీప చెప్పడంతో పారు ద్వారానే చిన్న మరదలికి బుద్ధి చెప్పిస్తానని అంటాడు కార్తీక్. దీప అనాథ.. తనకి ఎవరూ లేరు కాబట్టి తన కాపురం నాశనం చేయాలని జ్యోత్స్న చూస్తోందని అంటాడు. ఆ మాటలతో పారిజాతం కంటతడి పెడుతుంది. దీపకి అన్యాయం జరగనివ్వను నేనేంటో చూపిస్తానని కార్తీక్‌కి చెబుతుంది పారు. దీప కొట్టిన దెబ్బకి మందు రాసుకుంటూ పడుకున్న జ్యోత్స్న పక్కనే పారు పడుకుంటుంది. దీప జోలికి రావొద్దని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు.. రేపటి నుంచి నీకు టార్చర్ చూపిస్తానని అంటుంది పారు. జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కడుతున్నట్లుగా పీడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. ఉదయాన్నే ఈ విషయాన్ని శ్రీధర్‌కు చెప్పగా.. అలా ఎప్పటికీ జరగదని అంటాడు.

ఏప్రిల్ 16వ తేదీ 646వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న మెడలో కార్తీక్ తాళి కట్టినట్లుగా కాంచనకు కల వచ్చిన విషయం గురించి తల్లికి కార్తీక్ వివరణ ఇస్తుండగా దీప ఏడుస్తూ పెరటిలోకి వెళ్లిపోతుంది. ఈ పంచాయతీ అంతా ఎందుకు పెట్టావంటూ తల్లిపై అరుస్తాడు కార్తీక్. దాంతో కాంచన కూడా అలిగి గదిలోకి వెళ్లిపోతుంది. వెంటనే దీపని ఓదార్చడానికి కార్తీక్ వెళ్తాడు. ఇంతలో అక్కడికి శివన్నారాయణ కుటుంబం వస్తుంది. దీప- కార్తీక్‌లు కనిపించకపోవడంతో పెరటిలో ఉన్నారని తెలిసి పారిజాతం వెళ్లబోతుండగా ఆమెను ఆపి నేనే వెళ్తానని అంటుంది జ్యోత్స్న. కాంచనకి వచ్చిన కల గురించి కార్తీక్- దీపలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్ని దొంగచాటుగా జ్యోత్స్న వింటుంది. దీపని ఏడిపించాలని కార్తీక్‌కి ఫోన్ చేసి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో కోపంతో ఊగిపోతుంది దీప. నీకు బుద్ధి ఉంటే మళ్లీ మా ఆయనకి ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది దీప. ఈ మాటలన్నీ విన్న శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. దీపని జ్యోత్స్న ఇరికించిందని గ్రహించిన పారు ఆమెను కాపాడటానికి గట్టిగా అరుస్తుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా.. నా కూతురిని నా ముందే అన్ని మాటలు అంటావా అంటూ దీపపై సీరియస్ అవుతుంది సుమిత్ర.

Karthika deepam 2 Serial Weekly Episodes April 13th to April 18th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 17వ తేదీ 647వ ఎపిసోడ్‌లో..
తనకు తల్లి స్థానంలో నిలబడి పుట్టింటి సారె పెడుతోన్న సుమిత్ర ఆశీర్వాదాలు తీసుకోవడానికి దీప ముందుకు వంగగా.. సుమిత్ర వెనక్కి జరుగుతుంది. నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయని చెబుతుంది సుమిత్ర. ఆ వెంటనే దీప కోసం ప్రత్యేకంగా కొన్న నెక్లెస్‌ను జ్యోత్స్న చేతుల మీదుగా వేయిస్తుంది పారిజాతం. నా చేతే దీప మెడలో నెక్లెస్ వేయిస్తావా? దానిని ఏడిపిస్తానంటూ పారుపై రగిలిపోతూ కొత్త స్కెచ్ వేస్తుంది జ్యోత్స్న. నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను.. నేను ఇందాక పెరట్లో కార్తీక్- దీపలను చూసి కావాలని అబద్ధం చెప్పాను. ఆ సమయంలో నా మెడలో కార్తీక్ బావ తాళికట్టినట్లుగా కాంచన అత్తకు కల వచ్చిందని దీప చెబుతుండగా విన్నాను. అందుకే నా మీద కోపంతో దీప తిట్టిందని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలు విన్న అందరూ షాక్ అవుతారు. కాంచనను అడగ్గా ఆమె కూడా నిజమేనని ఒప్పుకుంటుంది. దాంతో కార్తీక్ జోక్యం చేసుకుని.. ఎప్పటికీ దీపే నా భార్య, ఆమె లేకుండా ఉండలేనని చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. దీపే నా మనవరాలని పారు ఎక్కడ చెబుతుందోనని దాస్ బయటికి తీసుకెళ్లి వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే కార్తీక్‌ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది పారు. దీప- జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటారు.

ఏప్రిల్ 18వ తేదీ 648వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ బావ ఇంట్లో ఏదో సెలబ్రేషన్స్ ఉన్నట్లుగా ఉన్నాయి.. మీరు వెళ్లలేదా అని కావేరిని అడుగుతాడు కాశీ. స్వప్న రాను అని చెప్పింది, అందుకే వెళ్లలేదని అంటుంది కావేరి. దీనిపై స్వప్నని అడగ్గా.. అక్కడికి వెళితే నలుగురితో మాటలు పడాల్సి ఉంటుందని, ముందు మీ నానమ్మ సెటైర్లు వేస్తుందని చెబుతుంది స్వప్న. నా మెడలో తాళి పడితేనే కానీ వీటన్నింటికీ చెక్ పడదని చెబుతుంది. జైలు నుంచి రిలీజైన వైరా తనను దెబ్బకొట్టిన జ్యోత్స్న అంతుచూడాలని ప్లాన్ చేస్తుంటాడు. దాస్‌ని పక్కకి తీసుకొచ్చిన జ్యోత్స్న.. మీరంతా ఏం చేసి గ్రానీనీ మార్చేశారని అడుగుతుంది. కార్తీక్- దీపల మంచితనమే అమ్మని మార్చేసిందని దాస్ చెబుతాడు. మీరెవ్వరూ నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటాను.. కార్తీక్ బావ చేతులతో నా మెడలో తాళి కట్టించుకుంటానని సవాల్ చేస్తుంది జ్యోత్స్న. వసంత్‌ని నువ్వు పెళ్లి చేసుకోలేవు, నువ్వే ఈ పెళ్లి ఆపేస్తావని స్వప్నతో అంటాడు కాశీ. జ్యోత్స్న గురించి దీప అలా మాట్లాడటం నాకు నచ్చలేదని దశరథతో చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్నకు పెళ్లయినా అది నా కళ్ల ముందే ఉండాలని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X