Karthika Deepam 2 Weekly: వైరాకి మస్కా కొట్టిన కార్తీక్.. జ్యోత్స్న కిడ్నాప్ డ్రామా అట్టర్‌ఫ్టాప్
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు 649 నుంచి 654వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్ 20వ తేదీ 649వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న కారులో వస్తుండగా ఆమెను వైరా కిడ్నాప్ చేస్తాడు. అనంతరం వైరా మనుషులు .. జ్యోత్స్నని కుర్చీకి కట్టేస్తారు. నీ వల్ల నా సామ్రాజ్యం మొత్తం పోయింది. మళ్లి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 20 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, అందుకే నిన్ను కిడ్నాప్ చేశామని చెబుతాడు. వెంటనే దశరథకు ఫోన్ చేసి మీ అమ్మాయి నా దగ్గరే ఉందని వీడియో తీసి పంపిస్తాడు. అది చూసిన దశరథ, శివన్నారాయణ, కార్తీక్‌లు షాక్ అవుతారు. జ్యోత్స్న కిడ్నాప్ అయిన విషయాన్ని సుమిత్రకు ఎలా చెప్పాలో తెలియక అంతా తలపట్టుకుంటారు. ఇంతలో సుమిత్ర రావడంతో జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వీడియో చూపిస్తాడు కార్తీక్. దాంతో సుమిత్ర కంగారుపడుతుంది. ఆ వెంటనే వైరా వీడియో కాల్ చేసి జ్యోత్స్నతో మాట్లాడిస్తాడు. మీ అమ్మాయి మీ ఇంటికి సేఫ్‌గా రావాలంటే 30 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. నీ వల్ల నాకు కూడా డబ్బులు వస్తాయి.. నువ్వు 20 కోట్లు తీసుకో, నేను 10 కోట్ల రూపాయలు తీసుకుంటానని వైరాతో డీల్ మాట్లాడుతుంది జ్యోత్స్న.
ఏప్రిల్ 21వ తేదీ 650వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పకుండా డీల్ చేయాలని దశరథ- శివన్నారాయణ మాట్లాడుకుంటూ ఉండగా పోలీసులను వెంటబెట్టుకుని వస్తాడు దాస్. అది చూసిన శివన్నారాయణ.. పోలీసులను తీసుకుని రావడానికి నువ్వు ఎవడ్రా అంటూ సీరియస్ అవుతాడు. దీప నచ్చజెప్పాలని చూస్తుండగా నువ్వు మా ఇంట్లో ఉండొద్దంటూ మెడపట్టి గెంటేస్తుంది సుమిత్ర. ఆ వెంటనే శ్రీధర్ రావడంతో నీకెవరు చెప్పారని శివన్నారాయణ అడగ్గా.. దాస్ చెప్పాడని అనడంతో ఇంకా రగిలిపోతాడు పెద్దాయన. జ్యోత్స్న కావాలని కిడ్నాప్ డ్రామా ఆడుతోందని దాస్- పారులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఈ ఆస్తికి జ్యోత్స్న ఏకైక వారసురాలు.. అది కావాలనుకుంటే ఎంతైనా ఇస్తాను, డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడాల్సిన అవసరం దానికెంటీ? అంటూ మండిపడతాడు. శివన్నారాయణ ఇంటికి ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చి జ్యోత్స్న గురించి ఎంక్వైరీ చేస్తాడు. దశరథ మాటలతో ఇంటికి పోలీసులు వచ్చారని వైరాకి అనుమానం వస్తుంది. పోలీసులకు ఎందుకు చెప్పారు? మీ అమ్మాయి మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పడంతో సుమిత్ర కుప్పకూలిపోతుంది.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 22వ తేదీ 651వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న కనిపించకపోవడంతో దాస్ ఏడుస్తాడు. ఎలాగైనా నా కూతురిని కాపాడమని కార్తీక్‌ని దాస్ బతిమలాడుతుండటంతో శివన్నారాయణ విని షాక్ అవుతాడు. నీ సొంత కూతురు అయినట్లుగా ఎందుకంత ఏడుస్తున్నావని ప్రశ్నిస్తాడు. అన్నయ్య కూతురు నాకు కూడా బిడ్డే.. అందుకే ఏడుస్తున్నానని అంటాడు దాస్. ఈ మాటలు విన్న పారుకి కూడా దాస్ మీద అనుమానం వస్తుంది. జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా అని అడగటంతో ఈ ఇంటికి మనం చాలా రుణపడి ఉన్నామని చెబుతాడు దాస్. కిడ్నాపర్ కాల్ కోసం దశరథ ఎదురుచూస్తుంటాడు. ఆ కిడ్నాపర్ చెప్పినట్లు డబ్బులిస్తే వాడు మరింత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడని పోలీసులు హెచ్చరిస్తారు. మా అమ్మాయి సేఫ్‌గా మా ఇంటికి వచ్చాక మీరు వాడిని ఏమైనా చేసుకోమని బతిమలాడుతుంది సుమిత్ర. ఇంతలో వైరా నుంచి దశరథకు ఫోన్ వస్తుంది. డబ్బులు తీసుకుని కారు నడుపుకుంటూ రమ్మని చెబుతాడు. దాంతో దశరథ ఒంటరిగా డబ్బులు తీసుకుని బయల్దేరతాడు. అతనిని ఫాలో చేస్తూ దాస్, పోలీసులు, కార్తీక్, పారులు వెళ్తారు. ఒకచోటికి రాగానే దశరథను కారు దిగేయమని వైరా ఫోన్ చేయగానే అతని మనుషులు కారు తీసుకుని వెళ్లిపోతారు.
ఏప్రిల్ 23వ తేదీ 652వ ఎపిసోడ్‌లో..
కిడ్నాపర్లు దొంగిలించిన దశరథ కారును ఫాలో అవుతూ పోలీసులు, కార్తీక్ వెంబడిస్తారు. కానీ అక్కడ కారు మాత్రమే ఉంటుంది డబ్బు కనిపించదు. సుమిత్రకు దీప మందులు తీసుకొచ్చి ఇవ్వగా.. జ్యోత్స్న వచ్చింది అనుకుని మురిసిపోతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి ప్రశ్నించడంతో వచ్చింది దీప అని తెలుసుకుని ఆమెపై రంకెలు వేస్తుంది. పోలీసులకు మస్కా కొట్టి డబ్బు తీసుకుని వస్తారు వైరా మనుషులు. సూట్‌కేస్ చూడగానే నా వాటా కూడా ఇవ్వమని అడుగుతుంది జ్యోత్స్న. నేను నిన్ను మోసం చేస్తున్నా.. తప్పలేదని చెబుతాడు వైరా. నాలాంటి ఆడపిల్లను మోసం చేస్తే నీకు పుట్టగతులు ఉండవని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంతలో పారు, కార్తీక్‌లు ఎంట్రీ ఇస్తారు. బావని చూడగానే ధైర్యం తెచ్చుకున్న జ్యోత్స్న.. వైరాని వెనుక నుంచి లాగిపెట్టి కొట్టి డబ్బును ఎత్తుకెళ్లాలని అనుకుంటుంది. దాంతో రగిలిపోయిన వైరా.. ఆమెను గన్‌తో కాల్చబోతుండగా కార్తీక్ అడ్డురావడంతో భుజానికి బుల్లెట్ తగులుతుంది. జ్యోత్స్న ఇంటికి రావడంతో సుమిత్ర సహా శివన్నారాయణ కుటుంబం సంతోషిస్తుంది. ఇంతలో కార్తీక్ భుజం మీద గాయంతో రావడంతో అక్కడ జరిగినదంతా చెబుతుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 24వ తేదీ 653వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వైరాని చంపేస్తానంటూ గన్ తీసుకుని బయల్దేరుతున్న శివన్నారాయణని ఆపేస్తాడు కార్తీక్. కార్తీక్‌కి బుల్లెట్ తగిలిందని పారిజాతం చెప్పడంతో శ్రీధర్ పరుగు పరుగున శివన్నారాయణ ఇంటికి వస్తాడు. కొడుకు చేతికి కట్టుని చూడగానే శ్రీధర్ తల్లడిల్లిపోతాడు. అసలు నీ వల్లే కార్తీక్ రిస్క్ చేశాడని పారిజాతంపై మండిపడతాడు శివన్నారాయణ. దశరథ వెళ్లుంటే సేఫ్‌గా అమ్మాయిని తీసుకొచ్చేవాడు.. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యుంటే డబ్బు, అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చేవని అంటాడు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని కాపాడాలని ఎంతో ప్రయత్నించాను.. అందుకే ఆ వైరా గాడు నన్ను చంపాలని అనుకున్నాడని చెబుతుంది జ్యోత్స్న. ఆ డబ్బు ఎక్కడికి పోలేదని నేను, పారు కలిసి వైరా గాడికి మస్కా కొట్టామని డబ్బు మూటని చూపిస్తాడు కార్తీక్. తన ప్రాణాలను కాపాడినందుకు కార్తీక్‌ని అందరి ముందు హత్తుకుంటుంది జ్యోత్స్న. అది చూసి దీప రగిలిపోతుంది. కార్తీక్, దీపలని తీసుకుని ఇంటికొస్తాడు శ్రీధర్. కొడుకు చేతికి గాయం చూడగానే కాంచన కంటతడి పెడుతుంది. ఆ జ్యోత్స్న కోసం నీ ప్రాణాలెందుకు రిస్క్‌లో పెట్టాలని మండిపడుతుంది.
ఏప్రిల్ 25వ తేదీ 654వ ఎపిసోడ్‌లో..
స్వప్న పెళ్లి గురించి ఏం ఆలోచించారని శ్రీధర్‌ని అడుగుతుంది కావేరి. ఇంతలో వసంత్ వచ్చి స్వప్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనని రెండ్రోజుల్లో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటానని అంటాడు. స్వప్న తనకు ఇష్టమేనని చెప్పడంతో కావేరి, కాశీలు షాక్ అవుతారు. జ్యోత్స్న కిడ్నాప్ అయి క్షేమంగా ఇంటికి రావడంతో దాస్ బాధపడుతూ ఉంటాడు. నేను చస్తే బాగుండేదని నువ్వు అనుకుని ఉంటావని తండ్రిని నానామాటలు అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని దాస్ చెప్పగా.. నేను ఈ ఇంటికి వారసురాలిగా, బావకి భార్యను కావడం నువ్వే చూస్తావని అంటుంది. ఈ మాటలతో దాస్ బాధపడుతూ వెళ్లిపోతాడు. అసలు జ్యోత్స్నని కాపాడటానికి ఎందుకు వెళ్లావని కార్తీక్‌తో గొడవ పడుతుంది దీప. ఇంతలో కార్తీక్‌కి వైరా ఫోన్ చేసి.. అసలు కిడ్నాప్ డ్రామా అంతా జ్యోత్స్నదే. ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? అన్ని తనే గైడ్ చేసింది.. జ్యోత్స్నతో జాగ్రత్త అని వైరా చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. జ్యోత్స్నని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు పారిజాతానికి 50 వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తాడు శివన్నారాయణ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications