Karthika Deepam 2 Weekly: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన శ్రీధర్.. జ్యోత్స్న జీవితంలోకి సూరజ్

Photo Courtesy: JioHotstar

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు 655 నుంచి 660వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 27వ తేదీ 655వ ఎపిసోడ్‌లో..
చేతికి బుల్లెట్ గాయం ఉన్నా సరే శివన్నారాయణ ఇంటికి వెళ్తానని కార్తీక్ చెప్పడంతో కాంచన మండిపడుతుంది. కార్తీక్‌ని బైక్ మీద ఎక్కించుకుని తీసుకొచ్చిన దీపని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. బావకి నేనంటే ప్రాణం.. అందుకే తన ప్రాణాలు రిస్క్ చేసి నా ప్రాణాలు కాపాడాడని అంటుంది జ్యోత్స్న. నేను మా అత్త ప్రాణాలు కాపాడటానికి నిన్ను కాపాడాను కానీ, అంతకుమించి ఏం లేదని అంటాడు కార్తీక్. వైరా గాడితో చేతులు కలిపి కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేసి, నీ వాటా కోసం ఎదురుచూశావని మండిపడతాడు కార్తీక్. ఈ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకు పెంచిన ప్రేమ ఏమాత్రం లేదని జ్యోత్స్నపై మండిపడుతుంది దీప. నేను నా కోసమే బతుకుతాను, నా స్వార్ధం కోసమే బతుకుతాను. త్వరలోనే బావతో తాళి కట్టించుకుంటానని చెబుతుంది జ్యోత్స్న. వచ్చే నెల ఇదే తారీఖు లోగా నీ మెడలో తాళి పడేలా చేస్తానని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వీరికి పారు కూడా సాయం చేస్తుంది. ఇంతలో ఇంటికి పంతులుగారు వచ్చి జ్యోత్స్న జాతకం కావాలని అడుగుతాడు.

ఏప్రిల్ 28వ తేదీ 656వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నకి, దీపకి, కార్తీక్‌కి మధ్య ఏదో మనకి తెలియని కథ నడుస్తోందని కాంచన అనుమానిస్తుంది. మీరు కూడా కొద్దిరోజులుగా నీరసంగా కనిపిస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లమని కాంచనా చెప్పినా శ్రీధర్ వినిపించుకోడు. జ్యోత్స్న జాతకం చూసిన పంతులుగారు.. ఈ అమ్మాయికి ఒక నెల రోజుల్లో పెళ్లి జరుగుతుంది, లేకపోతే జీవితాంతం ఈమె కన్యగానే మిగిలిపోతుందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కార్తీక్ జాతకం చూసిన పంతులు గారు... ఇతనిది చాలా గొప్ప జాతకం.. అందరికోసం రాజాలాంటి జీవితాన్ని వదులుకుని సామాన్యుడిగా మిగిలిపోయాడు. కానీ ఎప్పటికైనా జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడని పంతులుగారు చెప్పడంతో దీప సంతోషిస్తుంది. జ్యోత్స్న నీ వెంట ఎందుకు పడుతోంది? పెళ్లయిన వ్యక్తిని కోరుకోవడం ఏంటీ? అని కాంచన నిలదీయడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. పంతులుగారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుండగా జ్యోత్స్నని పారిజాతం ఆటపట్టిస్తుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes April 27th to May 2nd Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 29వ తేదీ 657వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న విషయంలో జాగ్రత్తగా ఉండమని కార్తీక్, దీపలను హెచ్చరిస్తుంది పారు. దాంతో జ్యోత్స్న ఆటకట్టించడానికి ఓ ప్లాన్ చెబుతాడు కార్తీక్. తన ఫ్రెండ్ కూతురి బర్త్ డే కోసం గిఫ్ట్ కొనడానికి షాప్‌కి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఓ గిఫ్ట్ బాగా నచ్చి దానిని తనకు ఇవ్వమని ఆల్రెడీ కొనుక్కున్న కుర్రాడితో గొడవ పడుతుంది. అయితే అతను మాత్రం ఇవ్వనని తేల్చేస్తాడు. కార్తీక్ చెప్పిన ప్లాన్ ప్రకారం.. చీర కొని జ్యోత్స్న ముందు దానిని దీపకి ఇవ్వబోతున్నానని, ఈ చీర కార్తీక్‌కి నచ్చిందని చెబుతుంది పారు. దాంతో ఆ చీరని నానమ్మ చేతిలో నుంచి లాక్కొంటుంది జ్యోత్స్న. తన ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో పారు చాలా సంతోషిస్తుంది. ఉదయాన్నే కార్తీక్, దీపలు రాగానే పారుతో కలిసి తమ ప్లాన్ అమలు చేస్తారు. ఇంటికి ఓ కుర్రాడిని తీసుకొచ్చి జ్యోత్స్నకి సంబంధం చూశానని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు సంతోషిస్తారు. ఇవేవి తెలియని జ్యోత్స్న చీర కట్టుకుని బావ ముందుకు వచ్చి నిలబడుతుంది

ఏప్రిల్ 30వ తేదీ 658వ ఎపిసోడ్‌లో..
రాజ్ తీసుకొచ్చిన పెళ్లికొడుకుని నచ్చలేదని ముఖం మీదే చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేనెందుకు నచ్చలేదని పెళ్లికొడుకు అడగ్గా.. పోరా అంటూ సీరియస్ అవుతుంది. ఆవిడ అరేయ్, ఒరేయ్ అంటోంది, డైలాగ్స్‌లో అలాంటివి లేవు కదా అని అనడంతో శివన్నారాయణ కుటుంబం ఉలిక్కిపడుతుంది. అసలు ఎవడ్రా నువ్వు అంటూ శివన్నారాయణ సీరియస్ అవ్వడంతో అతను ఆర్టిస్ట్ అని పారు, కార్తీక్‌లు చెబుతారు. అసలు ఇంత డ్రామా ఎందుకు ఆడావని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న తన పెళ్లి బాధ్యతను నా మీద పెట్టింది. పైగా నెల రోజుల్లో పెళ్లి జరగాలని పంతులు గారు జ్యోస్యం చెప్పారు. అందుకే అసలు జ్యోత్స్న మనసులో ఏముంది? పెళ్లికి సిద్ధమా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఇదంతా చేశానని అంటాడు కార్తీక్. నువ్వు ఒప్పుకుంటే మంచి పెళ్లి కొడుకుని తీసుకొస్తానని చెబుతాడు కార్తీక్. నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినా నాకు నచ్చరు.. ఎందుకంటే నేను నిన్నే ప్రేమిస్తున్నా, నీతోనే ఉంటానని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. దీప మెడలో తాళిని జ్యోత్స్న తెంచేయబోతుండగా దీప లాగిపెట్టి కొడుతుంది. దాంతో సుమిత్ర సీరియస్ అవుతుంది. కొట్టాల్సింది నువ్వు కాదు నేనంటూ జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది.

Karthika deepam 2 Serial Weekly Episodes April 27th to May 2nd Here is Highlights

Photo Courtesy: JioHotstar

మే 1వ తేదీ 659వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న ప్రవర్తనతో శివన్నారాయణ రగిలిపోతాడు. తప్పు చేసింది నేను, చిన్నప్పటి నుంచి కార్తీకే నీ మొగుడని నేను చెబుతా వచ్చానని అంటాడు దశరథ. అందరూ నన్నే తప్పుబడుతున్నారు కానీ, నేనంటే ఇష్టం లేదని బావని ఎందుకు అడగటం లేదని నిలదీస్తుంది జ్యోత్స్న. కార్తీక్ గాడు నాకు లండన్ నుంచి వచ్చినరోజే నువ్వంటే ఇష్టం లేదని పారు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మరి అప్పుడే ఈ నిజం ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మన రెండు కుటుంబాలు విడిపోతాయి. కాంచన- దశరథలు తీసుకున్న మాటలు గుర్తొచ్చి ఇదంతా జరగకుండా ఉండటానికే ఈ నిజం దాచానని చెబుతుంది పారు. నిజం చెప్పి మంచి చేశావని పారిజాతానికి శివన్నారాయణ థ్యాంక్స్ చెబుతాడు. మా ఫ్రెండ్స్ అందరం టూర్‌కి వెళ్తున్నామని స్వప్న చెప్పడంతో ఎక్కడికి వెళ్లొద్దని కూతురికి వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతాడు శ్రీధర్. కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా గుండెపోటు రావడంతో కారులోనే కుప్పకూలిపోతాడు. జ్యోత్స్నతో గొడవపడిన కుర్రాడు ఇదంతా చూసి శ్రీధర్‌ని కాపాడతాడు. తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని ఫోన్ రావడంతో కార్తీక్ పరుగు పరుగున హాస్పిటల్‌కి వస్తాడు. శ్రీధర్‌ని చూడగానే ఎమోషనల్ అయినా కార్తీక్.. తన తండ్రిని కాపాడిన కుర్రాడిని వెతుక్కుంటూ వెళ్తాడు.

మే 2వ తేదీ 660వ ఎపిసోడ్‌లో..
తన తండ్రిని కాపాడినందుకు సూరజ్‌కు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. అయితే దీని వల్ల సూరజ్‌కు ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయినట్లుగా తెలియడంతో కార్తీక్ బాధపడతాడు. అవకాశాలు మళ్లీ వస్తాయి.. కానీ ప్రాణాలు పోతే తిరిగి రావని సూరజ్ చెప్పడంతో మిమ్మిల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉందని అంటాడు కార్తీక్. మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ మాత్రమే వచ్చింది. ఈసారి కనుక హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, శ్రీధర్‌లు షాక్ అవుతారు. బావ చేతిలో ఇరుక్కుపోవడంతో జ్యోత్స్న రగిలిపోతుండగా పారు వచ్చి నెల రోజుల్లో నీకు పెళ్లి జరగడం ఖాయమని చెబుతుంది. దీప ఒక్కతే రావడంతో కార్తీక్ కోసం శ్రీధర్‌కి ఫోన్ చేస్తుంది కాంచన. వాడు నా దగ్గరే ఉన్నాడని అడ్డదిడ్డంగా వాదిస్తాడు శ్రీధర్. తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లి స్వప్న, కావేరి, కాశీలకు జరిగింది చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నాన్న ప్రాణాలతో ఉండాలంటే ఆయన సంతోషంగా ఉండేలా చూసుకోవాలని స్వప్నకి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X