Karthika Deepam 2 Weekly: కార్తీక్‌ని లోబరచుకునేలా జ్యోత్స్న ప్లాన్.. కూతురికి షాకివ్వనున్న దశరథ

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు 637 నుంచి 642వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 6వ తేదీ 637వ ఎపిసోడ్‌లో..
ఈ ఇంటికి వారసురాలు ఒకరే ఉండాలి.. అది నేనే అయ్యుండాలని కార్తీక్, దాస్‌లతో తేల్చి చెబుతుంది జ్యోత్స్న. నేను ఇప్పుడే వెళ్లి ఇంట్లో వాళ్లందరికీ నిజం చెబుతానని దాస్ అంటాడు. అప్పుడు నేను వెంటనే చస్తాను.. నా చావు కేక మా అమ్మ విని గుండెపగిలి చచ్చిపోతుంది. భార్య మరణంతో మా నాన్న, కొడుకు చావుతో మా తాత అందరూ చస్తారని జ్యోత్స్న బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నా కూతురిని చూస్తుంటే నాకు భయంగా ఉంది.. ఏదో ఒకటి చేయ్ నా కూతురు నాకు కావాలని కార్తీక్‌తో అంటాడు దాస్. దీపని, ఆస్తిని అన్నింటిని వదిలేస్తాను.. నువ్వు నా మెడలో తాళి కట్టి, నా భార్యను చేసుకోమని కార్తీక్‌ను అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో షాకైన కార్తీక్.. దీప ఉండగా మరొకరిని ఆ స్థానంలోకి తీసుకురానని తేల్చేస్తాడు. నేను కూడా అంతే.. ఈ ఇంటికి వారసురాలిననే స్థానాన్ని మరొకరికి ఇవ్వలేనని చెబుతుంది జ్యోత్స్న. అయితే నీ నోటితో నువ్వే నేను నీ కూతురిని కాదని చెప్పిస్తానని కార్తీక్ సవాల్ విసురుతాడు. అది నేను కూడా చూస్తానని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. పార్టీలో కార్తీక్ ప్రవర్తన తేడాగా ఉండటంతో దీపని నిలదీస్తారు కాంచన, శ్రీధర్. ఇంతలో కార్తీక్ వచ్చి దీపకి దిష్టి తీయడంతో అంతా షాక్ అవుతారు.

ఏప్రిల్ 7వ తేదీ 638వ ఎపిసోడ్‌లో..
దీపకి దిష్టి తీయడంతో ఎందుకు తీశావని కార్తీక్‌ను అడుగుతుంది కాంచన. దీప కడుపుతో ఉంది.. పార్టీలో ఎన్ని కళ్లు పడ్డాయో ఏంటో? అని తీశానని చెబుతాడు కార్తీక్. కానీ కాంచనకు జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. జ్యోత్స్నతో ఏం మాట్లాడావు? ఎందుకు ఆగిపోయావని కార్తీక్‌ను అడుగుతుంది దీప. వీలునామా గురించి గొడవపడ్డామని అబద్ధం చెబుతాడు కార్తీక్. రేపు మన పెళ్లిరోజు గుర్తుందా అని దీప అడగ్గా.. అస్సలు మరిచిపోలేదని చెబుతాడు కార్తీక్. మరోవైపు.. దీప- కార్తీక్‌ల పెళ్లి ఫోటోలను చూస్తూ రేపటి రోజున నా బావని నాకు కాకుండా చేశావు, ఇప్పుడు వారసురాలిగా ఆస్తిని ఎత్తుకుపోవడానికి రెడీ అయ్యావని దీప హత్యకు కుట్ర పన్నుతుంది జ్యోత్స్న. పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే శ్రీధర్ - కాంచనల ఆశీస్సులు తీసుకుంటారు కార్తీక్- దీప. ఇంతలో శౌర్య వచ్చి తల్లిదండ్రులకు పెళ్లిరోజు కానుకగా ఒక డ్రాయింగ్ ఇస్తుంది. కాంచన మాటలు వినిపించుకోకుండా కార్తీక్, దీపలు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. దీప వచ్చేసరికి గుమ్మం దగ్గర నూనె పోస్తుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ పట్టుబట్టల్లో రావడంతో విశేషం ఏంటీ? అని అడుగుతారు శివన్నారాయణ కుటుంబ సభ్యులు.

Karthika deepam 2 Serial Weekly Episodes April 6th to April 11th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 8వ తేదీ 639వ ఎపిసోడ్‌లో..
ఫ్లోర్‌పై ఉన్న నూనెను చూసుకోకుండా కాలు జారిపడబోతున్న దీపని జ్యోత్స్న పట్టుకోవడంతో అంతా షాక్ అవుతారు. దీపని తీసుకుని పారిజాతం వెళ్లిపోగానే.. నా అసలు ప్లాన్ వేరే ఉందని నవ్వుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి.. అందరూ ఫ్లోర్ మీద ఉన్నది నీళ్లు అనకుంటున్నారు, కానీ అది నూనె అని నాకు తెలుసు అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ వెంటనే పారిజాతం వచ్చి.. ఫ్లోర్ మీద నూనె పోసి దీపకి కీడు చేయాలని చూస్తావా దీప జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. కార్తీక్- దీపల పెళ్లిరోజని తెలుసుకున్న పారిజాతం.. ఈ విషయం అందరికీ చెబుతుంది. మాకు ముందే ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు కార్తీక్- దీపలపై మండిపడతారు. ఆ వెంటే కార్తీక్ దంపతులు పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడంతో దీప చాలా సంతోషిస్తుంది. ఈరోజు మీ ఇద్దరికీ లీవ్ ఇస్తున్నాను.. నా కారు తీసుకుని ఎంజాయ్ చేయమని శివన్నారాయణ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న వచ్చి నన్ను గుడికి తీసుకెళ్లమని కార్తీక్‌తో గొడవ పడుతుంది. దీనికి సుమిత్ర కూడా సపోర్ట్ చేస్తుంది.

ఏప్రిల్ 9వ తేదీ 640వ ఎపిసోడ్‌లో..
సుమిత్ర మాట కాదనలేక జ్యోత్స్నని తీసుకుని గుడికి వెళ్తాడు కార్తీక్. గుడి బయటే ఉన్న కార్తీక్‌ని లోపలికి తీసుకురావడానికి డ్రామాలు ఆడుతుంది జ్యోత్స్న. కార్తీక్ లోపలికి రాగానే.. భార్య మీద అలిగి బయట ఉండకూడదని కోప్పడతాడు పూజారి. ఈవిడ మా ఆవిడ కాదని కార్తీక్ ఎంత చెబుతున్నా పూజారి వినిపించుకోడు.. జ్యోత్స్నకు మద్ధతుగా కొందరు మహిళలు కూడా గొడవ చేస్తారు. ఇంతలో దీపని తీసుకుని పారు వస్తుంది. ఈవిడే నా మనవడి అసలు భార్య అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టావు.. నిన్ను బావ వాడేసుకుంటున్నాడు, నా దారికి అడ్డురావొద్దని పారుకి వార్నింగ్ ఇస్తుంది. ఇకపై నువ్వు నేను చూసుకుందామని ఇద్దరూ సవాళ్లు విసురుకుంటారు. దీప- పారులు కనిపించకపోవడంతో ఇద్దరూ ఎక్కడికి వెళ్లారని శివన్నారాయణ అడుగుతాడు. గుడికి వెళ్లారని సుమిత్ర చెప్పడంతో .. వీలునామా మార్చి రాసి మంచి పని చేశావని దశరథను మెచ్చుకుంటాడు శివన్నారాయణ.

Karthika deepam 2 Serial Weekly Episodes April 6th to April 11th Here is Highlights

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 10వ తేదీ 641వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నకి ఏమైనా జరిగితే మీ అమ్మ తట్టుకునేలా లేదని దీపతో అంటాడు కార్తీక్. అలాంటిది జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అమ్మ గుండె పగిలిపోతుందని చెబుతుంది దీప. అత్త బలహీనతను, జ్యోత్స్న తన బలంగా మార్చుకుంటోందని.. దీని నుంచి మీ అమ్మని దూరం చేయాలని అంటుండగా వీరి మాటలను జ్యోత్స్న వింటుంది. నాకు తల తిరుగుతోంది.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని కార్తీక్‌ను అడుగుతుంది. ఆసుపత్రి పేరుతో ఊరంతా తిప్పిస్తుంది జ్యోత్స్న.ఇంతలో దీప ఫోన్ చేసి దానిని అక్కడే వదిలేసి నువ్వు వచ్చేయమని చెబుతుంది. నువ్వు నా బానిసవి, నేను ఏం చెబితే అదే చేయాలని అంటుంది జ్యోత్స్న. ఆ వెంటనే పారు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ జ్యోత్స్న వినిపించుకోదు. గుడికి వెళ్లినవారు ఎంతకూ రాకపోవడంతో పారుకు ఫోన్ చేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నకి హెల్త్ బాలేదని పారు చెప్పగానే సుమిత్ర, శివన్నారాయణ కంగారుపడతారు. ఎవరూ లేని ప్లేస్‌కి కార్తీక్‌ని తీసుకొచ్చిన జ్యోత్స్న.. నా మెడలో తాళికట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని తాళిబొట్టు అతని చేతిలో పెడుతుంది.

ఏప్రిల్ 11వ తేదీ 642వ ఎపిసోడ్‌లో..
నా మెడలో తాళి కడతావా లేదంటే గన్‌తో కాల్చుకుని చనిపోమంటావా? అంటూ కార్తీక్‌ను బెదిరిస్తుంది. గన్‌తో కాల్చుకోబోతుండగా ఆమెను కాపాడతాడు. నా ప్రాణాలంటే నీకు లెక్కలేదు.. అదే నేను చస్తే మా అమ్మ చనిపోతుంది, బెంగతో మా నాన్న, తాతలు పోతారు. వీరందరినీ చంపుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా తేల్చుకోమని డెడ్‌లైన్ పెడుతుంది. జ్యోత్స్న కార్తీక్‌ను ఎక్కడికి తీసుకెళ్లింది? ఇంతసేపు ఇద్దరూ ఏం చేస్తున్నారని దశరథని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందని.. ఒకవేళ అదే తప్పు చేస్తే నేను ఊరుకోనని సుమిత్ర చెబుతుంది. వసంత్‌ ఇంటికొచ్చి స్వయంగా తన చేతులతో గాజులు వేస్తుండగా వద్దని వెళ్లిపోతుంది స్వప్న. ఆమె మనసులో తానే ఉన్నానని తెలుసుకుని కాశీ చాలా సంతోషిస్తాడు. తాళి సంగతి.. ఇంటి దగ్గర తేల్చుకుంటానని జ్యోత్స్నని తీసుకుని బయల్దేరతాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X