Karthika Deepam 2 Weekly: శ్రీధర్‌పై పగ తీర్చుకున్న జ్యోత్స్న.. క్షీణిస్తోన్న సుమిత్ర ఆరోగ్యం
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు 541 నుంచి 546వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 15వ తేదీ 541వ ఎపిసోడ్‌లో..
తన ఇంటికి రమ్మని పిలిచిన కాంచన రాకపోవడంతో ఆమె కోసం క్యారియర్ పంపిస్తాడు శ్రీధర్. మైసూరు బజ్జీ నేనే చేశాను, రుచి చూసి చెప్పమని కాంచనకి చెబుతాడు శ్రీధర్. దాంతో ఆ బజ్జీల రుచి చూస్తుంది కాంచన. గతంలో భర్తతో గడిపిన రోజులను తలచుకుంటూ ఏడుస్తుంది. కార్తీక్, దీపల రాకతో శ్రీధర్ ఇళ్లు కళకళలాడుతుంది. తాము వచ్చి ఇంతసేపు అవుతున్నా కాశీ రాకపోవడంతో కార్తీక్ స్వయంగా పైకి వెళ్లి అతనితో మాట్లాడతాడు. మా నాన్నకి పీఏగా ఉంటే రెస్టారెంట్ బిజినెస్ ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుందని, ఆ తర్వాత నువ్వే సొంతంగా బిజినెస్ పెట్టొచ్చని చెబుతాడు కార్తీక్. ఇంతలో స్వప్న రాగా.. భర్తను అర్ధం చేసుకోమని చెల్లెలికి కూడా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు మీ అత్తయ్య .. తల్లీ కూతుళ్లలా ఉంటారు కాబట్టి .. నన్ను, కాంచనని కలపమని దీప దగ్గర శ్రీధర్ ఏడుస్తాడు. నేను ప్రయత్నిస్తానని దీప చెప్పడంతో శ్రీధర్ సంతోషిస్తాడు. దీపను తీసుకుని శివన్నారాయణ ఇంటికి వచ్చిన కాశీని డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నావా అంటూ నానామాటలు అంటారు జ్యోత్స్న, పారిజాతం. దాంతో వారిద్దరికీ కౌంటర్ ఇస్తుంది దీప.
డిసెంబర్ 16వ తేదీ 542వ ఎపిసోడ్‌లో..
కార్తీక్ బైక్ నడుపుతుండగా తను వెనుక కూర్చోని కొడుకు బైక్ మీద రావడం చాలా సంతోషంగా ఉందని అంటాడు. జ్యోత్స్న సీఈవోగా ఉన్నప్పుడు లెక్కలేనన్ని తప్పులు చేసిందని.. కోట్ల రూపాయలను కొట్టేసిందని ఇది చాలా పెద్ద స్కామ్ అని చెబుతాడు శ్రీధర్. అసలు జ్యోత్స్న శివన్నారాయణ గారి మనవరాలు కాదేమోనని శ్రీధర్ అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. త్వరలోనే ఆ లెక్కలన్నీ మీ తాత ముందు పెడతానని చెబుతాడు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, నువ్వు ఆ పనిని త్వరగా చేయమని చెబుతాడు కార్తీక్. శ్రీధర్ దగ్గర డ్రైవర్ ఉద్యోగం మానేయమని అవసరమైతే మేం సాయం చేస్తామని జ్యోత్స్న, పారిజాతంలు కాశీకి చెబుతారు. మీరేమీ నాకు సాయం చేయనక్కర్లేదు.. మా మావయ్యగారు నీ లెక్కలన్నీ బయటకు తీస్తున్నాడు. నువ్వు మొన్న చేసింది 2 కోట్ల రూపాయలేనని అందరూ అనుకుంటున్నారు.. కానీ దాని కంటే పెద్ద స్కామ్‌లు చేశావని కాశీ అనడంతో జ్యోత్స్నకి చెమటలు పడతాయి. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆలోచిస్తున్న జ్యోత్స్న, పారిజాతం దగ్గరకి దీప వస్తుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 17వ తేదీ 543వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్నకు చెమటలు పట్టడంతో ఏం జరిగిందని అడుగుతుంది దీప. నీ కడుపులో బిడ్డకు ఏమైనా అయితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతేనని అంటుంది జ్యోత్స్న. నా బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని, తనకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటానని మా అత్తయ్యగారికి, మా ఆయనకి మాటిచ్చానని జ్యోత్స్నకి చెబుతుంది దీప. నా బిడ్డ జోలికి గతంలో వస్తే ఏం జరిగిందో గుర్తుంది కదా? ఈ బిడ్డ జోలికి వస్తే మీ అంతుచూస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతానికి ముచ్చెమటలు పడతాయి. జ్యూస్ తాగకుండా మారాం చేస్తున్న సుమిత్రని దశరథ బుజ్జగిస్తాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమను చూసిన దీప మురిసిపోతుంది. జ్యోత్స్న చాలా తెలివైనదని మనం ఈ తప్పుని బయటపెట్టేలోగా జాగ్రత్త పడుతుందని హెచ్చరిస్తాడు. మరోవైపు.. తనకు ఎదురవ్వబోతున్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కాశీని ట్రాప్ చేస్తుంది జ్యోత్స్న. నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తానని అతనిని తనవైపు తిప్పుకుంటుంది. జ్యోత్స్న గదిలో నుంచి కాశీ రావడం చూసిన దీప... ఏదో జరగబోతోందని అనుమానిస్తుంది.
డిసెంబర్ 18వ తేదీ 544వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, శ్రీధర్‌లు శివన్నారాయణ ఇంటికి వస్తారు. ఆ వెంటనే బండి తీయమని కాశీకి శ్రీధర్ చెప్పగా... జ్యోత్స్న చెప్పిన మాటలే అతనికి గుర్తొస్తాయి. దాంతో పగతో రగిలిపోతాడు కాశీ. సీఈవో పోస్ట్ కోసం శివన్నారాయణకు బద్ధ శత్రువైన వైరాతో చేతులు కలుపుతుంది జ్యోత్స్న. నాకు సీఈవో పోస్ట్ కావాలి.. అది నాకు దక్కేలా చేసి, ఇప్పుడున్న సీఈవో జీవితాన్ని నాశనం చేయాలని చెబుతుంది జ్యోత్స్న. నేను సీఈవో అవ్వగానే మా కంపెనీతో డీల్ గురించి చూసుకుంటానని చెబుతుంది. అలాగే కాశీకి మీ దగ్గర ఉద్యోగం ఇవ్వాలని కూడా చెప్పగా.. సైరా సరేనని అంటాడు. మామగారితో బిజినెస్ గురించి మాట్లాడుతుండగా కాశీకి జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. దాంతో స్వప్నని పిలిచిన శ్రీధర్.. మీ ఆయనకు ఉద్యోగం చేయడం లేదని క్లాస్ పీకుతాడు. దాంతో శ్రీధర్ మాటలకు ఓకే చెప్పి.. ఇష్టం లేకపోయినా పని చేస్తున్నానని బాధపడతాడు కాశీ.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 19వ తేదీ 545వ ఎపిసోడ్‌లో..
జ్యోత్స్న చెప్పడంతో కాశీని వైరా తన ఇంటికి పిలిపించి ఆకాశానికి ఎత్తేస్తాడు వైరా. నీ రెజ్యూమ్ చూశాను, నీ టాలెంట్‌కు ఎక్కడో టాప్‌లో ఉండాలని చెబుతాడు. నిన్ను నా కంపెనీకి జీఎంను చేస్తున్నాను, 10 లక్షల రూపాయల బోనస్ ఇస్తున్నానని వైరా చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు. ఆ వెంటనే జ్యోత్స్నకి కాల్ చేసి కాశీతో మాట్లాడిస్తాడు. ఈ అక్క పవర్ ఏంటో చూశావా? నా దగ్గర అవకాశం లేకపోతే.. వేరే చోట మాట్లాడి నీ టాలెంట్‌కు తగ్గ ఉద్యోగం ఇప్పించానని చెబుతుంది జ్యోత్స్న. వాళ్ల ట్రాప్‌లో పడిపోయిన కాశీ.. వైరా దగ్గర జీఎంగా చేయడానికి ఒప్పుకుంటాడు. జ్యోత్స్న రెస్టారెంట్ గురించి మీడియాకు శ్రీధర్ చెబుతుండగా కాశీని పోలీసులు తీసుకొస్తారు. జ్యోత్స్న రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యిందని అది తిన్న పలువురు ఆసుపత్రి పాలయ్యారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతారు. సీఈవోగా ఈ బిజినెస్ బాధ్యత మీదే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. దీప ఇంటిని శుభ్రం చేస్తుండగా సుమిత్ర వచ్చి నువ్వు కడుపుతో ఉన్నావు.. అలాంటి పనులు చేయకూడదని చెప్పి తను క్లీన్ చేస్తుంది. ఇంతలో సుమిత్రకు బాగా దగ్గు వచ్చి రక్తం కక్కుకుంటుంది. అది చూసిన దీప తన తల్లికి ఏం జరిగిందోనని బాధపడుతుంది.
డిసెంబర్ 20వ తేదీ 541వ ఎపిసోడ్‌లో..
నోటి నుంచి రక్తం వస్తే ఏం జరుగుతుందని కార్తీక్‌ని అడుగుతుంది దీప. దాంతో అతను కంగారు పడతాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతాడు. మా అమ్మ రక్తం కక్కుకుందని కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నాన్న అన్నాడని అంటుంది. దాంతో కార్తీక్, దీపలు దశరథతో మాట్లాడి సుమిత్రను ఆసుపత్రికి తీసుకెళ్లమని చెబుతారు. మామూలుగా చెబితే సుమిత్ర వినకపోవడంతో నాకు హెల్త్ బాలేదని అందుకే టెస్టులు చేయించుకుందామని అనుకుంటున్నట్లు దశరథ అనడంతో సుమిత్ర ఆసుపత్రికి వెళ్తుంది. శివన్నారాయణ సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతుండగా కార్తీక్, పారిజాతం, దీపలు వస్తారు. వాళ్లంతా ఏం జరిగిందని అడగ్గా.. నేను చెబుతానని శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన వీడియో చూపిస్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్, దీప, పారిజాతంలు షాక్ అవుతారు. శ్రీధర్‌ను జ్యోత్స్న నానామాటలు అనడంతో కార్తీక్ మండిపడతాడు. తండ్రిని విడిపించడానికి శివన్నారాయణతో కలిసి వెళ్తాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications









